జన్నారం: వాహనంలో సెంట్రింగ్ సామగ్రి కింద అక్రమంగా టేకు కలప, ఫర్నీచర్ తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం సెంట్రింగ్ వాహనంలో కలప తరలిస్తున్నారనే సమాచారంతో ఇందన్‌పల్లి అటవీ రేంజ్ పరిధిలోని కలమడుగు చెక్‌పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. జన్నారం నుంచి వెళ్తున్న మినీ వ్యాన్ తనిఖీ చేయగా అడుగున టేకు దుంగలు, ఫర్నీచర్ లభ్యమయ్యాయి. కాగా అధికారులు తనిఖీ చేస్తుండగా వాహనాన్ని వదిలి డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి పరారయ్యారు. కలపతో పాటు వాహనాన్ని సీజ్ చేశామని, కలప విలువ సుమారు రూ. 60 వేలు ఉంటుందని రేంజ్ అధికారి తెలిపారు. ఎఫ్‌ఎస్‌వో మధుకర్, బీట్ అధికారులు పోచయ్య, తన్వీర్ పాషా, బేస్ క్యాంప్ వాచర్లు ఉన్నారు.


