ధోని జెర్సీ నంబర్‌ మారనుందా? | Rumours MS Dhoni Changing His Jersey Number From 7 To 8 | Sakshi
Sakshi News home page

MS Dhoni: ధోని జెర్సీ నంబర్‌ మారనుందా?

Mar 18 2026 9:20 PM | Updated on Mar 19 2026 1:14 PM

Rumours MS Dhoni Changing His Jersey Number From 7 To 8

టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌ 2026 సీజన్‌లో తన జెర్సీ నంబర్‌ మార్చుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని జెర్సీ నంబర్‌ ఎంత అని చిన్న పిల్లాడిని అడిగినా టక్కున ఏడు అని చెప్పేస్తాడు. అంతలా పాతుకుపోయింది ధోని జెర్సీ నంబర్‌. రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌కు ఆడిన ధోని ఏడు నెంబర్‌ జెర్సీతోనే బరిలోకి దిగాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఐపీఎల్‌లోనూ సీఎస్‌కే తరఫున అదే జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగుతున్నాడు. అయితే తాజాగా ధోనినే స్వయంగా తన ఫేస్‌బుక్‌ ఖాతా వేదికగా తాను ధరించబోయే ఎనిమిదో నెంబర్‌ జెర్సీని పంచుకున్నాడు. 

‘కొన్ని నంబర్లు మనతో పాటే ఉండిపోతాయి. అందులో ఏడు అనేది ఒకటి. కానీ ఇవాళ నేను 8కి స్విచ్‌ అవుతున్నా. ఎందుకనేది మీకు త్వరలోనే తెలుస్తోంది’ అంటూ ధోని ఒక క్యాప్షన్‌ జత చేశాడు. ఇది చూసిన ధోని అభిమానులు మాత్రం ‘మా ధోని ఎప్పుడు ఏడో నంబర్‌ జెర్సీకే కట్టుబడి ఉండాలి. అది మాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది’ అంటూ పేర్కొన్నారు. 

మరికొందరు మాత్రం అది కేవలం అడ్వర్టైజ్‌మెంట్‌ కోసం ధోని చేసిన వీడియో అని తెలిపారు. నిజానికి ఎంఎస్‌ ధోనికి నంబర్ 7తో చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. ధోనికి ఆ నంబర్‌ ఒక ఎమోషన్‌ కూడా. ధోని పుట్టిన తేదీ జూలై 7 (07/07). అందుకే కెరీర్ ఆరంభం నుంచి ధోని అదే నంబర్‌ను వాడుతున్నాడు. 

భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్‌ కూడా ప్రకటించి అతని జెర్సీని బీసీసీఐ మ్యూజియంలో ఉంచింది. ఇలాంటి తరుణంలో ధోని తనకు అచ్చొచ్చిన నంబర్‌ను ఐపీఎల్‌లో మార్చుకోవడం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

చదవండి: ‘కెరీర్‌ ముగింపు మన చేతుల్లో ఉండదు’

Advertisement
 
Advertisement
Advertisement