ఓటీటీలోకి ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Sakshi
Sakshi News home page

Swatantra Veer Savarkar OTT: 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Published Mon, May 20 2024 2:15 PM

Swatantra Veer Savarkar Movie OTT Release Date Latest

ఓటీటీలోకి మరో డిఫరెంట్ మూవీ రాబోతుంది. 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' టైటిల్‌తో తీసిన ఈ బయోపిక్.. మార్చి 22న థియేటర్లలోకి వచ్చింది. అయితే బయోపిక్స్ ట్రెండ్ పాతబడటం వల్లో ఏమో గానీ ఈ సినిమాకు అనుకున్నంతగా వసూళ్లు రాలేదు. టైటిల్ రోల్‌లో రణ్‌దీప్ హుడా అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ సావర్కర్ జయంతి సందర్భంగా ఓటీటీలోకి రాబోతుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.

(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?)

రణ్ దీప్ హుడా ప్రధాన పాత్రలో నటించిన 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' సినిమాని ఇతడే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు సావర్కర్ జీవితంలో ఏం జరిగింది? ఇంతకు ఆయన ఎవరు అనే విషయాల్ని ఇందులో చూపించారు. రూ.20 కోట్ల బడ్జెట్ పెడితే రూ.30 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.

సావర్కర్ గురించి ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవడం వల్లే ఈ మూవీ సగటు ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ కాలేదు. ఇకపోతే మే 28న సావర్కర్.. 141వ జయంతి సందర్భంగా మూవీని ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నారు. జీ5 వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్స్ చూసే ఆసక్తి ఉంటే మీరు దీన్ని ట్రై చేయండి.

(ఇదీ చదవండి: నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!)

Advertisement
 
Advertisement
 
Advertisement