అమితాబ్‌ గురించి ఏదో అనుకున్నా.. ఆరోజు సీన్‌ షూట్‌ చేసేటప్పుడు.. | Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari: అమితాబ్‌తో నటించే సీన్‌.. రెండుసార్లు ఏడ్చేశా!

Published Mon, May 20 2024 2:13 PM

Aditi Rao Hydari Cries Twice While Shooting a Scene with Amitabh Bachchan

తెలుగు బ్యూటీ అదితి రావు హైదరి నటించిన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ "హీరామండి: ద డైమండ్‌ బజార్‌". దిగ్గజ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో తన నటనకు, డ్యాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. తన పర్ఫామెన్స్‌కు పాజిటివ్‌ రియాక్షన్‌ వస్తుండటంతో ఆనందంలో తేలియాడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

బిగ్‌బీతో నటించే ఛాన్స్‌
అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటించిన వాజీర్‌ సినిమాలో ఛాన్స్‌ వచ్చిందనగానే ఎగిరి గంతేశాను. ఆయనతో కలిసి పని చేసే అదృష్టం వస్తుందని ఊహించలేదు. బిగ్‌బీతో కలిసి పని చేసిన రోజుల్ని ఎన్నటికీ మర్చిపోలేను. ఆ సంతోషం, ఎగ్జయిట్‌మెంట్‌ మాటల్లో వర్ణించలేను. ఆ మూవీ అంతా తను వీల్‌చైర్‌లోనే కనిపిస్తారు. 

చిన్నపిల్లాడిలా..
సెట్‌లో కూడా అదే చైర్‌లో కూర్చుని అంతా తిరుగుతూ ఉండేవారు. ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం చూస్తుంటే భలే ముచ్చటేసేది. వానిటీ వ్యాన్‌ను వదిలేసి సెట్‌లోనే ఉండేవారు. వాజీర్‌లో అమితాబ్‌ నాతో మాట్లాడే ఓ సీన్‌ ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ జరిపేటప్పుడు ఆయన నా ఎదురుగా వచ్చి పెద్ద డైలాగ్‌ చెప్తున్నాడు. ఆయన్ని చూస్తూ ఏడ్చేశాను. 

గొప్ప నటుడు
తనొక పెద్ద స్టార్‌ కాబట్టి మనలాగా ఉండరేమో, డాబు ప్రదర్శిస్తారేమోనని ఏవేవో పిచ్చిగా ఊహించుకున్నాను. కానీ అక్కడలాంటిదేమీ లేదు. ఆయన నిజమైన యాక్టర్‌. నా కోసం ఆ సన్నివేశాన్ని మళ్లీ అంతే ఎమోషన్‌తో పూర్తి చేశారు.. నేను మళ్లీ కన్నీళ్లు ఆపుకోలేకపోయాను అని అదితిరావు హైదరి చెప్పుకొచ్చింది.

చదవండి: 'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్‌తో పెళ్లి'.. నటి ఏమందంటే?

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement