జ్యోతిక శ్రీ బృందానికి స్వర్ణం..! | Jyotika Sri Team Wins Gold In Asian Relay Athletics Championship, More Details Inside | Sakshi
Sakshi News home page

జ్యోతిక శ్రీ బృందానికి స్వర్ణం..!

Published Tue, May 21 2024 9:33 AM

Jyotika Sri Team Wins Gold In Asian Relay Athletics Championship

అమోజ్‌ జేకబ్, శుభ, జ్యోతిక శ్రీ, అజ్మల్‌

ఆసియా 4×400 మిక్స్‌డ్‌ రిలేలో భారత జట్టు జాతీయ రికార్డు

బ్యాంకాక్‌: ఆసియా రిలే అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ లో అజ్మల్, దండి జ్యోతిక శ్రీ, అమోజ్‌ జేకబ్, శుభాలతో కూడిన భారత బృందం మిక్స్‌డ్‌ రిలే 4్ఠ400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది.

ఈ క్రమంలో గత ఏడాది ఆసియా క్రీడల్లో 3 నిమిషాల 14.34 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు తెరమరుగైంది. భారత్‌కు బంగారు పతకం దక్కడంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతిక శ్రీ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రదర్శనతో భారత బృందం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి చేరుకుంది. జూన్‌ 30వ తేదీలోపు భారత బృందం టాప్‌–16లోకి చేరితే పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.

ఇవి చదవండి: World Para Championships: శభాష్‌ దీప్తి..

Advertisement
 
Advertisement
 
Advertisement