భారత్‌లో మరో జర్మన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా? | Sakshi
Sakshi News home page

భారత్‌లో మరో జర్మన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?

Published Tue, May 21 2024 2:31 PM

Audi Q7 Bold Edition Launched in India

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. ఎట్టకేలకు 'క్యూ7 బోల్డ్ ఎడిషన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొత్త ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ గ్లేసియర్ వైట్, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే. అనే నాలుగు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త వెర్షన్ లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి అదే ఇంజిన్ ఉంటుంది. పనితీరు పరంగా ఎటువంటి మార్పులు ఉండదు.

ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ 3.0 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. 335 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇది కేవలం 5.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. క్యూ 7 మోడల్ ఆడి ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటు ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్ రోడ్, ఇండివిజువల్ అనే 7 డ్రైవ్ మోడ్‌లను పొందుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement