
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీపై చేసిన వ్యాఖ్యలకుగాను కలకత్తాక హైకోర్టు మాజీ జడ్జి గంగోపాధ్యాయను ఎన్నికల కమిషన్ మందలించింది. 24 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ గడువు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.
ప్రచార సభల్లో మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని గంగోపాధ్యాకు ఎన్నికల సంఘం సూచించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించింది. నీ రేటెంత అని మమతా బెనర్జీని ఉద్దేశించి గంగోపాధ్యాయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
గంగోపాధ్యాయ ప్రస్తుతం వెస్ట్‌బెంగాల్‌లోని టమ్లుక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలో ఉన్నారు. కలకత్తా హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి మరీ గంగోపాధ్యాయ బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.