స్టార్‌ హీరోయిన్‌ను పట్టించుకోని డెలివరీ బాయ్‌.. నెటిజన్ల ప్రశంసలు! | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోయిన్‌ను పట్టించుకోని డెలివరీ బాయ్.. వీడియో వైరల్!

Published Mon, May 20 2024 3:25 PM

Delivery Agent Walks At In Front Of Past Taapsee Pannu Video Goes Viral

ఎవరైనా సెలబ్రిటీ మనకు ఎదురైతే చాలు. సెల్ఫీల కోసం ఎగబడే కాలం ఇది. ఇక పొరపాటున స్టార్స్‌ హీరోయిన్స్, హీరోలు కనపడితే ఇంక అంతే. సెల్పీ కోసం క్యూ కడతారు. అలాంటి ఈ రోజుల్లో ఓ డెలివరీ బాయ్‌ చేసిన పని నెట్టింట తెగ వైరలవుతోంది. అసలేం అతను ఏం చేశాడు? ఎందుకు అంతలా హాట్‌ టాపిక్‌గా మారిందో తెలుసుకుందాం.

తాజాగా ముంబయిలోని ఓ సెలూన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. దీంతో ఆమె అక్కడే వేచి ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అనుకోకుండా అదే సమయంలో సెలూన్‌ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్‌ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు.  అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్‌ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు. 

దీంతో ఆ డెలివరీ బాయ్‌పై నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని డెడికేషన్‌కు హ్యాట్సాఫ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతను తన పని పట్ల అంకితభావంతో ఉన్నాడంటూ మరొకరు రాసుకొచ్చారు. అతన్ని చూస్తుంటే సంతోషంగా ఉందంటూ మరో నెటిజన్ పోస్ట్‌ చేశారు. అతనికి కంపెనీ ప్రోత్సాహం ఇవ్వాలని కొందరు సూచించారు.

ఆ తర్వాత తాప్సీ తన కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. ఈ ఏడాది మార్చిలో తాప్సీ తన చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమావ విషయానికొస్తే  ఖేల్ ఖేల్ మే, ఫిర్ అయి హసీన్ దిల్రుబాలో తాప్సీ కనిపించనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement