ధోని ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్‌.. | Sakshi
Sakshi News home page

IPL 2024: ధోని ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్‌..

Published Mon, May 20 2024 1:28 PM

CSK Officials Big Revelation On MS Dhonis Retirement

ఐపీఎల్‌-2024 లీగ్ ద‌శలోనే చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇంటిముఖం ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన ఆర్సీబీ చేతిలో సీఎస్‌కే ఓడిపోయింది. ర‌వీంద్ర జ‌డేజా, ఎంఎస్ ధోని ఆఖ‌రిలో మెరుపులు మెరిపించిన‌ప్ప‌టికి త‌మ జ‌ట్టును మాత్రం గెలిపించ‌లేక‌పోయారు.

సీఎస్‌కే, ఆర్సీబీ 14 పాయింట్ల‌తో స‌మంగా ఉన్న‌ప్ప‌టికి.. ర‌న్‌రేట్ ప‌రంగా బెంగ‌ళూరు మెరుగ్గా ఉండ‌డంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజ‌న్ త‌ర్వాత ధోని ఐపీఎల్‌కు విడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

ధోని నుంచి అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ఈ క్ర‌మంలో ధోని రిటైర్మెంట్ వార్త‌ల‌పై సీఎస్‌కే ప్ర‌తినిథి ఒక‌రు స్పందించారు. ధోని తన రిటైర్మెంట్ గురించి ఫ్రాంచైజీకి ఇప్ప‌టి వ‌ర‌కు తెలియజేయలేదని సద‌రు ప్ర‌తినిథి తెలిపారు.

"ఐపీఎల్ రిటైర్మెంట్ గురుంచి ధోని ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కేలో ఎవ‌రితోనూ చ‌ర్చించ‌లేదు. అత‌డు త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌డానికి కొంత స‌మ‌యం తీసుకుంటాని మెనెజ్‌మెంట్‌తో ధోని చెప్పాడు. అత‌డు ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు. అది మాకు కలిసొచ్చే అంశం. 

వికెట్ల మ‌ధ్య ప‌రిగెత్త‌డంలో అత‌డు ఎక్క‌డ ఇబ్బంది ప‌డ‌లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చాలా మంది దిగ్గ‌జ క్రికెట‌ర్లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. కానీ అభిమానులు అయితే వ‌చ్చే సీజ‌న్‌లో ఈ రూల్‌ను ఉప‌యోగించుకుని ధోనిని కేవ‌లం బ్యాటింగ్‌కే దిగేలా చూడాలి కోరుతున్నారు. 

ఇది గానీ ధోని ఏమి నిర్ణ‌యం తీసుకుంటాడో మాకు తెలియ‌దు. త‌ను ఏ నిర్ణ‌యం తీసుకున్న మేము అంగీక‌రిస్తాం. అతను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్ట‌కుని ఏ నిర్ణ‌యమైన తీసుకుంటాడ‌ని"  సీఎస్‌కే సీనియ‌ర్ అధికారి ఒక‌రు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement