చిమ్మన్‌గూడలో కార్డెన్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

చిమ్మన్‌గూడలో కార్డెన్‌ సెర్చ్‌

Jul 20 2026 11:36 PM | Updated on Jul 20 2026 11:36 PM

సిరికొండ: మండలంలోని చిమ్మన్‌గూడ గ్రామంలో సోమవారం ఉదయం వేకువజామున ఇచ్చోడ సీఐ సీహెచ్‌ రమేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని ప్రతీ ఇంటిని తనిఖీ చేయగా నలుగురు నిందితుల నుంచి 10 లీటర్ల గుడుంబా, 50 లీటర్ల గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం ఊట, 3 క్వింటాళ్ల ఇప్పపువ్వుతో పాటు ఓ బెల్ట్‌ షాపులో 3.5 లీటర్ల అక్రమ మద్యం లభ్యమైంది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా సరైన పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. సీఐ మాట్లాడుతూ ఎవరైనా గుడుంబా తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement