వినాయక చవితి చుట్టూ... | Sakshi
Sakshi News home page

వినాయక చవితి చుట్టూ...

Published Tue, May 21 2024 3:08 AM

Anand Devarakonda Gam Gam Ganesha Trailer Launch

‘‘గం గం గణేశా’ దర్శకుడు ఉదయ్‌ నా వద్ద పని చేశాడు. అంకితభావం, కష్టపడే తత్వం ఉన్న అతనికి ఈ సినిమా తప్పకుండా సక్సెస్‌ ఇవ్వాలి’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఆనంద్‌ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది.

ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సాయి రాజేశ్‌ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘గం గం గణేశా’ని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు వంశీ కారుమంచి, కేదార్‌ సెలగంశెట్టి. ‘‘వినాయక చవితి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించాం’’ అన్నారు ఉదయ్‌ శెట్టి. ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘గం గం గణేశా’లో తొలిసారి ఎనర్జిటిక్‌ క్యారెక్టర్‌ చేశాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement