Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ksr Comments On Eenadu Ramojirao's False Statements And Jawahar Reddy's Behavior
వైఎస్సార్‌సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?

ఏపీలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలో మార్పు వస్తుందేమోలే అని ఆశించినవారికి యధాప్రకారం ఆశాభంగమే ఎదురైంది. ఎన్నికల ముందు ఎలాగైతే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను, ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి విశ్వయత్నం చేశారో, వైఎస్సార్‌సీపీపై విషం కక్కారో అదే ధోరణి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అవే అబద్దాలు, అవే మోసపూరిత కథనాలు, కక్ష, విద్వేషంతో కూడిన వార్తలు రాస్తూ ప్రజలను ఇంకా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు.ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున, పోలింగ్ అయిన తర్వాత జరిగిన హింసపై వారు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్న తీరు నీచంగా ఉంది. టీడీపీ వారిని రక్షించడానికి, వారి ప్రమేయంతో నియమితులైన పోలీసు అధికారులకు ఎలాంటి సమస్య రాకుండా చేయాలన్న లక్ష్యంతో వారు రాస్తున్న వార్తలు జర్నలిజం ప్రమాణాలను దిగజార్చుతూనే ఉన్నాయి. ఈ ఘటనలలో ఇరు వర్గాల తప్పులు ఉంటే వాటిని రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా రాస్తున్న తీరును బట్టే ఈ అల్లర్లు పెత్తందార్లే చేశారని అర్థం అవుతుంది. బలహీనవర్గాలపై జరిగిన దాడుల పట్ల కూడా మానవత్వం లేకుండా రామోజీ వార్తలు రాయించారంటే పేదలపై ఎంతటి పగ పట్టారో తెలుస్తుంది.ఎన్నికల సంఘం ఈ దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశిస్తే, ఆ ప్రకారం ప్రభుత్వం కొంతమంది అధికారులను ఎంపిక చేసింది. అంతే!ఈనాడు రామోజీకి నచ్చలేదట. వారందరికి రాజకీయాలు అంటగడుతూ రాసేశారు. అంటే ముందస్తుగానే సిట్ అధికారులను ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి వీరు ప్రయత్నం చేశారన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వారు ఇచ్చిన స్టోరీలు చూస్తే వీరు ఉగ్రవాదుల కన్నా ఘోరంగా మారారన్న సంగతి ఇట్టే అర్థం అయిపోతుంది. ఈనాడు రామోజీరావు రాస్తే ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసివేయాల్సిందే. ఆయన ఎవరిని కోరితే వారిని ఆయా పోస్టులలో నియమించాల్సిందే. లేకుంటే వారిపై బండలు వేస్తాం. వారిని నైతికంగా దెబ్బతీస్తాం. ఈ క్రమంలో వారు చెప్పినట్లు వింటే సరి.. ఎక్కడైనా ఒకటి, రెండు విషయాలలో మరీ బాగుండదని వినకపోతే.. ఇంకేముంది.. ఎన్నికల సంఘాన్ని వదలిపెట్టం అన్న రీతిలో దారుణమైన కథనాలు వండి పాఠకులను మోసం చేస్తున్నారు.ఇలా ఒకటి కాదు.. ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ బురద వేయడం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాయో, లేదో ఇంకా డీబీటీ కింద లబ్దిదారులకు డబ్బులు ఎందుకు వేయలేదని రాశారు. పేదలకు కాకుండా కాంట్రాక్టర్‌లకు డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం తన డ్యూటీ ప్రకారం ఆయా స్కీముల కింద నిధులు విడుదల చేసింది. ఇంకా వారికి ఇవ్వలేదు.. వీరికి ఇవ్వలేదు.. అంటూ పిచ్చి కథనాలు ఇస్తున్నారు. కాంట్రాక్టర్‌లకు డబ్బులు ఇవ్వకపోతే చేసిన పనులకు బిల్లులు రాక వారు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రాసేది వీరే. బిల్లులు చెల్లిస్తుంటే స్కీముల డబ్బును కాంట్రాక్టర్‌లకు ఇస్తున్నారని రాసేది వీళ్లే.రాజకీయ నేతలు డబుల్ టాక్ చేయడంలో దిట్టలని అనుకుంటాం. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు డాక్టరేట్ సంపాదించారని అంతా భావిస్తారు. కానీ వారిని మించి రామోజీరావు, రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా వారు ఏది పడితే అది రాసి పరువు పోగొట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి పరువు పోయాక, కొత్తగా పోయేదేముందిలే అని సిగ్గు విడిచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎన్నికల సంఘం పల్నాడు, తాడిపత్రి, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసపై సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించగానే, టీడీపీకి కొమ్ముకాసి తప్పులు చేసిన అధికారులను రక్షించడానికి ఈ మీడియా పూనుకుంది. వైఎస్సార్‌సీపీవారే హింసకు పాల్పడ్డారని పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించింది.వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కానీ, స్వయంగా ఒక మంత్రిగాని ఫోన్ చేస్తే బదులు ఇవ్వని ఎస్పీలను గొప్పవారిగా ప్రొజెక్టు చేయడానికి యత్నించారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీ వారు రాసిన పిర్యాదుపై సంతకం చేసి ఎన్నికల కమిషన్‌కు పంపించారు. అందులో ఏ ఏ అధికారిని తొలగించాలో రాయడమే కాకుండా, ఫలానా వారిని నియమించాలని కూడా కోరడం చిత్రమైన సంగతి. ఎన్నికల సంఘం కూడా ప్రామ్ట్ గా వారు కోరిన విధంగా అధికారులను మార్పు చేసింది. ఆ సమయంలో డీజీపీ, సీఎస్‌ను, ఇంటెలెజజెన్స్ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని ఈనాడు పెద్ద ఉద్యమంలా చెడరాసింది. ఈసీ ఒక్క సీఎస్‌ను తప్ప వారు కోరిన వారందరిని బదిలీ చేసింది.కొత్త అధికారులు వైఎస్సార్‌సీపీ ఓటర్లను బెదిరించి ఓటింగ్‌కు రాకుండా చేస్తారని వీరు ఆశించినట్లు ఉన్నారు. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయినా పేదలంతా వెల్లువలా ఓటింగ్‌కు తరలిరావడంతో వీరు ఆశించిన రీతిలో టీడీపీకి ప్రయోజనం కల్పించి ఉండకపోవచ్చు. దాంతో మరుసటి రోజు టీడీపీ వారు హింసాకాండకు దిగారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపైన దాడి చేశారు. తాడిపత్రిలో టీడీపీ రౌడీ మూకలు అల్లర్లకు దిగితే పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు. పైగా కొందరు పోలీసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి అరాచకం చేశారు. అది కనిపించకుండా సీసీ కెమెరాలను కూడా పోలీసులే పగులకొట్టారు. మరో సీసీ కెమెరాలో చిక్కడంతో వారు దొరికిపోయారు. ఈ సన్నివేశం మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చింది. దాంతో అనంతపురం, పల్నాడు కొత్త ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది.ఇది కేవలం తెలుగుదేశం వారి నిర్వాకమే. రామోజీ వంటివారి నీచమైన రాతల ఫలితమే అని చెప్పాలి. మరి కొందరిపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు వారిని రక్షించడానికి కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు సీఎస్‌పై అడ్డగోలు కథనం రాశారు. మొత్తం ఈ హింసాకాండకు సీఎస్‌ బాధ్యుడని రామోజీ తేల్చేశారు. ఆయన ఎలా బాధ్యుడు అవుతారో అర్థం కాదు. కొత్తగా నియమితుడైన డీజీపీ బాధ్యుడు కాదట. టీడీపీ, ఈనాడు ఏరికోరి వేయించుకున్న ఎస్పీలు బాధ్యులు కాదట. అర్థం, పర్థం లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు చేసిన తెలివితక్కువ నిర్ణయాలు కారణం కాదట. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక సీఎస్‌ వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారని రామోజీ తేల్చేశారు.జవహర్ రెడ్డి ఏమి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు? ఈసీ ఏమి చెబితే అది చేశారు తప్ప సొంతంగా ఆయన చేసింది ఏముంది? అయినా రామోజీ మరి అది పార్టీ పక్షపాతమో, కుల పక్షపాతమోకానీ, నిర్లజ్జగా ప్రభుత్వ ఉన్నతాధికారి నైతికస్థైర్యం దెబ్బతినేలా చెత్త వార్తలు రాసి పారేశారు. చేతిలో టీవీ, పేపర్ ఉంది కదా అని, ఎలాగూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయా వ్యవస్థలలో తమకు పలుకుబడి ఉంది కదా అని ఇంత ఘోరంగా వార్తలు ఇస్తారా? నిజానికి ఇలాంటి వార్తలు రాసిన ఈనాడు రామోజీరావుపై కేసు పెట్టాలి! ఈసీ ఛీఫ్ సెక్రటరీపై ఆధారపడుతూ నిర్ణయాలు చేసిందట. అంటే చంద్రబాబుకో, రామోజీకో ఫోన్ చేసి వారు ఏమి ఆదేశిస్తే అది చేయాలన్నది వీరి కోరిక కావచ్చు. అక్కడికి వీరు అడిగినవన్నీ ఈసీ చేసినా కనీసం కృతజ్ఞత లేకుండా ఈసీని ఆక్షేపిస్తూ వార్తలు ఇచ్చారంటేనే వీరు ఎంత అవకాశవాదులో అర్థం చేసుకోవచ్చు.వృద్దులకు ఇళ్ల వద్ద వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వద్దని ఈసీ ద్వారా చెప్పించిందే తెలుగుదేశం, ఈనాడు రామోజీ వంటి వారు అయితే దానికి జవహర్ రెడ్డి బాధ్యుడట. ఈసీ సూచనలను పరిగణనలోకి తీసుకునే సీఎస్ గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు. బ్యాంకుల ద్వారా పెన్షన్ ఇవ్వాలని కోరింది నిమ్మగడ్డ రమేషే కదా! అయినా ఆయన తప్పు లేదట. జనం అందరికి ఇది అర్థం అయినా రామోజీకి ఇంకా తెలియలేదు. వృద్దులంతా చంద్రబాబును, నిమ్మగడ్డను, రామోజీ వంటివారిని బండబూతులు తిట్టిన సంగతి జనానికి తెలియదా! సీఎస్‌నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుని అధికారులను నియమించిందట.రామోజీ కొత్త రాజ్యాంగం రాయాలి. ప్రతిపక్ష నేతనో, లేక రామోజీనో నివేదికలు అడగాలి కాబోలు. పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగితే ఛీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేయకపోవడం ఏమిటి? అని ఈనాడు రాసిందంటే వారు జర్నలిజం చేస్తున్నారా? లేక ఇంకేమైనా చేస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. ఈసీకి జాబితాలు పంపించి, వారు ఎవరిని నియమించమని చెబితే వారిని అప్పాయింట్ చేస్తే అది కూడా జవహర్ రెడ్డి తప్పేనట. ఈయన ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని విపక్షాలు అన్నాయట. అది వేద వ్యాఖ్యమట.ఆయా స్కీములకు కొన్ని నెలలు డబ్బు వేయకుండా, ఎన్నికల ముందు లబ్దిదారులకు ఇచ్చేయత్నం చేశారని అన్నారు. మరి చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అని, అన్నదాత సుఖీభవ అని డబ్బులు వేస్తే గొప్ప విషయమని ఇదే ఎల్లో మీడియా ఆ రోజుల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో లబ్దిదారులకు డబ్బులు పడకుండా ఆపింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఇంక వైఎస్సార్‌సీపీకి వచ్చిన లాభం ఏముంది. చివరిగా వీరి అసలు బాధ బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం వివిధ ఆరోపణలపై సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదట. అదట వీరి కడుపు నొప్పికి కారణం. ఈయనేమో టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని పోలీసు అదికారులను ప్రభావితం చేయడానికి కృషి చేశారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. అయినా పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదని ఈనాడు గొడవ చేస్తోంది. దీనిని బట్టే వారి మధ్య ఎలాంటి సంబంధ, బాంధవ్యాలు ఉన్నాయో గమనించవచ్చు.ఆంధ్రజ్యోతి అయితే హీనంగా మరో అబద్దపు కథనాన్ని ప్రచారం చేసింది. నీతి అయోగ్ లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తమకు తెలియదని అన్నదట. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారంటే ఓట్ల కోసం అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే రకంగా అబద్ధాలు చెబుతున్నారంటే వారికి బుద్ది, జ్ఞానం లేదని అనుకోవాలి. నీతి అయోగ్ ముసాయిదా పంపించామని తెలిపినా వీరు ఒప్పుకోరన్నమాట. ఎన్నికలు అయిపోయాక కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగబడి ఇలాంటి అసత్య కథనాలు ఇవ్వడం ద్వారా సాధించేది ఏమిటో తెలియదు! అంటే ఎన్నికలలో గెలవడం కష్టమనే అభిప్రాయానికి ఎల్లో మీడియా వచ్చేసిందా? అందుకే అప్పుడే మళ్లీ దాడి ఆరంభించిందా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Jogi ramesh Questions On Chandrababu Secret Tour
ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్‌

సాక్షి, విజయవాడ: ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్‌ గల్లంతవుతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరార్‌తో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారన్నారు జోగి రమేష్‌. ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు జోగి రమేష్‌. పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. టీడీపీ అడ్రస్‌ గల్లంతు కాబోతుంది కాబట్టే చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డాడని విమర్శించారు. పురందేశ్వరి ఈసీకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే అధికారులను మార్చారనిన్నారు.కాగా అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లిన చంద్ర­బాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్‌ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్‌ అయినట్లు తెలుస్తోంది.చదవండి: ఇట్లు ఇటలీకి

India Needs to Create 11 5 Crore Jobs By 2030 Details
2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 2030 నాటికి దేశంలో 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కోసం సర్వీస్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లను పెంచాలని చెబుతున్నారు. ఇది జరిగితే ఇండియా ఎకానమీ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే.. సంవత్సరానికి 1.65 కోట్ల ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుంది. గత దశాబ్దంలో ప్రతి ఏటా 1.24 కోట్ల ఉద్యోగాలు పెరిగాయని నాటిక్సిస్ ఎస్ఏ సీనియర్ ఎకనమిస్ట్ 'ట్రిన్ న్గుయెన్' సోమవారం ఒక నివేదికలో పేర్కొన్నారు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. అయితే దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉద్యోగావకాశాలు మందకొడిగానే సాగుతున్నాయి. మూడో సారి మోదీ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగం పెద్ద సవాలుగా మారుతుందని పలువురు చెబుతున్నారు.గత దశాబ్దంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించినప్పటికీ, కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే అధికారికంగా ఉన్నాయని న్గుయెన్ రాశారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం, దేశం మొత్తం శ్రామిక శక్తి రేటు 58 శాతంగా ఉంది. ఇది ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. చాలా తక్కువ. ఉద్యోగావకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో.. అప్పుడే ఇతర దేశాలతో భారత్ పోటీ పడగలదని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.

Purandeswari Political Future In Confusion
అయోమయంలో పురందేశ్వరి భవితవ్యం

పురందేశ్వరి కుట్ర రాజకీయాలు ఆమెకు ఎసరు తెచ్చిపెట్టనున్నాయా.. ఎన్నికల సమయంలో చిన్నమ్మ రాజకీయాలతోనే ఏపీలో బీజేపీ మరింత బలహీనపడిన పడిందని భావిస్తున్న సీనియర్లు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా.. ఏపీ బీజేపీలో ఇపుడు గ్రూపు రాజకీయాలకి పురందేశ్వరి వైఖరే కారణమని సీనియర్లు గుర్రుగా ఉన్నారు.. ఎన్నికల వేళ పార్టీని ఏకతాటిపై నడిపించాల్సిన సమయంలో ఆమె వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకు పార్టీని బలి చేశారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది. పురందేశ్వరి ఓడితే ఆమె రాజకీయ భవిష్యత్‌కి బ్రేక్ పడినట్లేనా...ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ భవితవ్యం అయోమయంగా ఉంది. ఎన్నికల ఏడాదిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న పురందేశ్వరి తన వైఖరితో పార్టీలో గ్రూపు రాజకీయాలకి ఆజ్యం పోశారు. అప్పటివరకు సోము వీర్రాజు నాయకత్వంలో ఏకతాటిపై నడిచిన పార్టీని రెండు గ్రూపులుగా మార్చేసారు. ఏపీలో గడిచిన మూడేళ్లగా సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ క్షేత్రస్ధాయిలో బలోపేతంపై దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకునేలా నిత్యం ప్రజలలో ఉంటూ కార్యక్రమాలు నిర్వహించేవారు.అయితే పురందేశ్వరి గత ఏడాది ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదట నుంచి బీజేపీలో ఉన్న నేతలపై గురి పెట్టారు. సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేసిన పలు జిల్లాల అధ్యక్షులని కావాలని మార్పు చేశారు. దీంతో పాటు రాష్ట్ర కార్యాలయంలోనూ బీజేపీలో దీర్ఘకాలంగా ఉంటున్న నేతలని తొలగించి మరీ తన సొంత టీంని నియమించుకున్నారు. అక్కడ నుంచి ప్రారంభమైన గ్రూపు రాజకీయాలు ఎన్నికల సమయానికి తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎన్నికలకు ముందు వరకు ఏపీలో బీజేపీ, జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తుందని భావించిన నేతలు. .ఆ దిశగానే ప్రయత్నించారు.జనసేన.. టీడీపీతో కలిసిన తర్వాత ఒంటరి పోరు వైపే మెజార్టీ నేతలు మొగ్గుచూపారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్ ఉండాలనే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని.. అందు కోసం ఒంటరిపోరే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతర పరిణామాలలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలుసుకుని ఎన్డీఎలో చేరడం వెనుక పురందేశ్వరి చక్రం తిప్పారని బీజేపీ నేతలు చెబుతుంటారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సొంతపార్టీ కంటే సొంత బంధువర్గానికి ప్రాదాన్యతనిచ్చారనేది జరిగిన పరిణామాలే చెబుతున్నాయి.చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్‌ని ఢిల్లీకి తీసుకెళ్లి హోంమంత్రి అమిత్ షాని కలిపించడం వెనుక పురందేశ్వరే ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత టీడీపీతో బీజేపీ జత కట్టడం.. టిక్కెట్లు ఖరారు ఇవన్నీ బీజేపీ కనుసన్నల్లో కంటే చంద్రబాబు చెప్పినట్లుగానే జరిగాయని విమర్శలున్నాయి. గత నాలుగన్నరేళ్లగా క్షేత్రస్ధాయిలో బీజేపీ బలోపేతంగా ఉన్న స్థానాలను తీసుకోవాల్సిన సమయంలో పురందేశ్వరి మాట్లాడకపోవడం ఏపీ బీజేపీకి మైనస్‌గా మారింది. ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ కనీసం 25 అసెంబ్లీ స్ధానాలు, ఎనిమిది పార్లమెంట్ స్దానాలలో పోటీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆశించారు. ఇందుకోసం టీడీపీతో గట్టిగా సంప్రదింపులు చేయాలని సీనియర్లు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు.అయితే అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే మైకంలో ఉన్న బీజేపీ పెద్దలకి ఏపీ బీజేపీలో పరిస్ధితులని పట్టించుకోలేదు. .ఇదే సమయంలో టీడీపీతో పొత్తులో భాగంగా పురందేశ్వరి చంద్రబాబు ఆశించినట్టుగా వ్యవహరించి కేవలం ఆరు ఎంపీలు, పది అసెంబ్లీ స్ధానాలకి పరిమితం చేశారు. ఆ తర్వాతైనా బీజేపీ పట్టున్న స్ధానాలను కోరుకుందా అది కూడా లేదు.. బీజేపీ ఓడిపోయే స్ధానాలను బిజెపికి అండగట్టినా కూడా ఎపి బిజెపి అధ్యక్షురాలిగా పురందేశ్వరి పెదవి విప్పలేదు... సరికదా తనకు ఎంపి టిక్కెట్ వస్తే చాలని ఊరుకున్నారు.దీనికి తోడు బిజెపితో పొత్తుకు ముందే కొన్ని స్ధానాలను టిడిపి ప్రకటించడం కూడా ఎపి బిజెపిలో మొదట నుంచి నేతలకి నచ్చలేదు.. బిజెపిలో మొదటి నుంచి సీనియర్లకి అవకాశం ఇవ్వాలని...బిజెపి గెలిచే స్ధానాలను తీసుకోవాలని సీనియర్లు నెత్తీ నోరూ బాదుకున్నా కూడా పురందేశ్వరి తన మరిది చంద్రబాబుతో కలిసి చేసిన కుట్రలు ఎపి బిజెపి భవితవ్యాన్ని పూర్తిగా చిదిమేశాయివిశాఖపట్టణం ఎంపీ స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు చివరి వరకు ప్రయత్నించారు.బిజెపి జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు విశాఖలో ఇల్లు కొనుక్కుని ఆ పార్లమెంట్ పరిధిలో బిజెపి బలోపేతం కావడానికి మూడేళ్లకి పైగా కృషి చేసిన జివిఎల్ ఆ స్ధానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే పురందేశ్వరి కనీసం టిడిపి, బిజెపి ఉమ్మడి చర్చలలో విశాక సీటుని కనీసం ప్రస్తావించలేదని తెలుస్తోంది. విశాఖలో పార్టీ బలంగా ఉందని..ఆ సీటు బిజెపికి ఇవ్వాలని పురందేశ్వరి గట్టిగా పట్టుపట్టకపోవడంతోనే ఆ సీటు టిడిపి తీసుకుందని చెబుతున్నారు.కేవలం తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యాసంస్ధల చైర్మన్ భరత్ కోసమే జివిఎల్ కి టిక్కెట్ రాకుండా చేశారని చెబుతున్నారు.ఆ తర్వాత విజయనగరం లేదా అనకాపల్లి కోసం జివిఎల్ ప్రయత్నించినా కూడా అవి కూడా దక్కలేదు.దీంతో జివిఎల్ పురందేశ్వరి వైఖరిపై అలిగి ఎన్నికల సమయంలో ఢిల్లీకే పరిమితమయ్యారు.ఇక అనకాలపల్లి ఎంపి స్ధానంపై మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఆశలు పెట్టుకుంటే ఆయనని కాదని కడప నుంచి సిఎం రమేష్ కి టిక్కెట్ ఇప్పించారు.ఇది కూడా చంద్రబాబు డైరక్టన్ లో జరిగిందని బిజెపి సీనియర్లు విమర్శిస్తున్నారు.ఉత్తరాంద్రలో ఉన్న బిసి నేతలకి అవకాశం ఇవ్వకుండా గత ఎన్నికల తర్వాత టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్ కి టిక్కెట్ ఇవ్వడం ఉత్తరాంద్ర బిజెపిలో వివాదం రాజేసింది. బిజెపిలో ఉంటూ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉండే సిఎం రమేష్ అభ్యర్ధిత్వాన్ని ఉత్తరాంద్ర బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోయారు.ఇక రాజమండ్రి స్ధానం నుంచి పోటీ చేయాలని మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భావించారు. రాజమండ్రిలోనే పుట్టి నాలుగన్నర దశాబ్ధాలగా బిజెపిలో ఉన్న సోము వీర్రాజు రాజమండ్రి ఎంపి టిక్కెట్ ఆశిస్తే పురందేశ్వరి చక్రం తిప్పి టిక్కెట్ ఆమె దక్కించుకున్నారు.ఇక సోము వీర్రాజుని అనపర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని సూచించినా ఓడిపోయే స్ధానంలో పోటీచేయలేనని తిరస్కరించారు.ఇక ఏలూరు స్ధానం కోసం దశాబ్ధకాలంగా బిజెపిలో పనిచేస్తున్న తపనా చౌదరికి కూడా టిక్కెట్ ఇప్పించడంలో పురందేశ్వరి విఫలమయ్యారు.ఈ సీటుని బిజెపికి ఇవ్వకుండా టిడిపి తీసేసుకుని కడప జిల్లాకి చెందిన యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ని రంగంలోకి దింపారు. ఇక హిందూపూర్ ఎంపి కానీ కదిరి అసెంబ్లీ కానీ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డికి కూడా టిక్కెట్ దక్కలేదు.ఇలా వరుసగా పార్టీనే నమ్ముకుని దశాబ్ధాలగా రాజకీయాలు చేసిన సీనియర్లెవరకి కూడా టిక్కెట్లు దక్కలేదు కానీ టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతలకి టిక్కెట్లు దక్కడం సీనియర్లకి తీవ్ర నిరాశ కలిగించింది.దీంతో పాటు అనపర్తి టిక్కెట్ విషయంలో మాజీ సైనికుడికి అన్యాయం చేస్తూ రాత్రికి రాత్రి టిడిపి ఇన్ చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం...బద్వేలులో కూడా ఉప ఎన్నికలలో పోటీ చేసిన బిజెపి నేతని పక్కన పెట్టి టిడిపి ఇన్ చార్జి రోషన్ ని ముందు రోజు బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం బిజెపిలో తీవ్ర వివాదాస్పదమైంది.అలాగే ఎన్నికలకి ముందు వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే వరప్రసాద్ ని బిజెపిలో చేర్చుకుని తిరుపతి ఎంపి టిక్కెట్ ఇవ్వడం కూడా పార్టీలో వ్యతిరేకత తెచ్చింది.ఇలా ఉద్దేశపూర్వకంగా బిజెపిలో మొదట నుంచి పనిచేసిన నేతలని పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి టిక్కెట్లు ఇవ్వడం వెనుక పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించారని సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.టిడిపి నుంచి బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చే బదులు ఆ సీట్ల స్ధానంలో బిజెపి వేరే సీట్లని తీసుకోవాలని... దీని వల్ల బిజెపి నష్టపోతోందంటూ మాజీ సిఎం బిజెపి సీనియర్ నేత ఐవిఆర్ కృష్ణరావు పలుమార్లు ట్విట్లర్ వేదికగా ప్రశ్నించారు. ఇలా పురందేశ్వరి పెట్టిన చిచ్చుతో ఎన్నికల సమయంలో ఎపి బిజెపి రెండుగా చీలిపోయింది.ఎన్నికల ప్రచారంలో సీనియర్లు ఎవరూ కూడా ప్రచారంలో పాల్గొనకపోవడానికి పురందేశ్వరి వైఖరే ప్రధానకారణంగా తెలుస్తోంది.ఇక రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాదిరిగానే అక్కడా సొంత టీం నే ఏర్పాటు చేసుకున్నారు.స్ధానికుడైన సీనియర్ నేత సోము వీర్రాజుని పురందేశ్వరి ఎక్కడా కలుపుకుపోలేదు. నామినేషన్ రోజున మాత్రం సోము వీర్రాజుతో కలిసి ర్యాలీగా వెళ్లి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.ఆ తర్వాత సోము వీర్రాజు ఎక్కడా ప్రచారంలో కనిపించకపోవడానికి పురందేశ్వరి వైఖరే కారణమని తెలుస్తోంది. సోము వీర్రాజు స్ధానంలో రాజమండ్రి టిక్కెట్ దక్కించుకున్న పురందేశ్వరి మర్యాదపూర్వకంగా కూడా కనీసం సోము వీర్రాజు ఇంటికి వెళ్లకపోవడం...ఎన్నికల ప్రచారానికి ఆయనను పిలవకపోవడంతోనే ఆయన ప్రచారంలో పాల్గొలేదని తెలుస్తోంది. దీనికి తోడు రాజమండ్రిలో సోము వీర్రాజు హయాంలో కట్టిన బీజేపీ కార్యాలయాన్ని కాదని ఎన్నికల వేళ పురందేశ్వరి ప్రత్యేకంగా వేరే చోట ఎన్నికల కార్యాయాల్ని ప్రారంభించడం కూడా సోము వీర్రాజుకి తీవ్ర మనస్తాపం కలిగించినట్లు తెలుస్తోంది. బీజేపీ కార్యాయాలన్ని కాకుండా ప్రైవేట్‌గా వేరేచోట ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేయడం కూడా ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలను రాజేసింది. ఇలా సొంత పార్టీ కార్యాలయాన్ని.. సొంత పార్టీ నేతలను నమ్మకుండా టీడీపీ నేతలను పురందేశ్వరి నమ్మడం కూడా ఆమెకు మైనస్‌గా మారిందంటున్నారు.ఇలా వరుస తప్పిదాలతో ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందంటున్నారు. ఒకవర్గం పురందేశ్వరి అనుకూలంగా ఉంటే...మరొక వర్గం పురందేశ్వరిని వ్యతిరేకిస్తోందంటున్నారు.ఇలాంటి పరిణామాలు గతంలో ఎపుడూ ఏపీ బీజేపీలో చోటుచేసుకోలేదని.. కేవలం పురందేశ్వరి వైఖరి కారణంగానే బిజెపిలో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయని అంటున్నారు.ఇపుడా గ్రూపు రాజకీయాలే పురందేశ్వరికి ఎసరు తెచ్చేలా కన్పిస్తున్నాయంటున్నారు.రాజమండ్రితో పాటు బిజెపి పోటీ చేసిన మొత్తం ఆరు ఎంపి స్ధానాలు, పది అసెంబ్లీ స్ధానాలలో కనీసం సగం సీట్లైనా బిజెపి గెలిస్తేనే పురందేశ్వరి రాజకీయ భవితవ్యానికి ఇబ్బంధి ఉండకపోవచ్చునంటున్నారు. కానీ బిజెపి గెలుపొందే స్ధానాలను కాకుండా ఓడిపోయే స్ధానాలను తీసుకునే ఓటమిని ముందే డిసైట్ చేసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపు మాట తర్వాత కనీసం పురందేశ్వరి అయిన రాజమండ్రిలో గెలుస్తోందో లేదోనేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ రాజమండ్రిలో పురందేశ్వరి ఓడిపోతే ఆమె రాజకీయ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఆమె ఓడిపోతే ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమెకు శాపంగా మారి బీజేపీ అధ్యక్షరాలి పదవి నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఇప్పటికే ఎన్నికల సమయంలో పురందేశ్వరి కుట్ర రాజకీయాలపై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారంటున్నారు. ఇలా వరుస ఫిర్యాదుల నేపధ్యంలో ఆమె ఓడిపోతే శాశ్వతంగా పురందేశ్వరి చేజేతులా రాజకీయ భవిష్యత్‌ని నాశనం చేసుకున్నట్లేనని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో దశాబ్ధకాలం పాటు ఎంపిగా.. కేంద్ర మంత్రిగా పనిచేయడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హవా ఆమెకు కలిసివచ్చిందని.. ఇపుడు మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాలే ఆమె భవితవ్యాన్ని సమాది చేస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ గప్ చుప్‌గా ఉంది.. నేతలెవరూ కూడా ఎన్నికల తర్వాత పెదవి విప్పడానికి సాహసించడం లేదు.. గెలుపుపై నమ్మకం లేక ఏ నేతా కూడా మీడియా ముందుకురావడానికి ఇష్టపడకపోవడం ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలు.. తాజా పరిస్థితులను తెలియజేస్తున్నాయంటున్నారు.

Ap Elections 2024 May 21 Political Updates Telugu
May 21st: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 21st AP Elections 2024 News Political Updates2:32 PM, May 21st, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్‌ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే2:24 PM, May 21st, 2024ఈనాడు వార్తలను ఖండించిన సీఎస్‌డీఎస్‌ఏపీలో మేం పోస్ట్‌ పోల్‌ సర్వే నిర్వహించాంమా సర్వే రిపోర్ట్‌ నాలుగు రోజుల్లో వస్తుందిటీడీపీకే జనం అనుకూలంగా ఉన్నారనే వార్త అవాస్తవంసెఫాలజిస్ట్‌ సంజయ్‌కుమార్‌ మాటలు కూడా నిరాధారమే: సీఎస్‌డీఎస్‌ ఏపీ కోఆర్డినేటర్‌ వెంకటేష్‌2:01 PM, May 21st, 2024జూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిమాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మరెడ్డిపై మండి పడ్డ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిజూలకంటి బ్రహ్మరెడ్డి చరిత్ర మర్డర్లు చేసే చరిత్రఅభివృద్ది చేసే చరిత్ర మాదిసిట్టింగ్ జడ్జితో విచారణకు నేను కూడా సిద్దంఏడు మర్డర్ల కేసులో ఏ1 ముద్దాయి జూలకంటి బ్రహ్మారెడ్డిజూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు 2009లో నాపై ఓడిపోయి మాచర్ల నుంచి పారిపోయాడువైఎస్సార్‌సీపీ పాలనలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధినీతి కబుర్లు చెబుతూ షో చేస్తూ చందాల మీద బతికే వ్యక్తి జూలకంటి బ్రహ్మారెడ్డి11:32 AM, May 21st, 2024ఎస్సీలంతా వైఎస్సార్సీపీకే ఓటు వేశారు: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజుఆ అక్కసుతోనే దళితులపై దాడులు జరిపారువదినా మరిది అయిన పురందేశ్వరి, చంద్రబాబు పోలీసులను మార్చారుపోలీసు అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిపారుఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పని చేస్తున్నాయిచంద్రబాబు తన మనమడికి 6 నెలల వయసున్నపుడే వందలకోట్లు జమ చేశాడుపాలన ద్వారా జగన్ పేదల పాలిట దైవంగా మారారుసీఎం జగన్‌ను ఓడించే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవుపేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు జరిపారుపేదల పిల్లలు ఐక్య రాజ్య సమితికి వెళ్లి మాట్లాడుతున్నారుఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబుబీసీల తోకలు కత్తిరిస్తానంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబుబీజేపీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారుఎస్సీలంతా జగన్ వైపే ఉన్నారు10:43 AM, May 21st, 2024కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక150 పేజీల ప్రాథమిక నివేదికను సీఈసీకి పంపిన ఏపీ సీఎస్ఏపీలో ఎన్నికల రోజు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదికపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో.. మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన సిట్1370 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, 124 మంది అరెస్ట్ఇంకా 1152 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని సిట్ నివేదికఎఫ్‌ఐఆర్‌లో కొత్త సెక్షన్ల చేర్చే విషయంపై సిఫార్సు చేసిన సిట్8:40 AM, May 21st, 2024దుష్ప్రచారం చేయడం డాక్టర్‌ లోకేశ్‌కు అలవాటే: ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ వాసుదేవరెడ్డి వెల్లడికోర్టుల్లో తప్పుడు కేసులు వేయడంలో నేర్పరి చీవాట్లు పెట్టి జరిమానా విధించిన అమెరికా కోర్టుపలువురు రోగుల మరణానికి కారకుడయ్యాడని ప్రాక్టీస్‌ పైనా నిషేధంఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధా­విగా చలామణి అవుతున్నారుఅయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందిగుంటూరు మెడికల్‌ కాలేజీలో 1983లో లోకేశ్‌ గ్రాడ్యుయేట్‌ అయ్యాడుగ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్‌ మొదలెట్టాడుఅప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్‌ చేయడం లోకేశ్‌కు అలవాటుప్రాక్టీస్‌ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజ­­మాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడుఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్, అదానీ మీద వాషింగ్టన్‌ డీసీ కోర్టులో కేసులు ఫైల్‌ చేశాడుఇండియా నుంచి కంటై­నర్‌లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్‌ నుంచి స్పైవేర్‌ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరో­పణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించిందివైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్‌ కారకుడయ్యాడు2006లో వర్జీనియా బోర్డ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ లోకేశ్‌ మెడికల్‌ లైసెన్స్‌ను రద్దు చేసిందిఅనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్‌ చేశారుఅయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలిమేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్‌ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు.7:52 AM, May 21st, 2024సిట్ నివేదికలో సంచలన విషయాలుఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ప్రాథమిక నివేదికలో బయటపడిన పోలీసుల వైఫల్యాలుపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునాలుగు బృందాలుగా మూడు జిల్లాలలో పర్యటించిన సిట్33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు, సీసీ కెమెరాలు పరిశీలనఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందినే అరెస్ట్ చేసిన పోలీసులుఇందులో 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందన్న సిట్1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన‌ సిట్దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించిన సిట్రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్రెండు గ్రూపుల‌ మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొన్న సిట్ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తింపుదాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదికఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకి కారణంగా సిట్ నివేదికపరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిట్ సూచనకోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్ష‌న్లు జోడించాలన్న సిట్సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను ఆదేశించిన డీజీపీ7:16 AM, May 21st, 2024ఇట్లు.. ఇటలీకి!వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులుఅబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేతటీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారంగతంలో విదేశాల నుంచే షెల్‌ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపుస్కిల్‌ స్కామ్‌లోనూ బాబు దుబాయ్‌ బంధంఈసారి అదే షెల్‌ దందాయేనా..!గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే 7:07 AM, May 21st, 2024కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్‌ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారుటీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలిదాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్‌ డేటా సేకరించి విచారణ నిర్వహించాలి 7:05 AM, May 21st, 2024పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహంనిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణంఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గం6:53 AM, May 21st, 2024బదిలీలతో బరితెగింపుఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్‌ నివేదికదాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలంపోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండదర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి

Political Fight Between Congress And BJP At North East Delhi Seat
BJP Vs Congress: ఈశాన్య ఢిల్లీ ఎవరిది?..

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో అంద‌రినీ ఆక‌ర్షిస్తున్న సీటు ఈశాన్య ఢిల్లీ. హ్య‌ట్రిక్‌పై క‌న్నేసిన బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీపై, యువ‌నాయ‌కుడు క‌న్హ‌య్య కుమార్‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది. గ‌త ఎన్నిక‌ల్లో బెగుస‌రాయ్‌లో ఓడిపోయిన క‌న్హ‌య్య‌కుమార్‌ను రాహుల్ గాంధీ ఈసారి ఢిల్లీలో పోటీకి దింప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 20శాతం ముస్లింలు, 11శాతం ఎస్సీల స‌మీక‌ర‌ణను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ప్ర‌యోగానికి దిగింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.ఈశాన్య ఢిల్లీ ప్రాంతం దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా. నార్త్ ఈస్ట్ సీటు భారతదేశం మొత్తంలో అత్యంత జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ అత్యధిక జనాభా పూర్వాంచల్‌కు చెందినవారే. ఈ లోక్‌సభ స్థానంలో అనేక అనధికార కాలనీలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు స్థిరపడ్డారు. ఉత్తరప్రదేశ్‌తో ఈశాన్య ఢిల్లీ సరిహద్దు కారణంగా, ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా నుండి వలస వచ్చిన వారి జనాభా ఎక్కువగా ఉంది.ఈ లోక్‌సభ స్థానంలో భ‌జ‌న్‌పురా, బురారీ, తిమర్‌పూర్, సీలంపూర్, ఘోండా, బాబర్‌పూర్, గోకల్‌పూర్, సీమాపురి, రోహతాస్ నగర్, ముస్తఫాబాద్, కరవాల్ నగర్‌లతో కలిపి 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 16.3 శాతం షెడ్యూల్డ్ కులాలు, 11.61 శాతం బ్రాహ్మణులు, 20.74 శాతం ముస్లింలు, 4.68 శాతం వైశ్య (బనియా), 4 శాతం పంజాబీ, 7.57 శాతం గుర్జార్ మరియు 21.75 శాతం ఓబీసీ కమ్యూనిటీ వారి వాటాను కలిగి ఉంది.గ‌తంలో 2009 లోక్‌సభ ఎన్నిక‌ల్లో బీజేపీపై కాంగ్రెస్‌ 59.03 శాతం ఓట్లతో భారీ ఆధిక్యం సాధించగా బీజేపీకి 33.71 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 నుంచి వ‌రుస‌గా బీజేపీ విజ‌య‌కేతనం ఎగ‌రేస్తోంది. 2014లో సినీ నటులు మనోజ్ తివారీకి 45.38 శాతం ఓట్లతో గెలుపొంద‌గా, 2019లో 53.86 శాతం రెండోసారి విజ‌య‌కేత‌నం అందుకున్నారు. ఈ సీటులో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల అభ్యర్థులకు ప్రజల్లో మంచి పేరుంది.ఒకవైపు రాజకీయాలకు అతీతంగా నటుడిగా, గాయకుడిగా మనోజ్ తివారీ బాగా పాపులర్ అయితే, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ జేఎన్‌యూ స్టూడెంట్ లీడ‌ర్‌గా దేశ‌వ్యాప్తంగా త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్హయ్య కుమార్ కూడా చాలా చురుకుగా కనిపించారు. ఈ యాత్రలతో యువతను కనెక్ట్ చేయడంలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే తుక్‌డేతుక్‌డే గ్యాంగ్ నాయ‌కుడ‌ని బీజేపీ.. క‌న్హ‌య్య కుమార్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి మారేందుకు ఈ ఎన్నిక మ‌నోజ్ తివారీకి కీల‌కంగా మార‌నుంది. ఇప్ప‌టికే రెండుసార్లు గెలిచి స‌త్తా చాటిన తివారీ మూడోసారి హ్యాట్రిక్ సాధించ‌డం ద్వారా ఢిల్లీ బీజేపీ అగ్ర‌నాయ‌కుడిగా త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవ‌కాశం ఉంది. ఢిల్లీ బీజేపీకి నాయ‌కుడు లేక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడుతున్న పార్టీకి తివారీ సార‌థ్యం వ‌హించ‌డానికి ఇదొక అవ‌కాశమ‌నే అంచ‌నాలొస్తున్నాయి.ఇటు షీలా దీక్షిత్ త‌ర్వాత ఢిల్లీకి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ లీడ‌ర్ క‌రువ‌య్యారు. క‌న్హ‌య్య కుమార్ గ‌నుక ఈశాన్య ఢిల్లీ నుంచి గెలిస్తే ఆయ‌న కూడా ఢిల్లీ కాంగ్రెస్‌కు ఫ్యూచ‌ర్ సీఎం లీడ‌ర్‌గా ఎదిగే అవ‌కాశ‌ముంది. మ‌రి ఈసారి ఢిల్లీ ఈశాన్యంలో క‌మ‌లం ఉద‌యిస్తుందా? హ‌స్త రేఖ‌లు మార‌తాయా? అన్న‌ది ఓట‌రు చేతిలో ఉంది.

IPL 2024: Was Dhoni At Fault For RCB Handshake Fiasco? New Video Adds Twist
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?

‘‘ప్రపంచకప్‌ ఫైనల్‌ గెలిచినా.. భావోద్వేగాలు ప్రతిబింబించేలా సంబరాలు చేసుకుంటున్న సమయంలోనూ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడం మర్యాద. ‘మన మధ్య పోరు ముగిసిపోయింది.మన మధ్య ఇక ఎలాంటి శత్రుత్వం లేదు. ఇప్పటికి ఇది ముగిసిపోయింది’ అని ఇరు జట్లు పరస్పరం చెప్పుకోవడానికి ఇది(షేక్‌హ్యాండ్‌) ప్రతీక’’- హర్షా భోగ్లే, కామెంటేటర్‌.‘‘అతడొక ఐకానిక్‌ ప్లేయర్‌. వచ్చే ఏడాది ఆడతాడో లేదో కూడా తెలియదు. బహుశా ఇదే చివరి మ్యాచ్‌ కూడా అయి ఉండవచ్చు. అలాంటి లెజెండ్‌ను కలవడానికి ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూడటం సహజం.ఆ తర్వాత ఎంతసేపు సంబరాలు చేసుకున్నా ఎవరూ ఏమీ అనరు. కానీ అంతా ముగిసి తెల్లారిన తర్వాత.. ‘అయ్యో.. ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌ ప్రకటించాడు.కానీ మనం ఆయనకు డీసెంట్‌గా ఓ షేక్‌హ్యాండ్‌తో వీడ్కోలు పలకలేకపోయామే’ అని బాధ పడితే ప్రయోజనం ఉంటుందా?’’- ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌.ధోనికి అవమా‍నంచెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని పట్ల రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపట్ల ఇలా కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ(ముంబై ఇండియన్స్‌)తో పాటు ఐదుసార్లు ట్రోఫీ సాధించిన దిగ్గజం పట్ల ఆర్సీబీ ప్లేయర్లు ప్రవర్తించిన విధానం అవమానకరమని మండిపడుతున్నారు.ఇక ధోని అభిమానులైతే ఆర్సీబీ జట్టును సోషల్‌ మీడియా వేదికగా పదునైన కామెంట్లతో తూర్పారబడుతున్నారు. అయితే, తాజాగా ఓ నెటిజన్‌ కొత్త వీడియోను తెరమీదకు తెచ్చారు. ధోనికి మద్దతుగా మాట్లాడే వారందరూ ఒక్కసారి ఈ దృశ్యాలను చూడాలంటూ కొత్త చర్చకు దారితీశారు.ఇంతకీ ఏం జరిగింది?... ఐపీఎల్‌-2024 ఆరంభం నుంచి వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌ రేసులో వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.లీగ్‌ దశలో సొంత మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా చెన్నైని ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పించి.. టాప్‌-4 బెర్తును ఖరారు చేసుకుంది.ధోనిని పట్టించుకోని ఆర్సీబీ ఆటగాళ్లు?ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఫైనల్‌ గెలిచినంతంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధోని సహా మిగిలిన చెన్నై ఆటగాళ్లు కరచాలనం చేసేందుకు వచ్చారు. అయితే, ఆర్సీబీ సెలబ్రేషన్స్‌ పూర్తికాకపోవడంతో వీళ్లను పట్టించుకోలేదు. దీంతో చిన్నబుచ్చుకున్న ధోని డ్రెసింగ్‌రూంకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు కాసేపు వేచి చూడగా.. ఎట్టకేలకే ఆర్సీబీ ప్లేయర్లు వచ్చి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు.ఈ నేపథ్యంలో ధోని మూడు నిమిషాల పాటు ఎదురుచూసినా ఆర్సీబీ ఆటగాళ్లు షేక్‌హ్యాండ్‌ కోసం రాలేదని.. తలాను ఘోరంగా అవమానించారంటూ విరాట్‌ కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లందరిపై సీఎస్‌కే ఫ్యాన్స్‌ మండిపడ్డారు.అసలు నిజం ఇదేనంటూఈ క్రమంలో ఓ వ్యక్తి నిజం ఇదేనంటూ.. ‘‘ధోని మూడు నిమిషాలు వేచి చూశాడని అభిమానులు అంటున్నారు. అయితే, అతడు కాసేపు కూడా ఎదురుచూడకుండా వెళ్లిపోయాడు. గెలిచిన జట్టుకు ఆమాత్రం సెలబ్రేట్‌ చేసుకునే హక్కులేదా? సీఎస్‌కే గతేడాది ట్రోఫీ గెలిచినపుడు సంబరాలు చేసుకుందా? లేదంటే షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి వెళ్లిందా? ’’ అని ఓ వీడియోను పంచుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్సీబీ- సీఎస్‌కే ఫ్యాన్స్‌ మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీసింది.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్‌ చేరే తొలి జట్టు ఇదే: పాక్‌ లెజెండ్‌I can understand he’s pissed but every other player came to shake hands. Those players deserved to have that moment. When CSK won last year should they have gone around celebrating or gone to shake hands? https://t.co/MPXQ9zVOYo pic.twitter.com/TxKA2My6xD— Pradhyoth (@Pradhyoth1) May 19, 2024#THALAFOREVER 🦁💛@msdhoni pic.twitter.com/zOu5KABAcP— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024

