'లూసిఫర్‌2'లో మాఫియా డాన్‌గా మోహన్‌లాల్‌ లుక్‌ రివీల్‌ | Lucifer Empuraan Mohanlal First Look Out Now | Sakshi
Sakshi News home page

'లూసిఫర్‌2'లో మాఫియా డాన్‌గా మోహన్‌లాల్‌ లుక్‌ రివీల్‌

May 21 2024 12:58 PM | Updated on May 21 2024 3:13 PM

Lucifer Empuraan Mohanlal First Look Out Now

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నేడు (మే 21) 64వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా లూసిఫర్‌  సీక్వెల్‌ నుంచి ఆయన లుక్‌ను రివీల్‌ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ లూసిఫర్‌ 2 పోస్టర్‌ను డైరెక్టర్‌, హీరో పృథ్వీరాజ్ పోస్ట్‌ చేశాడు.

మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం లూసిఫర్‌.. 2019వ విడుదలైన ఈ సినిమా రూ. 200 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా 'లూసిఫర్‌2: ఎంపురాన్‌(రాజు కన్నా గొప్పవాడు)' అనే టైటిల్‌తో ఈ ఏడాదిలో విడుదల చేయనున్నారు. సీక్వెల్‌ కోసం మురళీ గోపి అందించగా పృథ్వీరాజ్‌నే దీనికి కూడా దర్శకత్వం వస్తున్నారు. గతేడాదిలోనే షూటింగ్‌ కూడా ప్రారంభమైంది.  ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

'లూసిఫర్'లో  స్టీఫెన్‌ గట్టుపల్లి అనే రాజకీయ నాయకుడిగా మోహన్‌లాల్‌ కనిపించాడు. అయితే, ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు ఈ ప్రపంచాన్నే శాసించే మాఫియాకు అధినేతగా ఉంటారు. మాఫియా డాన్‌ అబ్రహాం ఖురేషి సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అంత స్థాయికి ఎలా చేరుకున్నాడు. రాజకీయాలకు ముందు ఆయన ఏం చేశాడు..? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు..? అనేది తెలియాలంటే లూసిఫర్‌2 వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. లూసిఫర్‌ చిత్రాన్ని తెలుగులో గాడ్‌ఫాదర్‌ పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement