కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం | Sakshi
Sakshi News home page

కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం

Published Sun, May 19 2024 5:14 AM

Nine burnt alive as bus catches fire in Haryana

గురుగ్రామ్‌: కదులుతున్న బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు. 17 మంది గాయపడ్డారు. హరియాణాలోని నుహ్‌ జిల్లా టౌరు సమీపంలో శని వారం వేకువజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్, లూధియానా జిల్లాలకు చెందిన సుమారు 60 మందితో కూడిన బంధువర్గం మథుర, బృందావన్‌ తీర్థయాత్రకు వెళ్లి తిరిగివస్తోంది. 

వీరి బస్సులో కుండ్లి– మనేసర్‌– పల్వాల్‌(కేఎంపీ)ఎక్స్‌ప్రెస్‌ వేపై వెళ్తుండగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు వాహన చోదకులు గమనించి డ్రైవర్‌ను హెచ్చరించారు. అతడు పట్టించుకోకపోవడంతో బస్సును వెంబడించారు. ఈలోగా బస్సులోపల మంటలు, పొగ వ్యాపించడంతో డ్రైవర్‌ బస్సును నిలిపివేసి పరారయ్యాడు. బస్సు మెయిన్‌ డోర్‌ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు కిటికీల నుంచి అతికష్టమ్మీద కిందికి దూకారు. అప్పటికే బస్సులోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
 
Advertisement
 
Advertisement