CP Dayanand Key Comments Over Bangalore Rave Party
బెంగళూరు రేవ్‌ పార్టీ: ఆ ఇద్దరు నటులు ఎవరు?

సాక్షి, బెంగళూరు: బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ దర్యాప్తుపై సీపీ దయానంద కీలక విషయాలు వెల్లడించారు. ఈ రేవ్‌ పార్టీలో ఇద్దరు నటులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అలాగే, అనుమానితుల బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఎఫ్ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు.కాగా, సీపీ దయానంద మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు రేవ్‌ పార్టీ కేసును ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ చేయడం జరిగింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. రేవ్‌ పార్టీలో 150 మంది పాల్గొన్నారు. ఈ రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్‌ శాంపుల్స్‌ స్వీకరించాము. ఎఫ్ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాము. డ్రగ్స్ కొనుగోలుపై ప్రత్యేక చట్టల ద్వారా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము. బెంగళూరు రేవ్‌ పార్టీలో ఇద్దరు నటులు దొరికారు. ఇద్దరు నటుల రక్త నమునాలు తీసుకున్నాము. ఈ ఈవెంట్‌లో రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనలేదు. పోలీసులు వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. డ్రగ్స్ తెచ్చిన పెడ్లర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నారు. ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు.

Joe Biden says What's happening in Gaza is not genocide
గాజాలో జరుగుతోంది మారణహోమం కాదు: జో బైడెన్

న్యూయార్క్‌: అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ICC)నుంచి ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, హమాస్‌ అగ్రనేతలపై అరెస్టు వారెంట్లు ఇవ్వాలని కోరిన చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం దాడులతో మారణ హోమం సృష్టిస్తుందన్న కరీం ఖాన్‌ ఆరోపణలను బెడెన్‌ తీవ్రంగా ఖండించారు. వైట్‌హౌజ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జో బైడెన్‌ మాట్లాడారు.‘‘గాజాలో జరగుతున్నది.. మారణహోమం కాదు. అటువంటి ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాం. అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడుల్లో ఇజ్రాయెల్‌ బాధిత పక్షంగా మిగిలింది. హమాస్‌ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్‌ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, కొందరు హమాస్‌ చెరలో ఇంకా బంధీలుగా ఉన్నారు. .. మేము(అమెరికా) ఇజ్రాయల్‌ రక్షణ, భద్రత కోసం కట్టుబడి ఉంటాం. హమాస్‌ మిలిటేంట్లను అంతం చేసేవరకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తాం. హమాస్‌ ఓడిపోవటమే మా లక్ష్యం. హమాస్‌ను ఒడించేందుకు ఇజ్రాయెల్‌ కోసం పనిచేస్తాం. హమాస్‌ నుంచి ఇజ్రాయెల్‌ బంధీల విడుదల విషయంలో వెనక్కి తగ్గము’’ అని బెడెన్‌ అన్నారు. మరోవైపు.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ జరగాలని బైడెన్‌ పేర్కొనటం గమనార్హం.గాజా, ఇజ్రాయెల్‌లో యుద్ధ నేరాలు, మానవాళిపై అకృత్యాలకు గాను నెతన్యాహు, ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్, హమాస్‌ నేతలు యోహియా సిన్వర్, మహ్మద్‌ దీఫ్, ఇస్మాయిల్‌ హనియేహ్‌లు బాధ్యులని చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్‌ అన్నారు. వారికి అరెస్టు వారెంట్లు ఇవ్వాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే.

Lucifer Empuraan Mohanlal First Look Out Now
'లూసిఫర్‌2'లో మాఫియా డాన్‌గా మోహన్‌లాల్‌ లుక్‌ రివీల్‌

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నేడు (మే 21) 64వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా లూసిఫర్‌ సీక్వెల్‌ నుంచి ఆయన లుక్‌ను రివీల్‌ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ లూసిఫర్‌ 2 పోస్టర్‌ను డైరెక్టర్‌, హీరో పృథ్వీరాజ్ పోస్ట్‌ చేశాడు.మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం లూసిఫర్‌.. 2019వ విడుదలైన ఈ సినిమా రూ. 200 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా 'లూసిఫర్‌2: ఎంపురాన్‌(రాజు కన్నా గొప్పవాడు)' అనే టైటిల్‌తో ఈ ఏడాదిలో విడుదల చేయనున్నారు. సీక్వెల్‌ కోసం మురళీ గోపి అందించగా పృథ్వీరాజ్‌నే దీనికి కూడా దర్శకత్వం వస్తున్నారు. గతేడాదిలోనే షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.'లూసిఫర్'లో స్టీఫెన్‌ గట్టుపల్లి అనే రాజకీయ నాయకుడిగా మోహన్‌లాల్‌ కనిపించాడు. అయితే, ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు ఈ ప్రపంచాన్నే శాసించే మాఫియాకు అధినేతగా ఉంటారు. మాఫియా డాన్‌ అబ్రహాం ఖురేషి సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అంత స్థాయికి ఎలా చేరుకున్నాడు. రాజకీయాలకు ముందు ఆయన ఏం చేశాడు..? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు..? అనేది తెలియాలంటే లూసిఫర్‌2 వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. లూసిఫర్‌ చిత్రాన్ని తెలుగులో గాడ్‌ఫాదర్‌ పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Prithviraj Sukumaran (@therealprithvi)

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement