ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్‌ | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్‌

Published Tue, May 21 2024 2:55 PM

Jogi ramesh Questions On Chandrababu Secret Tour

సాక్షి,  విజయవాడ: ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్‌ గల్లంతవుతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు పరార్‌తో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. 

కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారన్నారు జోగి రమేష్‌. ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు జోగి రమేష్‌. పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. టీడీపీ అడ్రస్‌ గల్లంతు కాబోతుంది కాబట్టే చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డాడని విమర్శించారు. పురందేశ్వరి ఈసీకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే అధికారులను మార్చారనిన్నారు.

కాగా అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లిన చంద్ర­బాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.

అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్‌ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్‌ అయినట్లు తెలుస్తోంది.

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్
చదవండి: ఇట్లు ఇటలీకి

Advertisement
 
Advertisement
 
Advertisement