జ‌ట్టును ప్ర‌క‌టించిన వెస్టిండీస్‌.. కొత్త కెప్టెన్ ఎవరంటే? | Sakshi
Sakshi News home page

SA vs WI: జ‌ట్టును ప్ర‌క‌టించిన వెస్టిండీస్‌.. కొత్త కెప్టెన్ ఎవరంటే?

Published Mon, May 20 2024 11:26 AM

Brandon King to lead Windies against Proteas in T20I series

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో స‌న్నాహ‌కాల్లో భాగంగా వెస్టిండీస్ త‌మ స్వ‌దేశంలో ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది. తొలి ద‌శ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు మాత్ర‌మే ఇరు జ‌ట్లు ఆడ‌నునున్నాయి. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ముగిసిన త‌ర్వాత మ‌రో మూడు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

మే 23న జ‌మైకా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో ప్రోటీస్‌తో సిరీస్ కోసం 14 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. 

ఈ సిరీస్‌కు ఐపీఎల్‌-2024లో భాగమైన విండీస్ ఆట‌గాళ్లు దూర‌మ‌య్యారు. కెప్టెన్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్, ఆండ్రీ ర‌స్సెల్‌, హెట్‌మైర్ వంటి కీల‌క ఆట‌గాళ్లు ప్లే ఆఫ్స్‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. ఈ సిరీస్‌లో విండీస్ కెప్టెన్‌గా బ్రాండన్ కింగ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, ఆండ్రీ ఫ్లెచర్, మాథ్యూ ఫోర్డే, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, రొమారియోడెన్ షెఫెర్డ్ వాల్ష్.

Advertisement
 
Advertisement
 
Advertisement