సైబర్‌ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్‌బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా | RBI employee loses Rs 24.5 lakh to scammers | Sakshi
Sakshi News home page

సైబర్‌ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్‌బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా

May 21 2024 1:21 PM | Updated on May 21 2024 1:28 PM

RBI employee loses Rs 24.5 lakh to scammers

సైబర్‌ నేరస్తులు బెంగళూరులోని ఆర్‌బీఐ ఉద్యోగిని నిండా ముంచారు. అందిన కాడికి రూ.24.5లక్షలు దోచుకున్నారు.  

నగరంలోని కన్నింగ్‌హామ్ రోడ్ ప్రాంతంలో నివసించే ఆర్‌బీఐ ఉద్యోగికి లాజిస్టిక్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ పేరుతో ఓ అగంతకుడు ఆమెకు కాల్‌ చేశాడు. మేడం.. మీ పేరుతో ఓ పార్శిల్‌ వచ్చింది. ఆ పార్శిల్‌లో ముంబైలో ఐదు పాస్‌పోర్ట్‌లు, 5 కిలోల బట్టలు, మూడు క్రెడిట్ కార్డ్‌లతో పాటు ఇతర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి.  

ముంబై పోలీసులు మీ పార్శిల్‌పై ఆరా తీశారు. ఈ కాల్‌ను ఇప్పుడే వాళ్లకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం..అంటూ ప్లాన్‌ ప్రకారం.. కాన్ఫిరెన్స్‌ కాల్‌లో మరో సైబర్‌ నేరస్తుడు లైన్‌లోకి వచ్చాడు. తనిను తాను ముంబై సీనియర్ పోలీస్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ పార్శిల్‌ విదేశానికి సంబంధించింది. అది మీ పేరుమీద ఉంది. మీ ఆధార్ కార్డును ఐడి ప్రూఫ్‌గా ఉపయోగించారని అన్నాడు. మీ బ్యాంక్‌ అకౌంట్‌ను మనీ ల్యాండరింగ్‌కు ఉపయోగించారని మరింత బయపెట్టించాడు.

ఈ కేసు సున్నిమైంది ఎవరికి చెప్పొద్దు. మీ బ్యాంక్‌ అకౌంట్‌ను పరిశీలిస్తున్నాం. ఆ అకౌంట్‌లో ఉన్న మొత్తాన్ని మేం చెప్పిన బ్యాంక్‌ అకౌంట్‌కు పంపించండి. విచారణ పూర‍్తయిన వెంటనే మీ డబ్బుల్ని మీకు పంపిస్తామని హామీ ఇచ్చాడు. సైబర్‌ నేరస్తుడి మాటల్ని నమ్మని బాధితురాలు తొలిసారి రూ.14.2 లక్షలు, రెండో సారి మరో అకౌంట్‌కు రూ.5.5 లక్షలు, మూడో అకౌంట్‌కు రూ.4.8 లక్షలు పంపింది. మొత్తంగా రూ.24.5లక్షల ట్రాన్స్‌ ఫర్‌ చేసింది. అయితే మరుసటి రోజు తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ అదే రోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement