అక్కడ ముగింపు.. ఇక్కడ ప్రారంభం! | Sanju Samson Opens Up Exit From Rajastan Royals Join CSK IPL 2026 | Sakshi
Sakshi News home page

Sanju Samson: అక్కడ ముగింపు.. ఇక్కడ ప్రారంభం!

Mar 17 2026 3:30 PM | Updated on Mar 17 2026 3:42 PM

Sanju Samson Opens Up Exit From Rajastan Royals Join CSK IPL 2026

టీ20 ప్రపంచకప్‌ హీరో సంజూ శాంసన్ ఐపీఎల్‌ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సంగతి తెలిసిందే. 2018 నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న సంజూ శాంసన్‌ 2025 నవంబర్‌లో ట్రేడింగ్‌లో భాగంగా జడేజా, సామ్‌ కరన్‌లను రిలీజ్‌ చేసిన చెన్నై శాంసన్‌ను దక్కించుకుంది. 

మరో 10 రోజుల్లో ఐపీఎల్‌ 18వ సీజన్‌ ఆరంభమవుతున్న నేపథ్యంలో సంజూ శాంసన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజస్థాన్‌తో బంధం ముగిసిందని, ఈ సీజన్‌ ద్వారా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ప్రయాణం ప్రారంభమైందని పేర్కొ న్నాడు. 

శాంసన్‌ మాట్లాడుతూ..‘నేను ఆ జట్టులో సమయం ముగిసిందని భావించా.. అందుకే రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి బయటకు వచ్చా. నేను రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రత్యర్థిగా ఆడడం ఇదే తొలిసారి అనుకుంటా. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. కానీ ఒకసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్‌ గురించే తప్ప వేరే దాని గురించి ఆలోచించను. 

రాజస్థాన్‌ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్‌మెంట్‌, సపోర్ట్‌ స్టాఫ్‌ అంతా తెలిసినవాళ్లే. వారు ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నారు. కానీ ప్రతీ ఒక్కరికీ ఒక సమయం అనేది ఉంటుంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో నా సమయం ముగిసింది. నేను ముందుకు సాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్‌పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. 

ఇక సంజూ శాంసన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌ ప్రారంభం నాటి నుంచి ఎక్కువగా రాజస్థాన్‌ రాయల్స్‌కే ఆడాడు. మధ్యలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడినప్పటికీ రాజస్థాన్‌తోనే శాంసన్‌కు అనుబంధమెక్కువ అని చెప్పొచ్చు. 2022లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన శాంసన్‌ ఆ సీజన్‌లో రాజస్థాన్‌ ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 

2023 సీజన్‌లో రాజస్థాన్‌ ప్లేఆఫ్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ బ్యాటర్‌గా మాత్రం శాంసన్‌ విజయవంతమయ్యాడు. ఆ తర్వాత 2024లో శాంసన్‌ నేతృత్వంలో రాజస్థాన్‌ జట్టు మరోసారి రెచ్చిపోయింది. తొలి 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలిచిన రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 

అయితే క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్ సంజూ శాంసన్‌ బెస్ట్‌ అని చెప్పొచ్చు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 5 హాఫ్‌సెంచరీల సాయంతో 531 పరుగులు సాధించి కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శన చేశాడు. 2025 సీజన్‌లో గాయాల సమస్యలతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. శాంసన్‌ స్థానంలో రియాన్‌ పరాగ్‌ జట్టును నడిపించాడు.

చదవండి: సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement