Karimnagar District News
-
ఉగ్రవాదమే ప్రధాన సమస్య
జగిత్యాలటౌన్: ఉగ్రవాదమే మనదేశం ముందున్న ప్రధాన సమస్య అని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్న పాకిస్తాన్‌ను అణిచివేసే చర్యలు చేపట్టాలని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. పహెల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఖండిస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడంతోపాటు ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో దేశ ప్రజలంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలువడం హర్షించదగిన పరిణామమన్నారు. మల్లికార్జన ఖర్గే, రాహుల్‌గాంధీతోపాటు ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం దేశ ఐక్యతకు నిదర్శనమన్నారు. దేశ జాతీయత, ఐక్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం పాకిస్తాన్‌పై చర్యలు చేపట్టాలన్నారు. మేధావులు, ప్రజాసంఘాలు విజ్ఞప్తి మేరకు ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఆయుధాలు పట్టిన వారితో శాంతిచర్చలు జరపాలని కోరారు. ఆయన వెంట పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, ధర రమేష్, జున్ను రాజేందర్, చందారాదాకిషన్, బీరం రాజేష్, గుండ మధు తదితరులు ఉన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.07 కోట్లు
మల్యాల: కొండగట్టు ఆంజన్న ఆలయంలోని 12 హుండీలకు భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ రాజమౌళి ఆధ్వర్యంలో సోమవారం లెక్కించారు. 39 రోజులకు రూ.1,07,67,134 సమకూరాయి. 134 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మిశ్రమ వెండి, బంగారాన్ని తిరిగి బ్యాగుల్లో పెట్టి, సీల్ వేసి హుండీల్లోనే వేశారు. జువెల్లర్స్ సమక్షంలో తూకం వేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఆలయ పరిశీలకులు సునీల్‌కుమార్, చంద్రశేఖర్, హరిహరనాథ్, అశోక్, రాములు పాల్గొన్నారు. కొండగట్టులో భక్తుల రద్దీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మధ్యాహ్నం ఎండలను సైతం లెక్కచేయకుండా స్వామి వారిని దర్శించుకున్నారు. మొక్కలు చెల్లించుకున్నారు. -
ట్యాంకర్ కిందపడి సూపర్వైజర్ మృతి
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–5 ఓసీపీలో తాను నడుపుతున్న ట్యాంకర్ కిందపడి పీసీపటేల్ అనే ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టు సూపర్వైజర్ మృతి చెందాడు. సోమవారం రెండో షిప్టులో వికాస్కుమార్(35) అనే సూపర్వైజర్ ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యాడు. హాలేజీ రోడ్డులో దుమ్ములేవకుండా వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు చల్లేందుకు వాహనం నడుపుకుంటూ వెళ్లాడు. ఈక్రమంలో ట్యాంకర్ అదుపు తప్పింది. అందులోంచి దూకి ప్రాణాలు కాపాడుకోవాలనే ప్రయత్నంలో అదుపుతప్పి అదేట్యాంకర్ వెనుక టైర్ కింద పడి వికాస్కుమార్ దుర్మరణం చెందాడు. డ్రైవర్ నడపాల్సిన ట్యాంకర్‌ను సూపర్వైజర్ ఎందుకు నడపాల్సి వచ్చిందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కాలంచెల్లిన వాహనంతో పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి రూ.కోటిపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు శవాన్ని కదలనివ్వం ప్రమాదంపై విచారణ జరిపి, మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు శవాన్ని ఇక్కడ నుంచి తీయనివ్వమని కార్మిక సంఘాల నాయకులు యాదగిరి సత్తయ్య, మడ్డి ఎల్లాగౌడ్ డిమాండ్‌చేశారు. పీసీపటేల్ ప్రైవేట్ ఓబీ సంస్థ నిర్లక్ష్యంతోనే వికాస్కుమార్ మృతి చెందాడని ఆరోపించారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ -
సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయంగా పాలన
ధర్మారం: సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణా అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ధర్మారంలోని మోడల్ స్కూల్ నుంచి ఎండపల్లి క్రాస్‌రోడ్డు వరకు రూ.3.20 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీరోడ్డు పనులకు ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకువడ్డీలు చెల్లిస్తూనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీనెల తొలివారంలోనే వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.20వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందని ఆమె స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పెగడపల్లి: కాంగ్రెస్ పార్టీ పేదల అభివృద్ధికి పాటుపడుతుందని మంత్రి సీతక్క అన్నారు. పెగడపల్లి మండలంలోని కీచులాటపల్లి కేంద్రంగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో రూ.20కోట్ల తో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ పథకం కింద నియోజకవర్గానికి 3500 ఇళ్లు, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నామని వివరించారు. సన్నబియ్యం కొనలేని స్థితిలో ఉన్న పేదల కోసం దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందిస్తూ, పేదలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ధర్మపురి అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్అండ్బీ సీఈ సమత, డీపీఓ మదన్మోహన్, ఈఈ శ్రీనివాస్, సీఈఓ గౌతం రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శోభారాణి, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రతిష్టాత్మకం నిరుపేదలు సన్నబియ్యంతో అన్నం తినాలనే లక్ష్యంతో కాంగ్రెస్ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీతక్క అన్నారు. నర్సింహునిపేటకు చెందిన దళితురాలు తాండ్ర లక్ష్మి ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు. దొడ్డుబియ్యం తినేందుకు ఇబ్బందిపడ్డామని, సన్నబియ్యం ఇవ్వడంతో ఇంటిల్లిపాదిభోజనం చేస్తున్నామని లక్ష్మి తెలిపారు. సీతక్కకు ఘన స్వాగతం ధర్మపురి: పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు జిల్లాకు వచ్చిన మంత్రి సీతక్కకు మండలంలోని రాయపట్నం వద్ద నాయకులు ఘన స్వాగతం పలికారు. శ్రీలక్ష్మినృసింహుడి ఫొ టో, ప్రసాదాలు అందించారు. ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రఘుచందర్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
ప్రకృతి సాగు.. ఆరోగ్యం బాగు
కరీంనగర్‌అర్బన్: సారవంతమైన నేలలు నిస్సారమవుతున్నాయి. విచ్చలవిడిగా ఎరువులు, మందుల వాడకంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్రజారోగ్యంతో పాటు సాగు నేలలను సారవంతంగా మార్చాలని కేంద్రం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. నేషనల్ మిషన్.. నేచురల్ ఫార్మింగ్ పేరుతో కార్యక్రమం అమలు చేస్తోంది. సహజ పద్ధతుల్లో విభిన్న పంటలు పండించేలా రైతులను ప్రొత్సహించనుంది. మూస పద్ధతిలో సాగుకు స్వస్తి పలికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించే పంటలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందు కోసం జిల్లాలో మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసి నివేదిక పంపాలని ఆదేశించింది. ఈ క్రమంలో కరీంనగర్ అర్బన్ మినహా 15 మండలాలకు గానూ 15 గ్రామాలను ఎంపిక చేసి నివేదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదముద్ర తదుపరి త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవనున్నాయి. ఏంటీ జాతీయ సహజ వ్యవసాయ మిషన్ ఇప్పటికే సాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న రైతులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోలు), స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) వంటి వాటికి ఈ పథకంలో ప్రాధాన్యమిస్తారు. సురక్షితమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సహజ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 2025–26లో ఈ పథకం కోసం వెచ్చించే రూ.2,481 కోట్ల మూలధనంలో కేంద్ర ప్రభుత్వం రూ.1,584 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.897 కోట్లు ఖర్చు చేయనున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో 2వేల వరకు నమూనా సహజ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతారు. ఆసక్తి గల రైతులకు నిపుణులైన శిక్షకులు సహజ వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువుల తయారీ వంటి వాటిలో శిక్షణనిస్తారు. జిల్లాల్లో ఎంపిక చేసిన వ్యవసాయ క్లస్టర్లలో ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు, స్థానిక రైతుల మధ్య సహకారం పెంచేందుకు కృషి సఖులు, సాగు సహాయకుల (సీఆర్పీ)ను ఉపయోగించుకోనున్నారు. నేల సారవంతానికి కేంద్రం చర్యలు మండలానికో గ్రామం ఎంపికకు ఆదేశం ప్రయోజనాలిలా.. సేంద్రియ ఎరువులు, సంబంధ పద్ధతుల వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూసారం మెరుగుపడుతుంది. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గడం వల్ల వాతావరణంలో కార్బన ఉద్గారాలు తగ్గుతాయి. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్, ధర ఉండటం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులు మానవ ఆరోగ్యానికి సురక్షితమైనవి. పోషక విలువలను అధికంగా కలిగి ఉంటాయి. కాగా నేషనల్ మిషన్.. నేచురల్ ఫార్మింగ్ పథకం కోసం మండలానికో గ్రామం ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించామని, ప్రభుత్వం ఆమోదం అనంతరం కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. -
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పట్టణంలోని సిక్కువాడిలో గత నెల 18న జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. సిక్కువాడిలోని అమ్మ మెస్‌లో వంట పని చేస్తున్న అన్నమనేని మంజులను ఆమె భర్త అన్నమనేని కొమురయ్య హత్య చేయాలని ప్రయత్నించాడు. హోటల్లోని పొయ్యిపై ఉన్న వేడి కూరను మంజుల మీద పోయడంతో ఆమె ముఖం, ఛాతి, వీపు భాగాల్లో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. హోటల్ యజమాని విజయ్ 108 అంబులెన్స్ ద్వారా మంజులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మంజుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాజన్న కేసు దర్యాప్తు చేపట్టారు. కొమురయ్యకు మొదటి నుంచి తన భార్యపై అనుమానం ఉండేది. అంతేకాకుండా, మంజుల గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ కారణంగా కొమురయ్య తన భార్యపై కక్ష పెంచుకుని ఆమెను చంపాలని ప్రయత్నించాడు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. నీట్ ర్యాంక్ రాదని యువతి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన జంగ పూజ (20) ఆదివారం నీట్ పరీక్ష రాసింది. ప్రభుత్వం విడుదల చేసిన కీ చూసుకుని ర్యాంక్ రాదనే మనస్తాపంతో సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పూజ 2023లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్‌పరీక్ష కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంది. పరీక్ష సరిగా రాయలేదని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. పూజ తల్లి జంగ జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోతులా.. దొంగలా..?శంకరపట్నం(మానకొండూర్): మండలంలో వరుస చోరీలతో జనం జంకుతుండగా.. తాజాగా కిరాణ దుకాణంలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగలు పడ్డారని వ్యాపారి అనుమానం వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు మాత్రం కోతులు దూరాయని పేర్కొంటున్నారు. వివరాలు.. మండలంలోని కేశవపట్నం ఎస్సీ, బీసీ కాలనీలో సత్యనారాయణ అనే వ్యక్తి రెండురోజుల క్రితం కిరాణ దుకాణానికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం తాళం తీసి చూడగా దుకాణంలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ట్రెయినీ ఎస్సై సుమన్‌రెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. కాగా, దుకాణం వెనక తలుపులకు గడియ పెట్టకపోవడంతో కోతులు దూరి వస్తువులను చిందరవందర చేశాయని, అలాగే బ్యాగ్‌లో ల్యాప్‌ట్యాప్ భద్రంగా ఉండడంతో కోతులు దూరినట్లు నిర్ధారణకు వచ్చారు. దుకాణంలో పడింది దొంగలు కాదని, కోతుల పడి వస్తువులు చిందవందర చేశాయని ట్రెయినీ ఎస్సై పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలుశంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన గంట గణేశ్, నరాల కొమురయ్య సోమవారం రాత్రి వర్షంలో మోటార్‌సైకిల్‌పై వస్తుండగా కేశవపట్నంలో కిందపడి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరిని 108వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
వక్ఫ్ ఆస్తులపై దురాక్రమణ తగదు
● వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి ● మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ ప్రతినిధులు జగిత్యాలటౌన్: వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ దురాక్రమణ తగదని, వక్ఫ్ అధికారాలను పరిమితం చేయడం సరికాదని, ఇది ముస్లిం మత విశ్వాసాలను దెబ్బతీయడమేనని మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ ప్రతినిధులు అన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ఇండియా పర్సనల్ లాబోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు కేవలం షరియా మేధోమార్పిడి మాత్రమే కాకుండా రాజ్యాంగబద్ధంగా లభించిన మైనార్టీల హక్కులకు విరుద్ధంగా ఉందన్నారు. ర్యాలీలో మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లియాఖత్‌అలీ మొహిసిన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, మాజీ కౌన్సిలర్, ముస్లిం సదర్ మహ్మద్భారీ, నేహాల్ పాల్గొన్నారు. -
ఆశన్నపల్లెలో నకిలీ మందుల విక్రయం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఆశన్నపల్లె గ్రామంలో సంజీవని న్యూట్రిషన్ కేర్ సెంటర్ నిర్వాహకుల మని నమ్మించి గ్రామస్తులకు సోమవారం నకిలీ మ ందులు విక్రయించారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. మాజీ సర్పంచ్ మంద వెంకన్న వైద్యాధికారులు, పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులను అదుపులోకి తీసకున్నారు. వరంగల్‌కు చెందిన కొందరు వ్యక్తులు గ్రామానికి చేరుకుని గడువు తీరిన, నకిలీ మందులు విక్రయించారు. విక్రేతలకు గ్రామ పంచాయతీ కా ర్యదర్శి సహకరించినట్లు గ్రామస్తులు ఆరోపించా రు. ఈవిషయమై డిప్యూటీ డీఅండ్‌హెచ్‌వో సుధాక ర్, కూనారం ఆరోగ్య కేంద్రం డాక్టర్ భావన మాట్లాడుతూ, నకిలీ వైద్యం, నకిలీ మందులకు ప్రజలు మోసపోవద్దన్నారు. నకిలీ మందులు, వాహనాన్ని సీజ్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవరా?
కరీంనగర్‌అర్బన్: ‘ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదవాలని ప్రచారం చేస్తున్నారు సరే.. మరి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించరా’.. అంటూ ఓ విద్యార్థిని ప్రజావాణిలో ప్రశ్నించింది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థి బామండ్ల అక్షర ప్రజావాణిలో వినతిపత్రం అందజేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, హాస్టల్స్ సరిగా ఉండాలన్నా, సరిపడా సిబ్బంది ఉండాలన్నా, విద్యార్థులకు మంచి చదువు రావాలన్నా, మంచి భోజనం అందాలన్నా ప్రభుత్వ అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు వారి పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించాలని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలో చదివినవారికే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులన్న నిబంధన తేవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ మరణాలు తగ్గాలన్న ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఫిర్యాదు మీకే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్నానని వివరించారు. -
తుదిమెరుగులు
రైల్వేస్టేషన్లకు● దాదాపు పూర్తయిన రామగుండం, కరీంనగర్ స్టేషన్లు ● ఆధునికీకరణలో ముందడుగు.. ఈనెల 15న ప్రారంభం? ● లిఫ్టులు, ఎస్కలేటర్లు, అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణం పూర్తి ● తుదిదశలో స్వాగత తోరణాలు, సుందరీకరణ పనులు ● కరీంనగర్ ఆర్వోబీ కోసం రైల్వేగేట్ పక్కకు తరలింపుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల పనులు దాదాపు పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. అన్నీ కుదిరితే.. ఈనెల 15న ప్రారంభోత్సవం జరగవచ్చని రైల్వేవర్గాలు అంటున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 27న కరీంనగర్, రామగుండం స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించాల్సింది. అయితే భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వాయిదాపడింది. ఈసారి అనుకుంటున్న 15వ తేదీన జరగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పెద్దపల్లిలో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ (ఏఎంఆర్‌యూటీ) దీనినే అమృత్ పథకం కింద కేంద్రం రూ.73 కోట్లు ఈ మూడు స్టేషన్ల కోసం విడుదల చేసింది. తొలిదశలో కరీంనగర్ రూ.26.06, రామగుండం రూ.26.50 కోట్లు విడుదల కాగా.. రెండో దశలో పెద్దపల్లికి రూ.20 కోట్లు విడుదలయ్యాయి. కరీంనగర్, రామగుండంకు సరికొత్త రూపు రోజుకు ఒకటి, రెండు మినహా పెద్దగా రైళ్లు రాని కరీంనగర్ స్టేషన్ రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. స్టేషన్లో రెండు దశాబ్దాలుగా ఉన్న ఒక్క ప్లాట్ఫారానికి అదనంగా 2, 3 ప్లాట్‌ఫారాలు నిర్మించారు. వాటిని వృద్ధులు, వికలాంగులు వినియోగించుకునేలా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు నిర్మించారు. స్వాగత తోరణాలు, స్టేషన్ ముఖద్వారం ఎలివేషన్, పార్కు పూర్తికావొచ్చాయి. ఇవి కాకుండా మరుగుదొడ్లు, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి, బుకింగ్ కార్యాలయం, ఆర్పీఎఫ్ పోస్టు, కేటీరింగ్ స్టాల్స్, వెయిటింగ్ రూములు, రిజర్వ్డ్ లాంజ్లతోపాటు కమర్షియల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ మేనేజర్, చీఫ్ గూడ్స్ సూపర్వైజర్, డిప్యూటీ స్టేషన్ మేనేజర్లకు ప్రత్యేక కార్యాలయాలు నిర్మించారు. రామగుండం రైల్వేస్టేషన్ ఆధునీకరణ, సుందరీకరణ పనులు కరీంనగర్ కంటే ముందే పూర్తయ్యాయి. దీని వీడియోలు ఇప్పటికే సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెద్దపల్లి స్టేషన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండో ఫేజ్‌లో నిధులు మంజూరవడంతో ఇక్కడ పనులు ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. ఆర్వోబీ కోసం.. రైల్వేగేటు తొలగింపు రైల్వేస్టేషన్ నిర్మాణ పనులతోపాటు కరీంనగర్– చొప్పదండి మార్గంలో ఆర్వోబీ పనులు కూడా ఊపందుకున్నాయి. ట్రాక్‌కు రెండువైపులా నిర్మాణాలు రైల్వేగేట్ వరకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రైల్వేగేటు తొలగించి అక్కడ పిల్లర్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రస్తుతమున్న రైల్వేగేట్‌ను తొలగించి పక్కకు తరలించి ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. వాస్తవానికి ఇప్పటికే పూర్తి కావాల్సిన ఆర్వోబీ నిర్మాణం ఇంకా కొనసాగుతూ.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తోంది. ఉదయం ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు ముదరడంతో బాధలు రెట్టింపయ్యాయి. అంబులెన్స్‌లో కరీంనగర్‌కు వచ్చే రోగుల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. -
భూప్రకంపన.. గాలివాన
● భయం గుప్పిట ప్రజలుకరీంనగర్అర్బన్/కరీంనగర్‌రూరల్/గంగాధర/శంకరపట్నం/మానకొండూర్/గన్నేరువరం: ఓ వైపు భూ ప్రకంపన.. మరోవైపు గాలివాన తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సోమవారం సాయంత్రం 6.49 నుంచి 6.55 గంటల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదైంది. జిల్లాకేంద్రంలో రెండుసార్లు భూకంపం రాగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కరీంనగర్, హుజూరాబాద్, గంగాధర, కొత్తపల్లి ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు తమ వారి యోగక్షేమాలను తెలుసుకునేందుకు ఫోన్లను ఆశ్రయించారు. కొద్దిసేపు భవనాలకు దూరంగా ఉన్న ప్రజలు మళ్లీ యథాస్థితిని కొనసాగించారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, చామనపల్లి తదితర గ్రామాల్లో రెండు పర్యాయాలు భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దుర్శేడ్‌లోని ఓ కిరాణ దుకాణంలో భూకంపం ధాటికి రిఫ్రిజిరేటర్‌తోపాటు భవనం కదిలిన దృశ్యం సీసీ కెమెరాలో నమోదైంది. గన్నేరువరం మండలంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అంతలోనే గాలివాన.. భూప్రకంపనలతో జనం భయభ్రాంతులకు గురికాగా, అంతలోనే గాలివాన బీభత్సంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో గల శ్రీచైతన్య కాలేజీ భవన రేకులు వెనుకాల ఇంటిపై పడగా పాక్షిక నష్టం వాటిల్లింది. గంగాధర మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసింది. శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో రాళ్లవాన కురిసి, తాటిచెట్టుపై పిడుగు పడింది. కేశవపట్నంలో విద్యుత్ స్తంభంపై చెట్టు విరిగిపడి, తీగలు తెగిపోవడంతో సరాఫరా నిలిచిపోయింది. తాడికల్–వంకాయగూడెం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడగా, వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. మానకొండూర్ మండలం కొండపల్కల, కెల్లెడ తదితర గ్రామాల్లో వడగండ్లు కురిశాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. గంగిపల్లి, కొండపల్కలలో విద్యుత్ స్తంభాలు విరిగిపడి అంధకారం నెలకొంది.జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా గాలిదుమారంతో పాటు వాన కురవడంతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు చినిగిపోయాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
డంప్‌యార్డ్‌కు చెత్త తగ్గించాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్కార్పొరేషన్: ఇంట్లో ఉత్పత్తి అయిన చెత్తను వేరు చేసి డిస్పోజ్ చేయడం ద్వారా డంప్‌యార్డ్‌కు చెత్తను తగ్గించాలని నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా సోమవారం నగరంలోని భగత్‌నగర్, విద్యానగర్ ప్రాంతాల్లోని పలు అపార్ట్మెంట్లలో తడి, పొడి చెత్త వేరు చేయడం, డిస్పోజ్ చేయడంపై అవగాహన కల్పించారు. తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నామని, పొడి చెత్తను డీఆర్సీ సెంటర్‌కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. డంప్‌యార్డ్ పరిసర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కొత్తగా ఉత్పత్తి అయ్యే చెత్త భారిగా డంపు యార్డుకు తరలివెళ్లడం ద్వారా బయోమైనింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుందన్నారు. స్థలం దొరకగానే డంప్‌యార్డ్ తరలింపు ఇతర ప్రాంతంలో స్థలం దొరకగానే డంప్‌యార్డ్‌ను ఆటోనగర్ నుంచి తరలిస్తామని కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అన్నారు. సోమవారం డంప్‌యార్డ్ బాధితులతో తన చాంబర్లో సమావేశమయ్యారు. డంప్‌యార్డ్ కోసం హుజురాబాద్ ప్రాంతంలో స్థలం కేటాయింపునకు సంబంధించిన ప్రతిపాదన ఉందన్నారు. రోజూ అధికంగా వస్తున్న చెత్త కారణంగా బయోమైనింగ్‌లో జాప్యం జరుగుతుందున్నారు. -
మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్‌అర్బన్: మౌలిక సదుపాయాల పనులకు సంబంధించి గ్రౌండింగ్ వర్క్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రహరీ, టాయిలెట్స్, కిచెన్ షెడ్ వంటి మౌలిక అవసరాల నిర్మాణానికి పనులు మంజూరు చేశామని తెలిపారు. ఇంకా కొన్ని అభివృద్ధి పనులకు ఇప్పటికీ గ్రౌండింగ్ వర్క్ పూర్తి కాలేదని, సంబంధిత శాఖల హెచ్వోడీలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవతో ఎంపీడీవో, ఆర్డీవోల సమన్వయంతో ఈ నెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి విచారణ అధికారులు పకడ్బందీగా విచారించాలన్నారు. అనర్హులకు మంజూరైనట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరా వ్యవస్థ పై నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, డీటీడీవో పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలను విజయవంతం చేయాలి● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌టౌన్: గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30, 31న అమెరికా వాషింగ్టన్లో జరిగే మహాసభలలో మున్నూరుకాపులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం అపెక్స్ కమిటీ గౌరవ చైర్మన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం మహాసభల పోస్టర్‌ను జ్యోతినగర్‌లో ఆవిష్కరించారు. మున్నూరుకాపులందరూ రాజకీయాలకతీతంగా, ఐక్యంగా ముందుకు సాగలన్నారు. గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్వీ మహేందర్, నాయకులు ప్రకాశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.నేల ఆరోగ్యాన్ని కాపాడాలి జమ్మికుంట(హుజూరాబాద్): పంట మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకంతో నేల ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని మడిపల్లి రైతు వేదికలో జయశంకర్ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో డీఏవో, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు, డీహెచ్‌ఎస్‌వో శ్రీనివాస్‌రావు, శాస్త్రవేత్త నర్సయ్య మాట్లాడారు. పంటలో అధిక మోతాదులో యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి సాగు వ్యయం పెరుగుతుందని, వ్యవసాయ అధికారుల సూచన మేరకే వాడుకోవాలన్నారు. భావితరాలకు సారవంతమైన నేలను అందించాలన్నారు. విత్తనాలు, పురుగుమందుల కొనుగోలు సమయంలో రసీదులను పంటకాలం ముగిసేవరకు భద్రపరుచుకోవాలని, పంటనష్టం జరిగితే కష్టకాలంలో పని చేస్తాయని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఏడీఏ సునీత, ఏవో ఖాదర్‌హుస్సేన్, ఏఈవోలు రామ్‌ప్రసాద్, మహేందర్, అచ్యూత్, అర్చన తదితరులు పాల్గొన్నారు. నియమాలు పాటించాలిజమ్మికుంట(హుజూరాబాద్): విద్యుత్ ప్రమాదాల నివారణకు వినియోగదారులు, సిబ్బంది నియమాలు పాటించాలని ఎస్ఈ రమేశ్‌బాబు అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ భద్రత పోస్టర్లు ఆవిష్కరించారు. డివిజనల్ ఇంజినీరు (ఆపరేషన్స్) ఎస్ లక్ష్మారెడ్డి, టెక్నికల్, సేఫ్టీ ఆఫీసర్ ఉపేందర్, ఏడీఈ రాజేందర్, టౌన్ ఏఈ ఆనంద్, రూరల్ ఏఈ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
అత్తపై కోడలు దాడి
జగిత్యాలక్రైం: అత్తపై కోడలు కత్తితో దాడిచేయగా, కేకలు వేయడంతో స్థానికులు కాపాడి సఖి కేంద్ర నిర్వాహకులకు అప్పగించారు. స్థానికుల వివరాలు.. జిల్లా కేంద్రంలోని జంబిగద్దె ప్రాంతానికి చెందిన పెండ్యాల భాగ్య సంతానం లేకపోవడంతో వినయ్ అనే వ్యక్తిని పెంచుకుంది. అతడికి అఖిల అనే యువతితో వివాహం జరిపించింది. కాగా, కొన్నేళ్లుగా అత్తను అఖిల శారీరకంగా, మానసికంగా వేధిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న బోరు వేయాలని అఖిల అత్తకు సూచించగా, ఆమె మరిచిపోయింది. దీంతో ఆగ్రహించిన కోడలు ఇంట్లోని కత్తితో అత్తపై దాడిచేయగా వీపు, ముఖంపై స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు జిల్లా సంక్షేమశాఖాధికారి నరేశ్‌కు సమాచారం అందించగా, వెంటనే సఖి నిర్వాహకులు లావణ్య, సామాజిక కార్యకర్త శారద చేరదీసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్సై గీత వృద్ధురాలి కోడలు, కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం సఖి కేంద్ర నిర్వాహకులు వృద్ధురాలిని ఆమె ఇంటికి తరలించారు. -
వేసవి దుక్కి.. పంటకు పుష్టి
● పంట కొయ్యలు కాల్చేస్తే ప్రమాదమే ● తొలకరికి ముందు లోతు దుక్కులు మేలు ● ఏటవాలుగా దున్నితే మరింత శ్రేయస్కరంకరీంనగర్ అర్బన్: శాస్త్రవేత్తల మాటలు కాకుండా సొంత నిర్ణయాలే పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పంట కొయ్యలు కాల్చకుండా కలియదున్నడం, వేసవిలో లోతు దుక్కులతో ఎంతో ప్రయోజనం. పురుగులు, తెగుళ్లు, కలుపును నివారించుకోవడంతో పాటు భూమిపొరల్లో వర్షపునీరు ఇంకి పంటకు ఉపయోగపడుతుంది. వేసవిలో లోతు దుక్కుల ఉపయోగాల గూర్చి కరీంనగర్ వ్యవసాయ పరిధశోధనస్థానం హెడ్ డీన్ డా.జి.మంజులత వివరించారు. వేసవి దుక్కులకు ఏప్రిల్, మే నెలలు అనుకూలం, వేసవి దుక్కులను అడ్డం, పొడువు సాళ్లతో కాకుండా ఏటవాలుగా దున్నడం శ్రేయస్కరం. ఏటవాలు దుక్కితో ప్రయోజనాలనేకం ఏటవాలుగా దున్నడం వల్ల భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతుగా దున్నినపుడు భూమిలోపలి పొరల్లో ఉన్న క్రిమికీటకాలు సూర్యకిరణాలతో చనిపోతాయి. వేసవి దుక్కుల్లో తొలకరి వర్షాలు కురిసినపడు విత్తనాలు వేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. తొలకరి వర్షాలకు ముందే రెండుసార్లు దున్నితే గట్టిగా ఉన్న భూమి గుల్లబారడంతో పాటు కలుపు నివారించుకోవచ్చు. వర్షం నీరు భూమిలోకి చొచ్చుకొనిపోతోంది, భూమి పొరల్లోకి గాలి చేరుతుంది. సూక్ష్మజీవుల సాంద్రత, సేంద్రియ కర్బనం బాగా పెరుగుతుంది. దీంతో భూమిలోని పోషకాలను మొక్క గ్రహించడానికి అనుకూలంగా ఉంటుంది. కలుపు, పురుగు మందుల అవశేషాలకు మొక్కలు తీసుకోవు. భూమి వర్షపునీటిని తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. గాలిలో ఉన్న నత్రజని వర్షపునీటితో కలిసి భూమిలోకి చేరడం వల్ల భూసారం పెరుగుతుంది. పురుగుమందులు, తెగుళ్ల మందులకయ్యే పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. హానిచేసే బాక్టీరియాను నాశనం చేయొచ్చు. వరికొయ్యలు కలియదున్నాలి వరి కోతలు పూర్తయ్యాక కొయ్యలను తగులబెడుతుంటారు. దీనివల్ల భూమి సారం కోల్పోతుంది. అలా కాకుండా వరి కొయ్యలను నీటిలో నాన్చి దున్నడం లేదా బీడులోనే కలియదున్నితే నేలలో పోషక విలువలు పెరుగుతాయి. పత్తి రైతులు కాల్చివేయకుండా కలియదున్నాలని శాస్త్రవేత్తలు స్పష్టం సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. -
7 నుంచి క్రికెట్ శిక్షణ శిబిరాలు
● కరీంనగర్, గోదావరిఖని, వేములవాడ, జగిత్యాలలో నిర్వహణకు కేడీసీఏ రెడీ ● ఈ నెల 6 లోపు దరఖాస్తు చేసుకున్నవారికే అవకాశం కరీంనగర్‌స్పోర్ట్స్: క్రికెట్లో ఓనమాలు నేర్పించేందుకు హెచ్‌సీఏ, కేడీసీఏ శ్రీకారం చుట్టాయి. గతంలో మూడు జిల్లాల్లోనే శిబిరాలు నిర్వహించగా, ఈ ఏడాది నుంచి జగిత్యాలలో శిబిరాన్ని ప్రారంభించనున్నారు. నిష్ణాతులైన కోచ్‌ల సమక్షంలో శిక్షణ ఇవ్వనున్నట్లు క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్.మురళీధర్‌రావు తెలిపారు. ఈనెల 7 నుంచి జూన్ 6 వరకు శిబిరాలు నిర్వహిస్తారు. ఈ నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలని క్రికెట్ సంఘం బాధ్యులు తెలిపారు. 13 నుంచి 23 ఏళ్ల వారికి.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అనుబంధమైన కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తారు. 13 నుంచి 23 ఏళ్ల బాలబాలికలు, పురుషులకు, మహిళలకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. దరఖాస్తు ఇలా.. క్రీడాకారులు ఫొటో, ఆధార్‌కార్డుతో సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కరీంనగర్ వావిలాలపల్లిలోని జిల్లా క్రికెట్ సంఘం కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. శిబిరానికి ఎంపికై న క్రీడాకారులు వైట్ యూనిఫాంతో రావాలి. మిగిలిన కిట్ శిబిరంలో ఇస్తారు. ఒక్కో శిబిరంలో 100 నుంచి 120 మంది క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం దక్కుతుంది. రాణించినవారు హెచ్‌సీఏ టోర్నమెంట్లో.. శిక్షణ శిబిరాల్లో రాణించిన క్రీడాకారులకు మంచి అవకాశాలు దక్కనున్నాయి. శిబిరం అనంతరం జూన్‌లో ఉమ్మడి జిల్లా క్రికెట్ టీంలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అండర్– 14,16,19,23 విభాగాల్లో జట్లను ఎంపిక చేసి హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ సంఘం) ఆధ్వర్యంలో జరుగనున్న టోర్నమెంట్లకు పై జట్లను పంపించనున్నారు. కరీంనగర్‌లోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల ఎదురుగా ఉన్న క్రికెట్ అసోసియేషన్ మైదానం, సెయింట్ అల్ఫోన్స్ పాఠశాల మైదానంలో శిబిరాలు జరుగుతాయి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 86887 68775 (శ్రావణ్‌కుమార్) పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలోని జీఎం గ్రౌండ్లో శిక్షణ శిబిరం జరగనుంది. సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్ 98663 51620 (కిరణ్‌కుమార్) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 2వ బైపాస్‌లో గల స్వర్గీయ నర్సింగరావు మైదానంలో శిబిరం జరుగనుంది. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 91772 59935 (రాజు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీస్టేడియం లేదా ఎస్కేఎన్ఆర్ కళాశాల మైదానంలో తొలిసారిగా శిక్షణ శిబిరం జరుగనుంది. సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్ 99480 64712 (జలపతి) క్రికెటర్లుగా ఎదిగేందుకు అవకాశం క్రికెట్ అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. చాలా మంది పిల్లలు మైదానాలు, గల్లీలో క్రికెట్ ఆడుతంటారు. వీరందరు క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే శిబిరాల్లో పాల్గొనాలి. అత్యాధునిక పద్ధతుల్లో కోచ్‌లు ట్రైనింగ్ ఇస్తారు. క్రికెటర్లుగా ఎదగాలనుకునే చిన్నారులు శిబిరాల్లో శిక్షణ తీసుకుంటే చాలా బాగుంటుంది. – వి.ఆగంరావు, క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్షుడు -
విషపురుగు కాటుకు వ్యక్తి మృతి
సారంగాపూర్(జగిత్యాల): రోళ్ళవాగు ప్రాజెక్టు వద్ద ఎండ్రికాయలు పడుతుండగా పాముకాటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బీర్పూర్ ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నందగావ్ గ్రామానికి చెందిన గణపతిదేవ్రావు టార్పే (34) తన స్నేహితుడు సూర్యభాను మారుతితో కలిసి శనివారం ఎండ్రికాయలు పట్టేందుకు బీర్పూర్ శివారులోని రోళ్ళవాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎండ్రికాయలు పడుతున్న క్రమంలో చీకటిగా ఉండడంతో విషపురుగు కాటువేసింది. వెంటనే సూర్యభాను మారుతి 100కు డయల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గణపతిదేవ్రావు టార్పేను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యహ్నం మృతిచెందాడు. మృతుడి భార్య పుష్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా నిర్మల్ జిల్లా సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు జీవనోపాధి కోసం ఇక్కడి వచ్చి ఎండ్రికాయలు పట్టుకుని వెళ్తుంటారని పోలీసులు తెలిపారు. కోతుల దాడిలో మహిళకు గాయాలుహుజూరాబాద్: కోతుల దాడిలో ఆదివారం మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికుల వివరాలు.. పట్టణంలోని విద్యానగర్ మూడో రోడ్లో కోతుల మంద భారీ సంఖ్యలో తిరుగుతూ పుల్లూరి త్రివేణిని తీవ్రంగా గాయపరిచాయి. కోతులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మున్సిపల్ అధికారులు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. శివలింగం, నంది విగ్రహం లభ్యం చొప్పదండి: మండలంలోని దేశాయిపేట గ్రామ చెరువు వద్ద ఆదివారం నంది, శివలింగం విగ్రహాలు లభ్యమయ్యాయి. విషయం తెలిసిన గ్రామస్తులు విగ్రహాల వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరి కొందరు అన్నారు. ఆలయ నిర్మాణానికి వేరే స్థలం తీసుకొని విగ్రహాలు ప్రతిష్ఠించాలని గ్రామంలోని నాయకులు పేర్కొన్నారు. డబ్బులతో ఉడాయించిన వ్యాపారులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లిలో బట్టల వ్యాపారులుగా స్థిరపడ్డ రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు అందినకాడికి అప్పు చేసి రూ.50లక్షలతో రాత్రికిరాత్రే ఉడాయించారు. విషయం తెలుసుకున్న రుణదాతలు లబోదిబోమంటున్నారు. బాధితులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. రాజ స్థాన్లోని నాగుల్‌కు చెందిన గుమాన్ రాచర్లగొల్లపల్లిలో బట్టల వ్యాపారిగా స్థిరపడ్డాడు. మ రొకరితో కలిసి వ్యాపారం కోసమని స్థానికుల నుంచి రూ.లక్షల్లో అప్పు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా పలు చిట్టీలను ఎత్తుకున్నారు. ఇద్దరు కలిసి సుమారు రూ.50లక్షలకు పైగా అ ప్పులు చేసి గుట్టుచప్పుడు ఉడాయించారు. మూడు రోజుల క్రితమే వారు గ్రామాన్ని విడిచి పరారీ కాగా.. విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో అప్పులు ఇచ్చిన వారు తల పట్టుకుంటున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పరారీ అయిన వ్యాపారుల కోసం గాలిస్తున్నారు. అప్పులిచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. -
చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం
కథలాపూర్(వేములవాడ): మండలంలోని ఊట్‌పెల్లి గ్రామశివారులో శనివారం రాత్రి పిచ్చిమొక్కలకు నిప్పంటుకొని మంటలు చెలరేగడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పిచ్చిమొక్కలకు అంటుకున్న మంటలు వ్యాపించి గ్రామశివారులోని రైస్‌మిల్, పెట్రోల్ బంక్ సమీపం వరకు చేరుకున్నాయి. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. ఎస్సై నవీన్‌కుమార్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ప్రజలను అప్రమత్తం చేశారు. మెట్పల్లి నుంచి ఫైరింజన్ వచ్చి మంటలార్పేసింది. అగ్నిప్రమాదంలో రైస్‌మిల్, పెట్రోల్ బంక్‌కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
‘ఎన్‌రైప్’తో మామిడి ‘పండు’
● కాయలను పండుగా మార్చే పౌడర్ ● మామిడి మార్కెట్లో చైనా పౌడర్లు వాడుతున్నట్లు ప్రచారం ● కాల్షియం కార్బైడ్‌ను నిషేధించిన ప్రభుత్వం ● ఎన్‌రైప్ పౌడర్ విక్రయాలకు సర్కార్ అనుమతి జగిత్యాలఅగ్రికల్చర్: మామిడికాయలను పండుగా మార్చేందుకు చాలా చోట్ల వ్యాపారులు విషపూరితమైన కాల్షియం కార్బైడ్, చైనాపౌడర్లను వాడుతున్నారు. ఇటీవల జగిత్యాల (చల్గల్) మామిడి మా ర్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించే కాయల్లో కాల్షియం కార్బైడ్ కలిగిన చైనాపౌడర్లు వాడుతున్న ట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటి పండ్లను తింటున్న వినియోగదారులు క్యాన్సర్ బారిన పడుతుండడంతో ఆరోగ్య సంస్థ, హైకోర్టు కాయను పండుగా మార్చే రసాయనాలను నిషేధించింది. దీంతో కా యను పండుగా మార్చేందుకు ఎన్‌రైప్ అనే సేంద్రియ పౌడర్‌ను ఉపయోగిస్తున్నారు. ఎన్‌రైప్‌ను ఉపయోగించాలని ఉద్యాన శాఖ ప్రచారం చేస్తుండగా, ఆగ్రోస్ సంస్థ ఆ పౌడర్‌ను మార్కెటింగ్ చేస్తుంది. పండ్లలో రారాజు.. పండ్లలో రారాజు మామిడిలో అన్ని రకాల పోషకాలు ఉండడంతో ప్రతి ఒక్కరూ తినేందుకు ఇష్టపడుతుంటారు. గతంలో పక్వానికి వచ్చిన కాయలను గడ్డి, మామిడి ఆకు కింద మాగబెట్టేవారు. అప్పుడు మామిడిపండ్లు రుచిగా, నాణ్యతగా ఉండేవి. కాగా, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి వ్యాపారులు రసాయనాలతో పండుగా మార్చడం మొదలుపెట్టారు. దీంతో మామిడి పండుతో లాభం కంటే నష్టం ఎక్కువగా జరగడంతో ప్రభుత్వం రసాయనాలను నిషేధించింది. అట్టపెట్టెల్లో చైనా ప్యాకెట్లు చల్గల్ మామిడి మార్కెట్ నుంచి పంజాబ్, హరియాణా, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు ఎక్కువగా మామిడికాయలు ఎగుమతి చేస్తారు. జగిత్యాల నుంచి ఢిల్లీ వెళ్లాలంటే లారీకి రెండురోజులు పడుతోంది. సదరు కాయలను అక్కడి వ్యాపారులు పండుగా మార్చాలంటే మరో నాలుగైదు రోజులు పడుతోంది. దీంతో వ్యాపారులు త్వరగా మార్కెటింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయా రాష్ట్రాలకు పంపే మామిడికాయల అట్టపెట్టెల్లో చైనాపొడి ప్యాకెట్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. కాయను పండుగా మార్చే పౌడర్లను ప్రభుత్వం నిషేధించింది. దీనికి తోడు, చాలా మంది పక్వానికి రాని కాయలను విక్రయిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసిన వ్యాపారులు, ఢిల్లీ వెళ్లేవరకు కాయ నాణ్యత చెడిపోతుండడంతో వాటికి సైతం పౌడర్లు వాడుతున్నారు. ఎన్రైప్కు ప్రభుత్వ అనుమతి సహజ సిద్ధమైన స్టార్స్(గంజి)లో ఉండే ఇథలిన్, మాడ్చిన కొబ్బరిచిప్పల పొడితో ‘ఎన్‌రైప్’ పౌడర్‌ను తయారు చేస్తారు. ఈ పౌడర్‌తో కాయ పండుగా మారినా రుచి, నాణ్యతలో తేడా ఉండదు. ఈ మేరకు బెంగళూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ సంస్థ ఆమోద ముద్ర వేయగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వగా, తెలంగాణలో ఎన్‌రైప్‌ను అమ్మేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పండుగా ఎలా మార్చుతుందంటే.. ఎన్‌రైప్ ప్యాకెట్ రూ.పదికి మార్కెట్లో దొరుకుతోంది. ఒక ప్యాకెట్ ద్వారా 10–15 కిలోల మామిడికాయలను పండుగా మార్చవచ్చు. పక్వానికి వచ్చిన కాయలను అట్టపెట్టెలో పెట్టి అందులో నాలుగైదు చోట్ల చిన్నరంధ్రాలు చేసిన ఎన్‌రైప్ ప్యాకెట్‌ను వేసి గాలి తగలకుండా సీల్ చేయాలి. ఎన్‌రైప్ ద్వారా నాలుగైదు రోజుల పాటు అవసరమైన ఇథలిన్ గ్యాస్ విడుదలై కాయ పండుగా మార్చుతుంది. తనిఖీలు నిర్వహించాలి మామిడి మార్కెట్‌తో పాటు రోడ్డు వెంట ఉన్న షెడ్లు, మామిడి విక్రయాలు చేసే దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించాలి. కాల్షియం కార్బైడ్, చైనాపౌడర్లు వాడటంపై స్పష్టమైన నిబంధనలు పాటించాలి. ఆరోగ్యం కోసం తినే మామిడిపండు మనిషి అనారోగ్యానికి గురయ్యేలా తయారయితే ఏం లాభం. – సత్యనారాయణరెడ్డి, ధర్మపురి ప్రభుత్వ అనుమతితోనే ఎన్‌రైప్.. ప్రభుత్వ అనుమతితోనే ఎన్‌రైప్ విక్రయాలు జరుగుతున్నాయి. అగ్రోస్ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. మామిడికాయను ఎన్‌రైప్‌తో పండుగా మార్చవచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. కాల్షియం కార్బైడ్, చైనాపొడిని ప్రభుత్వం నిషేధించింది. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి, జగిత్యాల -
ఏటీఎంలో నగదు కాజేసేందుకు కుట్ర
కరీంనగర్‌క్రైం: ఏటీఎంలో నగదు కాజేసేందుకు గుర్తు తెలి యని వ్యక్తులు కుట్రపన్నారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులు, ఏటీఎం నిర్వాహకుల వివరాలు.. నగరంలోని క్రిస్టియ న్కాలనీలోని ఎస్బీఐ ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ప్రవేశించి, ఏటీఎం మిషన్ తలుపుతెరిచి, డబ్బు కాజేసేందుకు పరికరాన్ని అమర్చారు. ఉన్నతాధికారులు సీ పీ ఫుటేజీ ద్వారా గమనించి, ఏటీఎం చానల్ ఎగ్జిక్యూటర్ రజినీకాంత్‌కు సమాచారమిచ్చారు. ఆయన పోలీసుల కు ఫి ర్యాదు చేయగా, సీఐ సృజన్‌రెడ్డి ఏటీఎంను పరిశీలించారు. నగదు డ్రా చేసినవారి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
మనిషికి చిటికెడంతా ప్రేమ అవసరం
కరీంనగర్‌కల్చరల్: కూడు, గూడు, బట్టలాగే ప్రేమ కూడా మనిషికి కనీస అవసరమేనని, కవిత్వ పఠనంతో మనిషికి చిటికెడంతా ప్రేమైనా అందాలని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్ అన్నారు. ఆదివారం తెలంగాణ రచయితల వేదిక, ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్టు నిర్వహణలో సాహిత్య పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాధేయ మాట్లాడుతూ, కవిత్వాన్ని ప్రేమించే తాను సృజనకారులను ప్రోత్సహించడానికి 37 ఏళ్లుగా పురస్కారాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన వైష్ణవశ్రీకి సత్యదేవి సాహిత్య పురస్కారం, వరంగల్ కవి నందకిషోర్‌కు ఉమ్మడిశెట్టి సతీశ్‌కుమార్ యువ పురస్కారం, తిరుపతికి చెందిన సుధామురళికి రాజయ్య కవితా పురస్కారాన్ని నలిమెల చేతులమీదుగా ప్రదానం చేశారు. అలాగే కరీంనగర్‌కు చెందిన యుగంధర్ కవితా సంపుటి ‘ఇదేమి యుద్ధం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కవులు అన్నవరం దేవేందర్, సీవీ కుమార్, కందుకూరు అంజయ్య, గాజోజు నాగభూషణం, నడిమెట్ల రామయ్య, విలాసాగరం రవీందర్, తోట నిర్మలరాణి, పెనుగొండ సరసిజ, రామానుజం సుజాత, నీలగిరి అనిత, నసీరుద్దీన్, నెరువట్ల చైతన్య, కూకట్ల తిరుపతి, మోర అనిల్, పీఎస్ రవీంద్ర, బీవీఎం స్వామి, గుండు రమణయ్య, గాజుల రవీందర్, ప్రేమసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్ -
ఓపెన్ ‘సిట్టింగ్’
● వైన్స్ సమీపాల్లో మందుబాబుల హల్చల్ ● ఫుట్‌పాత్‌లు, ఖాళీ ప్రదేశాల్లో మద్యపానం ● కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటినా అమ్మకాలు ● ఇబ్బంది పడుతున్న మహిళలు, పాదచారులునగరంలోని హౌజింగ్‌బోర్డు చౌరస్తా వైన్స్ వద్ద ఫుట్‌పాత్‌పై కూర్చుని మందుబాబులు ఇలా బహిరంగంగా మద్యం తాగుతున్నారు. కమాన్ నుంచి హౌజింగ్‌బోర్డు కాలనీ, మారుతినగర్‌కు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. రాత్రి ఏడు దాటిందంటే ఇక్కడ మందుబాబులతో కిక్కిరిసిపోతుంది. కొందరైతే యథేచ్ఛగా రోడ్డుపైనే కూర్చుని మద్యం సేవిస్తుంటే.. అటుగా వెళ్లే మహిళలు, చిన్నారులు ఇబ్బంది పడడం కనిపించింది.కరీంనగర్‌క్రైం: సాయంకాలం అయిందంటే చాలు నగరంలోని పలు వైన్స్‌ల వద్ద ఫుట్‌పాత్‌లు, ఖాళీ ప్రదేశాలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. రద్దీ ప్రాంతాల్లో రోడ్లపైనే సిట్టింగ్ వేయడంతో మహిళలు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ వైన్స్‌కు పర్మిట్రూం ఉన్నప్పటికీ.. కొందరు ఓపెన్ డ్రింకింగ్ చేయడం సమస్యగా మారుతోంది. వైన్స్‌ల ఎదుట నిలిపే వాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక అర్ధరాత్రి తరువాత కూడా బార్లు తెరిచి ఉంటుండగా.. నగరశివారు ప్రాంతాల్లో తెల్లవార్లూ బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఫుట్‌పాత్‌లపైనే సిట్టింగ్.. నగరంలోని హౌజింగ్‌బోర్డు చౌరస్తాలోని మద్యంషాపులో పర్మిట్రూం ఉన్నప్పటికీ పలువురు ఫుట్‌పాత్‌లపై మద్యం సేవిస్తున్నారు అంబేద్కర్స్టేడి యం పక్కన, ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై అడ్డాలు వేస్తున్నారు. రాంనగర్, సుభాష్‌నగర్, కోతిరాంపూర్, విద్యానగర్, నాఖాచౌరస్తా, రేకుర్తి, చింతకుంట, మంకమ్మతోటతో పాటు పలు ప్రాంతాల్లోని బహిరంగ మద్యపానం జోరుగా సాగుతున్నా.. ఎకై ్సజ్, పోలీసు అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లమధ్యే వైన్స్‌లు కొనసాగుతుండగా.. ఓపెన్ సిట్టింగ్‌తో ఆయా కాలనీలవాసులు ఇబ్బంది పడుతున్నారు. గాంధీరోడ్డులో వస్త్రదుకాణాల మధ్యలో ఓ వైన్స్‌ను ఏర్పాటు చేయగా.. మందుబాబుల కారణంగా చుట్టుపక్కల షాపులవారు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అక్కడి వైన్స్‌తో రాత్రి సమయంలో గిరాకీ రావడంతో లేదని పలువురు వ్యాపారులు తెలిపారు. తెల్లవార్లూ అమ్మకాలు వైన్స్‌లు, బార్లు మూసివేసిన తర్వాత కూడా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బస్టాండ్ సమీపంలో ఉన్న రెండు బార్లలో తెల్లవార్లూ వెనకవైపు నుంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నా.. ఎకై ్సజ్, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు.అంబేద్కర్ స్టేడియం, కోతిరాంపూర్, మంచిర్యాల చౌరస్తాల్లోని మద్యం దుకాణాల్లోనూ బ్లాక్‌లో దందా సాగిస్తున్నారు. అలుగునూరు, రేకుర్తి, శాంతినగర్లాంటి విలీన గ్రామాల్లో తెల్లవార్లూ అనుమతి లేకుండా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. ఎకై ్సజ్, పోలీసు అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.నగరానికి సమీపంలో ఉన్న విలీన గ్రామంలో తెల్లవార్లూ బెల్టు దుకాణాలు తెరుచుకునే ఉంటున్నాయి. అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. హైవే పక్కనే ఉండడంతో నగరంతో పాటు సమీప గ్రామాల మందుబాబులు వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు. కార్లు, బైక్‌లపై వచ్చి నచ్చిన బ్రాండ్ తీసుకెళ్తున్నారు. అన్నీ తెలిసినా.. సంబంధిత అధికారులు సైలెంట్‌గా ఉంటున్నారు.నగరంలోని బస్టాండ్, మంకమ్మతోట, కోతిరాంపూర్, తదితర ప్రాంతాల్లోని బార్లలో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పేరుకు సమయానికి మూసేసినా.. దొంగచాటుగా విక్రయాలు సాగిస్తున్నారు. బస్టాండ్, అంబేడ్కర్ స్టేడియం సమీపంలోని మద్యం దుకాణాల వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత కూడా రద్దీ కనిపిస్తోంది. యథేచ్ఛగా విక్రయాలు కొనసాగిస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. -
పట్టుదలతో నాయకత్వ లక్షణాలు
కరీంనగర్: క్రమశిక్షణ, పట్టుదల, కృషి, కఠోరశ్రమతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి, ప్రముఖ సినీనటి రెజీనా కాసాండ్రా పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని వీకన్వెన్షన్లో డెమొక్రటిక్ సంఘ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామీణ మహిళా సంఘం వార్షిక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ పమేలా సత్పతి, ప్రముఖ సినీనటి, డెమోక్రటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలు రెజీనా కాసాండ్రా, సంస్థ వ్యవస్థాపకుడు ఎంఆర్ఎస్కే చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అప్పుడే నాయకురాలిగా రాణిస్తారని తెలిపారు. గ్రామాల్లో అనధికారికంగా నిర్వహించే బెల్ట్‌షాపుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తామని అన్నారు. మహిళలు మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలల పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని సూచించారు. డెమొక్రటిక్ సంఘ సంస్థ ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రముఖ నటి, డెమొక్రటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలు రెజీనా కాసాండ్రా మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు అంటే స్టేజీ మీద మాట్లాడం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో అన్యాయాన్ని ఎదిరించాలని పిలుపునిచ్చారు. తమ సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన దాదాపు 25మంది మహిళా సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై మాట్లాడారు. మహిళలు విన్నవించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. డెమోక్రటిక్ సంఘ ట్రస్ట్ ప్రియ రాజీవ్, ప్రతినిధి షేక్ ఆయుబ్ అడిషనల్ డీఆర్డీవో సునీత పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలవాలి కలెక్టర్ పమేలా సత్పతి, సినీనటి రెజీనా కాసాండ్రా -
నీట్ పరీక్ష.. ఇదేం శిక్ష
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025● కఠిన నిబంధనలతో అష్టకష్టాలు ● 2,975 మందికి 2,914మంది హాజరు ● పలు చోట్ల ఆలస్యం.. అనుమతించని అధికారులు కరీంనగర్ అర్బన్: జిల్లాలో నీట్ (నేషనల్ ఎలిజిబు లిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నిబంధనల క్రమంలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చెవుల కమ్మలు, ముక్కు పుడుకలు తీసేస్తేనే పరీక్షా కేంద్రానికి అనుమతించగా వాటిని తీసేసేందుకు నానాపాట్లు పడ్డారు. పలువురి చెవులకు గాయమై రక్తం కారింది. షూ, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించలేదు. జిల్లా పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,975 మందికి 2,914 మంది పరీక్ష రాశారు. 61మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. ఇక పరీక్షకు హాజరైన అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ ప్రక్రియ నిర్వహించారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీ, ఎస్సారార్ కళాశాలను కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ వివిధ నీట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, తహసీల్దార్ రాజేశ్ పాల్గొన్నారు.సమయం మించి పోవడంతో విద్యార్థిని పరుగులు -
భారీ విగ్రహం ఆవిష్కరణ
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని శ్రీ భక్త మార్కండేయస్వామి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 33 అడుగుల ఎత్తయిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆదివారం కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆవిష్కరించారు. తొలుత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాజీ మేయర్ వై.సునీల్‌రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కమిటీ సభ్యులు స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్, అనుమల్ల సత్యనారాయణ, బీజేపీ నాయకులు కంచ శేఖర్, హరీశ్ పాల్గొన్నారు. స్పష్టమైన వైఖరి ప్రకటించాలి కరీంనగర్: తెలంగాణ ఆవతరణ దినోత్సవం వరకు తెలంగాణ ఉద్యమకారుల అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని ఓ హోటల్లో ఆదివారం ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఆర్ మాట్లాడు తూ.. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుపరచాలన్నారు. ప్రతీ ఉద్యమకారుడికి 250 చదరపు గజాల భూమి, రూ.25వేల పెన్షన్, వైద్య సదుపాయాలు, వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ చైర్మన్ చీమ శ్రీనివాస్, ఫుడ్ కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
● రాణిస్తున్న ప్రాంతీయ క్రీడాపాఠశాల విద్యార్థులు ● ‘పది’ ఫలితాల్లో ఏటా 100శాతం ఉత్తీర్ణత ● పక్కా ప్రణాళికే విజయ రహస్యం అంటున్న ఉపాధ్యాయులు
పదోతరగతి ఫలితాల్లో 553 మార్కులు సాధించి క్రీడాపాఠశాల టాపర్‌గా నిలిచిన గుగులోతు విశ్వంత్ అథ్లెటిక్స్‌లో 110హార్డిల్స్ క్రీడాకారుడు. వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్యం సాధించాడు. బీహార్, గుజరాత్లో జరిగిన జాతీయపోటీల్లోనూ రాణించాడు. 548మార్కులు సాధించిన మరో విద్యార్థిని ఏ.దీపిక పరుగుల రాణి. 100 మీటర్ల రన్నింగ్‌లో దిట్ట. జాతీయ పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో గద్వాల్లో జరిగిన పోటీల్లో రాణించింది. 521 మార్కులు సాధించిన సాయివర్షిణి యోగాలో తన శరీరాన్ని బొంగరంలో తిప్పేస్తోంది. జార్ఖండ్, తమిళనాడులో జరిగిన జాతీయపోటీల్లో సత్తాచాటింది. -
ఎందుకిలా.. ఎన్నాళ్లిలా!
● పింఛన్ జమలో జాప్యం ● ఏప్రిల్ డబ్బుల కోసం పండుటాకుల పడిగాపులు ● ఇక ముఖ గుర్తింపుతో అందజేతకరీంనగర్అర్బన్: చేయూత పింఛన్ డబ్బు జమలో జాప్యం అనుమానాలకు తావిస్తోంది. గత మార్చి పింఛన్లు నెల దాటాక లబ్ధిదారులకు చేరగా ఏప్రిల్ నెలదీ అదే పరిస్థితి. ప్రతి నెలా ఠంఛన్‌గా రావాల్సి న పింఛన్ నెల దాటినా దిక్కులేకపోవడంతో లబ్ధి దారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రతి నెలా తొలివారంలోనే డబ్బులొచ్చేవి. క్రమేణా నెలాఖరుకు చేరగా తాజాగా నెల దాటినా పింఛన్ రాకపోవడం ఆందోళనకర పరిణామం. పింఛన్‌పైనే ఆధారపడి జీవించే వృద్ధులు లేకపోలేదు. నెలనెలా కుటుంబ పోషణ ఖర్చులకు ఉపయోగపడుతాయ ని భావించిన లబ్ధిదారులకు జాప్యం ఆశనిపాతంగా మారింది. అధికారులను సంప్రదిస్తే డబ్బులు వస్తాయని చెబుతున్నారని, తీరా మే నెల రావడంతో గందరగోళం నెలకొంది. లక్షమంది పడిగాపులు జిల్లాలో చేయూత పింఛన్ల కింద 1,23,641 మంది లబ్ధిపొందుతున్నారు. దివ్యాంగులకు రూ.3,016, ఇతర పింఛన్లకు రూ.2,016 ప్రతినెలా చెల్లిస్తున్నా రు. కాగా గత ఏడు నెలలుగా సకాలంలో పింఛను రాకపోవడంతో సంబంధిత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. 2020 వరకు ప్రతి నెల 1 లేదా రెండో తారీఖున పింఛన్ ఖాతాకు చేరేది. కుటుంబ బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చు చేసుకునేవారు. కాగా నెలల తరబడి నిర్లక్ష్యం వేళ్లూనుకోవడంతో సాంత్వన కలిగించేవారే కరువయ్యారు. పింఛన్ కోసం బ్యాంకుకు వెళ్లడం.. రాలేదన్న సమాచారంతో నిరాశగా వెనుదిరగడం లబ్ధిదారుల వంతవుతోంది. ఇక ముఖ గుర్తింపుతో పింఛన్లు ఇకనుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియలో నూతన విధానం అమలుకానుంది. అనర్హులను తొలగించడంతో పాటు జవాబుదారితనం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మే నెల నుంచి ముఖ గుర్తింపుతో పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని(ముఖ గుర్తింపు) కొత్తగా తీసుకొస్తోంది. సెర్ఫ్ కొత్త యాప్‌ను రూపొందించగా వీలైనంత త్వరలో కార్యక్షేత్రంలో అమలవనుంది.భౌతిక వెరిఫికేషన్ బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు రాని వారికి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు వారి వేలిముద్రలను వేసిలబ్ధిదారుల ఇంటికి వెళ్లి డబ్బులు అందజేస్తున్నారు. సదరు విధానంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడంతో సర్కారు కొత్త విధానాన్ని ప్రారంభించనుంది. పింఛన్ల పంపిణీకి ప్రత్యేకంగా రూపొందిస్తున్న యాప్‌లో లబ్ధిదారుల ఫొటోలను ప్రతి నెలా తీసుకుంటారు. ముఖ్యంగా పురపాలికల్లోని లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా పింఛన్ డబ్బులు జమ చేస్తున్నారు. ఎవరైనా లబ్ధిదారుడు మరణిస్తే అతని పింఛన్ వెంటనే రద్దు కావడం లేదు. కొందరికి మూడునెలలు, మరికొందరి ఖాతాల్లో ఆరునెలల వరకు పింఛన్ డబ్బులు జమైన సంఘటనలు ఉన్నాయి. అందుకే సర్కారు కొత్తగా ముఖ గుర్తింపు విధానం తీసుకువస్తుంది. పల్లెలు, పట్టణాలకు చెందిన లబ్ధిదారులు ఎవరైనా సరే యాప్‌లో ఫొటో తీసి అప్ లోడ్ చేస్తేనే పింఛన్ మంజూరవుతుంది.మందులకు పైసల్లేవు ఎప్పుడైనా ప్రతినెల మొదటివారంలో పింఛన్ డబ్బులు వచ్చేవి. కొన్ని నెలలుగా వచ్చే పింఛన్ అవసరానికి ఉపయోగపడటం లేదు. నెలాఖరుకు వేస్తున్నారు. ఇప్పుడేమో అవీ దిక్కులేదు. ఏప్రిల్ దాటినా డబ్బు రాలే. ప్రతినెల మందులు వాడాలి. ఇప్పుడేమో చేతిలో డబ్బులు లేవు. – రాజయ్య, ముగ్ధుంపూర్జిల్లాలో.. మొత్తం లబ్ధిదారులు 1,23,641 వృద్ధాప్య 48,918 వితంతు 34,229 దివ్యాంగులు 20,702 గీతకార్మికులు 3,767 చేనేత 2,817 ఒంటరి మహిళ 3,271 బీడీ కార్మికులు 9,937 -
నాణ్యమైన యూనిఫాం అందించాలి
● కలెక్టర్ పమేలా సత్పతితిమ్మాపూర్: వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాం నాణ్యంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యూనిఫాం కుట్టుమిషన్ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. నిర్ణయించిన ధర కన్నా రూ.2 అదనంగా చెల్లిస్తామని, యూనిఫాం నాణ్యతలో రాజీపడొద్దని తెలిపారు. కొత్తపల్లి పరిధిలోని 13 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన యూని ఫాం ఇక్కడ కుట్టిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రూ.5లక్షల వ్యయంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మో డల్ ఇళ్లును పరిశీలించారు. ఈ మోడల్ ఇంటి నిర్మాణంతో లబ్ధిదారులు ఖర్చు విషయంలో నిర్దిష్ట అంచనాకు వస్తారని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఖాళీ భవనాల్లో అంగన్వాడీలు, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎల్ఎండీ కాలనీలోని కేంద్రీయ విద్యాలయంలో ఆదివారం జరిగే నీట్‌పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థుల ఐడీప్రూఫ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రశ్న, జవాబు పత్రాల తరలింపునకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, ఆంజనేయులు ఉన్నారు. ఎండతో తస్మాత్ జాగ్రత్త కరీంనగర్ అర్బన్: జిల్లాలో ఇటీవల ఎండ తీవ్రత బాగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో సూచించారు. చిన్నారులు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తత అవసరమని అన్నారు. ఎప్పటికప్పుడు మంచి నీరు, గ్లూకోజ్, ఎలక్ట్రోరల్ పౌడర్ వంటివి అందించాలని అన్నారు. వడదెబ్బ బారిన పడకుండా గొడుగు వాడడం, తెలుపురంగు లేదా పలుచని చేనేత వస్త్రాలు ధరించాలని అన్నారు. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పడు ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తరువాత చేయాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పడు ఒక గ్లాసు మంచి నీరు తాగాలన్నారు. అధికారులు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, మజ్జిగ వంటివి సరఫరా చేయాలని కోరారు. ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. -
స్వచ్ఛతలో భాగస్వామ్యం కావాలి
● యూట్యూబ్ స్టార్ గంగవ్వ కరీంనగర్ కార్పొరేషన్: నగర పరిశుభ్రతలో ప్రజ లు భాగస్వామ్యం కావాలని యూట్యూబ్ స్టార్ గంగవ్వ పిలుపునిచ్చారు. పారిశుధ్యంపై నగరపాలకసంస్థ చేపట్టిన అవగాహన కార్యక్రమంలో యూట్యూబ్స్టార్లు గంగవ్వ, రాజు భాగస్వాములయ్యా రు. శనివారం కమిషనర్ చాహత్ బాజ్పేయ్తో కలిసి లక్ష్మినగర్, రాంనగర్, హౌసింగ్‌బోర్డుకాలనీ, ముకరాంపురలో పర్యటించారు. ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరుచేసే పద్ధతిని కమిషనర్ వారికి వివరించారు. సోర్స్ లెవెల్ సెగ్రిగేషన్, స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ, డీఆర్సీ సెంటర్, ఆర్ఆర్ఆర్ సెంటర్లలో చెత్తను వేరుచేయడంపై అవగాహన కల్పించారు. గంగవ్వ మాట్లాడుతూ ప్రతీ ఇంట్లో చెత్తను ఆకుపచ్చ, నీలంరంగు, ఎరుపురంగు డబ్బాల ద్వారా వేరు చేసి కార్మికులకు ఇవ్వాలన్నారు. తడిచెత్తతో కంపోస్టు ఎరువును తయారు చేయాలని, అట్టముక్కలు, డబ్బాలు, ఇతర పొడి వస్తువులు డీఆర్సీ సెంటర్‌కు అందించాలన్నారు. -
వాహనాలు పార్కింగ్ వీడాయి
జగిత్యాలటౌన్: జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో చేపల మార్కెట్ లోపల వాహనాలు పార్క్ చేస్తుండటంతో కొనుగోలుదారులు నిలబడటానికి స్థలం లేకుండాపోయింది. ఈ సమస్యపై మార్చి 19న ప్రచురితమైన కథనానికి మున్సిపల్ కమిషనర్ స్పందన స్పందించారు. చేపల మార్కెట్ నుంచి వాహనాలు తొలగించాలని తమ సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి వాహనాలను తొలగింపజేశారు. కాగా, వాహనాల తొలగింపుతో మార్కెట్లో సౌకర్యవంతంగా ఉందని, తక్షణమే స్పందించిన బల్దియా సిబ్బందితో పాటు వార్త ప్రచురించిన ‘సాక్షి’కి కొనుగోలుదారులు ధన్యవాదాలు తెలిపారు. -
మా బడిలో చేర్పించండి
● ఎంఈవో వినూత్న ప్రచారం కరీంనగర్: ‘మా బడిలో మంచి తరగతి గదులున్నాయి. ప్రయోగాలు చేసేందుకు సైన్స్‌ల్యాబ్, లైబ్రరీ, ఆత్మరక్షణకు కరాటే, ఆరోగ్యానికి పౌష్ఠికాహారం అందిస్తున్నాం. మీ పిల్లలను మా బడిలో చేర్పించండి’ అంటూ కరీంనగర్ జిల్లా గంగాధర ఎంఈవో ప్రభాకర్‌రావు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరా లంటూ మండలంలో ప్రచారం చేస్తున్నారు. బడిబాటకు ముందు సొంతంగా విద్యావాహిని పేరిట వాహనాన్ని తయారు చేశారు. ఆ వాహనానికి బడిలో కల్పిస్తున్న వసతుల ఫొటోలు అంటించి, తల్లిదండ్రులకు ఆవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులను వెంటేసుకుని రోజుకో గ్రామం తిరుగుతూ బడిబాటను కొనసాగిస్తున్నారు. మండలంలోని 33 గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రభాకర్‌రావు తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి స్ఫూర్తితో సొంతఖర్చులతో వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభాకర్‌రావు గతంలోనూ జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. -
అడ్డు తొలగింది.. రోడ్డు పడింది
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలకసంస్థ 9వ డివిజన్ పరిధిలోని అలకాపురికాలనీ నుంచి సిరిసిల్ల బైపాస్ (ఎన్టీఆర్ చౌరస్తా) వైపు వచ్చే రోడ్డు ముగింపు వద్ద పనులు అసంపూర్తిగా వదిలేశారు. విద్యుత్ పోల్, లైన్లు అడ్డుగా ఉండడంతో పూర్తి చేయలేదు. సీసీ రోడ్ ఎత్తుగా, ఆర్అండ్బీ మెయిన్ రోడ్ దిగువన ఉండడం, కిందినుంచి నాలా వెళ్తుండడంతో, రెండింటికీ కనెక్టివిటీ లేక సీసీ రోడ్డు చివరలో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో రాత్రివేళ వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యేవారు. ఓ వ్యక్తి అందులో శవమై తేలాడు కూడా. ఏళ్ల తరబడి సమస్య అలానే ఉండడంతో అలకాపురికాలనీకి చెందిన దుంపేటి రాము మార్చి 12న ‘సాక్షి’ ద్వారా వెలుగులోకి తీసుకురాగా, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ స్పందించారు. ట్రాన్స్‌కో అధికారులతో పలు మార్లు చర్చలు జరపడంతో, రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మార్చి 27న తొలగించారు. దీంతో సీసీ, మెయిన్‌రోడ్డులను కలుపుతూ కల్వర్ట్ నిర్మించి, రోడ్డు వేయడంతో సమస్య పరిష్కారమైంది. ధన్యవాదాలు మా కాలనీవాసులు నిత్యం ఎదుర్కొనే సమస్యను పరి ష్కరింపచేసిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. సీసీ రోడ్డు ను ఆర్అండ్బీ రోడ్డుకు కలపకపోవడం, కింద నాలా ఉండడంతో ఆ గొయ్యిలో చాలా మంది పడి గాయపడ్డారు. ‘సాక్షి’ ‘వాట్సప్ చేయండి’ శీర్షికలో మా కాలనీ వ్యక్తి రాము సమస్యను తెలియచేయడంతో అధికారులు స్పందించి వైర్లు, పోల్‌ను తొలగించి రోడ్డు వేశారు. – లోకేందర్రావు, అలకాపురికాలనీ, కరీంనగర్ -
ప్రమాదకర కల్వర్టు.. స్పందించిన కమిషనర్
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియా పరిధిలోని ఫైవింక్లయిన్ చౌరస్తా సమీపంలో కొ త్త కల్వర్టు ప్రమాదకరంగా ఉండడం, ఇరువైపులా సైడ్‌వాల్ నిర్మించకపోవడంతోపాటు కనీ స ం రోడ్డుకు సమానంగా మట్టి కూడా పోయలేదు. దీంతో ప్రమాదాలు చో టు చేసుకుంటాయి. ఈ సమస్యపై మా ర్చి 21న ‘సాక్షి’లో కథ నం ప్రచురించగా, బల్దియా కమి షనర్ జె.అరుణశ్రీ స్పందించారు. మార్చి 25న కల్వర్టును పరిశీలించి యుద్ధప్రాతిదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. కృతజ్ఞతలు ఫైవింక్లయిన్ చౌరస్తా సమీపంలో కొత్తగా నిర్మించిన కల్వర్టు ప్రమాదకరంగా ఉంది. సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకున్నందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. ము న్సిపల్ కమిషనర్, అధికారులు వెంటనే స్పందించారు. పనులు ప్రారంభించారు. 33వ డివిజన్ పరిధిలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. – మద్దెల దినేశ్, ఫైవింక్లయిన్ ఏరియా, గోదావరిఖని -
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025
సమస్యల పరిష్కారానికి సాక్షిప్రజా సమస్యల పరిష్కారంలో ‘సాక్షి’ దినపత్రిక ముందుంటోంది. అవినీతి, అక్రమాలను వెలికితీస్తూ.. అక్రమార్కులపై పంజా విసురుతోంది. అభాగ్యులకు అండగా ఉంటూ.. సమస్యల పరిష్కారానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇలా మరో అడుగు వేసి.. సమస్యల పరిష్కారంలో పాఠకులనూ భాగస్వామ్యం చేస్తోంది. ‘వాట్సాప్ చేయండి’ శీర్షికన నిత్యం ఫొటో కథనాలు ప్రచురిస్తోంది. వారివారి ప్రాంతాల్లో నెలకొన్న సమస్యను ‘సాక్షి’కి వాట్సాప్ చేస్తే.. కథనం ప్రచురించి, పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకుంటోంది. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతకాలంగా వందలాది సమస్యలు పరిష్కారం అయ్యాయి. దీంతో ‘సాక్షికి సలాం’ అంటూ పాఠకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – వివరాలు IIలోuన్యూస్‌రీల్ -
ప్రాణం తీసిన మామిడికాయలు
● చెట్టు పైనుంచి పడి వృద్ధుడు మృతి గోదావరిఖని: మామిడికాయలు తెంపడానికి చెట్టెక్కి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని చంద్రశేఖర్‌నగర్‌లో నివాసముంటూ వండ్రంగి పనులు చేస్తున్న నాగవెల్లి బాలయ్య(70).. శనివారం ఉదయం తన ఇంటి వెనకాల ఉన్న మామిడి కాయలు తెంపడానికి చెట్టు ఎక్కాడు. కర్రతో కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెట్టు పైనుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా బాలయ్య మార్గమధ్యంలో మృతి చెందాడు. బాలయ్యకు భార్య నాగవెల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. రోడ్డుప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పింఛన్ డబ్బు కోసం బ్యాంక్‌కు వస్తే, వాహనం ఢీకొని ఓ వృద్ధుడు ప్రాణాపాయ స్థితికి చేరాడు. స్థానికుల వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు రమావత్ బాల్య పింఛన్ డబ్బుల కోసం గొల్లపల్లిలోని బ్యాంక్‌కు వచ్చాడు. రోడ్డు దాటుతుండగా కామారెడ్డి నుంచి వస్తున్న మహారాష్ట్రకు చెందిన బొలెరో వాహనం వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాల్య అపస్మారక స్థితికి వెళ్లాడు. 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌లో చీమల తిరుపతిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ రమేశ్ తెలిపిన వివరాలు.. 2021లో ప్రశాంత్‌నగర్‌కు చెందిన బండారి మొగిలి హత్య కేసులో చీమల తిరుపతి, రాగుల రాజశేఖర్, బోనగిరి రాకేశ్ నిందితులు. బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు ట్రయల్‌కు వస్తుందని రాజీ పడదామని ప్రధాన నిందితుడు తిరుపతిని రాజశేఖర్, రాకేశ్ కోరారు. అందుకు తిరుపతి ఒప్పుకోలేదు. తిరుపతిని హత్య చేస్తే గతంలోని హత్య కేసు నుంచి తప్పించుకోవచ్చని నిర్ణయించుకున్నారు. ఈనెల 2న తిరుపతి నడుపుతున్న ఆన్లైన్ సెంటర్‌కు రాజశేఖర్, రాకేశ్ వెళ్లి అతడిపై కత్తులతో దాడిచేసి పారిపోయారు. శనివారం నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
ప్రాణం మీదికి తెచ్చిన మామిడికాయ వక్క
● ఊపిరాడక తల్లడిల్లిన బాలుడు పాలకుర్తి(రామగుండం): మామిడికాయ వక్క గొంతులో ఇరుక్కుని బాలుడు ఊపిరాడక నరకయాతన అనుభవించిన ఘటన శనివారం పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామంలో జరిగింది. 108 సిబ్బంది కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ పదినెలల వయసు ఉన్న బాలుడు ఇంట్లో మామిడివక్క మింగాడు. అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడలేదు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు బైక్‌పై పెద్దపల్లికి తరలిస్తూ కన్నాల గ్రామానికి చేరుకున్నారు. అప్పుడే ఎదురుగా 108 వాహనం రావడంతో అందులో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. ఎయిర్వేను కొంతమేర క్లియర్ చేస్తూ పెద్దపల్లికి చేరుకున్నారు. పెద్దపల్లిలో పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందంటూ కరీంనగర్‌కు రెఫర్ చేయడంతో మరో అంబులెన్స్ ద్వారా కరీంనగర్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ విషయమై సోషల్‌మీడియాలో విభిన్న కథనాలు వైరల్ అయ్యాయి. చికిత్స పొందుతూ యువకుడు మృతిసైదాపూర్(హుస్నాబాద్): నాలుగేళ్ల ప్రాయంలో ఊహ తెలియక ముందే తల్లిదండ్రులను కోల్పోయాడు. 10 నెలల క్రితం తాత, 6 నెలల క్రితం నానమ్మ మృతిచెందారు. నా అనే వారు ఎవరూ లేరు. ఒంటరి తనం, అనారోగ్యం భరించలేక ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు.. సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన అనగోని సంపత్–సుజాత దంపతుల కుమారుడు వికాస్(27). నాలుగేళ్ల వయస్సులో తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి తాత, నాన్నమ్మ లక్ష్మయ్య, లక్ష్మి వద్ద పెరిగాడు. హుస్నాబాద్‌లోని ఓ షాపులో పని చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 10 నెలల క్రితం తాత, 6 నెలల క్రితం నానమ్మ మృతిచెందారు. ఒంటరితనం, అనారోగ్యంతో ఐదురోజుల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. -
బాగైన చేతిపంపు.. తీరిన నీటి కొరత
బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రంలోని ప్రైమరీ స్కూల్ పరిసరాల్లో ఉన్న చేతిపంపు పని చేయడం లేదని, ఆప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారని మార్చి 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదే రోజు ఎంపీడీవో జయశీల చేతిపంపును బాగు చేయించారు. అధికారులు త్వరగా స్పందించారు బోయినపల్లి ప్రైమరీ స్కూల్ పరిసరాల్లో బోరు చేడిపోయింది. మా సమస్యను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, అధికారులు వెంటనే స్పందించారు. ఎంపీడీవో ఆదేశాలతో బోరుకు మరమ్మతు చేశారు. మా ఏరియా ప్రజలకు నీటి కొరత తీర్చిన ‘సాక్షి’కి సలాం. – మాడిచెట్టి శ్రీనివాస్, బోయినపల్లి -
హత్య కేసులో రాజీకి అంగీకరించలేదని..
● ప్రధాన నిందితుడిపై మరో ఇద్దరు నిందితుల దాడి ● కత్తిపోట్లతో తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు గోదావరిఖని: హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరుపతిపై అదేకేసులో ఏ–2, ఏ–3గా ఉన్న మరో ఇద్దరు నిందితులు కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. స్థానిక ప్రశాంత్‌నగర్‌కు చెందిన చీమల తిరుపతిపై అదే ప్రాంతానికి చెందిన రాగుల రాజశేఖర్, బోనగిరి రాకేశ్ దాడిచేశారు. ఈముగ్గురు 2021లో ప్రశాంత్‌నగర్‌కు చెందిన బండారి మొగిలి హత్య కేసులో నిందితులు. జైలుకు వెళ్లి బెయిల్‌పై ఇటీవల విడుదలయ్యారు. కేసు ట్రయల్‌కు వస్తోంది. దీంతో ప్రధాన నిందితుడి వద్దకు వెళ్లి కేసు రాజీ పడదామని మిగతా ఇద్దరు ప్రతిపాదించారు. కేసు కొట్టుడు పోతుందని, కేసు రాజీ అవసరం లేదని ప్రధాన నిందితుడు తిరుపతి రాజీకి ఒప్పుకోలేదు. ఈవిషయంలో ముగ్గురి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో శుక్రవారం తిరుపతి నడుపుతున్న ఎస్ఎం ఆన్లైన్ సెంటర్ వద్ద బైక్‌పై అటూఇటూ తిరుగుతుండటంతో గమనించిన తిరుపతి.. ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారని ఫోన్లో ప్రశ్నించాడు. దీంతో వారు ఫోన్ కట్‌చేసి బైక్ పైనుంచి దిగివచ్చి తిరుపతిపై కత్తులతో దాడి చేశారు. స్థానికులు గుమికూడటంతో నిన్ను ఎప్పటికై నా చంపుతామని బెదిరించి నిందితులు పరారయ్యారు. గాయాల పాలైన చీమల తిరుపతి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాగుల రాజశేఖర్, బోనగిరి రాకేశ్‌పై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. కత్తిపోట్లకు గురైన తిరుపతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఇంటర్ ఫలితాలపై పునః సమీక్ష
కరీంనగర్: నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ వసుంధరదేవి శుక్రవారం సందర్శించారు. ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ఫలితాలపై పునః సమీక్షించారు. కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి, తగు సూచనలు చేశారు. బాలికల పునఃచ్చరణ తరగతులను పరిశీలించి, తగు మార్గదర్శకాలు అందించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదువు ఒక్కటే మార్గమని సూచించారు. తానూ ఇదే కళాశాలలో చదివిన ట్లు గుర్తు చేశారు. కళాశాలను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఐఈవో వి.గంగాధర్, ప్రిన్సిపాల్ ఎ.నిర్మల,, డాక్టర్ జి. వెంకటరాజిరెడ్డి, నిత్య, కరుణ, మమత, ఉమాదేవి, సూపరింటెండెంట్ బల్బీర్‌సింగ్ పాల్గొన్నారు. ‘ఉగ్రదాడికి కేంద్రం వైఫల్యమే కారణం’ చిగురుమామిడి: ఇటీవల జరిగిన ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని, అందుకు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా నైతిక బాధ్యత వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిగురుమామిడిలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో శుక్రవారం సీపీఐ 19వ మండల మహాసభ నిర్వహించారు. అందె చిన్నస్వామి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి చాడ వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తోందని, పేద ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో సీపీఐ సహకారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పోనుగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె స్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, జిల్లా ౖకౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్‌రెడ్డి, బోయి ని పటేల్, కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, బూడిద సదాశివ, ముద్రకోల రాజయ్య పాల్గొన్నారు. గోడ ప్రతుల ఆవిష్కరణ కొత్తపల్లి: చింతకుంటలోని శ్రీ సీతారామ భక్త హనుమాన్ సహిత ఆలయంలో ఈనెల11వ తేదీన చేపట్టనున్న 108సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమ గోడ ప్రతులను కరీంనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. చాలీ సా పారాయణ బృంద సభ్యుడు పెరుమాండ్ల కమల్‌గౌడ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పి.శ్యాంసుందర్ రెడ్డి, రెడ్డవేని మధు, జింక సంపత్, నాయిని ప్రసాద్, శేఖర్ రావు పాల్గొన్నారు. జమ్మికుంటకు రూ.3 కోట్ల నిధులుజమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ గత ఆర్థిక సంవత్సరంలో వందశాతం పన్నులు వసూలు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలి చింది. దీంతో జమ్మికుంట పట్టణ అభివృద్ధికి రూ.3కోట్లు మంజూరు చేస్తూ.. మున్సిపల్ సెక్రటరీ టీకే.శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ ఎండీ.అయాజ్‌కు హైదరాబాద్‌లో ప్రొసీడింగ్స్ అందించారు. పన్నుల వసూళ్లలో కష్టపడి పని చేసిన కమిషనర్, సిబ్బందిని అభినందించారు. కమిషనర్ ఎండీ.అయాజ్ మాట్లాడుతూ రూ.3 కోట్ల నిధులను పట్టణంలో జంక్షన్లు, అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తామని తెలిపారు. మేనేజర్ రాజిరెడ్డి, ఆర్ఐ భాస్కర్, ఆర్వో వాణి, మున్సి పల్ అధికారులు మహేశ్, కుమార్, బిల్ కలెక్టర్ మొగిలయ్య, పాషా పాల్గొన్నారు. -
ధూప, దీపాలకు వేళాయె
● ఆలయాలకు ఆర్థిక సాయానికి కొత్త దరఖాస్తులు ● ఉమ్మడి జిల్లాలో 900వరకు ఆలయాలు ● చిన్న ఆలయాలకు రెండు మూడు నెలలకోసారి వేతనాలు ● గౌరవ భృతి పెంచాలని డిమాండ్ ● ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కావాలంటున్న అర్చకులుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆలయాల్లో ధూప, దీపాలకు వేళయింది. దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే ఆలయాలకు ధూపదీప నైవేద్యాల (డీడీఎన్స్కీమ్) పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పథకం కింద ఎంపికయిన ఆలయానికి ప్రతినెలా రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ఇందులో రూ.4000 ధూపదీప నైవేద్యాలకు, మిగిలిన రూ.6000 కింద గౌరవ భృతి కింద చెల్లిస్తారు. ఈ పథకం కోసం ఈనెల 24వరకు దరఖాస్తులు కోరుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం నిబంధనలు రూపొందించి, ఆ మేరకు అర్హత, ఆసక్తి కలిగిన ఆలయాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఆలయం నిర్మాణమై కనీసం 15ఏళ్లు అయి ఉండాలని ప్రాథమిక నిబంధన విధించారు. వీటితోపాటు దరఖాస్తు ఫారంలో మిగిలిన నిబంధనలు పొందుపరిచారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవభృతి పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఆరోగ్య బీమా కల్పించాలని అర్చకులు కోరుతున్నారు. వైఎస్ హయాంలో మొదలై.. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకం రూపుదిద్దుకుంది. అప్పట్లోఽ ధూపదీప నైవేద్యాల కోసం రూ.2500 చొప్పున ఆనాటి ఖర్చులకు అనుగుణంగా చెల్లించేవారు. ఆరోగ్య శ్రీ, 108, ఫీజు రీయంబర్స్మెంట్ పథకాల మాదిరిగానే ఈ పథకం కూడా రాష్ట్రం విడిపోయినా కొనసాగుతుండటం గమనార్హం. రూ.2500 నుంచి క్రమంగా ఆర్థికసాయం రూ.10,000కు చేరుకుంది. ధూప, దీప నైవేద్యాల ఖర్చులకు 2018లో ఈ మొత్తం రూ.6000గా నాటి సీఎం కేసీఆర్ పెంచారు. తరువాత రూ.10,000 పెంచుతూ జీవో విడుదల చేసినా.. ప్రస్తుత సీఎం రేవంత్ హయాంలో అమలవుతోంది. చూసేందుకు చిన్నమొత్తంగా కనిపించినా.. పూజారులకు ఇస్తున్న గౌరవ భృతిని అన్ని ప్రభుత్వాలు ఆదరిస్తున్నాయి. అదే సమయంలో పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని పలువురు పూజారులు డిమాండ్ చేస్తున్నారు. చివరిసారిగా 2022లో.. ప్రతీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆలయాలు ఈ పథకానికి ప్రాథమిక అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2022లో చివరిసారిగా నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు మూడేళ్ల తరువాత నోటిఫికేషన్ వచ్చింది. ధూపదీప నైవేద్యాల కింద ఉమ్మడి జిల్లాలో 898 ఆలయాలు ఈ పథకం కింద నెలనెలా రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం పొందుతున్నాయి. మూడేళ్ల కాలంలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆలయాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మరో వంద వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.ధూపదీప నైవేద్యం పథకం కింద ఆలయాలు ఫేజ్–1 ఫేజ్–2 ఫేజ్–3 మొత్తం కరీంనగర్ 118 71 67 256 జగిత్యాల 153 67 102 322 పెద్దపల్లి 64 40 49 153 రాజన్నసిరిసిల్ల 83 36 48 167వేతనాలు పెంచాలి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్చకుల బాధలను తెలుసుకొని అర్చకులకు వేతనం కల్పించాలని ఉద్దేశంతో డీడీఎన్ స్కీమ్ ప్రవేశపెట్టారు. అది ఇప్పటివరకు విజయవంతంగా సాగుతోంది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్చకుల బాధని అర్థం చేసుకొని డీడీఎన్ అర్చకులకు వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – రామకృష్ణమాచార్యులు, జిల్లా అర్చక సంఘం అధికార ప్రతినిధిఈఎస్ఐ, బీమా కల్పించాలి ధూప దీప నైవేద్య పథకం కింద పనిచేసే అర్చకులకు ప్రభుత్వం ఈఎస్ఐ, ఆరోగ్య బీమా పథకాలను వర్తింప జేయాలి. ఈఎస్ఐ కూడా మాకు అమలు చేస్తే.. అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. వీటితోపాటు పేద అర్చకులకు ఇండ్ల నిర్మించి ఇవ్వాలని కోరుతున్నాం. – నాగరాజ్ శర్మ, డీడీఎన్ స్కీం అధికార ప్రతినిధి -
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
● టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఎస్ఈ రమేశ్ బాబుకొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ప్రమాదాల నివారణకు పెద్దపీట వేస్తున్నామని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్‌బాబు అన్నారు. కరీంనగర్ విద్యుత్ భవన్లో విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంచుతూ చైతన్య పరుస్తున్నామని చెప్పారు. జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా కరీంనగర్ సర్కిల్లోని డీఈ టెక్నికల్ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించామన్నారు. రైతులు, వినియోగదారులు ఎట్టి పరిస్థితిల్లో విద్యుత్ సంస్థ చేయాల్సిన పనులకు సొంతంగా చేయకూదడని సూచించారు. విద్యుత్ సమస్య తలెత్తితే 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. డీఈలు కె.ఉపేందర్, జంపాల రాజం, ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. -
7 నుంచి వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు
కరీంనగర్‌స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వేసవిలో నిర్వహించే ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలను ఈనెల 7 నుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్.మురళీధర్‌రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని కేడీసీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిక్షణ శిబిరాల వివరాలను వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్లో 2, గోదావరిఖనిలో 1, జగిత్యాలలో 1, వేములవాడలో 1 శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 13 సంవత్సరాల వయస్సు నుంచి 23 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారులకు ఈ శిబిరంలో నిపుణులైన కోచ్‌ల సమక్షంలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు, ఈనెల 6 లోగా ఆసక్తి, అర్హులైనవారు తమ పేర్లను కరీంనగర్‌లోని కేడీసీఏ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. జూన్ 6 వరకు కొనసాగుతాయని అన్నారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులతో ఈనెల 12 నుంచి ఉమ్మడి జిల్లా టోర్నమెంట్ నిర్వహించి రాణించిన క్రీడాకారులను జూన్‌లో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు సైతం ప్రతి కేంద్రంలో 100 నుంచి 120 మంది క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని అన్నారు. -
‘ఇందిరమ్మ’కు అర్హులనే ఎంపిక చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: అర్హులైన వారిని మాత్రమే ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థకార్యాలయంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టే గెజిటెడెట్ అధికారులతో సమావేశమయ్యారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గెజిటెడ్ లెవెల్ పరిశీలన సోమవారం నాటికి పూర్తి కావాలన్నారు. ఇచ్చిన చెక్ లిస్టు ఆధారంగా పరిశీలించాలని, పూర్తిగా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై గాని, దరఖాస్తుదారు భార్య,భర్త పేర్లపై మాత్రమే భూ పత్రాలు ఉండాలన్నారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు స్వరూపరాణి, ఖాదర్ మొహియుద్దీన్, సహాయ కమిషనర్ వేణు మాధవ్, డీఈలు లచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రావు, అయూబ్‌ఖాన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చెత్త రహిత డివిజన్లుగా మార్చాలి స్వచ్ఛతను పాటించడం ద్వారా నగరంలోని అన్ని డివిజన్లను చెత్త రహితంగా మార్చాలని కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అన్నారు. శుక్రవారం కళాభారతిలో వార్డు అధికారులు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, ఆర్ఐలతో సమీక్ష నిర్వహించారు. తమ డివిజన్ల పరిధిలో పారిశుద్ధ పనులపై వార్డు అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని, శనివారం నుంచి నగరంలో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రతి దుకాణానికి ట్రేడ్ లైసెన్సు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్ఎఫ్ సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశారు. ● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ -
‘పురుమల్ల’పై వేటు వేయండి
● పీసీసీ అధ్యక్షుడికి జిల్లా నేతల ఫిర్యాదుకరీంనగర్ కార్పొరేషన్: తన తీరుతో పార్టీకి నష్టం చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్‌ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు దాదాపు 200 మంది నాయకులు శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశకుమార్ గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన శ్రీనివాస్‌కు టికెట్ ఇస్తే, ప్రత్యర్థులతో కుమ్మకై ్క అస్త్రసన్యాసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్లో పార్టీకి నష్టం కలిగిస్తున్న పురుమల్లను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. కాగా గత నెల 28వ తేదీన సమావేశంలో జరిగిన గొడవకు సంబంధించి నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకొంటానని మహేష్‌కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రహమత్ హుస్సేన్, పులి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అన్నపూజలు.. అభిషేకాలు
వేములవాడ: వేములవాడ రాజన్నను శుక్రవారం 25వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నకు కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, సత్యనారా యణ వ్రతాలు, కల్యాణాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.30 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆరుద్ర నక్షత్రోత్సవ పూజలు ఆలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవం పురస్కరించుకొని స్వామివారికి అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. దర్శించుకున్న దేవాదాయ అధికారులు రాజన్నను రాష్ట్ర దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్లు కృష్ణప్రసాద్, టంకసాల వెంకటేశ్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. ఏఈవో శ్రవణ్ స్వామివారి ప్రసాదాలు అందించి సత్కరించారు. రాజన్న సన్నిధిలో భక్తులు -
‘గల్ఫ్’ సమస్యలపై సమగ్ర అధ్యయనం
● కార్మికులకు దీర్ఘకాలిక ప్రయోజన విధానాన్ని రూపొందిస్తాం ● అధ్యయన కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహిస్తాం.. ● గల్ఫ్ దేశాల్లో 13లక్షల మంది వలస కార్మికులు ఉన్నారు ● ‘టాంకాం’ ద్వారా గల్ఫ్ వెళ్లే వారికి నైపుణ్య శిక్షణ ● ‘సాక్షి’తో గల్ఫ్ కార్మికుల సమస్యల అధ్యయన సలహా కమిటీ చైర్మన్ డాక్టర్ బీ.ఎం.వినోద్కుమార్సిరిసిల్ల: గల్ఫ్.. ఆ పేరు చెబితే.. కాసుల గలగలలు.. శవపేటికలు.. కన్నీటి ధారలు.. ఎడాది బాధలు తెలంగాణ ప్రజల కళ్లముందుంటాయి. తెలంగాణ జిల్లాల యువతకు ఉపాధిని అందించే ఆశల స్వర్గం గల్ఫ్. అరబ్బు దేశాలైన ఖతర్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఒమన్, బహ్రెయిన్, కువైట్ దేశాల్లో 25 లక్షల మంది తెలుగు వాళ్లు ఉన్నారు. అందులో 13లక్షల మంది తెలంగాణ వాసులే. ఆ దేశాల్లో మానవ వనరులు తక్కువ కావడంతో ఐదు దశాబ్దాల కిందటే గల్ఫ్ వలస బాటలు మొదలయ్యాయి. ఈ వలస ప్రస్థానం కొందరికి స్వర్గమైతే.. ఎందరికో నరకమైంది. పాస్‌పోర్టుల నుంచి వీసాల వరకు అన్నింటా ఏజెంట్ల మోసాలు.. భాషరాని దేశంలో ఎడారి బాధలు అనివార్యమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి గల్ఫ్ కార్మికుల సమస్యల అధ్యయనానికి సలహా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ బీ.ఎం.వినోద్‌కుమార్‌ను నియమించారు. గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీని రూపొందిస్తామని ఆయన శుక్రవారం ‘సాక్షి’కి వెల్లడించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ప్రవాసీ ప్రజావాణి ఏర్పాటు తెలంగాణలోని గల్ఫ్ బాధితులు తమ సమస్యలను విన్నవించుకోడానికి ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి(హెల్ప్‌లైన్)ను ఏర్పాటు చేశాం. మంత్రి పొన్నం ప్రభాకర్ హెల్ప్‌లైన్‌ను ఇటీవలే ప్రారంభించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. గల్ఫ్ దేశానికి వెళ్లిన వారు అక్కడే చిక్కుకుని ఏళ్ల తరబడి ఇంటికి రాకుండా ఉంటున్నారని, అక్కడికి వెళ్లిన వారు ఎక్కడ ఉన్నారో... ఎలా ఉన్నారో తెలియడం లేదు అంటూ.. ఫిర్యాదులు వచ్చాయి. ఆయా దేశాల్లోని ఇండియన్ ఎంబసీ(భారత రాయభార కార్యాలయం) ద్వారా ఆ ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నాం. గల్ఫ్‌లో మరణిస్తే రూ.5 లక్షలు గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికులు అక్కడే ఏ కారణంగా మరణించినా ఆ కార్మికుడి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తుంది. 2023 డిసెంబరు 23 నుంచి ఇప్పటి వరకు 165 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.8.25 కోట్ల ఆర్థిక సాయం అందింది. ఇలా దేశంలో ఏ రాష్ట్రంలోనూ రూ.5 లక్షల సాయం అందించే విధానం లేదు. ఒక్క తెలంగాణలోనే అమలవుతుంది. ఇటీవల తెలంగాణలోని నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన ప్రేమ్‌సాగర్(40), శ్రీనివాస్(42)లు పాకిస్థాన్‌కు చెందిన మతోన్మాది చేతిలో హత్యకు గురయ్యారు. దీనిపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి శవాలను స్వగ్రామాలకు చేర్చేందుకు మేం కృషి చేశాం. వారి కుటుంబ సభ్యులను పరమార్శించి భరోసా కల్పించాను. ప్రభుత్వ పరంగా రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నాం. ఏడేళ్లు దాటితే ప్రభుత్వ సాయం పొందవచ్చు గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు అక్కడే ఉంటూ.. స్వగ్రామానికి రాకుండా.. భార్యబిడ్డలను పట్టించుకోకుండా.. ఏడేళ్లుగా పైగా ఉంటే.. చట్టప్రకారం మిస్సింగ్ కేసులు నమోదు చేయిస్తున్నాం. చట్టబద్ధంగా విచారణ జరిపించి ఆయా దేశాల్లోని ఎంబసీ ద్వారా విచారణ జరిపి సదరు వలస జీవి చనిపోయినట్లు భావించి సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంది. ఇటీవల ప్రవాసీ ప్రజావాణికి ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడి కేసులు నమోదు చేయించాం. వలస కార్మికుల పిల్లలకు మెరుగైన విద్య గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికుల్లో కొందరు ఆర్థికంగా ఉంటే.. చాలా మంది పేదరికంలో ఉన్నారు. అలాంటి వారి పిల్లలకు ప్రభుత్వ గురుకులాల్లో సీట్లు కేటాయించే విధంగా చూస్తాం. మెరుగైన విద్య అందేలా, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తాం. స్థానికంగా తెలంగాణ వాసులకు అందే అన్ని సంక్షేమ పథకాలు వలస కార్మికుల కుటుంబాలకు అందే విధంగా చూస్తాం. గతంలో రైతుబంధు సాయం వలస కార్మికులకు ఇవ్వకుంటే.. కోర్టులో కేసు వేసి సాధించాం. ఇప్పుడు రైతుభరోసా వలస కార్మికుల భూములకు అందుతుంది. టాంకాం ద్వారా నైపుణ్య శిక్షణ.. తెలంగాణలో ‘టాంకాం’ సంస్థ ద్వారా గల్ఫ్ వెళ్లాలనే ఆలోచన ఉన్న యువకులకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. గతంలో హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్‌గా పనిచేసిన విష్ణువర్ధన్‌రెడ్డి ‘టాంకాం’ సంస్థకు సీఈవోగా ఉన్నారు. ఆయన పర్యవేక్షణలో వివిధ పనుల్లో నైపుణ్య శిక్షణ, ఆయా దేశాల్లోని పరిస్థితులు, అక్కడి చట్టాలు, ఏమైనా సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలి.. అనే అంశాలపై ముందే అవగాహన కల్పిస్తున్నాం. పాస్‌పోర్టు ఆఫీసర్‌గా నాకు అనుభవం ఉంది నేను ప్రాంతీయ పాస్‌పోర్టు ఆఫీసర్‌గా 1997లో సికింద్రాబాద్‌లో చేశాను. అప్పట్లో పాస్‌పోర్టు కోసం రద్దీ అధికంగా ఉండడంతో వైజాగ్‌లోనూ ప్రాంతీయ పాస్‌పోర్టు ఆఫీస్‌ను ఏర్పాటు చేయించాను. నేనే అక్కడి వరకు రైలులో వెళ్లి అక్కడ కూడా విధులు నిర్వహించాను. సికింద్రాబాద్ ఆఫీస్‌లో మ్యాన్యువల్ విధానాన్ని రద్దు చేసి కంప్యూటరీకరణ చేశాను. వైజాగ్‌లోనూ ఆధునిక విధానాలను అమలు చేశాను. ప్రొటెక్షన్ ఇమిగ్రేంట్ ఆఫీసర్‌గా పని చేసి, జర్మనీకి వెళ్లాను. విదేశీ విధానాలపై నాకున్న అనుభవంతో తెలంగాణ గల్ఫ్ వలస కార్మికులకు మెరుగైన ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించేందుకు కృషి చేస్తా. తెలంగాణ విధానమే రోల్‌మోడల్ కావాలి ఎన్ఆర్ఐ విధానంలో ఇప్పటి వరకు కేరళ అనుసరించే విధానాలు మోడల్‌గా ఉన్నాయని భావిస్తున్నారు. కానీ మా కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి దేశానికి తెలంగాణ రోల్‌మోడల్ అయ్యేలా ఎన్ఆర్ఐ పాలసీని రూపొందిస్తాం. మా అధ్యయన కమటీ తొలి సమావేశం ఇంకా జరగలేదు. మే రెండో వారంలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం తరువాత మా కమిటీ ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనకు పూనుకుంటుంది. కేరళ కన్నా మెరుగైన విధానాన్ని అమలు అయ్యేలా చూస్తాం. -
జీవాల దాహం తీర్చుతున్న బల్దియా
అధికారులను కదిలించిన ‘సాక్షి’ కథనం కోల్‌సిటీ(రామగుండం): వేసవిలో నీటికోసం అల్లాడుతున్న మూగజీవాల దీనస్థితిపై ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన ‘జీవాల దాహం తీర్చుదాం’ కథనం బల్దియా అధికారులను కదిలించింది. గతేడాది వేసవిలో మూగజీవాల కోసం నగరంలోని 90చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేసిన అధికారులు.. ఈ వేసవిలో అందులో నీళ్లు నింపకుండా నిర్లక్ష్యం చేశారు. దీనిపై కథనం ప్రచురించగా బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ స్పందించారు. నీటితొట్టెలను గుర్తించి ప్రతీరోజు నీళ్లు నింపాలని ఆదేశించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం నేతృత్వంలో నగరంలోని తొట్టెల్లో శుక్రవారం సిబ్బందితో నీటిని నింపించారు. జీవాల దాహం తీర్చడానికి ‘సాక్షి’ తీసుకున్న చొరవను పలువురు అభినందించారు. బాధ్యులను అరెస్టు చేయాలి● పోలీస్‌స్టేషన్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన జగిత్యాలక్రైం: భూ కబ్జా చేశారని మనస్తాపం చెంది గురువారం ఆత్మహత్య చేసుకున్న పడిగెల మల్లారెడ్డి బంధువులు శుక్రవారం రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. మృతుడి కుమార్తె శరణ్య పురుగుల మందు డబ్బా తెచ్చుకోవడంతో బంధువులు డబ్బాను లాక్కొని పడేశారు. దీంతో స్పందించిన డీఎస్పీ రఘుచందర్ హత్య కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. పొరండ్లలో భారీ బందోబస్తు మృతుడి బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో పోలీసులు ముందస్తుగా పొరండ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు. విశ్వంలోనే మొట్టమొదటి పాత్రికేయుడు నారద మహర్షి కరీంనగర్‌టౌన్: ముల్లోకాలు సంచరించి లోక కల్యాణం కోసం సమాచార రంగాన్ని వికసింపజేసిన మొట్టమొదటి పాత్రికేయుడు, ఖగోళ జర్నలిస్ట్ నారద మహర్షి అని తెలంగాణ ప్రాంత గ్రామ వికాస ప్రముఖ్ జిన్నా సత్యనారాయణరెడ్డి అన్నారు. సమాచార భారతి కరీనగర్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని వాగేశ్వరి డిగ్రీ, పీజీ కళాశాలలో దేవర్షి నారద జయంతి(జర్నలిస్ట్ దినోత్సవం) వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నారద మహర్షిని మొట్టమొదటి పాత్రికేయుడిగా పరిగణిస్తూ ప్రతి సంవత్సరం నారద జయంతిని ప్రపంచ పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తర్వాత అత్యంత శక్తివంతమైన స్థానం మీడియా రంగం, పాత్రికేయులకే దక్కుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ బాధ్యులు పాక సత్యనారాయణ, తడగొప్పుల శంకరయ్య, గీకూరి శ్రీనివాస్, సమాచార భారతి బాధ్యులు వేణుగోపాల్, విమల్, పైడిపల్లి శ్రీనివాస్, ఓదెల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో ప్లంబర్ దుర్మరణం పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఇంటినిర్మాణం పనుల్లో ప్లంబింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గజ్జల శ్రీనివాస్(45) దుర్మరణం చెందాడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన శ్రీనివాస్ ఒంటరిగానే పెద్దపల్లిలో నివాసముంటూ ప్లంబర్‌గా పనులు చేస్తుంటాడని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. మృతుడి కూతురు వైష్ణవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
జల్సాలకు అలవాటుపడి.. బైక్ చోరీలు
పాలకుర్తి(రామగుండం): జల్సాలకు అలవాటుపడి బైక్ చోరీలు చేస్తున్న ముఠాను శుక్రవారం పట్టుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ వివరాలు వెల్లడించారు. బసంత్‌నగర్‌కు చెందిన చింతకింది సిద్ధార్థ, తుంగ శ్యాం, అంతర్గాం మండలం రాయదండి గ్రామానికి చెందిన తోకల సిద్ధార్థతోపాటు మరో ముగ్గురు బాలురు మంచి స్నేహితులు. జల్సాలకు అలవాటు.. ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాశతో బైక్ తాళం తీసే టెక్నిక్ తెలుసుకున్నారు. పార్కింగ్ చేసిన బైక్‌లు చోరీచేస్తున్నారు. ఇటీవల పెద్దపల్లి బస్టాండ్ ప్రాంతంలో పార్క్ చేసిన బైక్‌ను దొంగిలించారు. ఐటీఐ మిత్రుల ద్వారా పరిచయమైన తోకల సిద్ధార్థకు బైక్‌లు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. శుక్రవారం ఈసాలతక్కళ్లపల్లి శివారులో ఎస్సై స్వామి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా చింతకింది సిద్ధార్థ, తుంగ శ్యాం బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బైక్ చోరీలు వెలుగులోకి వచ్చాయి. వారిచ్చిన సమాచారంతో మరో ముగ్గురు మైనర్లతో పాటు బైక్‌లను కొనుగోలు చేస్తున్న తోకల సిద్ధార్థపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం సిద్ధార్థ పరారీలో ఉన్నాడని డీసీసీ తెలిపారు. సిద్ధార్ధ, శ్యామ్‌ను అరెస్టు చేశామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచాక్యంగా వ్యవహరించిన ఎస్సై స్వామితోపాటు కానిస్టేబుళ్లు అనిల్, శరత్, శ్రీనివాస్, రవీందర్‌ను డీసీపీతోపాటు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ అభినందించి నగదు రివార్డు అందజేశారు. అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిచందుర్తి: రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలోపెద్దపులి సంచరిస్తోందని, అటవీ ప్రాంతం వైపు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వేములవాడ డిప్యూటీ రెంజ్ అధికారి రాఘవేందర్ రావు సూచించారు. హైకాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సాయి వైష్ణవ్, సాయి సాహెబ్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని లింగంపేట, మల్యాల, చందుర్తి గ్రామాల ప్రజలకు పులి సంచారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లే ప్రజలు సూర్యుడు అస్తమించే వరకు గ్రామాల్లోకి చేరుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లే అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. మూడు మాసాలుగా ఇదే ప్రాంతంలో పులి సంచారం కొనసాగిస్తుందని చందుర్తి, రుద్రంగి, వేములవాడ రూరల్ మండలాల్లో అటవీ ప్రాంతాలను అనుకుని, జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మేడిపల్లి, భీమారం మండలాల్లో అటవీ ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీట్ అధికారి బాలకృష్ణ, బేస్‌క్యాంపు సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. గంజాయి విక్రయదారుల అరెస్ట్ ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న జాడి కిరణ్, జాడి ప్రకాశ్, గుజ్జుల సాయి, కొమురవెల్లి పవన్, ఇందిబెల్లి సందిప్కుమార్, లింగన్నపేట సందీప్‌కుమార్‌ను అరెస్టు చేయగా, మరొకరు ఖేల కుమార్ పరారయ్యాడని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం పెద్దపల్లి ఏసీపీ కృష్ణతో కలిసి వివరాలు వెల్లడించారు. ఎస్సై రమేశ్, తన సిబ్బందితో రైల్వేస్టేషన్లో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. వారిని విచారించగా గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు అంగీకరించారు. వారినుంచి గంజాయి, బైక్, రెండు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు గోదావరిఖని పరిసరాలకు చెందిన వారుగా గుర్తించారు. సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై రమేశ్, ఏఎస్సై రత్నాకర్, హెడ్‌కానిస్టేబుల్ కిషన్, పీసీ రాజేందర్ పాల్గొన్నారు. గంజాయి విక్రయదారులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై రమేశ్, సిబ్బందిని డీసీపీ. ఏసీపీ అభినందించారు. గునుకులపల్లెలో అగ్నిప్రమాదం చిగురుమామిడి: మండలంలోని గునుకులపల్లెలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో వరి కొయ్యలకు నిప్పుపెట్టగా తీవ్రస్థాయిలో మంటలు చెలరేగి చిగురుమామిడి సింగిల్‌విండో వైస్‌చైర్మన్ కరివేద మహేందర్‌రెడ్డికి చెందిన మామిడిచెట్లు దగ్ధమయ్యాయి. అలాగే లేగదూడ మంటల్లో చిక్కుకోవడంతో చర్మం కాలిపోయింది. లేగదూడ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని రైతు వాపోయాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైతుపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరాడు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని హనుమాన్ దీక్షపరుడు మృతి
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని నటరాజ్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని టీఆర్‌నగర్ గ్రామానికి చెందిన కొడిక్యాల కృష్ణమూర్తి (53) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్ దీక్ష తీసుకున్న కృష్ణమూర్తి శుక్రవారం సాయంత్రం బ్యాంక్ పని నిమిత్తం తన ద్విచక్రవాహనంపై జగిత్యాలకు వచ్చి నటరాజ్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రగాయాలు కావడంతో 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు. రైల్వే కాంట్రాక్టు ఎలక్ట్రిషన్.. కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి రైల్వే స్టేషన్లో కాంట్రాక్టు ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్న విశాఖపట్టణం చిన్నవాల్తేరుకాలనీకి చెందిన షైక్ సుభాహని(52) మద్యానికి బానిసై అనారోగ్యంతో మృతిచెందినట్లు ఏఎస్సై రాంమూర్తి తెలిపారు. ఏఎస్సై వివరాల ప్రకారం.. సుభాహని కొత్తపల్లి రైల్వే స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా సుజమల మండలం ముదిగేడు గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అనే సూపర్వైజర్ వద్ద ఎలక్ట్రిషన్ పనులు చేస్తున్నాడు. నాలుగు రోజులుగా విపరీతంగా మద్యం తాగుతూ భోజనం చేయడం మానేశాడు. గత నెల 29న సుభాహని అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించడంతో మార్చురీ గదిలో శవాన్ని భద్రపరచారు. మృతుడి కుటుంబ సభ్యుల కోసం ఆరా తీయగా.. ఎలాంటి సమాచారం లభించలేదు. సూపర్వైజర్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. చెట్టుకు కారు ఢీకొని యువకుడు..కథలాపూర్: మండలంలోని చింతకుంటకు చెందిన గాజ బ్రహ్మానంద స్వామి (30) అనే యువకుడు శుక్రవారం సాయంత్రం కారులో వెళ్తూ చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న బ్రహ్మానంద స్వామి శుక్రవారం స్వగ్రామానికి వచ్చి తన బంధువు కారులో గ్రామశివారుకు స్నేహితులతో కలిసి వెళ్లారు. చెట్టుకు కారు ఢీకొట్టడంతో బ్రహ్మానందస్వామి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడన్నారు. మృతుడికి ఏడాది క్రితం వివాహం జరిగింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. లారీ ఢీకొని మల్టీపర్పస్ వర్కర్.. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో శుక్రవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎడెల్ల నర్సయ్య(46) దుర్మరణం పాలయ్యాడు. సబ్బితం గ్రామానికే చెందిన నర్సయ్య గ్రామ పంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడని బసంత్‌నగర్ ఎస్సై స్వామి తెలిపారు. మృతుడికి భార్య కనకమ్మ, కుమారుడు రాజశేఖర్ ఉన్నారు. విద్యుదాఘాతంలో గేదె.. బుగ్గారం: మండలంలోని గోపులాపూర్‌లో శుక్రవారం విద్యుదాఘాతంతో గేదె మృతి చెందింది. వివరాలు ఇలా.. మ్యాదరవేని విజయకు చెందిన గేదె శుక్రవారం ఊరు బయట మినీ ట్రాన్స్ఫార్మర్ వద్ద మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. దీని విలువ 85 వేలు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని బాదితురాలు విజయ తెలిపారు. కడుపునొప్పి భరించలేక వృద్ధుడి ఆత్మహత్య మానకొండూర్: మండలంలోని పోచంపల్లిలో కడుపునొప్పి భరించలేక వృద్ధుడు శుక్రవారం ఉరేసుకున్నాడు. సీఐ సంజీవ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పోలం పోచాలు(79) పదిహేనేళ్లుగా కడుపునొప్పి, ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో బాత్రూం పక్కన ఉరేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కూతురు. కుమారుడు రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
ప్రాణం తీసిన చేపల వేట
● భార్య కళ్ల ముందే నీటమునిగిన భర్త శంకరపట్నం: చేపల వేటకు కుంటలో దిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని మెట్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొల్లూరి చంద్రమౌళి((60)) భార్య స్వరూపతో కలిసి శుక్రవారం సాయంత్రం చింతకుంటలో చేపల వేటకు వెళ్లాడు. భార్య, భర్త ఇద్దరు చీరతో చేపలు పడుతుండగా చంత్రమౌళి కుంటలోని జేసీబీ గుంతలో పడిపోయాడు. భార్య స్వరూప బయటకు తీసేందుకు ప్రయత్నించగా నీట మునిగాడు. సమీపంలోనివారు చంద్రమౌళిని ఒడ్డుకు తీశారు. ఎస్సై రవి, ట్రైనీ ఎస్సై సుమన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్స్పోర్ట్స్/కొత్తపల్లి(కరీంనగర్)/రామడుగు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సీతారాంపూర్‌లోని ఐవీవై పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐవీవై పాఠశాల సహకారంతో 40మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 30రోజుల పాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఎక్కువ మంది వస్తే మరో బ్యాచ్‌లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఈవీవై స్కూల్ చైర్మన్ పసుల మహేశ్, కో చైర్మన్ శ్రీపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రామడుగు మండలంలోని వెదిర పరిధిలో ఉన్న అల్ఫోర్స్ పాఠశాలలో జరుగుతున్న ఒలింపియాడ్ ఫౌండేషన్ జిల్లాస్థాయి తరగతుల రెండోఫేస్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పలు అంశాలపైన ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అల్ఫోర్స్ ఆధినేత వి.నరేందర్‌రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరి పాల్గొన్నారు. పక్కాగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం రెవెన్యూ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వీసీలో మాట్లాడగా జిల్లా పరిస్థితిని వివరించారు. అన్ని మండలాల్లో భూభారతి కొత్త ఆర్వోఆర్ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. 10,568 ఇందిరమ్మ దరఖాస్తుల విచారణ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 4న జరిగే నీట్ పరీక్షల కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మికిరణ్, నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి మార్కెట్‌తో ఉపాధి
● పొరుగు రాష్ట్రాల నుంచి కూలీల రాక ● వసతులు కల్పించడంలో వ్యాపారుల నిర్లక్ష్యం జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాలలోని చల్గల్ మామిడి మార్కెట్ కూలీలకు ఉపాధి మార్గంగా మారింది. ఈ మార్కెట్లో మామిడి సీజన్లో పనిచేసేందుకు స్థానిక కూలీలేకాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి వస్తుంటారు. వేల సంఖ్యలో కూలీలు వస్తున్నప్పటికీ వారితో పనిచేయించుకునే వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో వారికి కనీస వసతులు కరువయ్యాయి. వేల సంఖ్యలో కూలీలు మామిడి సీజన్ ఏప్రిల్, మే నెలల్లో కొనసాగుతుంది. ఈ సీజన్లో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలో రోడ్ల వెంబడి వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకుని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేస్తుంటారు. వాటిని ట్రాక్టర్ల నుంచి దింపేందుకు.. కాయలను గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసేందుకు.. లారీల్లో లోడ్ చేసేందుకు ఎక్కువ సంఖ్యలో కూలీలు అవసరమవుతారు. తోటల్లో కాయలు తెంపేందుకు కూడా కూలీల అవసరం ఎక్కువ. ఈ పనులు చేసేందుకు స్థానికంగా కూలీలు దొరక్కపోవడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూలీలను రప్పిస్తుంటారు. ఒక్కో వ్యాపారి దుకాణంలో కనీసం 50 మంది వరకు కూలీలు పనిచేస్తుంటారు. నెలరోజుల్లో రూ.25వేల నుంచి రూ.30వేల ఆదాయం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలను వ్యాపారులు వివిధ పనులకు ఉపయోగించుకుంటారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూలీలను మామిడి కాయలను తెంపేందుకు, లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు ఉపయోగిస్తారు. ఢిల్లీ, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలను మామిడికాయల గ్రేడింగ్.. ప్యాకింగ్‌కు ఉపయోగిస్తారు. కూలీలు గ్రూపుగా ఏర్పడి పనులు చేస్తుండటంతో టన్ను ఆన్లోడ్ చేస్తే రూ.250 వరకు చెల్లిస్తారు. గ్రేడింగ్.. ప్యాకింగ్ చేసే వారికి ట్రేకు రూ.15, పెట్టెలను లారీల్లో లోడ్ చేస్తే రూ.3వేల నుంచి రూ.5 వేలు, కాయలు తెంపడానికి వెళ్తే రోజుకు రూ.500 చెల్లిస్తారు. ఆ వ్యాపారి దుకాణానికి వచ్చిన కాయలను బట్టి ఒక్కో కూలీ కనీసం 30నుంచి40 రోజుల్లో రూ.30వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకుంటారు. ఆయా రాష్ట్రాల్లో వేసవి సీజన్లో పనులు లేకపోవడంతో పనుల కోసం జగిత్యాల వస్తుంటారు. ఇలా జిల్లాకు కనీసం ఐదారు వేల మంది కూలీలు వస్తుంటారు. వసతులు అంతంతే.. మార్కెట్లో కూలీలతో పనులు చేయించేందుకు చూపుతున్న శ్రద్ధ.. వారికి కనీస వసతులు కల్పించడంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మండుతున్న ఎండలో మార్కెట్ పక్కనున్న వ్యవసాయ భూముల్లో ప్లాస్టిక్ కవర్లతో గుడారాలు వేసుకుని ఉండటం.. షెడ్ల కింద పడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో వారి బాధలు వర్ణణాతీతం. చాలామంది రోడ్డపక్కనున్న చెట్ల కింద తీరుతున్నారు. ఈ క్రమంలో వారిని పనులకు తీసుకొస్తున్న వ్యాపారులు వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని స్థానికులు అంటున్నారు. ఏటా వస్తుంటాం ఏటా మామిడి సీజన్లో జగిత్యాలకు వస్తుంటాం. నెల రోజులపాటు ఇక్కడ పనిచేస్తాం. రూ.30వేల వరకు సంపాదించుకుంటాం. మహారాష్ట్రలో పనులు లేకపోవడంతో ఉపాధి కోసం ఇక్కడకు వస్తాం. – సేవాలాల్, మహారాష్ట్ర ప్యాకింగ్ చేస్తాం మామిడికాయలను గ్రేడింగ్ చేసి, ప్యాకింగ్ చేసేందుకు ఇక్కడకు వస్తాం. మా రాష్ట్రం నుండి కనీసం 500 మంది వరకు వచ్చాం. మామిడి మార్కెట్లో ఏదో పని దొరుకుతుందనే ఆశతో వచ్చి, ఎంతో కొంత సంపాదించుకుని వెళ్లతాం. – గుడ్డె, ఉత్తరప్రదేశ్ -
సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: రాజీవ్యువవికాసం పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొన్న వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్‌చాహత్ బాజ్‌పేయ్ సూచించారు. నగరంలో రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు చేసుకొన్న వారికి వారం రోజుల నుంచి కళాభారతిలో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ, వికలాంగుల కేటగిరీల వారిగా సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరవ్యాప్తంగా 16 వేల మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వెరిఫికేషన్‌కు 10వేల మంది మాత్రమే హాజరయ్యారన్నారు. ప్రభుత్వ నిబందనల మేరకు ఆన్లైన్లో చేసుకొన్న దరఖాస్తు ప్రతితో పాటు, అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ జత చేసి, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నగరపాలకసంస్థ నిర్వహిస్తున్న వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నారు. డంప్‌యార్డు నుంచి కాపాడండి కరీంనగర్ కార్పొరేషన్: డంప్‌యార్డ్ బారి నుంచి తమ ప్రాణాలు కాపాడాలంటూ బాధిత ప్రజలు రోడ్డెక్కారు. ఆటోనగర్‌లోని డంప్‌యార్డ్‌ను వెంటనే తరలించాలని నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గురువారం అలకాపురికాలనీ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్, హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఆటో నగర్లో ఉన్న డంప్‌యార్డ్ తమ పాలిటి శాపంలా మారిందని ఆందోళనకారులు ఆవేదనచెందారు. విషవాయువులు వెలువడి పిల్లలు, వృద్ధులు, గర్భిణులు శ్వాసకోశ, చర్మవ్యాధులకు గురవుతున్నారన్నారు. కలెక్టర్, మున్సిపల్ అధికారులు తమ బాధలను పరిగణలోకి తీసుకొని వెంటనే డంప్‌యార్డ్‌ను తరలించాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
హైకమాండ్ వద్దకు ‘పురుమల్ల’ పంచాయితీ
● పీసీసీ అధ్యక్షుడిని కలిసి మంత్రి పొన్నం వర్గీయుల ఫిర్యాదు ● దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న పురుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న కరీంనగర్ పంచాయితీ అధిష్టానం వద్దకు చేరింది. ఇటీవల డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నెలకొన్న గొడవను ఇరువర్గాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాయి. ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌గౌడ్‌ను కలిసి పొన్నం వర్గీయులు ఫిర్యాదు చేయగా, తనపై దాడిచేసిన వారిపై చర్యతీసుకోవాలని పురుమల్ల శ్రీనివాస్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పురుమల్ల శ్రీనివాస్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, రాచకొండ చక్రధర్‌రావు, బోనాల శ్రీనివాస్, ఎస్.ఏ.మోసిన్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి కోరారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పురుమల్ల శ్రీనివాస్ జిల్లా ఇన్చార్జీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డిని కలిశారు. పురుమల్ల శ్రీనివాస్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి రహమత్ హుస్సేన్ డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పురుమల్ల చేసిన ఆరోపణలను ఖండించారు. పార్టీలో పురుమల్ల పారాచూట్ నాయకుడని విమర్శించారు. -
సంక్షేమాధికారులకు పోస్టింగ్
● ఎస్సీ వసతిగృహాల్లో నియామకం ● కాళేశ్వరం జోన్లో 19మంది రిపోర్టు మంచిర్యాలఅర్బన్: ఎస్సీ వసతిగృహా సంక్షేమాధికారులుగా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచిర్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి బుధవారం రాత్రి నియామక పత్రాలు అందజేశారు. గత ఏడాది జూన్ 24నుంచి 29వరకు కంప్యూటర్ ఆధారిత(సీఆర్‌బీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించగా సెప్టెంబర్ 20న ఫలితాలు విడుదలయ్యాయి. కాళేశ్వరం జోన్ పరిధిలో 24మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసిన పంపగా.. ఐదుగురు అభ్యర్థులు వివిధ కారణాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రాలేదు. దీంతో 19మందికి నియామక పత్రాలు అందజేయగా.. గురువారం కేటాయించిన వసతిగృహాల్లో రిపోర్టు చేశారు. వీరిలో 12మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. పెద్దపల్లికి ఐదుగురిని కేటాయించారు. తోట శైలజ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్‌సీ(గర్ల్స్) పెద్దపల్లి, ఇసంపల్లి రమ్య ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మంథని, ప్రశాంత్, ఎస్సీ ఐడబ్ల్యూహెచ్‌సీ బాయ్స్ హాస్టల్ మంథని, డి.తిరుపతి, ఎస్సీడబ్ల్యూహెచ్సీ బాయ్స్ హాస్టల్ మంథని, సాధుల రమేశ్, ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్ మంథనికి కేటాయించారు. -
ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రారంభం
● సమస్యల పరిష్కారమే ధ్యేయం ● నుస్తులాపూర్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతిమ్మాపూర్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆన్‌వీల్స్ కార్యక్రమాన్ని ప్రా రంభించామని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో గురువారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.. సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇక ముందు ఉండబోదన్నారు. వారానికి మూడు రోజులు అధికారుల బృందంతో ఆయా గ్రామా ల ప్రజల వద్దకు వెళ్తామన్నారు. అధికారుల సమక్షంలోని వారి సమస్య తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. గుండ్లపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల దుస్థితిపై ఓ యువకుడు, చావుబతుకుల్లో ఉన్న తండ్రిని బతి కించుకునేందుకు ఎల్వోసీ ఇప్పించమని ఓ తనయుడు పంపించిన సందేశాలే ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం రూపకల్పనకు ప్రేరణనిచ్చాయని కవ్వంపల్లి పేర్కొన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ కవ్వంపల్లి అనూరాధ, అన్నిశాఖల అధికా రులు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. -
రైతుల ఖాతాకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు
● మంత్రి పొన్నం ప్రభాకర్కరీంనగర్ అర్బన్: ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్ లో ధాన్యం డబ్బులు పడేలా జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని ప్రకటనలో సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఉన్నా.. సలహాలు, సూచనల కోసం రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 0333కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా విద్యుత్ దీపాలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌కు మంత్రి ఉత్తమ్ అభినందన జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతిని అభినందించారు. జిల్లాలో ఇప్పటి వరకు 14344 మంది రైతుల నుంచి 99,408 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దొడ్డు రకాలు 90,632 మెట్రిక్ టన్నులు, సన్న రకాలు 8,756 మెట్రిక్ టన్నులు కాగా దొడ్డు, సన్న రకాలు వడ్లకు రూ.100.64 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. దీంతో పాటు సన్నరకాల వడ్లకు బోనస్ విలువ రూ.4.38 కోట్లను రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు ప్రతిపాదనలను పంపినట్లు అధికారులు వివరించారు. -
జీవాల దాహం తీర్చుదాం
కోల్‌సిటీ(రామగుండం): వేసవిలో నీటి కోసం జనాలు అల్లాడిపోతారు. వివిధ అవసరాల కోసం ఇంట్లోంచి బయటకు వెళ్తే.. దాహం తీర్చుకునేందుకు నీళ్లు ఎక్కడ లభిస్తాయా? అని ఆశ పడతారు. ఎప్పటికప్పుడు దాహం తీర్చుకునేందుకు తహతహలాడతారు. మరి మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుంది? అవి దాహం ఎలా తీర్చుకుంటాయి? మనం ఏమైనా ప్రయత్నం చేస్తే వాటి దాహం తీరుతుందా? ఇలాంటి సందేహాలకు సమాధానమిస్తున్నారు కొందరు పక్షులు, జీవాల ప్రేమికులు. పక్షుల శరీర ఉష్ణోగ్రతలు అత్యధికం.. సాధారణంగా పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయని పక్షిప్రేమికులు చెబుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు దాటితే ఎక్కువ సేపు అవి జీవించలేవని అంటున్నారు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అందులో మునకేస్తూ శరీర ఉష్ణోగ్రతలు తగ్గించుకుంటాయి. జనం కోసమైతే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? వీటి కోసం ఎవరు ఆలోచిస్తారు? ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరువలో నమోదవుతున్నాయి. అందుకే మూగజీవాలకు ఊపిరి పోయడానికి మనమే ఒకడుగు ముందుకేద్దాం. ఇంటి ఆవరణ, ఇంటి బయట కాసిన్ని నీళ్లు పెట్టి వాటి దాహం తీర్చుదాం. అందరూ స్పందించాలి ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కుళాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధికుక్కలు, పక్షుల దాహం తీర్చేందుకు ప్రతీ ఒక్కరు స్పందించాలి. ప్రభుత్వంతోపాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ఎదుట, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబాపై తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అయితే బల్దియా ఆధ్వర్యంలో గతేడాది వేసవిలో సుమారు 90 చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేసి నీళ్లు పోశారు. వీటిని ప్రస్తుతం పట్టించుకున్న నాథుడు లేడు. కొందరు స్థానికుల ఇళ్ల ఎదుట, దుకాణాల మందున్న తొట్టెల్లో నీళ్లు పోసి దాహం తీర్చుతున్నారు. ఇలాగే ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తే మంచిదని మూగజీవాల ప్రేమికులు కోరుతున్నారు. పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు తల్లడిల్లుతున్న పక్షులు, జంతువులు నివాసాలు, ఖాళీ ప్రదేశాల్లో నీటితొట్టెలు -
చట్టాలకు లోబడి నడుచుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): రాజ్యాంగంలోని చట్టాలకు లోబడి ప్రతీ ఒక్కరు నడుచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేశ్ సూచించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా జాతీ య న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు చింతకుంట వార్డు కార్యాలయంలో గురువారం చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం గురించి వివరించిన జడ్జి చట్ట ప్రకారం మహిళలు ఎన్ని గంటలు పనిచేయాలి, యాజమాన్యం ఎటువంటి సహాయ సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది అనే అంశాలను వివరించారు. ఎలాంటి న్యాయపరమైన సాయం అందించడానికై నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, న్యాలమడుగు శంకరయ్య పాల్గొన్నారు. కార్మికులకు అండగా బీఆర్ఎస్: ఎమ్మెల్యే గంగులకరీంనగర్: తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర మరువలేనిదని, బీఆర్ఎస్ కార్మికులకు అండగా ఉంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా బీఆర్టీయూ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమలాకర్ జెండా ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకై క పండుగ మేడే అన్నారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, బీఆర్టీయూ నాయకులు మద్దెల రాజేందర్, దావు రాజమల్లయ్య, గడ్డం సంపత్, లింగయ్య, సంపత్, రాములు, రమేశ్ పాల్గొన్నారు. ఓపెన్ టెండర్ పూర్తి కరీంనగర్: విద్యాశాఖ పరిధిలోని డీసీఈబీ కాంప్లెక్స్‌లో షాపుల కేటాయింపు కోసం ఓపెన్ టెండర్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పేర్కొన్నారు. విద్యాశాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కాంప్లెక్స్‌లో ఏడు దుకాణాలను ఐదేళ్లపాటు అద్దె కేటాయింపు కోసం గురువారం ఓపెన్ టెండర్ ప్రక్రియను కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ టెండర్లో 26మంది పాల్గొనగా, నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. షాపులు పొందిన వారు ఈనెల 8వ తేదీలోపు డిమాండ్ డ్రాఫ్ట్ (ఈఈ) చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్‌రావు, డీసీఈబీ కార్యదర్శి స్వదేశ్‌కుమార్, జిల్లా సైన్స్‌అధికారి జయపాల్‌రెడ్డి, ప్రణాళిక సమన్వయకర్త ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యుత్ భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని విద్యుత్ భవన్లో గురువారం విద్యుత్ భద్రత వారోత్సవాల పోస్టర్, కరపత్రాలను టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్‌బాబు ఆవిష్కరించారు. రైతులు, వినియోగదారులు విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా భద్రత జాగ్రత్తలను పాటించాలని కోరారు. ప్రతి విద్యుత్ ఉద్యోగి రైతులకు, వినియోగదారులకు విద్యుత్ భద్రత జాగ్రత్తల గురించి వివరించాలని సూచించారు. డీఈలు కే.ఉపేందర్, ఎం.తిరుపతి, కాళిదాసు, ఏడీఈ ఎం.లావణ్య, పీవో బండారి చంద్రయ్య పాల్గొన్నారు. -
● ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లలో కమీషన్ దందా ● ఆస్పత్రులతో కుమ్మకై ్క రోగుల నిలువు దోపిడీ ● రిఫర్ చేసిన ల్యాబ్‌కు వెళ్లకుంటే రిపోర్టు చెల్లదని వైద్యుల మెలిక ● నగరంలో అందుబాటులో లయన్స్‌క్లబ్, రెడ్‌క్రాస్ ల్యాబ్‌లు ● తక్కువ ధరకే రోగ నిర్ధారణ పరీక్షలు
లయన్స్ క్లబ్ స్కానింగ్ సెంటర్లో సీటీస్కాన్ చేస్తున్న టెక్నీషియన్కరీంనగర్ టౌన్: నగరంలో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. వైద్యం మాట దేవుడెరుగు. వ్యాధి నిర్ధారణ పేరుతో ప్రైవే టు ఆసుపత్రులతో కలిసి రూ.వేలల్లో దండుకుంటున్నారు. ఏదైనా రోగం వస్తే ఆసుపత్రికి వెళ్లాలంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు భయపడాల్సి వస్తుందని నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు కుమ్మక్కై పర్సెంటేజీల దందా నడిపిస్తున్నారు. రెఫర్ చేసిన వైద్యుడికి 50శాతం వరకు కమీషన్ ఇస్తూ రోగులను నిండా ముంచుతున్నారు. అద్దాల మేడలు.. అడ్డగోలు ధరలు నగరంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అద్దాల మేడల్లో సెంటర్లను ఏర్పాటుచేసి, మంచి కమీషన్ ఇస్తామని పలు ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులతో కుమ్మక్కవుతున్నారు. పీఆర్వోల ద్వారా ప్రచారం చేసుకుంటూ రోగులను తమ సెంటర్లకే పంపించమని కోరుతున్నారు. పలు సెంటర్లు నేరుగా ఆస్పత్రులకు అంబులెన్స్‌లను పంపించి, రోగులకు పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆస్పత్రికి చేరుస్తున్నారు. ఈ భారం కూడా రోగులపైనే వేస్తున్నారు. పలు ఆస్పత్రుల నిర్వాహకులు ఎవరెక్కువ పర్సంటేజీ ఇస్తే ఆ ల్యా బ్కే రోగులను రిఫర్ చేస్తున్నారు. తెలిసిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకుంటామంటే రిపోర్టు చెల్లదంటూ పలువురు వైద్యులు భయపెడుతున్నారు.ప్రజలకు అందుబాటులో లయన్స్‌క్లబ్, రెడ్‌క్రాస్ సేవలు లయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ 320జి సంస్థ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో 2021లో స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్‌ను నగరంలోని ఉస్మాన్‌పురలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో ఏర్పాటుచేశారు. నిరుపేదలకు ల్యాబ్ టెస్టులు, స్కానింగ్‌లు తక్కువ ధరకే అందించాలని రూ.3కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలు, సీటీస్కాన్ మిషన్ ఏర్పాటు చేశారు. సీటీస్కాన్ ద్వారా 15రకాల టెస్టులు, ల్యాబ్ ద్వారా 168 రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజు 200మంది రక్తపరీక్షలు, స్కానింగ్ కోసం రావడం గమనార్హం. షుగర్, కిడ్నీ, థైరాయిడ్, సీబీపీ, జ్వరం సంబంధిత టెస్టులకు ఎక్కువగా వస్తున్నారు. ప్రజలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లలో డబ్బులను గుల్ల చేసుకోవద్దని, తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇరు సంస్థల నిర్వాహకులు కోరుతున్నారు. -
తడగొండ జీపీలో చొరబడ్డ ఆగంతకులు
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ గ్రామపంచాయతీ భవనంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని ఆగంతకులు హంగామా చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. వాటర్‌ప్లాంట్ గది తాళం పగులకొట్టి, కాయిన్ బాక్స్‌లోని నాణేలను బయట పారబోశారు. అనంతరం జీపీ గది మెయిన్ డోర్ తలుపులు పగులకొట్టి బీరువాలోని ఉన్న కాగితాలు, రిజిష్టర్లను చిందర వందరగా పడేశారు. గురువారం ఉదయం ఎంపీవో శ్రీధర్, పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ టీం ఆధారాలను సేకరించింది. పంచాయతీ కార్యదర్శి సుమలత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తెలిపారు. -
అత్యుత్తమ మహిళా కళాశాలగా ‘అల్ఫోర్స్’
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్‌లోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాలకు తెలంగాణలో ఉత్తమ మహిళా డిగ్రీ కళాశాలగా అవార్డు లభించింది. ఢిల్లీలోని ఆసియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన ప్రపంచ విద్యా సమ్మిట్–2025లో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి భూషణ్ చౌదరి, పీజీ కమిషన్ కౌన్సిలర్ నీలేశ్ కుమార్, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్వీకర్ మోహన్‌సింగ్ చేతుల మీదుగా అవార్డును కళాశాల కరస్పాండెంట్ వూట్కూరి రవీందర్‌రెడ్డి స్వీకరించారు. విద్య, నైపుణ్యం, శాసీ్త్రయ దృష్టి, నైతిక విలువలు, ప్రాంగణ నియామకాలు, ఉత్తీర్ణతశాతం, విద్యార్థి అధ్యాపకుల నిష్పత్తి, కళాశాల సాధించిన ప్రగతిని పరిగణలోకి తీసుకొని అవార్డు ప్రకటించిందని తెలిపారు. -
అతి తక్కువ ధరలకే టెస్ట్‌లు
కరీంనగర్లో ఏ ప్రయివేటు ఆసుపత్రికి, డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లినా రక్త, మూత్ర పరీక్షలు చేసుకోవాలంటే అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. చిన్న రోగానికి కూడా డాక్టర్లు పెద్ద పరీక్షలు రాస్తున్నారు. లయన్స్‌క్లబ్ ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు, బంధువులు అందరం ఇక్కడే పరీక్షలు చేసుకుంటున్నాము. బయటి ధరలకన్నా కేవలం 20శాతం ధరకే ఇక్కడ పరీక్షలు చేస్తున్నారు. – రాజు, కరీంనగర్ పేదల కోసం ప్రారంభించాం జిల్లాకేంద్రంలో కొన్నేళ్లుగా ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో అత్యధిక రేట్లు పెట్టి రోగనిర్ధారణ చేయించుకోలేక చాలా మంది ఆసుపత్రులకు వెళ్లడమే మానేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్‌క్లబ్ తక్కువ ధరలకే సేవలు అందించాలనే ఉద్దేశంలో రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ల్యాబ్, సీటీస్కాన్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రాజిరెడ్డి, లయన్స్‌క్లబ్ చైర్మన్ వైద్యులు సహకరించాలి జిల్లాలో ప్రైవేటు వైద్యం చేయించుకోలేని దీనస్థితిలో ఉన్న నిరుపేదలు ఉన్నారు. వారు ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చినప్పుడు రోగనిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు పంపకుండా లయన్స్‌క్లబ్ ల్యాబ్‌కు పంపిస్తే ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రైౖవేటు ల్యాబ్ కన్నా.. కేవలం 20శాతం ధరలకే లయన్స్ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నాం. వైద్యులు సహకరించాలి. – ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, రెడ్‌క్రాస్ సెక్రటరీ -
బీజేపీకి గుణపాఠం తప్పదు
కరీంనగర్: కార్మికులు తమ హక్కులను పోరాడి సాధించుకున్నారని, బీజేపీ వారి హక్కులను హరిస్తే కార్మిక లోకం చూస్తూ ఊరుకోదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైల్వే హమాలీ సంఘం కార్మికులు ఏర్పాటుచేసిన పతాకాన్ని ఆవిష్కరించారు. రైల్వేగేట్ నుంచి బద్దం ఎల్లారెడ్డి భవన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య జెండా ఆవిష్కరణ చేశారు. సిమెంట్ గోదాం, ఫర్టిలైజర్ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం చాడవెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11ఏళ్లు గడుస్తున్నప్పటికీ కార్మిక హక్కులను హరించడానికి కుటీల ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలోని కార్మికవర్గం అంతా మేడే స్ఫూర్తిగా హక్కుల కోసం పోరాటం చేయాలని, ఈనెల 20న జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ అనుబంధ రైల్వే హమాలీ సంఘం అధ్యక్షుడు కాశెట్టి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దాసరి ప్రభాకర్, రవీందర్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెల్దండి దామోదర్, ఉల్లిగడ్డల హమాలీ సంఘం అధ్యక్షుడు నర్సింహులు, కొమురయ్య, సిమెంట్ గోదాం ఫర్టిలైజర్ హమాలీ సంఘం అధ్యక్షుడు జంగా తిరుపతి, నన్నవేన కొమురయ్య, కదారి బీరయ్య, మామిడిపెల్లి శంకర్, ఆకుల లచ్చన్న, ప్రకాశం గంజ్ ట్రాలీ ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్ ,కాల్వ రాయమల్లు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి -
ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్‌టౌన్: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ అనుమతులకు సంబంధించిన ‘జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ’ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగింది. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఆస్పత్రి నుంచి వెలుపడే బయో కెమికల్, ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఆస్తి పన్ను, నీటి పన్ను నిర్దిష్ట సమయంలో చెల్లించాలని పేర్కొన్నారు. నివాసయోగ్యంగా ఉన్న గృహాల్లో ఆస్పత్రులు నిర్వహిస్తున్నట్లయితే వాటిని తప్పనిసరిగా వెంటనే వాణిజ్య పరిధిలోకి మార్చుకోవాలని అన్నారు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు తప్పక పాటించాలని, ఎగ్జిట్, ఎంట్రీ కోసం వేరువేరుగా ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ... ప్రతి ప్రైవేట్ ఆస్పత్రికి పార్కింగ్ సౌకర్యం విధిగా ఉండాలని అన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎనమల్ల నరేశ్, హెచ్‌ఈవో బాలయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి కరీంనగర్: పదోతరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి సప్లమెంటరీలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి మండల విద్యాధికారులను ఆదేశించారు. పదో తరగతి ఫలితాలు, విద్యాశాఖలో కార్యాచరణపై కలెక్టరేట్లో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 6,200 మంది విద్యార్థుల్లో 5,995మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫెయిల్ అయిన 205మందిపై ప్రత్యేక దృష్టి సారించి, వచ్చే నెలలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. 2015 నుంచి ఇప్పటివరకు పదోతరగతిలో సబ్జెక్టుల వారీగా ఫెయిల్ అయిన విద్యార్థుల డాటా సేకరించాలన్నారు. ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో ప్రాక్టీస్ చేయించి వారంతా సప్లమెంటరీలో పాస్ అయ్యేలా చూడాలని అన్నారు. మండల విద్యాధికారులు అన్ని పాఠశాలలను సందర్శించి కావలసిన సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, కో–ఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్ ఆంజనేయులు, డీసీడీవో కృపారాణి, సీడీపీవో సబిత పాల్గొన్నారు. -
టెంట్‌హౌజ్‌లో అగ్నిప్రమాదం
ధర్మపురి: టెంట్‌హౌజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగి లక్షల విలువ చేసే సామగ్రి దగ్ధమైంది. బాధితుడు షబ్బీర్ కథనం ప్రకారం.. పట్టణంలోని నక్కలపేట రూట్లో ఉన్న టెంట్‌హౌజ్‌లో గురువారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు గోదాంలో ఉన్న టెంట్ సామగ్రికి నిప్పంటించారు. పెద్ద ఎత్తున మంటల చెలరేగడంతో చుట్టుపక్కల వారు షబ్బీ ర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన ఫైరింజన్‌కు ఫోన్‌చేయగా.. సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేశారు. మంటల్లో టెంట్ సామానుతోపాటు డెకరేషన్ సామగ్రి, థర్మకోల్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.15లక్షల వరకు సామగ్రి దగ్ధమైందని బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు. -
జాతీయ పోటీలకు లౌక్యశ్రీ ఎంపిక
జమ్మికుంట: మండలంలోని కోరపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నారవేన లౌక్యశ్రీ జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ సబ్ జూనియర్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ జిట్టబోయిన శ్రీను తెలిపారు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఈనెల 1నుంచి 4వ తేదీ వరకు నిర్వహించే 39వ జాతీయస్థాయి సబ్ జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థిని హెచ్ఎం మిడిదొడ్డి సమ్మయ్య, ఉపాధ్యాయులు రాజయ్య, దేవదాస్, ప్రకాశ్, శ్రీనివాస్, నరహరి, రాజు, రవికాంత్‌రాజు, శ్రీనివాస్‌రెడ్డి, పద్మ, సంపత్, విజేందర్‌రెడ్డి, గీతాలు హర్షం వ్యక్తం చేశారు. ఆయిల్‌పాం తోట దగ్ధంవీణవంక: మండలంలోని ఘన్ముక్కుల గ్రామంలో గాలికి విద్యుత్ వైర్లు ఒకటికొకటి తగలడంతో అయిల్‌పాం తోట దగ్ధమైంది. గ్రామానికి చెందిన నందికొండ మాధవరెడ్డి మూడు ఎకరాల్లో అయిల్‌పాం సాగు చేశాడు. గురువారం విద్యుత్ వైర్లు గాలికి ఒకదానికొకటి తగలడంతో నిప్పురవ్వలు చేనులో పడటంతో మంటలు చెలరేగి అయిల్‌పాం దగ్ధమైందని బాధితుడు వాపోయాడు. అదేవిధంగా నందికొండ మల్లారెడ్డికి చెందిన నాలుగు ఎకరాల మగ వరి మంటలకు అంటుకొని కాలిపోయిందని అన్నాడు. సంబంధిత అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు. జూనియర్ సివిల్ జడ్జిగా కీర్తనకరీంనగర్క్రైం: నగరంలోని అరెపల్లికి చెందిన కట్ట కీర్తన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ంది. 2021లో హైదరాబాద్‌లోని ప్రైవేట్ లా కళాశాల నుంచి ఎల్ఎల్బీ, నల్సార్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేసింది. హైకోర్టులో, కరీంనగర్ కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతూనే జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు సన్నద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ంది. తల్లి పద్మ గృహిణి కాగా, తండ్రి కోటి జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. అక్క శ్రీదేవి పీజీ పూర్తి చేయగా, తమ్ముడు సుదర్శన్ బీటెక్ చదువుతున్నాడు. -
ప్రాణం తీసిన రీల్స్ సరదా
● మానేరువాగులో పడి యువకుడి మృతి కరీంనగర్‌క్రైం: సోషల్ మీడియా రీల్స్ సరదా ఒక యువకుడి ప్రాణాలు తీసింది. రీల్స్ చేయడానికి కరీంనగర్ శివారులోని మానేరు వాగులోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతిచెందాడు. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన మహ్మద్ లతీఫ్‌కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. చిన్న కుమారుడు మహ్మద్ అర్బాస్ (20) గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి మానేరు బ్రిడ్జి సమీపంలోని రీల్స్ చేయడానికి వెళ్లాడు. అర్బాస్ మానేరు వాగులోకి దిగి రీల్స్ చేస్తున్న క్రమంలో లోతైన ప్రదేశంలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. స్నేహితులు స్థానికులను పిలిచి వారి సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అర్బాస్ అప్పటికే మృతిచెందాడు. అర్బాస్ తండ్రి లతీఫ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. 147 కిలోల గంజాయి స్వాధీనంవరంగల్ క్రైం: చింతగట్టు ప్లైఓవర్ బ్రిడ్జి దగ్గర రూ.73.65లక్షల విలువ గల 147 కిలోల ఎండు గంజాయిని పట్టకున్నట్లు నార్కోటిక్ డీఎస్పీ సైదులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుకుమామిడి నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీ చేయగా.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరళ్ల సదయ్య, హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన సామల శేషు కలిసి ఇన్నోవా, షిప్ట్ కార్లలో 69ప్యాకెట్ల గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. సదయ్య, సతీశ్‌పై 2014, 2016లో కేయూసీ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. -
పిచ్చికుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు
● వరంగల్ ఎంజీఎంకు తరలింపు ఇల్లందకుంట(హుజూరాబాద్): పిచ్చికుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు అయిన ఘటన బుధవారం మండలంలోని కనగర్తిలో జరిగింది. గ్రామానికి చెందిన రాజు–వనిత దంపతుల కుమారుడు రెండేళ్ల అయాన్ ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పిచ్చికుక్కలు దాడి చేశాయి. అప్రమత్తమైన తల్లిదండ్రులు బాలుడిని హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, గతంలో కూడా గ్రామంలో పలువురిపై కుక్కలు దాడిచేశాయని, సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేటగాడి నిప్పు.. చెట్టుకు ముప్పుబోయినపల్లి(చొప్పదండి): వణ్యప్రాణుల కోసం ఓ వేటగాడు భారీ వృక్షం మొదట్లో నిప్పుపెట్టగా.. అది నేలకొరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పివేశారు. బోయినపల్లి మండలం తడగొండ నుంచి గంగాధర వెళ్లే మార్గంలో ఓ పెద్దచెట్టు మొదలుకు ఓ వేటగాడు రెండు రోజుల క్రితం నిప్పుపెట్టాడు. చెట్టు బొర్రెలో దాగి ఉన్న వణ్యప్రాణుల కోసం మొదట్లో నిప్పు పెట్టాడు. పెద్ద ఎత్తున మంటలు లేవడంతో చెట్టు కూలిపోయి రోడ్డుపై పడింది. అయినా మంటలు తీవ్రంగా ఉండడంతో సమీప పొలాల్లోని రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. అనంతరం చెట్టును తొలగించారు. -
అప్పు తీసుకున్న వారు మోసం చేశారని..
జగిత్యాలక్రైం: మాయమాటలు చెప్పి అవసరం నిమిత్తం బంగారం, నగదు తీసుకున్న ఇద్దరు మహిళలు ఇప్పుడు అప్పుడు అంటూ తిప్పుకుంటుండడంతో మనస్తాపానికి గురైన ఓ వృద్ధురాలు జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పెగడపల్లి మండలం రాములపల్లికి చెందిన తోట బాలవ్వ వద్ద జగిత్యాలకు చెందిన అశ్విని, మల్యాల మండలం రామన్నపేటకు చెందిన విజయ ఇద్దరూ కలిసి తమ అవసరం నిమిత్తం 14 నెలల క్రితం 15 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకుని ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు. కాలపరిమితి ముగియడంతో బాలవ్వ డబ్బులు చెల్లించాలని కోరగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. దీంతో గతంలోనే బాలవ్వ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల ముందు కూడా వారు డబ్బులు చెల్లిస్తామని ఒప్పుకున్నారు. బుధవారం డబ్బులు చెల్లించేందుకు వాయిదా ఉండటంతో బాలవ్వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు అశ్విని, విజయను పిలిపించారు. వారు డబ్బులు చెల్లించేందుకు కొంతసమయం కావాలని, ఇప్పుడే కావాలంటే తమ వద్ద లేవని నిరాకరించడంతో మనస్తాపానికి గురైన బాలవ్వ వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగింది. అక్కడున్న వారు గమనించి బాలవ్వను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలవ్వ చికిత్స పొందుతోంది. పోలీస్‌స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం ఆస్పత్రికి తరలించిన పోలీసులు -
పదిలో ఆరో స్థానం
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025కరీంనగర్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 6వ స్థానం దక్కించుకుంది. గత ఏడాది 96.65 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 7వ స్థానం సాధించగా, ఈసారి ఉత్తీర్ణత 97.90 శాతం నమోదయింది. జిల్లాలో మొత్తం 12,508 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12,245 మంది పాసయ్యారు. 263 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఎప్పటిలాగే ఈ విద్యా సంవత్సరం సైతం ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు గణనీయమైన ఉత్తీర్ణత సాధించాయి. సత్తాచాటిన మోడల్, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ జిల్లా వ్యాప్తంగా జెడ్పీ, కేజీబీవీ, ఎయిడెడ్, మోడల్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు ఫలితాల్లో సత్తాచాటారు. జిల్లాలోని 12 కేజీబీవీల్లో 8 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని 25 జ్యోతిబాపూలే గురుకులాల్లో 1,614 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా 1,607 మంది ఉత్తీర్ణత సాధించారని జ్యోతిబాపూలే ఉమ్మడి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ అంజలి వెల్లడించారు. జిల్లా పరిధిలోని మానకొండూరు, నగునూర్, కరీంనగర్, రామడుగు, హుజూరాబాద్ బాలుర వసతి గృహాల్లో మొత్తం 36 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 35 మంది ఉత్తీర్ణత సాధించారు. బీసీ బాలికల వసతి గృహం కరీంనగర్లో ఒకరి విద్యార్థిని ఉత్తీర్ణత సాధించింది. ఎస్సీ వసతి గృహాల్లో 156 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 149 మంది ఉత్తీర్ణత సాధించారు. 11 మోడల్ స్కూల్లో 98 శాతం ఉత్తీర్ణత జిల్లాలోని 11 మోడల్ స్కూళ్లల్లో 965 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 947 మంది ఉత్తీర్ణత సాధించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల్లో గంగాధర, ఎలగందల్, రామడుగు, సైదాపూర్, శంకరపట్నం, తిమ్మాపూర్ పాఠశాలల ఉన్నాయి. జూన్ 3 నుంచి సప్లమెంటరీ.. ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 17లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని, జూన్ 3 నుంచి 13 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్న ం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు రీవెరిఫికేషన్ దరఖాస్తు ఫారం కోసం డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రీకౌంటింగ్ ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున డీడీ (ఎస్బీఐ/ఎస్బీహెచ్) తీసి ఈనెల 15 వరకు డీఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో 97.90 శాతం ఉత్తీర్ణత 12,508 మంది విద్యార్థులకు 12,245 మంది ఉత్తీర్ణత సత్తాచాటిన మోడల్ స్కూల్, ఎస్సీ, బీసీ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులుఅంశం బాలురు బాలికలు మొత్తం హాజరైనవారు 6,616 5,892 12,508 ఉత్తీర్ణులు 6,451 5,794 12,245 ఉత్తీర్ణత శాతం 97.51 98.34 97.90న్యూస్రీల్పదోతరగతిలో నాలుగేళ్ల ఫలితాలుసంవత్సరం ఉత్తీర్ణతశాతం రాష్ట్రంలో స్థానం 2022 93.34 15వ స్థానం 2023 95.00 4వ స్థానం 2024 96.65 7వ స్థానం 2025 97.90 6వ స్థానం -
కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్‌అర్బన్: సమ్మర్ క్యాంపులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ రంగంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులు వేసవి సెలవుల్లో విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ ప్రారంభించినట్లు వివరించారు. నాలుగు వారాలపాటు జరిగే శిక్షణలో 50 మంది విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, ఫొటోషాప్ స్కిల్‌లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం 25 మంది చొప్పున విద్యార్థులకు థియరీతోపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తామని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి రోజూ ఒక పేజీ చేతి రాత ప్రాక్టీస్ చేయాలని అన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్, ప్రాంతీయ శిక్షణ కేంద్రం మేనేజర్ రాంబాబు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, కేజీబీవీ కోఆర్డినేటర్ కృపారాణి, సంతోష్ పాల్గొన్నారు. -
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
వేములవాడ: సివిల్ జడ్జి(జూనియర్ బెంచ్) పరీక్షల్లో వేములవాడకు చెందిన సంకెపల్లి జాహ్న వి అర్హత సా ధించారు. పట్టణంలోని భీమేశ్వరాలయం వీధికి చెందిన ఎస్.హరికిషన్ కూతురు జాహ్నవి ఉస్మానియా యూనివర్సిటీలో బీకాం ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ప్రస్తుతం న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నా రు. నాలుగో ప్రయత్నంలో జడ్జిగా అర్హత సాధించారు. పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింతజగిత్యాలటౌన్: జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బ్యాగ్‌ను తిరిగి ఆమెకు అప్పగించారు సిబ్బంది. జగిత్యా ల డిపోకు చెందిన బస్సులో వరంగల్‌కు చెందిన సులోచన కరీంనగర్లో ఎక్కింది. తులం బంగారం, సెల్‌ఫోన్, డబ్బులు ఉన్న బ్యాగ్ ను బస్సులో మరిచిపోయి దిగిపోయింది. బస్ కండక్టర్ గంగప్రసాద్ ఆ బ్యాగ్‌ను గుర్తించి జగిత్యాల డిపోలో అప్పగించారు. ఇంటికెళ్లిన ప్రయాణికురాలు బ్యా గ్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించి టికెట్ ఆధారంగా జగి త్యాల డిపోకు చేరుకుంది. అన్ని ఆధారాలను పరిశీలించిన ఆర్టీసీ సిబ్బంది ఆ బ్యాగును ఆమెకు అందించారు. బ్యాగును అందించిన కండక్టర్ గంగప్రసాద్, సిబ్బ ందికి సులోచన ధన్యవాదాలు తెలిపారు. డిపో క్లర్క్ మొండయ్య తదితరులు ఉన్నారు. -
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
సారంగాపూర్: బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన ఆకుల చిన్న గంగన్న (55) బుధవారం పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం.. గంగన్న ఏడాది క్రితం చెట్టుపై నుండి కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. చెట్టుకు ఉరేసుకున్నా డు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడి అరెస్ట్ కథలాపూర్: మండలకేంద్రానికి చెందిన కల్లెడ జైపాల్ అక్రమంగా గంజాయి తరలిస్తూ విక్రయిస్తున్న క్రమంలో పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. జైపాల్ గంజాయిని కోరుట్ల, కథలాపూర్ ఏరియాలో విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు మెట్పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేశ్‌బాబు పర్యవేక్షణలో మంగళవారం రాత్రి తనిఖీ చేపట్టగా సిరికొండ శివారులో పట్టుబడ్డాడు. అతడి నుంచి 96 గ్రాముల గంజాయి, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. స్వగ్రామానికి చేరిన మృతదేహంకథలాపూర్(వేములవాడ): మండలంలోని పోసానిపేటకు చెందిన గుంట హన్మంతు(42) సౌదీ అరేబియాలో రెండు నెలల క్రితం హత్యకు గురికాగా.. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. హన్మంతు కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్తున్నాడు. తాను ఉంటున్న గదిలో నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన వ్యక్తితో ఫిబ్రవరి 28న గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హన్మంతు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. -
కరీంనగర్లో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయండి
కరీంనగర్‌టౌన్: జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు మరోసారి విజ్ఞప్తి చేశారు. అంబేడ్కర్ స్టేడియంలో రూ.10 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. శాతవాహన వర్శిటీలో ఖేలో ఇండియా కింద మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో మన్సూక్ మాండవీయను కలిసిన బండి సంజయ్.. మూడు అంశాలపై చర్చించారు. కరీంనగర్లో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు అనివార్యమని బండి అన్నారు. మెడికల్ హబ్‌గా మారిన నగరానికి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని, బీడీ, నేత కార్మికులతోపాటు వివిధ రంగాల్లో కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్నారు. ఈఎస్ఐ సౌకర్యం లేక వారందరు వైద్య చికిత్సకు నోచుకోవడం లేదన్నారు. అదేవిధంగా నగరంలోని అంబేడ్కర్ స్టేడియానికి నిత్యం వేలాది మంది వస్తుంటారని, వారికోసం సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని బండి కోరారు. ఖేలో ఇండియా పథకం కింద శాతవాహన వర్శిటీలో రూ.16 కోట్ల వ్యయంతో మల్టీ పర్పస్హాల్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి కేంద్రప్రభుత్వానికి పంపారని గుర్తుచేశారు. స్పందించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల వర్శిటీని సందర్శించి మల్టీపర్పస్ హాల్ సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ.. ఈఎస్ఐ ఏర్పాటు ప్రతిపాదనలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపామని, ఆమోదం లభించిన వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్, శాతవాహన వర్శిటీలో మల్టీపర్పస్ హాల్ ఏర్పాటు అంశాలను త్వరితగతిన పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. అంబేడ్కర్ స్టేడియానికి సింథటిక్ ట్రాక్ మంజూరు చేయండి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు బండి సంజయ్ వినతి -
ఏక్తా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్‌టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను ఈసారి భారీస్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మే 22న కరీంనగర్లో నిర్వహించే కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరవుతారని, నిర్వాహకులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఏక్తా యాత్ర పోస్టర్‌ను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరీంనగర్ విభాగ్ సహా సంఘ చాలకులు డాక్టర్ సి.హెచ్ రమణాచారి, విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇ. మధుసూదన్‌రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, మాజీ మేయర్లు సునీల్‌రావు, డి.శంకర్, రమేష్, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్, మాజీ కార్పొరేటర్ పవన్, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు, ఓదెలు, మురళీకృష్ణ, కరీంనగర్, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శలు శ్రీనివాస్‌గౌడ్, మధుకర్, రఘు, శ్రీనివాస్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు వేణు, బీజేపీ మీడియా కన్వీనర్ లోకేష్, అజయ్‌వర్మ, ఎలక్షన్స్ సెల్ కన్వీనర్ రమణారెడ్డి, బల్బీర్ సింగ్, రమణారెడ్డి, చైతన్య, రాము పాల్గొన్నారు. -
‘బండ’బారిన బతుకులు
కండలు కరిగించినా.. కొండలు పగులదీసినా.. ● కుండలో మెతుకులు కరువు ● కష్టజీవులకు దక్కని హక్కులు ● ప్రమాదబీమా ఊసేలేదు ● రెక్కాడితే తప్ప డొక్కాడని తుర్కాశీ కార్మికులు రాజన్నసిరిసిల్ల జిల్లాలో 82 గ్రామాల్లో.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 82 గ్రామాల్లో తుర్కాశీ కార్మికులు ఉన్నారు. వీరంతా నిత్యం గుట్టలు, గుట్టబోరును నమ్ముకుని బండలు కొడుతున్నారు. భవన నిర్మాణాలకు, ప్రహరీలకు, పునాదుల నిర్మాణాలకు బండలను సరఫరా చేస్తారు. ఎంతో కష్టతరమైన పనిలో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. కండలు కరిగించి కొండలు పగలదీసినా ఇంట్లో కుండలు వెలితిగానే ఉంటున్నాయి. ఎదుగుబొదుగు లేని జీవితంతో బతుకు జట్కాబండిని భారంగా ఈడుస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ధైన్యం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎండా, వాన, చలి ఇవేవి వాళ్లని భయపెట్టవు... రేపటికి పని దొరక్కపోతే ఎలాగన్న వేదన తప్ప... పండుగ పబ్బాలకు పరమాన్నం రుచి ఎరుగరు. జిల్లాలో అట్టడుగు స్థాయిలో జీవిస్తున్న తుర్కాశీల బతుకుచిత్రం దుర్భరం. అటవీ ప్రాంతాల్లో పనిచేయడంతో ఫారెస్ట్ అధికారులు బండలు కొట్టవద్దని పనిముట్లను లాకెళ్తున్నారని కార్మికులు వాపోయారు. రెక్కల కష్టాన్ని నమ్మకున్న కార్మికుల బతుకులు బండలవుతున్నాయి. గుర్తింపు లేదు తుర్కాశీ కార్మికులను భవన నిర్మాణరంగ కార్మికులుగా గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాల్సి ఉండగా.. కార్మికశాఖ వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణానికి అవసరమైన బండలను కొట్టి సరఫరా చేస్తున్నా గుర్తింపుకార్డులు, భవన నిర్మాణ కార్మికులుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కడం లేదు. ఇప్పటికై నా జిల్లా అధికారులు చొరవచూపి జిల్లాలోని తుర్కాశీ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు ఇస్తాం భవన నిర్మాణ కార్మికులుగా తుర్కాశీ కార్మికులను గుర్తిస్తాం. తుర్కాశీ కార్మికులు దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. ఇప్పటికే జిల్లాలో చాలా మందికి గుర్తింపు కార్డులు ఇచ్చాం. ఇంకా ఎవరైనా గుర్తింపు కార్డులు లేని వారు ఉంటే కార్మిక శాఖ ఆఫీస్‌ను సంప్రదిస్తే జారీ చేస్తాం. – నాజర్ అహ్మద్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, సిరిసిల్ల సిరిసిల్ల: కండలు కరిగించి.. గుట్టలను పిండి చేస్తున్నారు. ఎండ..వాన..చలి.. లెక్కచేయని తనంతో కష్టపడుతున్నారు. అయినా పూటగడవని స్థితిలో తుర్కాశీలు కాలం వెల్లదీస్తున్నారు. భవన నిర్మాణాలకు బండలను సరఫరా చేస్తున్నా వారికి కనీసం కార్మికులుగా గుర్తింపుకార్డులు లేవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. బండలు కొడుతూ ‘బండ’బారిన జీవనం గడుపుతున్న తుర్కాశీలపై మేడే సందర్భంగా ప్రత్యేక కథనం. -
జిల్లా జడ్జికి ప్రాసిక్యూటర్ల శుభాకాంక్షలు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ఎస్.శివకుమార్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.శరత్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా జడ్జి ప్రాసిక్యూటర్లకు సంబంధించిన సమస్యలు, వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల పెండెన్సి తగ్గించేందుకు ప్రాసిక్యూటర్లు ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రాసిక్యూటర్లు వారి సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లక్ష్మిప్రసాద్, జూలూరి శ్రీరాములు, కుమారస్వామి, గౌరు రాజిరెడ్డి, గడ్డం లక్ష్మణ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రంజిత్, వీరస్వామి పాల్గొన్నారు. నీట్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించండి కరీంనగర్ అర్బన్/కరీంనగర్: వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం మే 4న జరిగే నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణపై సమావేశం నిర్వహించారు. మే 4న జరిగే నీట్ ప్రవేశ పరీక్ష రాసే 2,975 మంది విద్యార్థుల కోసం ఏడు పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షకు ఒక రోజు ముందే కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎక్కడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కాకుండా జాగ్రత్తలు వహించాలని, సీసీ టీవీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పరీక్షను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో నీట్ పరీక్ష జిల్లా కోఆర్డినేటర్ పంకజ్ కుమార్, జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి పవన్‌కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎన్పీడీసీఎల్ ఏడీఈ లావణ్య, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఏసీపీ మాధవి, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. నేడు ఇస్కాన్ టెంపుల్ ప్రథమ వార్షికోత్సవం కరీంనగర్ కల్చరల్: ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉజ్వలపార్క్ సమీపంలో ఇస్కాన్ టెంపుల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం సాయంత్రం 5:30 గంటల నుంచి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మందిర బాధ్యుడు నరహరి ప్రభుదాస్ తెలిపారు. మంగళవారం ఆలయంలో మాట్లాడుతూ.. సాయంత్రం అభిషేకం, మహానివేదన, హారతిసేవ ఉంటాయని, 6:30 గంటల నుంచి 8గంటల వరకు అలకాపురి కాలనీలో రాధాగోవిందుల పల్లకీసేవ, ప్రవచనం, కీర్తన, భజన ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు వార్షి కోత్సవంలో పాల్గొని జగన్నాథుని కృపకు కావాలని పిలుపునిచ్చారు. కన్నకృష్ణ, డాక్టర్ ఎల్.రాజభాసర్రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, సత్యనారాయణం, నగేశ్‌రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. రెండు, నాలుగో సెమిస్టర్ల ఫీజు గడువు కరీంనగర్‌సిటీ: శాతవాహన విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (హానర్స్) కోర్సులో రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షల రుసుము నిర్ధారించడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్ తెలిపారు. అభ్యర్థులు వారివారి కళాశాలల్లో ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షలు మే నెలలో జరుగుతాయని తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మే 6వ తేదీ వరకు, రూ.300 అపరాధ రుసుముతో మే9వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. -
ఇంటికి దారేది?
● నగరంలో పలుచోట్ల ఇళ్ల ఎదుట తవ్వకాలు ● గత ప్రభుత్వంలో డ్రైనేజీ, రోడ్ల పనులు ప్రారంభం ● అలాగే వదిలేసి ఏడాదిన్నర ● పట్టించుకోని ప్రస్తుత పాలకులు ● ఇబ్బంది పడుతున్న ప్రజలునగర శివారు ఉన్న అలకాపురికాలనీ ఇది. స్మార్ట్‌సిటీలో భాగంగా నగరం అద్దంలా మెరిసిపోతుండగా.. ఈ ప్రాంతం రోడ్డు, డ్రైనేజీ లేక వెలవెలబోతోంది. రోడ్డు, డ్రైనేజీ వేస్తామన్న గత పాలకులు పనులు ప్రారంభించగా.. తరువాత జరిగిన పరిణామాలతో వదిలేశారు. దీంతో ఈ కాలనీవాసులు తమ ఇండ్లకు దారిలేక ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ లేక ఇళ్లలోని మురుగునీరు రోడ్డుపైకి చేరుతోందని చెబుతున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఇలా తడకలు వేసుకున్నారు. డ్రైనేజీ రోడ్డుపై పారుతోంది. ఈ చిత్రం నగరంలోని జ్యోతినగర్‌లోని. నిత్యం రద్దీ ఉండే ప్రాంతం ఇది. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన ఈ ఏరియాలో రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను విస్తరిస్తామని గత పాలకులు పనులు ప్రారంభించారు. కొద్దిరోజులకే ఎన్నికలు రావడంతో డ్రైనేజీ తవ్వి వదలేదశారు. కొంతదూరం పనులు పూర్తి చేశారు. రోడ్డు పనులు మరిచారు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఇళ్లలోకి వెళ్లేందుకు ఇలా తడకలు వేసుకుని కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు వృద్ధులు అయితే ఇంట్లోంచి బయటికి వెళ్లేందుకు భయపడుతున్నారు.నగరంలోని కోతిరాంపూర్‌లో ఉన్న కాలనీ ఇది. ఇక్కడ రోడ్డు, డ్రైనేజీ వేస్తామని గత ప్రభుత్వ హయాంలో పాలకులు పనులు ప్రారంభించారు. ఇళ్ల ఎదుట రోడ్లు తవ్వారు. కంకర పోశారు. డ్రైనేజీ కోసం కందకం తవ్వారు. ఇంతలో సర్కారు మారడంలో అలాగే వదిలేశారు. రెండేళ్లుగా తవ్విన రోడ్డుపైనే కాలనీవాసులు నడుస్తున్నారు. ఇళ్లలోకి వెళ్లేందుకు దారిలేక చెక్కలు వేసుకుని సర్కస్‌ఫీట్లు వేస్తున్నారు. బండ్లు బయట పెడుతుంటే.. చోరీకి గురవుతున్నాయని చెబుతున్నారు.కరీంనగర్ కార్పొరేషన్: కొత్త రోడ్లు వేస్తున్నామని పాతరోడ్లు తవ్వేశారు. డ్రైనేజీల కోసం ఇండ్ల ఎదుట కాలువలు తవ్వారు. ఇక కొత్త డ్రైనేజీలు, రోడ్లతో సమస్యలు తీరుతున్నాయని అంతా మురిసిపోయారు. కానీ జరిగిన పరిణామాలతో తవ్విన పనులు తవ్వినట్లే నిలిపివేసి ఏడాదిన్నర దాటింది. ప్రభుత్వ మారినా పనుల్లో కదలికలేదు. దీంతో నగరంలోని ఆయా కాలనీవాసుల పరిస్థితి పేనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్లయింది. గత ప్రభుత్వ హయాంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) కింద అంతర్గత రోడ్లతో పాటు, డ్రైనేజీల పనులు చేపట్టారు. రోడ్లు, డ్రైనేజీల కోసం ఇండ్ల ఎదుట తవ్వడం పనులు జరుగుతుండగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఆ వెంటనే కాంట్రాక్టర్ ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. 2023 డిసెంబర్లో నిలిపివేసిన పనుల్లో ఇప్పటివరకు కదలిక లేకుండా పోయింది. ఇండ్ల ఎదుట కాలువలు డ్రైనేజీ నిర్మాణాల కోసం ఇండ్ల ఎదుట కాలువలు తవ్వి వదిలివేయడంతో ఇండ్లల్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో చాలా మంది తాత్కాలికంగా పాత తలుపులు, చెక్కలు కాలువలపై వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. ఏడాదిన్నరగా ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడుస్తుండడంతో మరికొంతమంది కాలువలను పూడ్చి వేసి తాత్కాలికంగా రాకపోకలకు దారి వేసుకున్నారు. మురుగునీరంతా అక్కడే నిలిచిపోవడంతో మరో సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది. తాత్కాలిక ఏర్పాట్లైనా చేయాలి పనులు అసంపూర్తిగా నిలిపివేయడంతో కోతిరాంపూర్, అలకాపురికాలనీ, జ్యోతినగర్, ఆరెపల్లి, సీతారాంపూర్, తీగలగుట్టపల్లి, కిసాన్‌నగర్, లక్ష్మినగర్, పోచమ్మవాడ తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా కనీసం పట్టించుకొనేవాళ్లు లేకపోవడంపై మండిపడుతున్నారు. ఇండ్లకు వెళ్లేందుకు, మురుగునీళ్లు నిలవకుండా నగరపాలకసంస్థ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లైనా చేయాలని కోరుతున్నారు.ఈ బాధలు ఇంకెన్ని రోజులు? డ్రైనేజీ కడుతామని మా ఇంటి ముందు కాలువ తవ్వి రెండేళ్లవుతోంది. ఇప్పటివరకు పనులు కొనసాగించడం లేదు. కాలువ పైనుంచి పాత తలుపు చెక్కలు వేసుకుని నడుస్తున్నాం. కాలువను పూడ్చివేద్దామంటే పైనుంచి వచ్చే మురుగునీళ్లు మా ఇంటి వద్దే నిలిచిపోతోంది. ఇంటినుంచి బయటకు రావడానికి, పోవడానికి బాధలు తప్పడం లేదు. రాత్రుళ్లు అయితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోంది. – సంగని పద్మ, మొగిలయ్య, అలకాపురి -
శిక్షణతో సైబర్ నేరాలకు చెక్
సిరిసిల్లక్రైం: సైబర్ నేరాల ఛేదనకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఎంతో దోహదపడుతాయని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. నేరాల పరిశోధనలో ఉపయోగించాల్సిన అంశాలపై కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల సిబ్బంది, అధికారులకు మంగళవారం సైబర్ నిపుణులతో సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సైబర్ నిందితులకు శిక్ష పడటంలో డిజిటల్ సాక్ష్యాధారాల సేకరణ కీలకమన్నారు. సాంకేతికత ఆధారంగా అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే మోసాలపై అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో సిబ్బంది, అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ నేరాలకు అడ్డుకట్ట వేయాలని వివరించారు. సైబర్ నేరం జరిగినప్పుడు ఫిర్యాదు నమోదు నుంచి డిజిటల్ ఆధారాల సేకరణ, విశ్లేషణ మొదలగు అంశాలపై నిపుణులు ఇచ్చిన శిక్షణ సద్వినియోగం చేసుకొని నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసేలా ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, రాజుకుమార్, కోర్స్ కో ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ. గీతే -
డంపు.. కంపు.. నిప్పు
● సబ్‌స్టేషన్‌కు పొంచి ఉన్న ప్రమాదం ● ఆందోళనలో విద్యుత్ సిబ్బందికొత్తపల్లి: కరీంనగర్ హౌజింగ్‌బోర్డు కాలనీలోని 33/11 కె.వీ.సబ్‌స్టేషన్‌కు ప్రమాదం పొంచి ఉంది. సబ్‌స్టేషన్ ప్రహరీని ఆనుకొని మున్సిపల్ డంపింగ్ యార్డు ఉండటం విద్యుత్ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. డంపింగ్ యార్డులోని చెత్తకు నిప్పు పెడుతుండటంతో సబ్‌స్టేషన్‌లోని ఆపరేటర్లు దుర్వాసన, పొగతో ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డులోని మంటలతో సబ్‌స్టేషన్‌కు ప్రమాదం పొంచి ఉంది. వేసవికాలం గాలులు వీస్తుండటంతో ప్రమాదవశాత్తు సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్ఫార్మర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్తపై పడితే, అందులోని ఆయిల్‌కు అంటుకుంటే ప్రమాదం తీవ్రంగా ఉండనుందన్న ఆందోళన సిబ్బందిలో నెలకొంది. మంగళవారం డంపింగ్ యార్డు వద్ద ముక్కుకు రుమాలు కట్టుకొని విద్యుత్ సిబ్బంది నిరసన వ్యక్తం చేసారు. అనేక మార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసనతో కూడిన పొగ వల్ల స్థానికులతో పాటు తాము అనారోగ్యాల పాలవుతున్నామని, అక్కడ విధులు నిర్వర్తించడం కష్టంగా ఉందన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డును ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. -
మహిళా వ్యవసాయ కళాశాల తరలింపు..?
జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్లలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకులం మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలను మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకికి తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఈ కళాశాల మంజూరు కాగా.. అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనల మేరకు కోరుట్లలోని ఓ ప్రభుత్వ భవనంలో ప్రారంభించారు. అప్పటినుంచి అదే భవనంలో కొనసాగుతోంది. కళాశాలకు శాశ్వత భవనం కోసం అప్పటి మంత్రి సూచనల మేరకు వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో దాదాపు 50 ఎకరాల భూమి కేటాయించారు. అప్పటికే స్తంభంపల్లిలో ఏర్పాటు చేయదలిచిన ఇథనాల్ ఫ్యాక్టరీకి స్థలం కేటాయించగా.. ఆ ఫ్యాక్టరీ రద్దు కావడంతో సదరు స్థలాన్ని ఈ కళాశాలకు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. మరోవైపు ఇటీవలే వ్యవసాయ కళాశాలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగాను గుర్తింపు వచ్చింది. దీంతో అందులో చదువుతున్న విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలిగింది. మొదట 2023–24 విద్యా సంవత్సరంలో ఈ కళాశాలను సిద్దిపేటలో నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలగా కొనసాగించారు. అక్కడ మరో కళాశాల మంజూరు కావడంతో దానిని సాంఘిక సంక్షేమ కళాశాలగా మార్చుతూ జగిత్యాలకు తరలించారు. జిల్లాకేంద్రంలో భవనం అందుబాటులో లేకపోవడంతో అప్పటి మంత్రి ఈశ్వర్ సూచనల మేరకు కోరుట్లలో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి వర్సిటి గుర్తింపు రాలేదు. ఫలితంగా కోర్సులో చేరిన విద్యార్థులు సందిగ్ధంలో పడిపోయారు. మొదటి సంవత్సరం పూర్తయిన విద్యార్థులు ఏ వర్సిటీ అటనామస్ కింద పరీక్షలు రాయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయం ఇటీవల ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో దానికి జయశంకర్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చారు. దీంతో విద్యార్థులకు సమస్య లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో కళాశాలను బెజ్జంకికి తరలిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళాశాలకు బెజ్జంకిలో 75ఎకరాలు కేటాయించేందుకు అధికారుల బృందం పర్యటిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై సంబంధిత ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా.. తమకు గైడ్‌లైన్స్ రాలేదని పేర్కొన్నారు. కోరుట్ల నుంచి బెజ్జంకికి తరలిస్తున్నట్లు సమాచారం -
ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం
● నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు ● జిల్లాలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు ● తనిఖీ అధికారులను బెదిరిస్తున్న యాజమాన్యాలు జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఇటీవల లింగనిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ తర్వాత అబార్షన్ చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు డీఎంహెచ్‌వో ఆకస్మికంగా ఆస్పత్రి తనిఖీ చేశారు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది పేషెంట్‌ను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. ధర్మారంలోని ఓ ఆస్పత్రి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే ఫిర్యాదుతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవల తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు తేలడంతో యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. స్కానింగ్ యంత్రాన్ని సీజ్ చేశారు. గోదావరిఖనిలోని శ్రీమమత ఆస్పత్రిలో డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి సోమవారం తనిఖీలు చేశారు. అనుమతి లేనిస్కానింగ్ యంత్రాన్ని గుర్తించి సీజ్ చేశారు. అయితే, తనిఖీ కోసం ఉదయం ఆస్పత్రికి చేరుకున్న డీఎంహెచ్‌వోకు వివిధ విభాగాలను చూపించాల్సిన నిర్వాహకులు.. అటూఇటూ తిప్పుతూ కాలయాపన చేశారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. -
లింగనిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
● డీఎంహెచ్‌వో వెంకటరమణ కరీంనగర్‌టౌన్: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు గర్భంలోని పిండం ఆడ లేదా మగ అని తెలియపరచడం వంటి చర్యలకు పాల్పడితే నేరుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించి మొదటి కాన్పులు సాధారణంగా అయ్యేలా గర్భిణులు, వారి కుటుంబసభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. సిజేరియన్ డెలివరీల పర్సంటేజ్ తగ్గించి నార్మల్ డెలివరీల పర్సంటేజీ పెంచాలని తెలిపారు. వైద్యాధికారులు సనా జవేరియా, ఉమాశ్రీ, వేణు, వసంతకుమార్, రాజగోపాల్, కై క, స్వామి పాల్గొన్నారు. -
పాకిస్తాన్ జెండాను కాళ్లతో తొక్కిన మైనార్టీలు
రాయికల్: జమ్ముకశ్మీర్‌లోని పహెల్గమ్లో యాత్రికులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా మంగళవారం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మైనార్టీలు, యువజన సంఘం సభ్యులు స్థానిక పాతబస్టాండ్‌లో పాకిస్తాన్ జాతీయ జెండాను చించివేసి కాళ్లతో తొక్కారు. మైనార్టీలు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వెంటనే అంతమొందించి దేశాన్ని కాపాడాలని కోరారు. దేశంలో మైనార్టీలు, హిందువులంతా ఒక్కటేనని పిలుపునిచ్చారు. గుండెపోటుతో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మృతిజగిత్యాలరూరల్: జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన గడ్డం దశరథరెడ్డి (75) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మృతిపట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మామిడి చెట్టుపై నుంచి పడి కూలీ..జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం అంతర్గాం శివారులో మామిడికాయలు తెంపుతుండగా.. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి సీతారాం సాయక్కర్ (57) మృతిచెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బృహంపూర్ జిల్లా నవాలా గ్రామానికి చెందిన సాయక్కర్ కొన్నాళ్ల క్రితం పట్టణానికి వచ్చి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. మామిడికాయలు తెంపేందుకు కూలికి వెళ్లి చెట్టు కొమ్మ విరిగి కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి బంధువు పరిమళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్మాస్‌పూర్‌కు చెందిన ఆటోడ్రైవర్ నీరంక శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఘటన స్థలం నుంచి క్షతగాత్రుడిని 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. శంకర్ తన తల్లి ఏడాది క్రితం మృతిచెందడంతో సంవత్సరీకం చేయడానికి సరుకులు తీసుకొచ్చేందుకు వెంకటాపూర్ వెళ్తున్నాడు. అదే సమయంలో సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు వెంకటాపూర్ శివారులో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ కుడికాలు విరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెంపుడు కుక్కకు అంత్యక్రియలుమెట్పల్లిరూరల్: అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం మృతి చెందడంతో దిగులు చెందిన యజమాని అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన మెట్పల్లి మండలం బండలింగాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన కై ర రవి మూడేళ్ల క్రితం బెంగళూర్‌లో జర్మన్షేప్ శునకాన్ని రూ.16 వేలకు కొన్నాడు. దానికి లీయో అనే పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ఆది మంగళవారం ఉదయం అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. దాని మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం కోసం కోరుట్ల పశువైద్య కళాశాల వైద్యులను సంపద్రించాడు. హైదరాబాద్‌లో పోస్ట్‌మార్టం చేయిస్తే కారణం తెలుస్తుందని వారు చెప్పడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుని సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. -
లారీ పైనుంచి పడి హమాలీ మృతి
ధర్మారం(ధర్మపురి): స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీ మెడవేని రాజేశం(57) సోమవారం రాత్రి లారీ పైనుంచి పడి మరణించినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. లారీలో ధాన్యం లోడ్ చేస్తుండగా డ్రైవర్ గుర్రాల మల్లేశం నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాడు. దీంతో రాజేశం లారీ కిందపడి తీవ్రగాయాలకు గురయ్యాడు. వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం తర్వాత మంగళవారం ధర్మారంలోని రాజేశం ఇంటికి తీసుకు రాగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు. దహనసంస్కారాల కోసం రూ.20వేలు సాయం చేశారు. అదేవిధంగా మృతుడి కుటుంబానికి పరిహారం అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్షను ఫోన్లో కోరారు. అదేవిధంగా సింగిల్‌విండో ద్వారా రూ.5లక్షలు, మార్కెట్ కమిటీ ద్వారా మరో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని ఆయన కలెక్టర్‌కు విన్నవించారు. కుటుంబసభ్యులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ, నాయకులు చింతల ప్రదీప్‌రెడ్డి, దేవి జనార్దన్, ఓరం చిరంజీవి, కాసాని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
గుట్టల్లో సర్వే
గట్టుసింగారం పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం గట్టుసింగారం (సబ్బితం) గుట్టల్లో మంగళవారం పురావస్తు శాఖ అధికారులు ఎపిగ్రాఫికల్ సర్వే నిర్వహించారు. గట్టుసింగారం పరిసరాల్లోని సీతమ్మలొద్ది ప్రాంతంలో ఓ శిలపై చెక్కిన శాసనాలను ఎపిగ్రఫి డైరెక్టర్ మునిరత్నంరెడ్డి, పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. క్రీ.శ. 1వ శతాబ్దం నుంచి క్రీ.పూ. ఆరో శతాబ్దం వరకు ఉన్న ఈ శాసనాలు దక్కన్ ప్రాంతం ప్రారంభ చరిత్ర, సాంస్కృతిక పరిమాణం తదితర అంశాల గురించి తెలియజేస్తాయని వారు అన్నారు. ఇందుకు సంబంధించి 11 శాసనాలకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ శాసనాల్లో కొన్ని శాతవాహన కాలం నాటివిగా తెలుస్తున్నాయని వివరించారు. శాతవాహన రాజవంశానికి చెందిన కుమార ఆకుసిరి శాసనాలు తొలిసారిగా గుర్తించినట్లు తెలిపారు. రాక్‌ఆర్ట్ పెయింటింగ్ స్పెషలిస్ట్ బీఎం రెడ్డి, ఫారెస్టు రేంజర్ నాయక్, ఫొటో జర్నలిస్ట్ రవీందర్‌రెడ్డి ఉన్నారు. ● ఆధారాలు సేకరించిన పురావస్తు శాఖ -
అమ్మమ్మ, తాతయ్యకు బాలుడి అప్పగింత
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాకేంద్రంలోని తులసీనగర్‌కు చెందిన రమ అనే మహిళ తన నాలుగేళ్ల కుమారుడిని విచక్షణారహితంగా దాడిచేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. సఖీ కేంద్రం నిర్వాహకులు బాలుడిని చేరదీశారు. రమకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆమెకు మతిస్థిమితం సరిగా ఉండటం లేదని, గతంలో కూడా మానసిక వైద్యులకు చూపించుకుందని విచారణలో వెల్లడైంది. దీంతో బాలుడిని రాయికల్‌కు చెందిన అమ్మమ్మ, తాతయ్యకు అప్పగించారు. తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చిన సఖీ కేంద్రం నిర్వాహకులు -
డీఎంహెచ్‌వోను బెదిరించిన వారిపై చర్య తీసుకోవాలి
పెద్దపల్లిరూరల్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా చంపేస్తామంటూ బెదిరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, జిల్లా వైద్య ఉద్యోగులు, జేసీ నాయకులు కోరారు. ఈమేరకు మంగళవారం కలెక్టర్ శ్రీహర్షను కలిసి వినతిపత్రం అందించారు. విధుల్లో భాగంగా గోదావరిఖనిలోని శ్రీమమత హాస్పిటల్లో తనిఖీలు చేస్తే అనుమతి తీసుకోకుండానే స్కానింగ్ చేస్తున్నట్లు గుర్తించిన డీఎంహెచ్‌వో.. మిషన్ సీజ్ చేసి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారని తెలిపారు. అయితే, తమ బండారం బయటపడుతుందనే భయంతో ఆస్పత్రి రిసెప్షనిస్ట్ ఆనంద్‌తో డీఎంహెచ్‌వోపై తప్పుడు కేసు నమోదు చేయించారని పేర్కొన్నారు. తన విధులకు ఆటంకం కలిగించి, చంపుతామని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్ నాగిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, స్వాతిని సస్పెండ్ చేయాలని, మరో వైద్యుడు అనిల్‌కుమార్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని బోర్డుకు సిఫారసు చేయాలని, మహంకాళి స్వామి, ఆనంద్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డాక్టర్ వాణిశ్రీ, శ్రీరాములు, కిరణ్‌కుమార్, శ్రీనివాస్, ఉమామహేశ్వర్, దేవీసింగ్, రమేశ్, రాజేశ్, సాలమ్మ, దయామణి తదితరులు ఉన్నారు. కలెక్టర్‌కు టీఎన్జీవో వినతి -
సీఐలు పోలీస్స్టేషన్లను సందర్శించాలి
కరీంనగర్‌క్రైం: సీఐలు తమ పరిధిలోని పోలీస్స్టేషన్లను తరచూ సందర్శిస్తూ సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నెలవారీ నేరసమీక్ష నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను సరైన పద్ధతిలో అమలు చేయాలని ఆదేశించారు. డివిజన్ల వారీగా ఏసీపీలు సమీక్షలు నిర్వహించాలన్నారు. రికార్డు నిర్వహణ, రిసెప్షన్, కోర్టుడ్యూటీ, డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, పాయింట్బుక్ల ఏర్పాటు, సమన్ల జారీ వంటి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అడిషనల్ డీసీపీ ఎ.లక్ష్మీనారాయణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, ట్రైనీ ఐపీఎస్ వసుంధర, అడిషనల్ ఎస్పీ నరేందర్, ఏసీపీలు వెంకటస్వామి, శ్రీనివాస్, యాదగిరిస్వామి, శ్రీనివాస్, మాధవి, వేణుగోపాల్, కాశయ్య, సీఐలు పాల్గొన్నారు.● సీపీ గౌస్ ఆలం -
మామిడి మార్కెట్లో మాయాజాలం
● వ్యాపారులదే రాజ్యం.. నామమాత్రమైన అధికారులు ● దోపిడీపై మార్కెటింగ్ శాఖకు ఫిర్యాదులుజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల(చల్గల్) మామిడి మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. మార్కెట్‌కు మామిడి కాయలు తెచ్చే రైతులు, లీజుదారులను అడుగడుగునా దోచుకుంటున్నారు. ధర విషయంలో రైతులు అన్యాయానికి గురువుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మామిడి మార్కెట్లో జరుగుతున్న దోపిడీ గురించి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. మార్కెట్లో దోపిడీ మాత్రం ఆగడం లేదు. కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం రాత్రి మామిడి మార్కెట్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. నోటీసులిచ్చినా అంతంతే.. మామిడి మార్కెట్లో మార్కెట్ నిబంధనల మేరకు ఓపెన్ యాక్షన్ పెట్టాలని వ్యాపారులకు నోటీసులిచ్చినా స్పందన శూన్యం. ప్రస్తుతం ఒక్కరిద్దరు వ్యాపారులు ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేస్తుండగా.. చాలామంది వ్యాపారులు కమీషన్ పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు. ఓవైపు రైతులకు సరైన ధర రాక, మరోవైపు మార్కెట్‌కు సరైన ఆదాయం లేక రెంటికి చెడ్డ రేవడిలా మామిడి మార్కెట్ మారింది. వ్యాపారులు ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. లోకల్ మార్కెట్‌గా.. చల్గల్లోని రూ.కోట్ల విలువైన వాలంతరీ స్థలాన్ని మామిడి మార్కెట్‌కు కేటాయిస్తే రోజురోజుకు అభివృద్ధి చెంది ఉత్తర తెలంగాణకు ప్రతిష్టాత్మకంగా మారాల్సింది పోయి.. చివరకు లోకల్ మార్కెట్‌గా మారి ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మామిడి మార్కెట్లో ఓపెన్ మార్కెట్ నిర్వహిస్తే.. ఢిల్లీ, నాగ్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి బడా వ్యాపారులతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులు వస్తారని, తద్వారా వ్యాపారుల్లో పోటీతత్వం పెరిగి ధర పెరుగుతుందని రైతులు ఆశ పడ్డారు. కాని చాలామంది లోకల్ వ్యాపారులు ఓపెన్ మార్కెట్‌ను వ్యతిరేకిస్తున్నారు. లోకల్ వ్యాపారులు రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి కిలోకు రూ.2–5 కమీషన్‌పై ఢిల్లీ, నాగ్‌పూర్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ వ్యాపారులతో ఏదో ఓ ధర మాట్లాడుకొని లోకల్ వ్యాపారులు కాయను నేరుగా పంపిస్తున్నారు. కటింగ్ల పేరిట దోపిడీ వ్యాపారులు ఆ కటింగ్, ఈ కటింగ్ అంటూ రైతులను దోపిడీ చేస్తున్నారు. కాయకు ధర నిర్ణయించిన తర్వాత ప్రైవేట్ ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేసి వ్యాపారికి సంబంధించిన షెడ్లో కాయలు పోయమంటారు. తూకం వేయించిన కాగితం వెనక వైపునే లెక్కలు వేసి ఇచ్చి డబ్బుల కోసం తర్వాత రమ్మంటారు. కటింగ్ల పేరిట వ్యాపారులు రెండు పద్ధతులు అవలంబిస్తున్నారు. మొదటి పద్ధతిలో మార్కెట్ ధరకు రూ.3–4 తగ్గించి టన్నుకు క్వింటాల్ కాయలను తరుగు పేరిట తీసేస్తున్నారు. రెండో పద్ధతిలో రాటన్ పేరిట రైతులు తీసుకొచ్చిన కాయలను గ్రేడింగ్ చేసి చిన్న కాయ అంటూ సగానికి సగం ఏరేస్తున్నారు. సగం కాయలకు మంచి ధర, మరో సగం కాయలకు రూ.7–8 ధర నిర్ణయిస్తున్నారు. సూట్ పేరిట టన్నుకు 50 కిలోలు తీసేస్తున్నారు. ఇక కమీషన్ పేరిట 4 శాతం కటింగ్.. ఇలా ఎంత వీలైంతే అంతమేరకు దోచుకునే పనిలో వ్యాపారులున్నారు. రైతులతో ఆడుకుంటున్న వ్యాపారులు కోర్రీలు పెడుతూ మామిడి రైతులతో వ్యాపారులు ఆడుకుంటున్నారు. కమీషన్ పద్ధతిలో కొనుగోలు చేస్తుండటంతో.. రైతులు కాయలు తెంపే ముందు ఒకటి, రెండు రోజుల ముందు నాలుగైదు శాంపిల్ కాయలను తీసుకొచ్చి వ్యాపారులకు చూపిస్తారు. ఓ ధర చెప్పి మార్కెట్‌కు రెండు రోజుల తర్వాత తీసుకరమ్మంటారు. చివరకు రైతులు కాయలను మార్కెట్‌కు తీసుకొచ్చిన తర్వాత కాయలు నాణ్యతగా లేవు.. మాట్లాడుకున్న ధర ఇవ్వం.. మరో ధర ఇస్తామంటూ పేచీలు పెడుతున్నారు. కాయలు చెడిపోతాయనే ఉద్దేశంతో గత్యంతరం లేక ఏదో ఓ ధరకు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధర తగ్గిస్తున్న వ్యాపారులు ప్రస్తుతం కొంతమేర మామిడి కాయలు మార్కెట్‌కు వస్తుండటంతో ధర తగ్గిస్తున్నారు. ప్రస్తుతం బెంగినపల్లికి ధర కిలో రూ.25–55, దశేరి రకం కిలో రూ.53–70, హిమాయత్ రకం రూ.80–110 వరకు పలుకుతోంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. మామిడి కాయ అంతంతమాత్రంగానే మార్కెట్కొస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌కు 1,500–2,000 క్వింటాళ్ల వరకే వచ్చింది. పట్టించుకోవడం లేదు ఉత్తర తెలంగాణలో మామిడి మార్కెట్‌గా ప్రసిద్ధి గాంచిన చల్గల్ మామిడి మార్కెట్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ధరలు, కటింగ్ల విషయంలో వ్యాపారుల ఇష్టారాజ్యమే నడుస్తోంది. రైతులను పట్టించుకోవడమే మానేశారు. వ్యాపారుల దోపిడీతో తోటలను ఏదో ఓ ధరకు లీజుకివ్వాల్సిన పరిస్థితి దాపురించింది. – నక్కల తిరుపతిరెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లిపరిస్థితులను చక్కదిద్దుతున్నాం మామిడి మార్కెట్ పరిస్థితులను చక్కదిద్దుతున్నాం. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం. ఓపెన్ మార్కెట్‌ను పెద్దఎత్తున నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఓపెన్ మార్కెట్ నిర్వహించిన వ్యాపారులకు నోటీసులిచ్చాం. – రాజశేఖర్, మార్కెట్ కార్యదర్శి, జగిత్యాల -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
కమాన్‌పూర్(మంథని): కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామం రాజేంద్రనగర్ శివారులో సోమవారం మధ్యాహ్నం గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామానికి చెందిన సవలం మల్లేశ్ చింతూరు ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన అలక సందీప్, మద్దెల హరీశ్‌కు అందజేశాడు. ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై గంజాయిని గోదావరిఖని ప్రాంతానికి తరలిస్తుండగా, పక్కా సమాచారంతో కమాన్‌పూర్ ఎస్సై ప్రసాద్ సిబ్బందితో దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు కిలోల గంజాయి, ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకున్న ఎస్సై ప్రసాద్, సిబ్బందిని ఏసీపీ, గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాదరావు అభినందించారు. -
మారుమోగిన శివనామస్మరణ
వేములవాడ: ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు రాజన్న దర్శనానికి తరలివస్తున్నారు. సోమవారం 50వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీని గమనించిన ఆలయ అధికారులు క్యూలైన్లను కట్టడి చేశారు. భక్తుల ద్వారా రూ.55లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శంకర జయంతి వేడుకలు ప్రారంభం రాజన్న సన్నిధిలో ఐదు రోజులపాటు జరిగే శంకర జయంతి వేడుకలు సోమవారం అద్దాల మంటపంలో ఇన్చార్జి స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ ఆధ్వర్యంలో ఆరంభమయ్యాయి. స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. శంకరాచార్య సహస్ర నామ పారాయణం, శివగీత–శివసహస్ర నామ పారాయణం జరిపించారు.● దర్శించుకున్న 50 వేల మంది భక్తులు -
భర్తను సరిగా చూసుకోలేకపోతున్నానని..
● మానేరుడ్యాంలో దూకి వృద్ధురాలి ఆత్మహత్యతిమ్మాపూర్(మానకొండూర్): అనారోగ్యంతో మంచం పట్టిన భర్తకు సేవ చేయలేనని, తాను కూడా అనారోగ్యానికి గురవుతున్నానని మనస్తాపం చెందిన భార్య మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎల్ఎండీ పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా గుగ్గిళ్లకు చెందిన నర్సమ్మ(60) భర్తకు గుండెపోటు రావడంతో మంచానికే పరిమితం అయ్యాడు. కొడుకులు ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. భర్తతో పాటు నర్సమ్మ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. తన భర్తను సమర్థవంతంగా చూసుకోలేకపోతున్నానని మనస్తాపానికి గురైంది. కొడుకులు సైతం దూరంగా ఉండడంతో ఆమె మానసిక ఒత్తిడిని మరింత పెంచింది. ఏప్రిల్ 27న సాయంత్రం 4 గంటల సమయంలో నర్సమ్మ శ్రీకరీంనగర్ వెళ్లి వస్తాన్ఙు అని భర్తకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇల్లు చేరలేదు. దీంతో ఆందోళన చెందిన భర్త కొడుకులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. సోమవారం మానేరు డ్యాంలో ఆమె మృతదేహం తేలింది. మృతురాలి చిన్న కొడుకు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదుతో ఎల్ఎండీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం సోమన్పల్లికి చెందిన రైతు కొరండ్ల సంతోష్‌రెడ్డి (35) అప్పుల బాధతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కథనం ప్రకారం.. సంతోష్‌రెడ్డికి మూడెకరాల భూమి ఉంది. అనారోగ్యం, ఇతర సమస్యలతో అప్పులు పెరిగాయి. అతనికున్న భూమిలో రెండెకరాలు విక్రయించి అప్పు చెల్లించినా తీరకపోవడంతో మనస్తాపానికి గురై ఆదివారం క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. సంతోష్‌రెడ్డికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మనోవేదనతో వృద్ధుడు..గోదావరిఖని(రామగుండం): స్థానిక విఠల్‌నగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు జంగ మల్లయ్య(80) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. మల్లయ్య భార్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటినుంచి మల్లయ్య పిల్లల వద్దకు వెళ్లకుండా ఇంట్లో ఒక్కడే ఉంటూ మానసికంగా బాధపడేవాడు. ఈక్రమంలో తీవ్ర మనో వేధనకు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికరీంనగర్క్రైం: నగరంలోని కోతిరాంపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామానికి చెందిన తిప్పర్తి రాజమౌళి కుమారుడు హరికృష్ణ(38) కరీంనగర్‌లోని లక్ష్మినగర్‌లో నివాసం ఉంటూ గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తున్నాడు. హరికృష్ణ, మరోవ్యక్తి పరిపూర్ణచారి కలిసి బైక్‌పై కోతిరాంపూర్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఢీ కొట్టింది. హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. పరిపూర్ణచారికి తీవ్రగాయాలయ్యాయి. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ఢీకొని ఒకరు..మల్యాల: లారీ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన మల్యాల మండలం రాజారాం శివారులో చోటుచేసుకుంది. ఇదే ఘటనలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన అల్లెపు బాలయ్య, శారద కుమారుడు అల్లెపు నరేశ్(18) జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. సోమవారం తన బంధువు బోదాసు రాజ్‌కుమార్‌తో కలిసి జగిత్యాల వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వస్తుండగా రాజారం శివారుకు రాగానే జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ సంఘటనలో యువకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాఽధితులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నరేశ్ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రాజ్‌కుమార్ చికిత్స పొందుతున్నాడు. నరేశ్ బంధువుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. ద్విచక్రవాహనం పైనుంచి పడి మహిళ..మెట్‌పల్లిరూరల్: ద్విచక్రవాహనంపై నుంచి కింద పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన మెట్పల్లి మండలం జగ్గాసాగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల లస్మవ్వ (44) భర్త నర్సయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తోంది. గ్రామ శివారులోకి చేరగానే ద్విచక్రవాహనంపై కింద పడిపోయింది. గాయపడిన లస్మవ్వను చికిత్స నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లస్మవ్వకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రూ.50లక్షలతో బోర్డు తిప్పేసిన వ్యాపారి?తంగళ్లపల్లి(సిరిసిల్ల): నమ్మిన వారిని మోసం చేసి రూ.50 లక్షలతో బోర్డు తిప్పేసిన వ్యాపారి ఉదంతం తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యాపారి ప్రధాన రహదారి పక్కన షెట్టర్ అద్దెకు తీసుకుని కొన్నేళ్లుగా బట్టలు, పండ్లు, కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండి పద్మనగర్‌లో సొంతిల్లు ఉంది. అదే అదునుగా అందినకాడికి అప్పులుచేసి రాత్రికి రాత్రే బిచాన ఎత్తేశాడని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు సుమారు రూ.50లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలిసింది. కానీ ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం శోచనీయం. ఈ ఘటనపై తంగళ్లపల్లి ఎస్సై బి.రామ్మోహన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
వేములవాడలో ఆధునిక అన్నదాన సత్రం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు నిరంతరం అన్నదానం అందించేందుకు రూ.35కోట్లతో అన్నదాన సత్రాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శృంగేరి పర్యటనలో ఉన్న అధికా రుల బృందం అక్కడి కొల్లూరు మూకాంబిక అమ్మవారిని సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని నిత్యాన్నదాన సత్రాన్ని పరిశీలించారు. వేములవాడలో అత్యాధునిక పద్ధతుల్లో అన్నదాన సత్రం నిర్మించేందుకు టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, అర్చకులు చంద్రగిరి శరత్‌శర్మ, సురేష్‌శర్మ, ఏఈ రాంకిషన్‌రావు తదితరులు ఉన్నారు. జాతీయపోటీలకు ఎంపికకరీంనగర్స్పోర్ట్స్: హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జ రిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ స్కేటింగ్ పోటీల్లో పా ల్గొన్న జిల్లాకు చెందిన శ్రీహాన్సి రెండు బంగారు పతకాలు సాధించి, ఈనెల 30నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. శ్రీహన్సిని జిల్లా విద్యాధికారి సీహెచ్ జనార్దన్‌రావు సోమవారం అభినందించారు. జాతీయ పోటీల్లో రాణించి బంగారు పతకం సాధించాలని సూచించారు. సెక్టోరియల్ అధికారి కర్ర అశోక్‌రెడ్డి, కోచ్ నరహరి పాల్గొన్నారు. -
‘తోట’ సిగలో ‘యుధ్వీర్’ అవార్డు
బోయినపల్లి(చొప్పదండి): అంతర్జాతీయ చిత్ర కళాకారుడు తోట వైకుంఠం మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతున్నారు. తాజాగా 32వ యుద్వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకు ఎంపికయ్యారు. చిత్రకళలో చేసిన సేవలకు అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ వారు తెలిపారు. ఈనెల 30న హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా అవార్డు, రూ.లక్షల నగదు బహుమతి అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 1942లో బూర్గుపల్లి గ్రామంలో జన్మించిన తోట వైకుంఠం చిత్రకారుడిగా అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ చిత్రకళా రంగంలో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి జిల్లా గర్వించదగ్గ వ్యక్తిగా నిలిచారు. సెప్టెంబర్ 2023లో ముంబై కేంద్రంగా పని చేసే అస్తాగురు అక్షన్ హౌస్ మోడరన్ ట్రేజర్స్ వేలం పాటలో తోట వైకుంఠం గీసిన కళాఖండానికి సుమారు రూ.కోటిన్నర ధర పలికింది. అపుడు వేలం పాటలో ఆయన గీసిన ఏడేళ్ల నాటి చిత్రం ఏకంగా రూ.1,41,35,220 ధర పలికింది. యాక్రిలిక్–ఆన్–కాన్వస్ వర్క్ ఆయన అత్యున్నత చిత్రకళా నైపుణ్యానికి నగదు ప్రోత్సాహం అందింది. చిన్నతనం నుంచే చిత్రకారుడు కావాలన్న బలీయమైన కోరిక ఆయనను గొప్ప చిత్రకారుడిగా తీర్చిదిద్దింది. సంప్రదాయ దుస్తులు, రంగుల చీరలతో ఉన్న ఆయన గీసిన మహిళల చిత్రాలు చూస్తే.. మహిళల చర్మ సౌందర్యం ప్రతిబింబిస్తుంది. డ్రెస్సింగ్‌తో మగవారి చిత్రాలు, డస్కీ స్కిన్‌తో మహిళల చిత్రాలు గీయడం వైకుంఠం ప్రత్యేకత. అమ్మ వంట గది వస్తువులతో.. చిత్రకారుడిగా గుర్తింపు పొందడానికి అమ్మ, తెలంగాణ మహిళలే స్ఫూర్తని వైకుంఠం అన్నారు. అమ్మ వంట గదిలో ఉండే వస్తువులన్నీ తన చిత్రకళకు ఉపయోగపడ్డాయని చెప్పారు. రాముడు, కృష్ణుడు, రావణుడు, హనుమంతుడు, సీత, సత్యభామ లాంటి వేషాలకు తానే మేకప్ వేసి రంగులు దిద్దేవాడిన న్నారు. బూర్గుపల్లిలో విద్యాభ్యాసం బూర్గుపల్లిలో పోశెట్టి సారు దగ్గర అమ్మ అక్షరాలు నేర్పించింది. బోయినపల్లి, శాత్రాజ్పల్లి, వేములవాడ, సిరిసిల్లలో చదివి చివరకు హైదరాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చిత్రలేఖనం నేర్చుకున్నారు. మహారాజ సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో కేజీ సుబ్రమణియన్ దగ్గర శిష్యరికం చేశారు. చిత్రాల తోట.. వైకుంఠం గీసిన చిత్రాలు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ప్రదర్శింపబడ్డాయి. ఆయన గీసిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చిత్రాలు కొనుగోలు చేయడానికి పోటీ పడతారు. అనేక అవార్డులు.. భోపాల్ రాష్ట్రంలో రెండేళ్లకోసారి ఇచ్చే భారత్‌భవన్ అవార్డుతోపాటు భారత ప్రభుత్వం ఓసారి జాతీ య అవార్డు, ఉమ్మడి రాష్ట్రంలో హంస అవార్డు ఇచ్చి ఆయనను సత్కరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ చిత్ర కళాకారుడి అవార్డు లభించింది. ఆయన దాసి, మాభూమి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేయగా.. దాసి చిత్రానికి ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు రావడం మరచిపోలేని అను భూతిగా ఆయన పేర్కొంటారు. రంగుల్లో ఎర్ర, ఆకుపచ్చ, నీలం రంగులు తనకు ఇష్టంగా పేర్కొంటారు. రంగులు కలిపి చిత్రాలు గీయడం ఆయనకు ఇష్టముండదు. వైకుంఠంపై పలువురు డాక్యుమెంటరీ చిత్రాలు తీశారు. బూర్గుపల్లిలో పాఠశాల అభివృద్ధికి గతంలో విరాళాలందించారు. ఎన్నో అవార్డులు.. మరెన్నో రివార్డులు గతంలో వేలం పాటలో రూ.కోటికి పైగా పలికిన చిత్రం తెలంగాణకే తలమానికం.. మన బూర్గుపల్లి వైకుంఠం -
హత్యకేసు భయంతో వ్యక్తి బలవన్మరణం
పాలకుర్తి(రామగుండం): వివాహిత హత్య ఘటనలో నిందితుడిగా కేసు నమోదైన నేపథ్యంలో ఓ వ్యక్తి భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై స్వామి తెలిపిన వివరాలు.. మంథని మండలం లక్కెపూర్ గ్రామానికి చెందిన పండుగ మొగిలి(45) గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా మొగిలి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితతో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఈ విషయమై కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. ఈక్రమంలో ఈనెల 25న సదరు వివాహిత లక్కేపూర్‌లో హత్యకు గురైంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు మొగిలిపై మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు మొగిలి మంచిర్యాలలోని తన అన్నకూతురు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని ఆమెకు తెలిపి పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. సోమవారం పాలకుర్తి మండలం కొత్తపల్లి శివారులోని మామిడితోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమచారమిచ్చారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నాణ్యతలో తిరుగులేని భారతి సిమెంట్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సిమెంట్ వ్యాపారరంగంలో తిరుగులేని ఏకై క సంస్థగా భారతి సిమెంట్ నాణ్యత, మన్నికలో వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజినీర్ సాగర్‌రెడ్డి అన్నారు. భారతి సిమెంట్ నేతృత్వంలో సోమవారం మండలకేంద్రంలో తాపీమేసీ్త్రలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సాగర్‌రెడ్డి మాట్లాడుతూ, భారతి సిమెంట్ వేరే సిమెంట్ కన్నా మూడురెట్లు మెరుగైనదని బిల్డర్స్, వినియోగదారులు, తాపీమేసీ్త్రలు చెప్పడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం, సలహాలు అందజేస్తూ ప్రత్యక్ష సంబంధాలు ఏర్పాటు చేసుకుందని వివరించారు. అనంతరం 50 మంది తాపీమేసీ్త్రలకు రూ.లక్ష ఉచిత ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక డీలర్ కానుగంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సభ సక్సెస్.. మంత్రుల్లో భయం
● సమ్మక్క జాతరను తలపించిన రజతోత్సవం ● బీఆర్ఎస్, కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు ● మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్కరీంనగర్: బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ మంత్రుల్లో భయం పట్టుకుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం కమలాకర్ నివాసంలో మాట్లాడుతూ.. రజతోత్సవ సభను చూసి ప్రభుత్వం ఉలిక్కిపాటుకు గురైందన్నారు. ప్రైవే టు పాఠశాలల యజమాన్యానికి ఆర్టీఏ ద్వారా మెసేజ్‌లు పంపి, సభకు బస్సులు పంపకుండా ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి భయపడకుండా బస్సులు పంపారని కృతజ్ఞతలు తెలిపా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పొంగులేటి వైఎస్సార్సీపీలో ఉన్నారని, సీతక్క టీడీపీలో ఉన్నారని గుర్తుచేశారు. హామీలు నెరవేర్చటంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై చేసిన పోరాటంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రజతోత్సవ వేడుకలకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, రుద్రరాజు పాల్గొన్నారు. -
బైపాస్ పనులకు బ్రేక్!
● పెద్దపల్లి రైల్వే బైపాస్ లైన్లో అనూహ్య మలుపు! ● తొలుత మే నెలాఖరుకు ప్రారంభిస్తారని ప్రచారం ● పనులు జరుగుతున్న తీరుపై అధికారుల అసంతృప్తి? ● పూర్తి అయ్యేందుకు మరింత సమయం ● ఐఆర్సీటీసీలో కానరాని కరీంనగర్– తిరుపతి రైలు ● నిజామాబాద్ వరకు పొడిగింపుపై ఉత్కంఠసాక్షిప్రతినిధి,కరీంనగర్: జగిత్యాల– పెద్దపల్లి సెక్షన్‌లోని బైపాస్ రైల్వేలైన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇటీవల పనులు వేగంగా సాగాయి. కానీ.. అకస్మాత్తుగా పెద్దపల్లి బైపాస్‌లో పనులు నిలిచిపోయాయని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి బైపాస్ పనులు నిబంధనల మేరకు జరగడం లేదని, పనుల్లో నాణ్యతపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నారని, తదుపరి ఆదేశాలు వచ్చేసరికి పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వచ్చే నెలాఖరును ప్రారంభం కావాల్సిన రైల్వేలైన్ మరికాస్త ఆలస్యం కానుందని సమాచా రం. వాస్తవానికి మార్చి ఆఖరునాటికి బైపాస్ పనులు పూర్తయ్యాయని ప్రచారం జరిగింది. మార్చి 28 నుంచి ఇంటర్‌లాకింగ్ పనులు మొదలవుతాయని, ఉగాది కల్లా పనులు పూర్తవుతాయని, ఉన్నతాధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాక.. మే నెలాఖరునాటికి బైపాస్ లైన్‌ను అందుబాటులోకి తీసుకువస్తారని అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా ఇటీవల ఇంటర్‌లాకింగ్ పను ల పరిశీలనకు వచ్చిన రైల్వే ఉన్నతాధికారులు పనులు నిబంధనల ప్రకారం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. మొత్తం 1.78 కిమీ పొడవున్న రైల్వేలైన్‌లో 500 మీటర్ల వరకు కొన్ని మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో బైపాస్ రైల్వేలైన్ ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. జూన్ నుంచి కానరాని కరీంనగర్– తిరుపతి రైలు కరీంనగర్ నుంచి పెద్దపల్లి మీదుగా తిరుపతివెళ్లే కరీంనగర్– తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మొన్నటి వరకు మే 29 తేదీ నుంచి పెద్దపల్లిలో ఆగకుండా నేరుగా బైపాస్ మీదుగా వెళ్తుందని ప్రచారం జరిగింది. దీన్ని బలపరుస్తూ ఐఆర్సీటీసీ పోర్టర్‌లోనూ మే 29 తరువాత పెద్దపల్లి రైల్వేస్టేషన్ కనిపించలేదు. జూన్ 1 నుంచి కరీంనగర్–తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఐఆర్సీటీసీ పోర్టర్లో కానరావడం లేదు. దీనికి కారణాలు అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం బైవీక్లీగా ఉన్న ఈ సర్వీసు కరీంనగర్‌కు ఉదయం 8.15 గంటలకు వస్తుంది. ఆ తరువాత సాయంత్రం 7.15 గంటలకు తిరిగి తిరుపతి బయల్దేరుతుంది. ఈనేపథ్యంలో ఈ రైలును నిజామాబాద్ వరకు పొడగిస్తారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ రైలును పొడిగిస్తారా? లేదా సర్వీసును వారానికి ఐదురోజుల పెంచుతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. పెద్దపల్లి రైల్వేబైపాస్లో స్టేషన్ కట్టాల్సిందే అదే సమయంలో బైపాస్ రైల్వే లైన్ వద్ద హాల్టింగ్ లేకుండా ప్రారంభమైతే.. తాము తిరుపతి వెళ్లేందుకు అవకాశం కోల్పోతామని పెద్దపల్లిలో రైలెక్కే మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, సిర్పూర్ కాగజ్‌నగర్, చెన్నూరు, ధర్మారం, ఆసిఫాబాద్ భక్తులు ఆందోళన చెందుతున్నారు. లేకపోతే గతంలోలా తామంతా కాజీపేట వరకు ప్రయాణం చేసి పద్మావతి లాంటి రైళ్లను అందుకోవాల్సి వస్తుందని, ఇది దూరాభారంతోపాటు తమకు సమయం కూడా వృథా అవుతుందని వాపోతున్నారు. దీనికి పరిష్కారంగా పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ వద్ద రైల్వేస్టేషన్ నిర్మించి, తిరుపతి–కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘పద్మ’గ్రహీతలకు అభినందనలు
కరీంనగర్ టౌన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకున్న తెలుగు ప్రముఖులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. పద్మ విభూషణ్ అందుకున్న దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, పద్మ భూషణ్ అందుకున్న బాలకృష్ణ, పద్మశ్రీ అవార్డు అందుకున్న మాడుగుల నాగఫణి శర్మను అభినందించారు. ఇది తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం అని హర్షం వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో ఔట్పోస్టుకరీంనగర్క్రైం: కరీంనగర్ బస్టాండ్‌లో పోలీసు ఔట్ పోస్టును సోమవారం సీపీ గౌస్ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బస్టాండ్‌లో దొంగతనాల నియంత్రణకు అవుట్‌పోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపా రు. 24గంటల పాటు పోలీసుసిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. టౌన్ ఏసీపీ వెంకట స్వామి, వన్‌టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై రాజన్న, ఆర్టీసీ అధికారులు ఎస్.భూపతిరెడ్డి, విజయమాధురి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మనిషికి ఆధార్.. కమతానికి భూధార్
వీణవంక/మానకొండూర్: మనిషికి ఆధార్‌కార్డు మాదిరిగా కమతానికి భూధార్ సంఖ్య కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. భూ భారతి చట్టంతో సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. ఈ మేరకు వీణవంక మండలం చల్లూరు రైతువేదికలో భూభారతి చట్టంపై సోమవారం అవగాహన కల్పించారు. ధరణిలో పొరపాట్లను సవరించేందుకు కలెక్టర్లకు మినహా ఏ అధికారికి అవకాశం లేదని, భూ భారతితో తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు మార్పులు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం సకాలంలో తూకం వేసి మిల్లులకు పంపాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులు సరిపడా ఉన్నాయా అని సిబ్బందిని అడిగారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆర్డీవో రమేశ్‌బాబు, ఏడీఏ సుజాత, తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీధర్, ఏవో గణేశ్, రైతులు పాల్గొన్నారు. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం మానకొండూరులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు ఉండొదన్నారు. దరఖాస్తుల్లో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జాబితా సిద్ధం చేసి, ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించాలన్నారు. కమిటీ ఆమోదించిన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణానికి ముందుగా ఎంపీడీవో, ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి సంయుక్తంగా మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. అనర్హులు ఉంటే జాబితా నుంచి తొలగించాలన్నారు. తహసీల్దార్ రాజేశ్వరీ, ఎంపీడీవో వరలక్ష్మి, కార్యదర్శి రేవంత్‌రెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. భూ భారతితో సాదాబైనామాల సమస్య పరిష్కారం చల్లూరు అవగాహన సదస్సులో కలెక్టర్ పమేలా సత్పతి -
నిగ్గు తేలేనా.. పాత కథేనా?
● పత్తి కొనుగోళ్ల అవకతవకలపై సాగుతున్న విచారణ ● టీఆర్ వివరాలు ఇవ్వడానికి మల్లగుల్లాలు ● 2004– 07 అక్రమాలు అటకెక్కినట్టేనా?కరీంనగర్ అర్బన్: పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పదిమందికి పైగా మార్కెట్ కార్యదర్శులతో పాటు డీఎంవోలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. పక్షం రోజులకు పైగా గడిచినా నామమాత్రపు వివరాలతో సరిపుచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మళ్లీ విచారణ సాగుతుండగా పాత కథనే మరిపిస్తారా.. నిజాలను నిగ్గు తేలుస్తారా అనేది త్వరలోనే తేలనుంది. 2004–07 సంవత్సరాల్లో ఇదే తరహాలో అక్రమాలు జరగ్గా సీబీఐ రంగంలోకి దిగినా రాజకీయ పలుకుబడితో ఎవరిపై చర్యలు లేకపోగా విచారణ అటకెక్కిందనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని అధికారులకు మెమోలు? జిల్లాలోని మార్కెట్ అధికారులకు, కార్యదర్శులకు విజిలెన్స్ అధికారులు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్)ల జారీ లో ఎక్కడ అవకతవకలు జరిగాయో పూర్తి వివరా లు పక్షం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశా రు. సంబంధిత అధికారులు వివరాలు ఇవ్వడానికి మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. గత నెలలోనే సీసీఐ కొనుగోళ్లు నిలిపివేయడంతో సంబంధిత వెబ్సైట్ సైతం మూతపడింది. వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు, రైతుల సంఖ్య, టీఆర్ జారీ, అందుకు సంబంధించిన కొనుగోళ్ల వివరా లు, కావాలని ఒకవేళ అవకతవకలు జరిగితే ఎక్క డో చెప్పాలని స్పష్టం చేశారు. వీరు పంపిన నివేదికతోపాటు, ఇదివరకే విజిలెన్స్ అధికారులు విచారణ అంశాలను బేరీజు వేసి, అక్రమాలని తేలిన చోట, తప్పుల తడకగా వివరాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది. పుస్తకాలు ఇవ్వడంలో మీనమేషాలు టీఆర్ తాత్కాలిక పుస్తకాలు ఏవోల దగ్గరే ఉన్నాయి. మార్కెటింగ్ అధికారులకు వెంటనే తిరిగి ఇచ్చేయాల్సిన వ్యవసాయ అధికారులు ఇంకా వారి దగ్గరే ఉంచుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 200–250 టీఆర్ పుస్తకాలను మార్కెట్ అధికారులు, వ్యవసాయ అధికారులకు ఇచ్చారు. ఒక అసలు ధ్రువీకరణ పత్రం రైతుకు జారీ చేయగా, మరొకటి నకలు తీసుకుంటారు. వీటిని మార్కెట్ అధికారులకు ఇవ్వాలి. జిల్లాలో ఏడువేల టీఆర్‌లు జారీ అయినట్లు తెలుస్తోంది. అసలు ఆవినీతి అంతా ఇక్కడే జరిగింది. కరీంనగర్, జమ్మికుంట, గంగాధర, చొప్పదండి, తదితర మార్కెట్లలో టీఆర్‌లు జారీ కాగా లోతుగా దర్యాప్తు సాగాల్సిన అవసరముంది. పాత కథేనా.. తేలుస్తారా..! ఉమ్మడి జిల్లా పరిధిలో 2004 నుంచి 2007 సంవత్సరాల మధ్య భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు తెరచి పెద్ద మొత్తంలో పత్తి కొనుగోలు చేసింది. రైతులు మార్కెట్‌కు వెళ్లినప్పుడు ధరలు పెట్టకుండా.. నానా రకాల కొర్రీలతో కొనుగోళ్లు చేయని సీసీఐ ఏటా చివరలో రైతుల నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు ప్రకటనలు చేసింది. దీనిపై రైతులు, రైతు సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు చేశాయి. సీసీఐ కేంద్రాల నిర్వాహకులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఒకటై దోపిడీక పాల్పడ్డారని ఆరోపించాయి. దిగివచ్చిన ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం విజిలెన్స్, సీబీసీఐడి విచారణకు ఆదేశించింది. విచారణ నామమాత్రంగా సాగుతుండడం. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులకు అనుకూలంగా విజిలెన్స్, సీబీసీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రహించిన కురుక్షేత్ర అనే స్వచ్ఛంద సంస్థ, రైతు సాధికారక సంస్థ సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టును ఆశ్రయించాయి. ఫలితంగా సీబీఐ ఆధికారులు రంగంలోకి దిగారు, ఆ మూడేళ్లలో సీసీఐ తెరిచిన కేంద్రాలు.. కొనుగోలు చేసిన పత్తి పరిమాణం.. ఏ కేంద్రాల్లో.. ఏఏ రైతుల నుంచి ఎంత మొత్తం కొనుగోలు చేశారు. ధరలు ఏ విధదంగా పెట్టారనే దానిపై దర్యాప్త ప్రారంభించారు. దర్యాప్తు తీరు చూసి న్యాయం జరుగుతుందని.. అక్రమాలు బట్టబయలవుతాయని అంతా ఆశించారు. కానీ దశాబ్దాలు గడిచినా విచారణ నామమాత్రమే. అక్రమాల్లో భాగస్వాములైనవారు ఉన్నత హోదాల్లో ఉండటం గమనార్హం. -
యువ వికాసం అర్జీలు వేగంగా పరిశీలించండి
కరీంనగర్ అర్బన్: రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల ప్రత్యేక అధి కారులు, ఎంపీడీవోలు, బ్యాంకర్లతో సమావే శం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లాలో 57,763 దరఖాస్తులు వచ్చాయని తెలి పారు. దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ప్రత్యేక అధికారులు దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కోటాలో నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు ఇదివరకే పంపించామని తెలిపారు. బ్యాంకుల నుండి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి కరీంనగర్ కార్పొరేషన్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. కళాభారతిలో జరుగుతున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీ లన ప్రక్రియను సోమవారం పరిశీలించారు. నగర వ్యాప్తంగా దాదాపు 15 వేల మంది దరఖాస్తు చేసుకొన్నారని, దరఖాస్తులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారీగా పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. 15 రోజుల్లో రైల్వేస్టేషన్ ప్రారంభం కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ రమేశ్‌రెడ్డి శనివా రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరికొత్త హంగులతో కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుని ప్రారంభోత్సవాని కి సిద్ధమవుతోందని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద రూ.26.64కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం చేపట్టిన స్టేషన్ రెనోవేషన్ పనులు చివరి దశకు చేరాయని తెలిపారు. రెండు వారాల్లో పనులు పూర్తిచేసి, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సం జరిపిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, స్టేషన్ మేనేజర్ ఉన్నారు. బాధిత మహిళలకు సత్వరమే సఖి సేవలు కరీంనగర్: మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ పరిధిలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ సఖి కేంద్రాన్ని ఆశ్రయించిన బాధిత మహిళలకు సత్వరమే సేవలు అందించాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపా రు. సప్తగిరికాలనీలోని సఖి కేంద్రంలో సోమ వారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం, శక్తి సదన్, సఖి కోఆర్డినేటర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీడబ్ల్యూవో సరస్వతి మాట్లాడుతూ.. బాధిత మహిళలు సఖి కేంద్రాన్ని ఆశ్రయించినప్పుడు ఉచిత న్యాయ, వైద్య, ఆశ్రయ, పోలీసుసేవలను సత్వరమే అందించాలన్నారు. అంగన్వాడీ, వైద్య సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సఖి అడ్మిన్ లక్ష్మి, డిహెచ్ఈడబ్ల్యూ కో– ఆర్డినేటర్ శ్రీలత పాల్గొన్నారు. -
నాగంపేటలో దొంగల హల్చల్
గంభీరావుపేట(సిరిసిల్ల): నాగంపేటలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు పదిళ్లలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. నాగంపేటలో శనివారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. గురుక లక్ష్మి, పొల్తూరి అంజయ్యకు చెందిన ఇళ్లలోని బీరువాలను పగలగొట్టి 6 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. రూ.30వేల నగదు పలువురి ఇళ్ల నుంచి ఎత్తుకెళ్లారు. ల్యాప్‌టాప్, ఇతర వస్తువులను చోరీ చేశారు. సమాచారమందుకున్న ఎస్సై ప్రేమానందం విచారణ చేపట్టారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవాలయాల్లో దొంగతనం కథలాపూర్: తాండ్య్రాల గ్రామంలోని రేణుక ఎల్లమ్మ, దుర్గామాతా దేవాలయాల్లో ఆదివారం వేకువజామున దొంగతనం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. రేణుక ఎల్లమ్మ దేవాలయంలో తలుపులు ధ్వంసం చేసి వస్తువులను చిందరవందర చేశారు. దుర్గామాతా దేవాలయంలో హుండీని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఆలయాల సమీపంలో ఉన్న టేలాలను ధ్వంసం చేసి వస్తువులను ఎత్తుకెళ్లారు. రూ.20వేలు నష్టపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. సంఘటనపై వివరాలు సేకరించినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పదిర గ్రామ శివారులో ఆదివారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు చెందిన కుంచాల మధు(18).. అతడి స్నేహితుడు తన్నీరు మహేశ్‌బాబు(25)తో కలిసి ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్లకు ద్విచక్ర వాహనంపై కొత్త దుస్తులు కొనడానికి వెళ్తుండగా.. సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేటకు ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంపై నుంచి ఎగిరిపడ్డ వారు తలలు పగిలి రోడ్డుపై విగతజీవులుగా పడిపోయారు. మధు తండ్రి శివ కొంతకాలంగా స్థానికంగా మేసీ్త్రగా భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. సరిగ్గా 28 రోజుల క్రితం రంజాన్‌కు ఒక్కరోజు ముందు నారాయణపూర్‌కు చెందిన ముస్లిం యువకులు అఫ్రోజ్, అవీజ్ అనే ఇద్దరు యువకులు కొత్త దుస్తుల కోసం బైక్‌పై సిరిసిల్లకు వెళ్తూ ఇదే రోడ్డుపై కొద్ది దూరంలో ప్రమాదానికి గురై మరణించారు. ప్రమాదానికి కారణమైన కారు కామారెడ్డి జిల్లాకు చెందినది కాగా.. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రమాకాంత్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కారు ఢీకొని ఒకరు.. మెట్పల్లి: పట్టణ పరిధిలోని ఆరపేట శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దొడ్డి గంగాధర్(59) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మేడిపల్లి మండలం మాచాపూర్‌కు చెందిన గంగాధర్ పట్టణంలోని తిరుమల అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. సాయంత్రం సమయంలో ద్విచక్ర వాహనంపై ఆరపేట వైపు వెళ్తుండగా.. ఎదురుగా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ జగిలం శేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు
మేడిపల్లి: కొండాపూర్ గ్రామ శివారు పాక్స్ గోడౌన్ మలుపు వద్ద ఆదివారం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. మన్నేగూడెం గ్రామానికి చెందిన సుందరగిరి శంఖర్గౌడ్ తలకు గాయం కాగా.. రాజలింగంపేట వాసి కొండ అశోక్ ధర్మతేజ కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇరువురిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. మేడిపల్లి నుంచి దేశాయిపేట రోడ్డు ఇంతకుముందు సింగిల్ రోడ్డుగా ఉండేది. రెండు సంవత్సరాల క్రితం డబుల్ రోడ్డు కావడంతో.. ఆ రోడ్డు గుండా రవాణా పెరిగింది. వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. -
ఆదర్శం.. ఆటోలక్ష్మి
● చిన్నతనంలోనే తండ్రి.. పిల్లలు చిన్న వయసులో భర్త మృతి ● ఆటోలో ఊరూరా తిరుగుతూ కూరగాయల విక్రయం ● ఆ కుటుంబానికి ఆమె ఆధారం కోనరావుపేట(వేములవాడ): ఆ కుటుంబానికి ఆమెనే పెద్ద దిక్కు. చిన్నతనంలో తండ్రి మృతి.. పిల్లలు పుట్టాక భర్త మరణంతో ఆ కుటంబం రోడ్డున పడింది. అయితే తన పిల్లల బాధ్యతను లక్ష్మి భుజాన వేసుకుంది. ధైర్యంతో ముందడుగు వేసింది. ఆటోలో కూరగాయలు విక్రయిస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. తన పిల్లలు, కన్నతల్లిని పోషించుకుంటోన్న కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన ఎర్ర లక్ష్మిపై ప్రత్యేక కథనం. భర్త మృతితో మళ్లీ మొదటికి.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన అనుముల యాదవ్వ–మల్లయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు. చిన్న కూతురు లక్ష్మికి కరీంనగర్ సమీపంలోని గోపాలపురం గ్రామానికి చెందిన ఎర్ర అంజయ్యతో వివాహమైంది. 2013లో అంజయ్య సౌదీఅరేబియా వెళ్లి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికే కూతురు, కుమారుడు సంతానం. అత్తగారింటి వద్ద వ్యవసాయ భూమి, సరైన ఇల్లు కూడా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పుట్టినింటికి చేరింది. తండ్రి చిన్నప్పుడే మృతిచెందడం, అక్కలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడంతో ఒంటరైన తల్లి, కుమారుడు, కూతుళ్ల పోషణభారం నెత్తికెత్తుకుంది. ఐదేళ్ల క్రితం కూరగాయల వ్యాపారం మొదలుపెట్టింది. ఆటోలో ఊరూరా తిరుగుతూ.. నిమ్మపల్లిలో ప్రతి శుక్రవారం జరిగే వారసంతలో కూరగాయలు అమ్ముకుంటూ మిగతా రోజుల్లో గ్రామంలో తిరుగుతూ విక్రయించేది. వచ్చిన డబ్బులు కుటుంబపోషణకు సరిపోకపోవడం, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, కుమారునికి వైద్య ఖర్చులకు ఇబ్బంది కావడంతో రూ.60వేలు అప్పు చేసి ఓ ఆటో కొనుగోలు చేసింది. ఆటోలో కూరగాయలు విక్రయించేందుకు మరిమడ్ల, అహ్మద్హుస్సేన్పల్లి, నిజామాబాద్ జిల్లా తాటిపల్లి, సిరికొండ వరకు ఆటో వెళ్లి కూరగాయలు విక్రయిస్తోంది. వర్షం పడినా, ఎండ తీవ్రత ఎక్కువున్నా కూరగాయలు మాత్రం విక్రయిస్తూనే ఉంటుంది. కూతురు నిహారిక ప్రస్తుతం ఎనిమిదో తరగతి, కుమారుడు మణికృష్ణ ఆరో తరగతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇంట్లో మగదిక్కు లేకున్నా ధైర్యంతో ఆ కుటుంబానికి ఆధారమైంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు.. ఎలాంటి ఆధారం లేకున్నా ఆత్మశ్వాసాన్ని కోల్పోకుండా నా ఇద్దరు పిల్లల చదువు, తల్లిని పోషిస్తున్నాను. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో కొని, అందులోనే కూరగాయలు విక్రయిస్తున్నాను. నా వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం సహకారం అందించి, ఆదుకోవాలి. – ఎర్ర లక్ష్మి, నిమ్మపల్లి -
ఇదో సువర్ణావకాశం
క్రీడలంటే ఇష్టమున్నవారికి, జాతీయ, రాష్ట్రస్థాయి లాంటి పోటీల్లో పాల్గొని సత్తా చాటాలనుకునేవారికి ఈ సమ్మర్ క్యాంపులు సువర్ణావకాశం. నెల రోజులపాటు పకడ్బందీగా కోచ్‌ల పర్యవేక్షణలో జరుగుతాయి. ఉన్నతమైన ప్రమాణా లతో కూడిన శిక్షణను ఈ నెల రోజులపాటు కోచ్‌లు అందిస్తారు. – గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి సద్వినియోగం చేసుకోవాలి క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే శిబిరాలను చిన్నారులందరూ సద్వినియోగం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారు భవిష్యత్‌లో క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. శిక్షణతో మేటి క్రీడాకారులుగా ఎదిగే అవకాశముంటుంది. – వి.శ్రీనివాస్‌గౌడ్, డీవైఎస్వో, కరీంనగర్ పేరు నమోదు చేసుకోవాలి పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 10 గ్రామీణ ప్రాంతాలు, 5 అర్బన్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిబిరాలను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలి. అర్బన్ ప్రాంతాల్లో శిక్షణ తీసుకోవాలనే చిన్నారులు ముందస్తుగా క్రీడాశాఖ వెబ్సైట్లో తమ పేరును నమోదు చేసుకోవాలి. – ఎ.సురేశ్, డీవైఎస్వో, పెద్దపల్లి మంచి అవకాశం శిబిరాల్లో చిన్నారులకు మంచి శిక్షణ దొరుకుతుంది. నా ణ్యమైన ప్రమాణాలతో శిక్ష ణ కార్యక్రమాలు జరుగుతా యి. చిన్నారులకు మంచి అ వకాశం. తల్లిదండ్రులు సై తం పిల్లల ఆసక్తిని గ్రహించి శిబిరాల్లో చేర్పించాలి. సమ్మర్ క్యాంపులను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. – తుమ్మల రమేశ్‌రెడ్డి, రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు -
వడదెబ్బతో మహిళ మృతి
ధర్మారం: పత్తిపాక గ్రామానికి చెందిన చెక్కపల్లి లక్ష్మి (60) అనే మహిళ వడదెబ్బతో ఆదివారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురి కాగా.. గ్రామంలోనే చికిత్స తీసుకుందన్నారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మృతురాలికి భర్త అంజయ్యతోపాటు ముగ్గురు కుమారులున్నారు. గుర్తుతెలియని వ్యక్తి.. చొప్పదండి: జ్యోతినగర్ సమీపంలోని వేబ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. వడదెబ్బ తగలడంతో స్పృహ తప్పి పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్థానికుల సాయంతో 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని గుర్తించినవారు 8712670766 నంబర్‌కు సమాచారమందించాలని ఎస్ఐ మామిడాల సుదర్శన్ తెలిపారు. పెగడపల్లి ఎస్సై సస్పెన్షన్ జగిత్యాల క్రైమ్: పెగడపల్లి ఎస్సై రవికిరణ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదివారం మల్టిజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదు కాగా.. కేసు విచారణలో జాప్యం చేయడంతోపాటు నిర్లక్ష్యం వహించారని ఉన్నతాధికారులు నివేదిక సమర్పించారు. దీంతో రవికిరణ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫొటోలు షేర్ చేస్తామని బెదిరింపులు ● నలుగురి అరెస్ట్ బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన సందరగిరి రాకేశ్ అనే యువకుడి వ్యక్తిగత ఫొటోలు షేర్ చేస్తామని బెదిరించి అతడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ఇదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై దూలం పృథ్వీధర్‌గౌడ్ ఆదివారం తెలిపారు. ఆయన వివ రాల ప్రకారం.. సందరగిరి రాకేశ్ ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతడి మరణ వాంగ్మూలంలో రాసిన నలుగురు వ్యక్తులను పిలిచి విచారించారు. రాకేశ్ వ్యక్తిగత ఫొటోలు గూగుల్‌లో షేర్ ద్వారా నలుగురు వ్యక్తులు షేర్ చేసుకున్నారు. ఫొటోలు బయటపెడతామని బెది రించారు. తన వ్యక్తిగత ఫొటోలు బయటపెడితే పరువు పోతుందని భావించిన రాకేశ్.. మర్లపేట గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మెడలోని పుస్తెల తాడు చోరీ యైటింక్లయిన్‌కాలనీ: గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి యైటింక్లయిన్‌కాలనీ రాజీవ్‌నగర్ లంబాడితండాకు చెందిన ఇస్లావత్ బుల్లి మెడలోని పుస్తెల తాడు ఆదివారం తెల్లవారుజామున చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇస్లావత్ బుల్లి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ఆవరణలో నిద్రపోయింది. తెల్లవారుజామున నిద్ర లేచి చూసుకునేసరికి తన మెడలోని పుస్తెల తాడు కనిపించలేదు. ఇంటి చుట్టు పరిసరాల్లో వెతికినా దొరకలేదు. గుర్తుతెలియని వ్యక్తులు తన మెడ లోని రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు దొంగిలించినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ రుద్రంగి: వేసవి సెలవుల్లో బంధువుల ఇళ్లకు వెళ్లేవారు, వారి ఇళ్లో దొంగలు పడే అవకాశమున్నందున పోలీస్ సిబ్బందికి సమాచారమందించాలని ఎస్సై సిరిసిల్ల అశోక్ సూచించారు. మండల కేంద్రానికి చెందిన ఎల్ల దేవవ్వ అనే మహిళ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లొచ్చేసరికి దొంగలు పడి అర తులం బంగారం, రూ.5వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఎస్సై పరిశీలించి వివరాలు సేకరించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. 60 దేశీకోళ్లు చోరీ మల్యాల: నూకపల్లి శివారులో నాటుకోళ్ల్ల షెడ్డు లోని 60 నాటుకోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రామన్నపేటకు చెందిన నర్సయ్య అనే వ్యక్తి నూకపల్లి వరద కాలువ శివారులోని తన షెడ్డులో దేశీకోళ్లు పెంచుతున్నారు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు షెడ్డులోని 60 దేశీకోళ్లను ఎత్తుకెళ్లినట్లు ఆదివారం గుర్తించిన నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విద్యుదాఘాతంతో ఫర్నిచర్, నగదు దగ్ధం
పెగడపల్లి: నర్సింహునిపేట గ్రామానికి చెందిన ఆరెల్లి దుర్గయ్య ఇంట్లో శనివారం రాత్రి విద్యుదాఘాతం జరిగింది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, దుస్తులతోపాటు ఇతర సామగ్రి, రూ.40వేల నగదు దగ్ధమైందని బాధితుడు పేర్కొన్నాడు. ఆరై శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలడిగి తెలసుకొని పంచనామా నిర్వహించారు. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ మండల నాయకులు ఆదివారం పరామర్శించారు. రూ.10వేల నగదుతోపాటు బియ్యం, ఇతర నిత్యావసరాలు అందజేశారు. రాములుగౌడ్, సత్తిరెడ్డి, శ్రీనివాస్, సంది మల్లారెడ్డి తదితరులున్నారు. నిప్పంటుకొని హార్వెస్టర్.. మేడిపల్లి: రేడియేటర్లో వేడిమి కారణంగా ప్రమాదవశాత్తు మంటలంటుకొని భీమారం మండలం మన్నేగూడెం గ్రామానికి చెందిన పెడిమల్ల గంగాధర్ హార్వెస్టర్ ఆదివారం దగ్ధమైంది. అదే గ్రామానికి చెందిన ఓ రైతు వరిని కోస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రెవర్ చాకచక్యంగా హార్వెస్టర్‌పై నుంచి దూకడంతో ప్రాణలతో బయటపడ్డాడు. స్థానికులు ఫైరింజన్‌కు సమాచారమివ్వడంతో వచ్చి మంటలార్పారు. -
యశోదలో అరుదైన కాంప్లెక్స్ కరోనరీ స్టెంటింగ్
కరీంనగర్‌టౌన్: సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ బదులుగా అత్యంత అరుదైన కాంప్లెక్స్ కరోనరీ స్టెంటింగ్ ద్వారా మహిళకు విజయవంతంగా మూడు స్టంట్లు వేసినట్లు యశోద హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ జగదీశ్ మాదిరెడ్డి తెలిపారు. ఆదివారం నగరంలోని యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌కు చెందిన విజయ వృద్ధాప్యం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెకు గుండె సమస్య రావడంతో యశోద ఆసుపత్రికి వచ్చారన్నారు. వెంటనే అంజియోగ్రామ్ చేయగా.. మూడు వాల్వ్‌లు బ్లాకు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమెకు బైపాస్ సర్జరీ చేయడం హైరిస్క్‌తో కూడుకోవడం వల్ల అత్యాధునిక కాంప్లెక్స్ కరోనరీ స్టెంటింగ్ ద్వారా విజయవంతంగా చికిత్స అందించినట్లు తెలిపారు. దీనికోసం ఆధునిక వైద్య పరికరాలైన ఆర్బిటల్ అథెరెక్టమీ, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ(ఓసిటీ)లను ఉపయోగించినట్లు తెలిపారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో సాంకేతికత వృద్ధి చెందుతూ అనేక మందికి జీవితాలపై ఆశను కలిగిస్తోందని తెలిపారు. హైరిస్క్ కార్డియాక్ కేసుల చికిత్సలో యశోద హాస్పిటల్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి సైతం హైదరాబాద్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని, ఇక్కడ ప్రపంచస్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలకు సైతం పెద్ద శస్త్ర చికిత్సలు అవసరం లేకుండా పరిష్కరించుకునే వీలుంటుందని అన్నారు. పేషెంట్ విజయ మాట్లాడుతూ.. తనకు బైపాస్ సర్జరీ అవసరమైనా తన వయస్సును దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక చికిత్స అందించిన యశోద వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
సమ్మర్ క్యాంపుల సందడి
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ● నెల రోజులపాటు శిక్షణ శిబిరాలు ● గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా.. ● అర్బన్ ఏరియాలో పే అండ్ ప్లే.. కరీంనగర్ స్పోర్ట్స్: పాఠశాలలకు వేసవి సెలవులిచ్చారు. సమ్మర్లో చిన్నారులు ఎండలో అటూఇటూ తిరగకుండా ఉండేందుకు కొన్ని సంస్థలు, కళాసంస్థలు, సమ్మర్ క్యాంపులను నిర్వహించి వారికి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవిలో క్రీడాశిక్షణ శిబిరాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో జిల్లాకు 10 కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను మే 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నారు. కేటాయించిన కేంద్రాల్లో అక్కడి పీడీ, పీఈటీ, సీనీయర్ క్రీడాకారుడు ఇలా ఒకరు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ క్రీడలో శిబిరం జరుగుతుంది.. ఏ గ్రామంలో నిర్వహిస్తున్నారు.. కోచ్ ఎవరు తదితర విషయాలపై సాక్షి ప్రత్యేక కథనం. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా.. గ్రామీణ ప్రాంతాల్లో మెరికల్లాంటి ఎందరో క్రీడాకారులున్నారని, వారికి నాణ్యమైన శిక్షణ అందించి వెలుగులోకి తీసుకొచ్చి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనే వేసవి శిబిరాలను క్రీడాశాఖ నిర్వహించడం మొదలుపెట్టింది. గ్రామీణ క్రీడలుగా పేరొందిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్‌తోపాటు ఈసారి మరికొన్ని క్రీడలను చేర్చి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. నెల రోజుల శిక్షణ కాలానికి గౌరవ వేతనం కింద రూ.5వేలు క్రీడాశాఖ కోచ్‌లకు ఇవ్వనున్నారు. 14 సంవత్సరాల్లోపు బాలబాలికలు తర్పీదు పొందే అవకాశముంది. అర్బన్ ఏరియాలో.. జిల్లాల్లోని అర్బన్ ఏరియాలో పే అండ్ ప్లే కింద శిబిరాలను ఆయా జిల్లాల క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు క్రీడాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న కోచ్‌ల నుంచి క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్బన్ ఏరియాలో శిక్షణ తీసుకోవాలనుకునే చిన్నారులు క్రీడాశాఖ ఇచ్చిన వెబ్సైట్లో https://satgasc-te langana.gov.in దరఖాస్తులు చేసుకోవాలి. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో అర్బన్ ఏరియాలో సమ్మర్ క్యాంపులను నిర్వహించేందుకు వేదికలు ఖరారు చేయగా.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో వేదికలు ఖరారు చేసే పనిలో పడ్డారు క్రీడాశాఖ అధికారులు. కరీంనగర్ జిల్లా.. క్రీడ వేదిక(గ్రామం) కోచ్ నంబర్ వాలీబాల్ రామడుగు ఎస్.ఆశాలు 9908528205 వాలీబాల్ వెదిర కరుణాకర్‌రెడ్డి 9502760690 వాలీబాల్ చింతకుంట ఎ.శ్రీనివాస్ 9700517852 వాలీబాల్ గంగాధర ఎల్.నరేశ్ 9441700892 వాలీబాల్ మల్లారెడ్డిపల్లె కె.నర్సయ్య 9989139012 కబడ్డీ రాంపూర్ కె.రాజ్‌కుమార్ 9666563882 హ్యాండ్‌బాల్ రామడుగు ఎ.సాయికృష్ణ 7660892907 నెట్‌బాల్ నగునూర్ ఎం.అంజన్సాయి 6281774073 హాకీ ఆర్నకొండ ఎం.చంద్రశేఖర్ 9490530300 జూడో నెదునూర్ ఎ.శ్రీనివాస్ 9000190331 పెద్దపల్లి జిల్లా.. గ్రామీణ ప్రాంతాల్లో.. ఫుట్‌బాల్ అంతర్గాం టి.శోభ 9866573416 ఫుట్‌బాల్ దొంగతుర్తి ఎన్.శ్రీనివాస్ 9398295492 వాలీబాల్ నందిమేడారం ఎం.కొమురయ్య 9848130522 వాలీబాల్ జూలపల్లి కె.రాకేశ్ 8978755521 వాలీబాల్ గర్రెపల్లి బి.నవీన్ 9703399149 బాక్సింగ్ కనగర్తి జె.శ్రీవిష్ణు 8555929662 అథ్లెటిక్స్ వెన్నంపల్లి ఎ.దుర్గాప్రసాద్ 9177964751 ఖోఖో నిట్టూర్ పి.భాస్కర్ 9177992471 తైకై ్వండో తెలుకుంట ఎన్.సతీశ్‌కుమార్ 9989143163 హ్యాండ్‌బాల్ అప్పన్నపేట వి.సురేందర్ 8008816932 అర్బన్ ఏరియాలో.. ఖోఖో 8ఇంక్లయిన్‌కాలనీ పి.ఓదెలుయాదవ్ 9849484631 ఖోఖో పెద్దపల్లి ఎండీ షఫీయొద్దీన్ 9949757572 ఫుట్‌బాల్ 8ఇంక్లయిన్‌కాలనీ కె.సత్యనారాయణ 9849340610 లాన్‌టెన్నీస్ మంథని ఎస్.జగదీశ్వర్ వాలీబాల్ సుల్తానాబాద్ ఎం.శ్రావణ్ 7702360978 రాజన్న సిరిసిల్ల జిల్లా.. కబడ్డీ కోనరావుపేట బి.వేణు 9492504013 అథ్లెటిక్స్ తంగళ్లపల్లి కె.శ్రీనివాస్ 9392880231 కరాటే పెద్దలింగాపూర్ బి.బాలరాజు హ్యాండ్‌బాల్ కొత్తపల్లి బి.భాను 9885598502 వాలీబాల్ రుద్రంగి ఎ.దేవయ్య 9866824012 వాలీబాల్ బోయిన్పల్లి పి.ప్రభాకర్ 8008494801 వాలీబాల్ కొదురుపాక ఎన్.శ్రీనివాస్‌రెడ్డి 7997182244 వాలీబాల్ ఎల్లారెడ్డిపేట బి.బాపురెడ్డి 9492390821 వాలీబాల్ ముస్తాబాద్ బి.అనిల్‌గౌడ్ 9989227229 వాలీబాల్ ఇల్లంతకుంట డి.శివరాం 9985796519 జగిత్యాల జిల్లా.. వాలీబాల్ భూపతిపూర్ సీహెచ్ తిరుపతిరెడ్డి 9440922296 వాలీబాల్ వెల్గటూర్ కె.సతీశ్ 9059501017 వాలీబాల్ లక్ష్మీపూర్ కె కోటేశ్వర్రావు 9963159111 వాలీబాల్ గొల్లపల్లి టి.పవన్ 8186870870 వాలీబాల్ ఎండపల్లి బి.కొమురయ్య 9182406818 వాలీబాల్ ఊరిట్పల్లి ఎం.ప్రవీణ్ 9701710968 అథ్లెటిక్స్ తిప్పన్నపేట ఎల్.శ్రీకాంత్ 9550963101 అథ్లెటిక్స్ ఎండపల్లి బి.శివమణి 8367588646 హ్యాండ్‌బాల్ గుల్లకోట జి.సాయికుమార్ 7893472246 సాఫ్ట్‌బాల్ మల్లన్నపేట కె.శ్రీకాంత్ 7702294312 -
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి పట్టణంలోని చెరువులో ప్రమాదవశాత్తు ఒకరు పడి మృతిచెందారు. కొత్తపల్లి ఏఎస్సై బి.రాంమూర్తి వివరాల ప్రకారం.. కొత్తపల్లి పట్టణానికి చెందిన గుండ శ్రీధర్(41) పని లేక తాగుడుకు బానిసై మానసిక స్థితి బాగా లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవాడు. కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన రాధతో వివాహం జరగగా.. వారికి 11 ఏళ్ల కుమారుడున్నాడు. శ్రీధర్ తాగుడుకు బానిసై తరచూ భార్యను ఇబ్బంది పెట్టడంతో.. కొడుకుతో కలిసి మూడేళ్లుగా తల్లిగారింటి వద్ద ఉంటోంది. కొత్తపల్లిలోని తన ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం బయలుదేరిన శ్రీధర్.. శనివారం కొత్తపల్లి చెరువులో శవమై తేలాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఊపిరాడక చనిపోయినట్లు భావిస్తున్నట్లు రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. కాంక్రీట్ మిల్లర్ కింద పడి వ్యక్తి..జగిత్యాలక్రైం జగిత్యాల రూరల్‌మండలం నర్సింగాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా జలగం ఎల్లయ్య (33) అనే వ్యక్తి మిల్లర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. జనగామ జిల్లా దర్దెపల్లి గ్రామానికి చెందిన జలగం ఎల్లయ్య జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో సీసీరోడ్డు నిర్మాణ పనులకు వచ్చాడు. మిల్లర్ వాహనం డ్రైవర్ వొల్లపు రాములు అజాగ్రత్తగా నడపడంతో ఎల్లయ్యపై టైరు ఎక్కి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. నర్సింగాపూర్ చెందిన గడ్డం మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. బావిలో పడి వృద్ధురాలు..ముస్తాబాద్: మామిడి కాయల కోసం వెళ్లిన వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పోతుగల్‌కు చెందిన మ్యాకల బాల్‌లక్ష్మి(75) మామిడి కాయల కోసం ఇంటి నుంచి వెళ్లింది. గ్రామ శివారులోని బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. బాల్‌లక్ష్మి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. బావిలో బాల్‌లక్ష్మి పడ్డట్లు గుర్తించి ఆమెను బయటకు తీశారు. అప్పటికే మృతిచెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేశ్ తెలిపారు. ఇద్దరు బలవన్మరణం తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలంలో వేరువేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. చీర్లవంచ గ్రామానికి చెందిన మ్యాక కొమురయ్య(43) ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అంకుషాపూర్ గ్రామానికి చెందిన యువకుడు కాసాని వేణు(26) మూడేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. గతంలో అపెండిక్స్ కడుపులో బ్లాస్ట్ అవగా.. చికిత్స చేయించారు. పది రోజుల క్రితం మళ్లీ కడుపు నొప్పి రావడంతో భరించలేక పొలం వద్దకెళ్లి పురుగుల మందు తాగాడు. కొమురయ్య భార్య మ్యాక రేణుక, వేణు తల్లి కాసాని ఎల్లవ్వ ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్సై బి.రామ్మోహన్ తెలిపారు. -
బ్యాంకులో చోరీకి యత్నం
మానకొండూర్: శుక్రవారం అర్ధరాత్రి ఓ దొంగ కొండపల్కల గ్రామంలోని తెలంగాణ గ్రామీ ణ బ్యాంకు తాళం పగలగొట్టి చోరీకి యత్నించాడు. గ్రామ స్తుల వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఓ దొంగ టీషర్టు ధరించి బ్యాంకు ఆవరణలోకి చొరబడ్డాడు. ముందుగా బ్యాంకు షట్టర్‌ను తెరిచేందుకు ఓ తాళాన్ని పగలగొట్టాడు. మరో తాళం తీసే క్రమంలో శబ్ద కావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ బి.సంజీవ్ పరిశీలించి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రభుత్వ ఫార్మసిస్టులు.. ఇక ఫార్మసీ ఆఫీసర్స్ ● ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ ఫార్మసిస్టులను ఫార్మసీ ఆఫీసర్స్‌గా పేరు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం జీవోఎంఎస్ నం.71 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రభుత్వ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రామారావు ఒక ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, హెల్త్ సెక్రటరీ, హెల్త్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, టీవీవీపీకి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల అదుపులో గంజాయి సేవిస్తున్న వ్యక్తులు..?జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కృష్ణానగర్‌లో శనివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు గంజాయి సేవిస్తుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడికెళ్లి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారయ్యారు. అదుపులో ఉన్న వ్యక్తులను పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అంత్యక్రియల్లో మరో విషాదం ● స్నేహితుడి కుమారుడి అంతిమ యాత్రకొచ్చిన వ్యక్తి మృతి హుజూరాబాద్: స్నేహితుడి కుమారుడు మృతిచెందాడని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి మృతిచెందడం హుజూరాబాద్‌లో కలచివేసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ముద్రవేన రాజశేఖర్(18) ఈనెల 19న తోకలపల్లి గ్రామ సమీపంలో రోడ్డు డివైడర్‌ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. రాజశేఖర్, హరిచరణ్ ఇద్దరు గాయపడ్డారు. రాజశేఖర్‌ను మెరుగైన చికిత్స కోసం హన్మకొండకు తరలించగా, హరిచరణ్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. రాజశేఖర్ శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజశేఖర్ తండ్రి, హుస్నాబాద్‌కు చెందిన ఇస్లావత్ వెంకట్(40) స్నేహితులు కాగా.. రాజశేఖర్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెంకట్ శనివారం హాజరయ్యారు. మృతుడి ఇంటి సమీపంలోని మురుగు కాలువలో వెంకట్ హఠాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు గమనించి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించేలోగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
అర్ధంతరంగా తనువు చాలించిన టేకేదారు
ముస్తాబాద్/కరీంనగర్‌క్రైం: కుటుంబాన్ని పోషించుకునేందుకు దారి తప్పిన ఓ యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. గ్రామస్తులు, మృతుల బంధువుల కథనం ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన మహ్మద్ షాదుల్లా(29) కరీంనగర్ జైలులో అస్వస్థతకు గురై మృతిచెందాడు. ఈనెల 18న ట్రాక్టర్ చోరీ సంఘటనలో షాదుల్లా, నరేందర్‌రెడ్డి, సమీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జైలుకు ముగ్గురిని తరలించారు. అయితే షాదుల్లా శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుండెపోటుతో మృతిచెందినట్లు జైలు అధికారులు సమాచారమందించారు. అయితే షాదుల్లా తండ్రి శర్పోద్దీన్ ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురై మృతిచెందాడు. అప్పటి నుంచి తండ్రి నిర్వహించే బీడీ కంపెనీలో టేకేదారుగా షాదుల్లా పని చేస్తున్నాడు. ఈజీ మనీ కోసం స్నేహితుల సహవాసంతో ఐకేపీలో ట్రాక్టర్‌ను అపహరించిన ఘటనలో షాదుల్లాను పోలీసులు జైలుకు తరలించారు. షాదుల్లా బెయిల్ కోసం తల్లి ఫర్వీన్, భార్య ప్రయత్నిస్తున్నారు. బయటకు వస్తాడని భావిస్తున్న తరుణంలోనే మృతిచెందడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆరు నెలల క్రితమే శర్పోద్దీన్ మృతిచెందగా.. ఇప్పుడు అన్ని తానై ఆదుకుంటాడనుకున్న షాదుల్లా మృతిచెందడంతో తల్లి ఫర్వీన్, భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కరీంనగర్ జైలులో ముస్తాబాద్ వాసి మృతి ఆరు నెలల క్రితం అనారోగ్యంతో తండ్రి.. -
లక్కేపూర్ శివారులో మహిళ హత్య
మంథని: లక్కేపూర్ గ్రామ శివారులో శనివారం ఓ మహిళ హత్యకు గురైంది. మంథని సీఐ రాజు వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మాసు రమాదేవి(36) అనే వివాహిత శుక్రవారం మధ్యాహ్నం శెట్టిపల్లి గ్రామానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. రాత్రి వరకు రమాదేవి ఇంటికి రాలేదు. శనివారం మంథని మండలం లక్కేపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కన్పించింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఫొటో ఆధారంగా రమాదేవిగా గుర్తించారు. మృతురాలి భర్త మాసు సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని తన భార్యకు పరిచయమున్న లక్కేపూర్ గ్రామానికి చెందిన పండుగు మొగిలిపై అనుమానముందని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వివాదాస్పదమైన డీఎంహెచ్‌వో ఆసుపత్రి తనిఖీ
గోదావరిఖని: నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ మిషన్ కలిగి ఉన్న స్థానిక లక్ష్మినగర్‌లోని శ్రీమమత ఆసుపత్రిపై శనివారం కేసు నమోదు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.అన్నాప్రసన్నకుమారి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించామన్నారు. అల్ట్రాసోమ్ స్కాన్ మెషిన్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్జే స్వాతి చాంబర్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. మిషన్‌కు పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ లేదన్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది, పోలీస్ శాఖ ద్వారా సంయుక్తంగా పరిశీలించారని, రిజిస్ట్రేషన్ లేకుండా చట్టవిరుద్ధంగా 2023 నుంచి నడుపుతున్నట్టు గుర్తించామని అన్నారు. డీఎంహెచ్‌వో రిసెప్షనిస్టు కాలర్ పట్టుకొని తీసుకెళ్లడం, బూతులు తిట్టడం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో.. తనిఖీ అంశం వివాదాస్పదంగా మారింది. డీఎంహెచ్‌వోపై కేసు ఆసుపత్రి రిసెప్షన్‌గా పని చేస్తున్న చెప్పకుర్తి ఆనందం ఫిర్యాదు మేరకు డీఎంహెచ్‌వోపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆసుపత్రికొచ్చి స్కానింగ్ మిషన్ ఏ గదిలో ఉందో చూపించాలని దుర్భాషలాడారన్నారు. కాలర్ పట్టుకొని లాక్కెళ్లి గది తాళాలు పగలగొట్టి బూతులు తిడుతూ డాక్టర్‌ను పిలవమని చెప్పారని అన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
వీరివీరి గుమ్మడి పండు..
ఒకప్పుడు గ్రామాల్లో సందడి చేసిన ఆటలు కనుమరుగవుతున్నాయి. కాలం మారింది.. బాల్యం ఇంటర్‘నెట్’లో చిక్కుకుంది. ఉదయం లేచింది మొదలు చేతిలో సెల్ఫోన్ల సందడే. ఆన్లైన్ గేమ్స్.. రీల్స్.. షార్ట్స్.. ఫేస్బుక్.. షేర్‌చాట్.. స్నాప్‌చాట్.. ఇలా చెప్పుకుంటూ పోతే శారీరక శ్రమ లేని అనేక అంశాలతో కాలం గడిచిపోతోంది. చిన్న వయసులోనే పనికి రాని వాటికి బానిసవుతూ భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్నారు. ఒకప్పుడు ఆనందం.. ఆహ్లాదం.. విజ్ఞానం పంచిన ఆటలు ఇప్పుడు మచ్చుకై నా కనిపించడం లేదు. పట్నంలో ఎప్పుడో మాయమయ్యాయి.. గ్రామాలకు దూరమయ్యాయి. సెలవులు ప్రారంభమయ్యాయి.. అక్కడక్కడ పిల్లలు కొన్ని ఆటలు ఆడుతుండగా.. ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్స్ పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల టగ్ ఆఫ్ వార్: టగ్ ఆఫ్ వార్.. మనిషి శారీకర శక్తిని తెలియపరిచే ఆట. కొంతమంది రెండు గ్రూపులుగా విడిపోయి.. ఇలా బలాబలాలను ప్రదర్శిస్తుంటారు. జూలపల్లి మండలం వడ్కాపూర్‌లో కొంతమంది చిన్నారులు ఇలా టగ్ ఆఫ్ వార్ ఆడుతూ కనిపించారు. ● పల్లీ: ఈ ఆట ఏకాగ్రతను పెంచుతుంది. చురుకుదనం ఉంటుంది. పెద్దపల్లిలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో చిన్నారులు పల్లీ ఆడుతూ కనిపించారు. -
ఇందిరమ్మ నమూనా ఇల్లు
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇప్పటికే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం నమూనా ఇళ్లు నిర్మించాలని ఆదేశించింది. కలెక్టరేట్ ఆవరణలో నిర్మాణం పూర్తవుతుండగా తాజాగా ఆర్డీవో కార్యాలయాల ఆవరణలో మోడల్ హౌస్ నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయాల ప్రాంగణాల్లో ఈ మోడల్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ప్రజలు కార్యాలయాలకు వస్తుండగా ప్రభుత్వమిచ్చే రూ.5లక్షలతో ఎలా నిర్మించవచ్చో ప్రాక్టికల్‌గా చూపించనున్నారు. సమస్యలు పరిష్కరించాలి కరీంనగర్‌సిటీ: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట కాంట్రాక్ట్ అధ్యాపకులు చేపట్టిన సమ్మె నాలుగో రోజు కొనసాగింది. వీరికి వర్సిటీ బోధనేతర సిబ్బంది సంఘీభావం తెలిపారు. బోధనేతర సిబ్బంది సంఘం ప్రధాన కార్యదర్శి పి.ప్రసాద్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు అధ్యాపకులను త్వరగా క్రమబద్ధ్దీకరించాలని, వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. జీవో 21ను సవరించాలని, పార్ట్‌టైం అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సంతోష్, శ్రీకాంత్, మారుతి, భీమయ్య, ప్రకాశ్‌రావు పాల్గొన్నారు. విద్యార్థులకు కరిక్యులం రూపొందించాం కరీంనగర్‌సిటీ: విద్యార్థులకు అవసరమైన కరిక్యులం రూపొందించి, అమలు చేస్తున్నామని ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. కళాశాలలో మూడో అకడమిక్ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ.. అటానమస్ హోదా ఎస్ఆర్ఆర్ కళాశాలకు 2022–23లో వచ్చిందన్నారు. 2025లో మూడో సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, విద్యార్థులకు అవసరమైన కరికులం రూపొందించడం జరిగిందన్నారు. అటానమస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ వంగల శ్రీనివాస్ అకాడమీ కౌన్సిల్ రిపోర్టును ప్రవేశపెట్టారు. ప్రముఖ వైద్యులు ఎడవల్లి రాజభాస్కర్‌రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ నుంచి డాక్టర్ సరసిజ, సురేశ్, పద్మావతి, డాక్టర్ కడారు సురేందర్‌రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ పి.నితిన్, టి.రాజయ్య కౌన్సిల్ సభ్యులు రేళ్ల సంజీవ్, ఎం.రాజేశ్, కిరణ్మయి, రాజేశం, శ్రీనివాసులు, సత్య ప్రకాశ్ పాల్గొన్నారు. రచయితల శాంతి ర్యాలీకరీంనగర్కల్చరల్: ఉగ్రవాదుల దాడికి నిరసనగా తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కవులు, రచయితలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. రచయితల వేదిక బాధ్యులు అన్నవరం దేవేందర్, సీవీ.కుమార్, కందుకూరు అంజయ్య, కుకట్ల తిరుపతి, బుర్ర తిరుపతి, నడిమెట్ల రామయ్య, నసీరుద్దీన్, విలాసాగరం రవీందర్, పెనుగొండ బసవేశ్వర్, కాసనగొట్టి స్వప్న కష్ణ, జనగాని యుగంధర్, ఎండీ.ఖాలీద్ పాల్గొన్నారు. చాంపియన్ కరీంనగర్కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణ ఏడో స్టేట్‌లెవల్ టాలెంట్ హంట్ హ్యాండ్‌బాల్ బాలుర చాంపియన్‌గా ఉమ్మడి జిల్లా బాలుర జట్టు నిలిచింది. హన్మకొండలో ఈ నెల 24 నుంచి 26 వరకు జరిగిన పోటీల్లో జట్టు చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. -
రైతు సంక్షేమానికే ‘భూభారతి’
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్‌కల్చరల్/కరీంనగర్‌స్పోర్ట్స్: రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్, కొత్తపల్లిలోని రైతువేదికల్లో శనివారం భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులకు ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. భూభారతితో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ధరణిలో ఉన్న 33 మాడ్యూల్స్‌తో రైతులు తమ భూ సమస్య దేని పరిధిలోకి వస్తుందో తెలి యక కోర్టులు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడేవారన్నారు. నూతన చట్టంలో మాత్రం రెండంచెల అప్పీలు వ్యవస్థ తీసుకొచ్చారని చెప్పారు. ఆధార్ మాదిరి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రతీ కమతానికి భూధార్ సంఖ్య కేటాయించినట్లు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, అందరి దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు చుట్టంలా వ్యవహరిస్తుందని సుడా చైర్మన్ కె.నరేందర్ రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఈఓ పవన్‌కుమార్, తహసీల్దార్లు రాజు, రాజేశ్, ఏడీఏ రణదీర్‌రెడ్డి, ఏవో కృష్ణ, కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. భవిత సెంటర్లను తీర్చిదిద్దండి భవిత సెంటర్లను ఆధునీకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్‌లోని ముకరాంపురంలో ఉన్న భవిత సెంటర్‌ను శనివారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి సందర్శించారు. జిల్లాలో 16 భవిత సెంటర్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ప్రతీ సెంటర్ గ్రాండ్ లుక్ ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అన్ని రంగాల్లో రాణించేలా భవిత సెంటర్లు దోహదపడాలని అన్నారు. అనంతరం రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. స్కూల్ చుట్టూ ఏర్పాటు చేస్తున్న పెన్సింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, స్కూల్లో క్రీడాకారులను ఆకట్టుకునేలా మొక్కలు నాటాలని, ఫౌంటెన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర మొక్కలు నాటించాలని సూచించారు. జిల్లా క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్‌గౌడ్, నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, పీఆర్డీఈ జనార్దన్ పాల్గొన్నారు. చట్టంతో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం సర్వే, విచారణ అనంతరమే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు గ్రామాల వారీగా రికార్డుల నిర్వహణ అవగాహన సదస్సుల్లో కలెక్టర్ పమేలా సత్పతి -
వీరివీరి గుమ్మడి పండు..
వీరివీరి గుమ్మడి పండు.. వీరిపేరేమి.. దాగుడుమూతలు దండాకోల్! చికుబుకు రైలు వస్తోంది.. పక్కకు పక్కకు జరగండి కోతికొమ్మచ్చి.. పట్టుకోండి చూద్దాం పులిమేక.. ఎవరు గెలుస్తరో ఏమో అష్టాచెమ్మా..గడులు దాటాలి.. నేనే గెలవాలి వైకుంఠపాళి.. నిచ్చెన ఎక్కితే సరి.. పాము మింగితే బలి గోటీలాట.. సూటి చూసి కొట్టాలి.. గోటీలు గెలవాలి చిర్రగోనె.. అందుకుంటే ఔట్.. లేదంటే గుడ్షాట్ వంగుడు.. దుంకుడు.. ఒక్కొక్కరు ఎగిరి దూకాలి.. తాకితే అంతే మరి ఆడుదామా కచ్చకాయ.. ఎగిరేస్తా చూడు రాయి.. పట్టుకుంటా మళ్లీ..కొనుగోళ్ల వెంటే రవాణా.. అంటూ చేతిలో సెల్‌ఫోన్ లేని కాలంలో చిన్నారులు ఎక్కువగా ఆడిన ఆటలు ఇవీ.. పొద్దున లేస్తే గల్లీ పోరగాళ్లు అందరూ ఒక్కచోట చేరి పొద్దుపోయే దాక ఆడి.. అలిసిపోయి ఇల్లు చేరేవారు. అలనాడు ఆడిన ఆటలతో వ్యాయామంతో పాటు.. విజ్ఞానం పెరిగేది. శరీరం ఉల్లాసంగా ఉండేది.. ఆరోగ్యానికి బాసటగా నిలిచేది. కాలం మారుతోంది.. శారీరక వ్యాయామం తగ్గిపోతోంది. చిన్నారులు సెల్ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. కాళ్లు, చేతులు కదపకుండా.. కళ్లతోనే ఆడుతున్నారు. బద్ధ్దకంతో ఆన్లైన్ ఆటలకు బందీలుగా మారి.. బరువు పెరిగిపోతున్నారు. పట్టణాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుండగా.. పల్లెల్లో అక్కడక్కడా.. అలనాటి ఆటలు ఆడుతూ.. ‘సాక్షి’ కెమెరాలకు చిన్నారులు కనిపించారు. ఈ సందర్భంగా అలనాటి ఆటలు.. వాటితో లాభాల గురించి కథనం.. – సాక్షి ఫొటోగ్రాఫర్స్, పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల– వివరాలు... IIలోuకరీంనగర్ అర్బన్: కొనుగోలు కేంద్రాల్లో సమస్యల్లేకుండా చర్యలు చేపట్టామని, కొనుగోళ్ల వెంటే రైస్‌మిల్లులకు ధాన్యం రవాణా చేస్తున్నామని పౌరసరఫరాల సంస్థ డీఎం మంగాళరపు రజనీ కాంత్ స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని వెల్లడించారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని సేకరిస్తామని, అన్నదాతలు నాణ్యతా ప్రమాణాలు పాటించి ధాన్యం తీసుకురావాలని సూచించారు. జిల్లాలో మొత్తం 347 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 32వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామ ని, టార్పాలిన్లు, సౌకర్యాలకు కొరత లేదని వివరించారు. కేంద్రాల్లో సౌకర్యాలు, మద్దతు ధర కల్పన, దళారుల దోపిడీకి అడ్డుకట్ట వంటి అంశాలపై శనివారం ‘సాక్షి’ ఇటర్వ్యూలో వివరించారు. జిల్లా అంతటా కొనుగోళ్లు ఈ సీజన్లో వరి కోతలు కొంత ఆలస్యమయ్యా యి. 5.86 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వ స్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో వ్యక్తిగత, ఇతర అవసరాలు పోనూ ఎంత వస్తుందన్నది త్వరలోనే తేలనుంది. జిల్లావ్యాప్తంగా దొడ్డు రకం ధాన్యం, సన్న రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లావ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు 32వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. పక్కా కార్యాచరణతో కొనుగోళ్లు కొనుగోలు కేంద్రంలో తాగునీరు, టెంట్, కూలీల కోసం షెడ్లు, వోఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించాం. కోటి గన్నీ సంచులు అవసరమవుతాయి. అవసరానికి తగినట్టుగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచాం. రోజూ లక్ష నుంచి రెండు లక్షల వరకు సంచుల్లో ధాన్యం నింపుతున్నారు. టార్పాలిన్లు, ధాన్యం రవాణాకు లారీలు అందుబాటులో ఉన్నాయి. కేంద్రాల నుంచి తీసుకెళ్లిన ధాన్యాన్ని 24 గంటల్లో దించాలని మిల్లర్లకు సూచించాం. ఇబ్బందులు తలెత్తితే రైతులకు ఇబ్బందులు తలెత్తినా, ఏవైనా ఫిర్యాదులున్నా కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబర్ 9154249727 సంప్రదించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు. నిబంధనల ప్రకారమే తూకం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం తూకం వేయాలని నిర్వాహకులకు, మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాం. తాలు లేకుండా శుభ్రమైన ధాన్యం తీసుకువచ్చి రైతులు సహకరించాలి. తేమ 17 శాతం మించరాదు. గన్ని సంచిలో 40.580 కిలోలు తూకం వేయాలి. తరుగు పేరుతో అదనంగా తూకం వేయరాదు. ఆటోమేటిక్ ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు నగదు జమ ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు చేపడుతున్నాం. ట్యాబ్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్రాల్లో సిబ్బందిని నియమించాలని సూచించాం. వానాకాలం సీజన్లో 72 గంటల్లో ఖాతాల్లో నగదు జమ చేశారు. ప్రస్తుతం అదే ప్రక్రియ కొనసాగనుంది. ధాన్యం తీసుకోవడానికి 96 మిల్లులు సంసిద్ధతను తెలియజేశాయి. చాలామట్టుకు మిల్లులు బ్యాంక్ గ్యారంటీ అందజేశాయి. ఇంకా బ్యాంక్ గ్యారంటీ అందజేస్తున్న వారికి ధాన్యం కేటాయిస్తున్నాం. జిల్లాలో మొత్తం సాగువిస్తీర్ణం 2,90,000సాగైన వరి: 2,66,896ఎకరాలు రానున్న దిగుబడి: 5,86,723మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం: 32,541మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలు: 347రైస్‌మిల్లులు: 96ధాన్యం మద్దతు ధర: ఏ గ్రేడ్: రూ.2,320సాధారణ రకం: రూ.2,300 -
పోటీ పరీక్షల్లో రాణించాలి
చొప్పదండి: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలని, రానున్న ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించాలని సంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి అన్నారు. మండలంలోని రుక్మాపూర్ శివారు సైనిక శిక్షణ పాఠశాలలో ఆమె రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకులంలో అమలు అవుతున్న శిక్షణ కార్యక్రమాలు, హాస్టల్ నిర్వహణ, పరిసరాలు, క్రీడలను పరిశీలించారు. బాక్సింగ్, ట్రెక్కింగ్ కార్యకలాపాలలో స్వయంగా విద్యార్థులతో పాటు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. అజిమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి సైనిక పాఠశాల నుంచి అత్యధికంగా 22 మంది కెడెట్లు ప్రవేశం పొందడం గర్వకారణమన్నారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, ఐటీ, ఇంజినీరింగ్ విభాగాలలో అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ సేవల్లో కూడా ప్రవేశం పొందాలని కోరారు. ఎల్లప్పుడు బ్యాకప్, ఆకస్మిక ప్రణాళిక ప్రత్యామ్నాయ ఎంపికలను కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారి ఎం భీమయ్య, శర్మ, కిశోర్, డైరెక్టర్ కల్నల్ కేసీ రావు, ప్రిన్సిపాల్ జి.కాళహస్తి, తదితరులు పాల్గొన్నారు. -
చలో ఎల్కతుర్తి
● బీఆర్ఎస్ రజతోత్సవానికి గులాబీదండు రెడీ ● లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి ● వందలాది బస్సుల్లో పంపేందుకు సిద్ధం సాక్షిప్రతినిధి,కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన రజో త్సవ సభకు జనసమీకరణ దాదాపుగా పూర్తయింది. సమీకరించిన జనాలు, కార్యకర్తలతో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఉదయమే తరలేలా వందలాదిగా ఆర్టీసీ, ప్రైవేటు, స్కూల్ బస్సులను అందుబాటులో ఉంచారు. ఇవి కాకుండా పార్టీకి చెందిన నాయకుల కార్లను కూడా సిద్ధం చేశారు. కరీంనగర్ నుంచి 15 వేలు, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల నుంచి 10వేల మంది చొప్పున జనసమీకరణ జరిగిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు వెల్లడించారు. హుస్నాబాద్, హుజూరాబాద్ నుంచి లక్ష మందిని తరలిస్తున్నామన్నారు. కరీంనగర్లో ప్రతీ డివిజన్ నుంచి 3 బస్సులు బయల్దేరనున్నాయి. ఈ మేరకు బస్సులు, పోస్ట ర్లు, బ్యానర్లు, సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటల తరువాత బస్సులు నియోజకవర్గాల నుంచి బయల్దేరనున్నాయి. ప్రతీ బస్సుకు కో– ఆర్డినేటర్లు ఉంటారు. వీరే బస్సులో వస్తున్న నాయకులకు ఆహారం, నీరు, ఇతర అవసరాలు, పార్కింగ్ తదితర విషయాల్లో మార్గనిర్దేశనం చేయనున్నారు. నాడు.. నేడు ఉమ్మడి జిల్లానే 2001 ఏప్రిల్ 27వ తేదీన కరీంనగర్లో సింహగర్జన పేరిట నిర్వహించిన సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చాటింది. ఆ తరువాత 2004లో కాంగ్రెస్‌తో సంకీర్ణంలో చేరింది. 2009 నుంచి మలిదశ పోరాటం ఉధృతం చేసింది. 2014లో రాష్ట్రం సిద్ధించింది. 2014, 2018లో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2023 నుంచి తిరిగి ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అధినేత కేసీఆర్ కాళేశ్వరం, రైతుబంధు, దళితబందు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఉమ్మడి జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 25 ఏళ్ల రజతోత్సవ సభ జరుగుతున్న ఎల్కతుర్తి కూడా 2016 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతర్భాగం కావడం గమనార్హం. నాడు తొలి ఆవిర్భావ సభ, ఇప్పుడు 25వ ఆవిర్భావ సభలు రెండూ ఉమ్మడి జిల్లాలోనే జరుగుతుండటం విశేషం. -
21 రోజుల్లో ముగ్గురి మృతి
● రాచర్లబొప్పాపూర్‌లోని ఆ కుటుంబంలో తీవ్ర విషాదం ● ఒంటరివారైన తల్లీకొడుకులుఎల్లారెడ్డిపేట(ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో ఆ కుటుంబంలో 21 రోజులుగా విషాదచాయలు వీడడం లేదు. ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గడ్డి నర్సయ్య, ఆయన కుమారుడు నరేందర్, తల్లి ఎల్లవ్వ మరణాలతో నర్సయ్య భార్య, కొడుకు ఒంటరివారయ్యారు. మూడు వారాల్లోనే ముగ్గురు రాచర్లబొప్పాపూర్‌కు చెందిన గడ్డి నర్సయ్య(55) తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అయితే ఏప్రిల్ 3వ తేదీన అనారోగ్యంతో మరణించాడు. అతని చిన్న కొడుకు నరేందర్(23) ఓ మహిళతో ప్రేమలో పడి, 45 రోజులు జైలు జీవితం గడిపాడు. తండ్రి చనిపోవడంతో బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే తన తండ్రి మృతికి సదరు మహిళే కారణమంటూ ఆమె ఇంటికి వెళ్లి గొడవపడి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఈనెల 22న ప్రాణాలు కోల్పోయాడు. తన కళ్ల ముందే కన్నకొడుకు, మనుమడు మృతిచెందడంతో నర్సయ్య తల్లి గడ్డి ఎల్లవ్వ(80) తీవ్ర మనోవేదనకు గురైంది. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. వారి కుటుంబంలో 21 రోజుల వ్యవధిలోనే ముగ్గురు మరణించడం కలచివేసింది. ప్రస్తుతం వారి కుటుంబంలో నర్సయ్య భార్య, కొడుకు ఒంట రివారయ్యారు. వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. -
కళాసిల్క్ చేనేత హస్తకళ మేళాకు ఆదరణ
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌లోని శ్రీరాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాసిల్క్ చేనేత హస్తకళ మేళాకు విశేష ఆదరణ లభిస్తోంది. మేళాలో పట్టు, ఫ్యాన్సీ డిజైనర్, పోచంపల్లి చీరలు, డ్రస్ మెటీరియల్స్, చుడీదార్స్, సూటింగ్స్ షర్టింగ్స్, జ్యువెల్లరీ, బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకుడు వినోద్ నేగి తెలిపారు. అలాగే ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడల్లో ప్రఖ్యాతి పొందిన చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. హర్యానా బెడ్, కుషన్ కవర్లు, లక్నో కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, డోర్ కార్టన్స్, స్టోన్ జ్యువెల్లరీ, పెరల్స్, క్రాఫ్ట్స్, బంజారా, కోల్ కత్తా బ్యాగులు, ఒడిస్సా పెయింటింగ్స్ , మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరి, రాజస్తాన్ కోటా బాందేజన్, బ్లాక్ప్రింట్స్, సంగ్నరి ప్రింట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఉత్తరప్రదేశ్ జామ్దాని, బనారస్ లక్నొవి డ్రెస్ మెటీరియల్స్ పాటు పలు రకాల వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. -
‘ఆరోగ్య మహిళ’ వరం
ఆరోగ్య మహిళ కార్యక్రమంలో అన్నివ్యాధులకు నిర్ధారణపరీక్షలతోపాటు ముఖ్యంగా కేన్సర్ స్క్రీనింగ్‌పై దృష్టి పెడుతున్నాం. మహిళలకు బ్రెస్ట్, సర్వికల్, గర్భాశయ, ఇతర కేన్సర్లు ఉంటే మేం చేసే పరీక్షల్లో ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో చికిత్స సులభమవడమే కాకుండా కేన్సర్ నిర్మూలన ఫలితం మెరుగ్గా ఉంటుంది. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, కరీంనగర్ తొలిదశలో గుర్తిస్తే నయం చేయవచ్చు కేన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నయం చేయొచ్చు. మగవారు ఎక్కువగా ఊపిరితిత్తుల కేన్సర్‌కు గురవుతున్నారు. స్మోకింగ్, నాన్ స్మోకింగ్ టొబాకో, రెడ్‌మీట్, ఆయిల్స్, జంక్ఫుడ్స్ మానేయాలి. మద్యపానం నియంత్రించాలి. నిర్దేశిత బరువు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం అర్ధగంటపాటు వాకింగ్, వ్యాయామం చేయాలి. భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. – డాక్టర్ రవీంద్రచారి, పల్మనాలజిస్టు -
అనుమానాస్పద స్థితిలో నర్స్ మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ సిటీలోని జ్యోతినగర్‌లో నివసిస్తున్న ఓ నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన బాసిల్లి ఝాన్సీ(23) స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితులతో కలసి జ్యోతినగర్‌లోని ఓ గదిలో కిరాయికి ఉంటుంది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోపల ఝాన్సీ ఉండగా ఆమె స్నేహితులు బిల్డింగ్‌పై పడుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో వీరికి పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఝాన్సీకి ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయడం లేదని తెలిపాడు. వెంటే స్నేహితులు కిందికి వచ్చి చూడగా ఝాన్సీ అపస్మారక స్థితిలో ఉంది. పక్కనే ఓ ఇంజెక్షన్ ఉండడంతో దానిని ఫొటోతీసి అజయ్‌కు పంపించారు. దీంతో అజెయ్ వెంటనే తన మిత్రుడికి సమాచారం ఇచ్చి స్నేహితులతో ఝాన్సీని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉరేసుకుని ఆర్ఎంపీ ఆత్మహత్యమేడిపల్లి: మేడిపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ సాంబారు జగదీశ్(44) శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీశ్ మూడేళ్లనుంచి తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నాడు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. అయిన మెడ నొప్పి తగ్గ్గలేదు. ఆపరేషన్ కోసం రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. ఆర్థిక పరిస్థితి, అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయాడు. జగదీశ్‌కు భార్య రూప, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అథారిటీ’ పర్యటన
రామగుండం: అంతర్గాం మండల కేంద్రంలోని టెక్స్టైల్ భూములను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఉన్నతాధికారులు శుక్రవారం పర్యటించారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని వారు సందర్శించారు. గతంలో సమర్పించిన భూ రికార్డుల ఆధారంగా ఆ స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని రైల్వేట్రాక్, రాజీవ్ రోడ్డు కనెక్టివిటీ, ఇరువైపులా పట్టణాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టు భూములు పరిశీలించారు. అయితే, ఎయిర్‌పోర్టు నిర్మాణం ఎంతోఅవసరం కాగా, అంతర్గాం, బసంత్‌నగర్ కేంద్రాల్లో దానిని ఎక్కడ నిర్మిస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. భూములను పరిశీలించిన వారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ప్రతినిధులతోపాటు రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ ఏడీఈ శ్రీనివాస్, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, అంతర్గాం తహసీల్దార్ రవీందర్‌పటేల్ తదితరులు ఉన్నారు. -
సలుపుతున్న రాచపుండు!
సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్‌టౌన్: ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఇది ఇప్పుడు చిన్నవయసు వారిని సైతం బలితీసుకుంటుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 40 శాతం కేసులు టొబాకో రిలేటెడ్ కేన్సర్(టీఆర్సీ).. అంటే పొగాకు వినియోగించే వారివని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 20–25 ఏళ్ల యువతనూ పట్టిపీడిస్తోందంటున్నారు. పొగాకు తీసుకోవడం ప్రారంభించిన 10–20 ఏళ్ల తర్వాత కేన్సర్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రతీ ముగ్గురిలో ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాతే నిర్ధారణ అవుతోందని, దీంతో బతికే అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు. -
ఆ ఇంట్లో... అసలేం జరిగింది?
-
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దొంగల అరెస్టు
కరీంనగర్‌క్రైం: రెండు వేర్వేరు దొంగతనం ఘటనల్లో నిందితులను కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయగా.. వారి నుంచి 250 గ్రాముల బంగారం, రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సీపీ గౌస్ ఆలం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రెండు ఘటనల్లో నిందితుల వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలోని బస్టాండులో చిగురుమామిడి మండలం నవాబ్‌పేటకు చెందిన కంది సంపత్‌రెడ్డి(48) ఫిబ్రవరి 14న ఒక మహిళ బ్యాగు నుంచి 16.5 తులాల బంగారం, ఫిబ్రవరి 24న కరీంనగర్ బస్టాండుకు వచ్చి ఒక మహిళ బ్యాగు నుంచి 47 గ్రాముల బంగారం, ఏప్రిల్ 8న ఒక వృద్ధుడి బ్యాగు నుంచి రూ.13లక్షలు దొంగిలించాడు. ఈ మూడు ఘటనలపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సంపత్‌రెడ్డిని కమాన్ చౌరస్తా వద్ద సీఐ కోటేశ్వర్ బృందం పట్టుకొని అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి 150 గ్రాముల బంగారం, రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో కరీంనగర్ టూటౌన్ పరిధిలో ఈనెల 13న సప్తగిరికాలనీలో ఒక ఇంట్లోకి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం అశోక్నగర్క్ చెందిన సూర రవి(35) అనే నిందితుడు చొరబడి 175 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.35వేల నగదు అపహరించుకుపోయాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు రవిని పద్మనగర్ చౌరస్తా వద్ద శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 100 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు బిల్ల కోటేశ్వర్, సృజన్‌రెడ్డి, సీసీఎస్ సీఐ బొల్లం రమేశ్ పాల్గొన్నారు. సిబ్బంది కుమార్, అనిల్‌రెడ్డి, సురేందర్‌పాల్, మల్లయ్య, సాయికుమార్‌తోపాటు పలువురిని ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు. -
రెవెన్యూలోనే భూ సమస్యకు పరిష్కారం
● ‘భూ భారతి’తో రైతులకు మేలు ● కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం లేదు ● సీసీఎల్ఏ వరకు అప్పీల్‌కు అవకాశం ● త్వరలో అసైన్మెంట్ కమిటీల ఏర్పాటు సాక్షి ఫోన్ఇన్లో ఆర్డీవో కుందారపు మహేశ్వర్సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ అర్బన్: ‘భూ భారతి’ రైతులకు వరం. భూ సమస్యలకు పరిష్కార వేదిక’ అని కరీంనగర్ ఆర్డీవో కుందారపు మహేశ్వర్ తెలిపారు. ధరణి స్థానంలో వచ్చిన భూభారతితో కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం లేదన్నారు. రెవెన్యూ అధికారుల స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ‘భూ భారతి’ సందేహాల నివృత్తి కోసం శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్లో రైతులు అడిగిన పలు ప్రశ్నలకు ఆర్డీవో సమాధానాలు ఇచ్చారు. జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి అమలవుతుందని, వచ్చేనెల ఒకటి నుంచి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలంలో అమలు చేస్తామన్నారు. -
లక్కీ కాంట్రాక్టర్!
● పనులు ప్రారంభించకముందే చెక్కు రెడీ ● బొమ్మకల్ ఫ్లైఓవర్ పెయింటింగ్‌కు రూ.40 లక్షలు కరీంనగర్ కార్పొరేషన్: చేసిన పనులకు బిల్లుల కోసం ఏళ్లతరబడి నగరపాలకసంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్లు ఎంతోమంది. నానా తిప్పలు పడితే వాయిదాల లెక్కన బిల్లులు వచ్చేది ఎప్పుడో. కాని ఈ కాంట్రాక్టర్ మాత్రం చాలా అదృష్టవంతుడు?..పనులు మొదలు పెట్టకముందే బిల్లు రెడీగా ఉంది. ఆయన పనులు చేయడమే ఆలస్యం...ఖాతాలో పడడం ఖాయం. విచిత్రమో...అదృష్టమో...అధికారుల మాయో తెలియదు కాని...అక్షరాల రూ.40 లక్షల చెక్కు, పనికి ముందే ఆ కాంట్రాక్టర్ పేరిట రెడీ అయిపోయింది. రూ.40లక్షల పని.. నగరంలోని బొమ్మకల్ ఫ్లై ఓవర్‌కు సుందరీకరణలో భాగంగా పెయింటింగ్ వేసేందుకు నగరపాలకసంస్థ నిర్ణయించింది. స్పర్స్ ఐఈసీ నిధులతో చారిత్రాత్మక చిత్రాలు, స్వచ్ఛతపై అవగాహన కల్పించే చిత్రాలను ఈ ఫ్లై ఓవర్‌పై వేయాల్సి ఉంటుంది. రూ.40 లక్షల విలువైన పనికి సంబంధించి రూ.5 లక్షల చొప్పున ఎనిమిది బిట్లుగా విభజించి నామినేషన్ పద్ధతిన కాంట్రాక్ట్ అప్పగించినట్లు సమాచారం. కాగా సదరు కాంట్రాక్టర్ పెయింటింగ్ పనులు మొదలు పెట్టకముందే ఆయన చేసిన(చేయని) పనికి బిల్లు కూడా రెడీ అయిపోయింది. రూ.40 లక్షల విలువైన చెక్కు జారీ అయింది. అది నగదుగా మారడమే మిగిలింది. నిధులు ల్యాప్స్ అవుతాయట.. స్పర్స్ ఐఈసీ నిధులతో రూ.40 లక్షల విలువైన పెయింటింగ్ పనులు చేపట్టారు. ఈ నిధులు గత ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించాల్సి ఉంది. దీంతో మార్చి 31వ తేదీ తరువాత ల్యాప్స్ అయిపోతాయానే ఉద్దేశంతో కాంట్రాక్టర్ పేరిట ముందే చెక్ రెడీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 31వ తేదీలోపు ఈ నిధులను వినియోగించాల్సి ఉన్నప్పుడు, అందుకు తగినట్లుగా ముందే ఎందుకు పనులు పూర్తి చేయలేకపోయారో అధికారులు చెప్పలేకపోతున్నారు. నిధుల గడువు ముగిసిపోతుందని హడావుడిగా నామినేషన్ పద్ధతిన కాంట్రాక్ట్ అప్పగించడం, పనులు మొదలు పెట్టకముందే బిల్లు సిద్ధం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ పనులు అనుకున్న రీతిలో చేయకపోయినా బిల్లు మాత్రం చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా పనులు మొదలు పెట్టకున్నా చెక్కు రెడీ కావడం పట్ల బల్దియా వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పనులు పూర్తయ్యాకే బిల్లు ఇస్తాం బొమ్మకల్ ఫ్లై ఓవర్ పెయింటింగ్ పనికి సంబంధించిన బిల్లు కాంట్రాక్టర్‌కు చెల్లించలేదు. నిధుల గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తున్నందున ఆ డబ్బులు విడుదల చేయాల్సి వ చ్చింది. చెక్ మాత్రమే రెడీ చేశాం. డబ్బులు నగరపాలకసంస్థ వద్దనే ఉన్నాయి. పనులు పూ ర్తయ్యాకే బిల్లు చెల్లిస్తాం. – చాహత్ బాజ్‌పేయ్, కమిషనర్ నగరపాలకసంస్థ -
విద్యార్థులూ.. సెల్ఫోన్లను పక్కన పెట్టండి
● సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి ● జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్: కరీంనగర్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పలు అంశాలపై ఉచిత వేసవి శిక్షణ కార్యక్రమాన్ని 20 రోజులపాటు నిర్వహించనున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న వేసవి శిక్షణ తరగతులపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు చదువుతోపాటు వివిధ క్రీడల్లో చక్కగా రాణించాలని సూచించారు. వేసవి శిక్షణ శిబిరాలకు సంబంధించి పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. సోమవారం నుంచి కరీంనగర్‌లోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎంపిక చేసిన 10 ప్రైవేటు పాఠశాలల్లో 20 అంశాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌లోని బాలభవన్, అంబేడ్కర్ స్టేడియం, సప్తగిరికాలనీలోని కేజీబీవీ స్కూల్, మంకమ్మతోటలోని గర్ల్స్ హైస్కూల్‌తోపాటు ఎంపిక చేసిన పది ప్రైవేటు పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు జరుగుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడి ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచించారు. స్విమ్మింగ్, స్పెల్ బి, క్రియేటివ్ రైటింగ్, అబాకస్, వాలీబాల్, బుక్ రివ్యూ, యాక్టింగ్, పెయింటింగు, క్విజ్, డ్యాన్సు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఫొటోషాప్, వివిధ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఈవో జనార్దన్‌రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ కర్ర అశోక్‌రెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు శేఖర్‌రావు, రామారావు, హనుమంతరావు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక వేధింపులు ఉంటే తెలియజేయాలి
కరీంనగర్‌క్రైం: విద్యార్థిదశలో లైంగిక వేధింపులకు గురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా మిత్రులకు తెలియజేయాలని లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొవాల్సి వ స్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ సూచించారు. శుక్రవారం కరీంనగర్ సిటీలోని ప్రభుత్వ వృద్ధులు, వికలాంగుల ఆశ్రమాలు, స్వధార్ హోమ్‌ను పరిశీలించారు. ఆహార పదార్థాలు నిలువచేసే గదులను తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించాలని నిర్వాహకులకు జడ్జి సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సహాయం, న్యాయసేవలు అవసరమున్నా..తమను సంప్రదించాలన్నారు.విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలి ● సీపీ గౌస్ ఆలం గంగాధర: విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సిబ్బంది తమ పరిధిలో ఉన్న గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలతో మమేకం కావాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సూచించారు. గంగాధర పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌కు సంబంధించిన వివరాలను సిబ్బందినడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు. ఎస్సై వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. రేషన్‌కార్డుల జారీ వేగవంతం చేయాలి● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ కరీంనగర్‌కార్పొరేషన్: రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వార్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన్‌కార్డులను త్వరగా లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నూతన రేషన్‌కార్డులు, పేర్ల నమోదుకు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన చేపట్టాలన్నారు. డివిజన్లవారీగా దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఐదుశాతం రాయితీతో ఆస్తి పన్ను చెల్లింపులపై దృష్టి సారించాలని, గడువులోగా కనీసం 25శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అండర్ అసెస్మెంట్లను గుర్తించి రివైజ్డ్ చేయాలని సూచించారు. అన్ అసెస్మెంట్లు ఉంటే అసెస్మెంట్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు స్వరూపరాణి, ఖాదర్ మొహియొద్దీన్, పౌరసరఫరాలశాఖ అధికారి నర్సింహరావు, రెవెన్యూఅధికారి శ్రీనివాస్, నగరపాలకసంస్థ ఆర్వో భూమానందం పాల్గొన్నారు.సుఖ ప్రసవాల సంఖ్య పెంచాలి● డీఎంహెచ్‌వో వెంకటరమణ హుజూరాబాద్/ఇల్లందకుంట: సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, వావిలాల పీహెచ్‌సీని శుక్రవారం తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దన్నారు. అనంతరం వావిలాల పీహెచ్సీ ఆద్వర్యంలో గ్రామంలో మలేరియా దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. చెల్పూరు వైద్యాధికారి మధు, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్ వావిలాల వైద్యాధికారి రాజేశ్, డాక్టర్లు చందన, హిమబిందు, సంధ్యారాణి, సఽంధ్యా, ఫర్హానుద్దీన్, కార్తీక్, విజయ్ పాల్గొన్నారు. -
ఉగ్ర దాడి మృతులకు ఉపాధ్యాయుల నివాళి
విద్యానగర్(కరీంనగర్): కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి గురువారం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాలి అర్పించారు. కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజిరెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చకినాల రామ్మోహన్, యూటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్టీయూ, టీపీటీఎఫ్, పీఆర్టీయూటీజీ, ఎస్సీ, ఎస్టీ సంఘం, ఎస్జీటీయూ సంఘాల బాధ్యులు ముల్కల కుమార్, ఎస్.రవీంద్రచారి, పీఆర్ శ్రీనివాస్, మర్రి జైపాల్‌రెడ్డి, అర్కాల శ్రీనివాస్, జె.రాంచంద్రారెడ్డి, గోనె శ్రీనివాస్, నాగరాజు, మీసాల మల్లిక్, కె.మహిపాల్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, బి.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ డీలర్ల పరీక్ష ప్రశాంతం
కరీంనగర్ అర్బన్: రేషన్ డీలర్ల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో తొలి విడత 68 రేషన్ దుకాణాలకు గానూ ప్రకటన వెలువడగా 415 మంది దరఖాస్తు చేసుకున్నారు. గురువారం జ్యోతినగర్‌లోని సెయింట్ జాన్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించారు. ఆర్డీవో కె.మహేశ్వర్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. 415 మంది అభ్యర్థులకు గానూ 391 మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వివరించారు. కాగా భానుడి ప్రతాపానికి అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. దశాబ్దాల తర్వాత రేషన్ డీలర్ల నియామకానికి ప్రకటన వెలువడటంతో పోటాపోటీ నెలకొంది. కాగా, పరీక్ష రాసినవారిలో రాజకీయ పార్టీల నేతల కుటుంబ సభ్యులు, రేషన్ డీలర్ల బంధువులు, రెవెన్యూ ఉద్యోగులు, అధికారుల బంధువులే ఎక్కువగా కనిపించారు. కరీంనగర్ రూరల్, గంగాధర, మానకొండూరు, చొప్పదండి, రామడుగు, తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరువరం, కొత్తపల్లి, కరీంనగర్ అర్బన్ మండలాల్లోని రేషన్ దుకాణాల అభ్యర్థులందరికీ ఇదే స్కూల్‌ను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. రెవెన్యూ ఉద్యోగులు, అధికా రులు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు. వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లింలకు మేలు ● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిశోర్రెడ్డికరీంనగర్టౌన్: వక్ఫ్ నిబంధనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి, పేద, మధ్యతరగతి ముస్లింల ప్రయోజనాలు, సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం వక్ఫ్‌పై సవరణలు చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్‌రెడ్డి తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం కరీంనగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ అనేది ఇస్లామిక్ చట్ట ప్రకారం ఇవ్వబడిన, తిరిగి ఇవ్వలేని దాతృత్వ నిధి అన్నారు. 2018 కేంద్రీయ వక్ఫ్ పరిషత్ నివేదిక ప్రకారం మన దేశంలో 10 లక్షల కోట్లకు పైగా అంచనా విలువ కలిగిన ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయన్నారు. అయితే వక్ఫ్ పాలన వ్యవస్థ బలహీనంగా ఉండి, బోర్డులో ఎవరు ఎవరికి జవాబు దారీగా ఉండడం లేదని, దీంతో మోదీ ప్రభుత్వం వక్ఫ్ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి వీలుగా సవరణ చట్టం ప్రవేశపెట్టిందన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓవైసీ ముస్లిం సమాజాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నాయకులు యాదగిరి సునీల్‌రావు, సుంకర మౌనిక, నిర్మలాదేవి, గుగ్గిలపు రమేశ్, కోమల ఆంజనేయులు, కన్నబోయిన ఓదెలు, వాసాల రమేశ్, ప్రవీణ్‌రావు, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మాడ వెంకటరెడ్డి, సాయిని మల్లేశం, ఎండీ ముజీబ్, సోమిడి వేణుప్రసాద్, చొప్పరి జయశ్రీ, మోహన్‌రెడ్డి, పుప్పాల రఘు, ఎన్నం ప్రకాష్, బల్బీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కరీంనగర్ –2 డిపోకు అవార్డులు కరీంనగర్: హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో ఇటీవల నిర్వహించిన టెక్నికల్ సెమినార్లో కరీంనగర్లో 2 డిపో పలు అవార్డులు అందుకుంది. బీఎస్ 6బస్సులలో హెచ్ఏ కేఎంపీఎల్ సాధించినందుకు, అశోక్ లీలాండ్ ఇంజిన్‌లో హై మైలేజ్ 20.40లక్షలు కిలోమీటర్లు సాధించినందుకు ఆర్టీసీ సీఎండీ సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ మునిశేఖర్, కరీంనగర్ జోన్ ఈడీ సోలమన్, హైదరాబాద్ గ్రేటర్ జోన్ ఈడీ ఖుస్రో షా ఖాన్, ఈడీ (ఇంజినీరింగ్) వెంకన్న చేతులమీదుగా ఆర్ఎం. బి.రాజు, డిపో మేనేజర్ శ్రీనివాస్, గతంలో డిపో మేనేజర్‌గా పనిచేసిన వి. మల్లయ్య రాష్ట్రస్థాయిలో అవార్డులు అందుకున్నారు. -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
శంకరపట్నం(మానకొండర్): ధరణితో భూ సమస్యలు పరిష్కరించలేక కలెక్టర్లం ఇబ్బందులు పడ్డామని, భూభారతితో సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోని పంక్షన్హాల్లో గురువారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. 1971లో ఆర్ఓఆర్ చట్టం వచ్చిందని, అమలు అయ్యేందుకు కొన్నేళ్లు పట్టినా పకడ్బందీగా అమలు అయ్యాయన్నారు. ధరణి చట్టం తీసుకురావడానికి రాత్రికిరాత్రే కంప్యూటరీకరణ చేయడంతో రైతులకు భూసమస్యలు ఏర్పడినట్లు పేర్కొన్నారు. భూభారతిలో రెండంచెల అప్పీలు వ్యవస్థ రూపొందించడంతో భూ సమస్యలు తహసీల్దార్, ఆర్టీవో స్థాయిలోనే పరిష్కారం అవుతాయన్నారు. గతంలో భూ ఆక్రమణలు జరిగాయని, వాటికి అడ్డుకట్ట పడుతుందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో భూమి పటం పొందిపర్చి భూధార్ అమలు చేస్తున్నట్లు వివరించారు. అంతకుముందు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిలో పర్యాటకులు చనిపోగా సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. సదస్సులో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఏవో వెంకటేశ్, రైతులు పాల్గొన్నారు. ● కలెక్టర్ పమేలా సత్పతి -
చేతులెత్తేశారా..?
● సమ్మర్ క్యాంపులు ఉన్నట్టా.. లేనట్టా.. ● 2017 నుంచి నిర్వహిస్తున్న నగరపాలక సంస్థ ● ప్రస్తుతం శిక్షణ శిబిరాల ఊసెత్తని బల్దియా ● ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, చిన్నారులుకరీంనగర్స్పోర్ట్స్: ఏడేళ్ల వ్యవధిలో ఐదు పర్యాయాలు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించిన కరీంనగర్ బల్దియా ఈసారి క్యాంపుల నిర్వహణపై చేతులెత్తేసిందా? అనే అనుమానం నగరవాసుల నుంచి వ్యక్తమవుతోంది. గతేడాది ఎన్నికల కోడ్ పేరిట శిబిరాలకు చెక్ పెట్టగా ఈ సారి ఏ కారణం చెబుతారో అని వేచి చూస్తున్నారు తల్లిదండ్రులు, చిన్నారులు. పక్క జిల్లాలో శిబిరాల నిర్వహణపై సన్నాహాలు ప్రారంభించగా, క్రీడల కోటగా పేరుగాంచిన కరీంనగర్లో ఆ ఊసే లేకుండాపోయింది. 2017 నుంచి ఉచిత శిక్షణ వేసవి సెలవుల్లో ఇంటిపట్టునే ఉంటున్న చిన్నారులకు కరీంనగర్ నగరపాలక సంస్థ 2017 నుంచి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు జిల్లా క్రీడాశాఖ సహకారంతో నిర్వహిస్తోంది. నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఆసక్తి ఉన్న క్రీడాంశాల్లో చిన్నారులు శిక్షణ పొందారు. ఈ ఏడాది వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. కానీ, నగరపాలక సంస్థ క్రీడా శిబిరాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 2017లో శిబిరాల్లో 15 క్రీడాంశాల్లో సుమారు 1,500 మంది, 2018లో 20 క్రీడల్లో 2,500, 2019లో 22 క్రీడాంశాల్లో 3వేలు, 2022లో 27 క్రీడల్లో సుమారు 3,200, 2023లో 28 క్రీడల్లో సుమారు 3వేల మంది శిక్షణ తీసుకున్నారు. వేల మందికి తర్ఫీదు ఇచ్చిన బల్దియా ప్రస్తుతం శిబిరాల ఊసెత్తకపోవడం విడ్డూరం. ఈసారి శిబిరాలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చినా లాభం లేకుండాపోయింది. ఇప్పటికే శిబిరాల కోసం రోజూ స్టేడియానికి వందల సంఖ్యలో చిన్నారులు వస్తున్నట్లు సమాచారం. గౌరవ వేతనం ఇవ్వాల్సి వస్తుందనా..? శిక్షణ శిబిరాల్లో కోచింగ్ ఇచ్చిన కోచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వడం ఆనవాయితీ. 2023 మే లో 28 క్రీడాంశాల్లో సుమారు 70 మందికిపైగా కోచ్‌లు చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. వీరికి ఇస్తామన్న గౌరవ వేతనం రూ.10వేలు నేటికీ ఇవ్వలేదు. ప్రస్తుతం శిబిరాల నిర్వహణపై ఎలాంటి ప్రకటన లేదు. ఒక వేళ శిబిరాలు నిర్వహిస్తే ఇది వరకు కోచ్‌లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇచ్చి, మలి దశ శిబిరాలకు కూడా ఇవ్వాల్సి వస్తుందని, అదే శిబిరాల జోలికి పోకుండా ఉంటే ఏ సమస్య ఉండదన్న ఆలోచనలో నగరపాలక సంస్థ అధికారులు ఉన్నట్లు పలువురు కోచ్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శిబిరాలు నిర్వహించాలి వేసవి క్రీడా శిబిరాలతో క్రీడాకారుల సామర్థ్యాలు మెరుగుపడుతాయి. చిన్నారులు క్రీడల్లో ఉన్నతస్థాయిలో నిలవాలంటే సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి. ఈసారి కూడా శిబిరాలు నిర్వహించాలి. కోచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలి. – బత్తిని శ్రీధర్‌గౌడ్, ప్రైవేటు పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ప్రతీ వర్షపు నీటిచుక్క ఒడిసిపట్టాలి
● అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్కరీంనగర్ కార్పొరేషన్: రానున్న వర్షాకాలంలో కురిసే ప్రతీ నీటి చుక్కను ఒడిసిపట్టుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వర్షపు నీటి సంరక్షణకు ప్రణాళిక రూపొందించాలన్నారు. గురువారం కలెక్టరేట్లో పురపాలక, నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. భూగర్భ జలాలు అడుగంటి పోతున్న తరుణంలో రాబోయే వర్షాకాలంలో వర్షపు నీటి సేకరణ, సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇండ్లలో నీటి సంరక్షణ చర్యలపై దృష్టి పెట్టాలన్నారు. వర్షపు నీరంతా నేలలోకి ఇంకేలా, ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేయాలని సూచించారు. భవన అనుమతుల సమయంలోనే ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. చెరువులు, కుంటల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో జాలువారే వరద నీటిని భూగర్భంలోకి ఇంకేలా కందకాల తవ్వకం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పేయ్ మున్సిపల్ కమిషనర్లు, భూగర్భ జలశాఖ, నీటిపారుదల పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. డివిజన్ల వారీగా బాధ్యతలు ఇంకుడు గుంతలనిర్మాణం లక్ష్యంగా శుక్రవారం నుంచి నగరంలో అధికారులు సర్వే చేపట్టనున్నారు. నగర పాలకసంస్థలోని 60 డివిజన్లతో పాటు విలీన గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 20, 21,22,23, 40, 41, 42, 43, 53, 57, 58, 59,60 డివిజన్లతో పాటు కొత్తపల్లి బాధ్యతలను డీఈ లచ్చిరెడ్డి, ఏఈ భీమ్వర్ధన్,టీపీబీవో సయ్యద్ ఖాదర్, ఎస్ఐ కుమారస్వామి అప్పగించారు.అలాగే 14,15,16,17, 18,19,36, 37, 38,39,54, 55,56 డివిజన్లతో పాటు చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్లకు డీఈ శ్రీనివాస్, ఏఈ సల్మాన్‌ఖాన్,టీపీబీఓ నదియా ఇస్రత్, ఎస్ఐ గట్టు శ్రీనివాస్, 11,12,13,33,34,35 డివిజన్లకు డీఈ ఓంప్రకాశ్, ఏఈ గట్టు స్వామి, టీపీబీవో నవీన్‌కుమార్, ఎస్ఐ వై.శ్రీనివాస్‌లను ఇన్‌చార్జీలుగా నియమించారు. 1,2,3,4,5,24,25,26,27, 28,29,44 డివిజన్లతో పాటు, దుర్శేడ్, గోపాల్పూర్, బొమ్మకల్ బాధ్యతలు డీఈ అయ్యూబ్‌ఖాన్, ఏఈ గఫూర్, టీపీబీఓ సాయిచరన్, ఎస్ఐ మహేందర్లకు, 6,7,8,9,10, 30,31, 32, 45, 46, 47, 48, 49,50, 51,52 డివిజన్లను డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సతీష్, శ్రీధర్,నరోత్తంరెడ్డిలకు అప్పగించారు. -
రివర్ ఫ్రంట్ వెనక నేతలెవరు?
● ఆడియో రికార్డులు బయటపెడతానంటున్న కమలాకర్ ● ఆ నేత ఎవరా? అంటూ జిల్లావ్యాప్తంగా మొదలైన చర్చ ● ఆడియోల్లో ఎవరి పేరు వస్తుందా? అని పార్టీల్లో ఉత్కంఠ ● దుష్ప్రచారంపై కోర్టుకు వెళ్తానంటున్న మాజీ మంత్రిసాక్షిప్రతినిధి,కరీంనగర్●: మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో తొలి నుంచి తాను చెబుతున్నదే నిజమైందని, కేవలం కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఆపారన్న తన మాటలు ఎట్టకేలకు నిజమయ్యాయని, త్వరలోనే తాను ప్రెస్‌మీట్ పెట్టి ఆడియో రికార్డులు బయటపెడతానని గంగుల కమలాకర్ పునరుద్ఘాటిస్తున్నారు. దీంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్మాణం మొదలైన దరిమిలా.. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం కారణంగా ఎల్ఎండీ డ్యాం ఉనికికి దెబ్బ వస్తుందని, పర్యావరణంగా సమస్యలు తలెత్తుతాయని, ఇక్కడి జీవావరణం ధ్వంసమవుతుందంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసిన విషయం తెలిసిందే. తీర్పు వెలువరించే సమయంలో కేసు వేసిన విషయంలో పలు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పు ఆధారంగా గంగుల వేయబోయే అడుగులు రాజకీయ వేడి పుట్టించనున్నాయి. ఎవరా పెద్ద నాయకుడు? కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి ఈ వ్యవహారం వెనక ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై గంగుల కమలాకర్ ఆరోపణల ప్రకారం.. కేవలం రాజకీయ కక్ష, కంటగింపు ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగకుండా.. సదరు పెద్ద నాయకుడు అడుగడుగునా అడ్డుపడ్డాడని, అతని పాత్రను నిగ్గు తేల్చే నాయకుల ఆడియో సంభాషణల రికార్డులు తమ వద్ద ఉన్నాయని అవసరమైతే వాటిని బహిర్గతం చేస్తామని మాజీ మంత్రి గంగుల ఘంటాపథంగా చెబుతున్నారు. రూ.540 కోట్లు విడుదలై పనులు సాగుతున్న ప్రాజెక్టుపై ఇలా ఏమాత్రం ఆధారాల్లేని కేసు వేయడం ఏమిటని గంగుల వర్గం గుర్రుగా ఉంది. ప్రాజెక్టు పూర్తయితే తమకు, తమపార్టీకి ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తుందో? అన్న రాజకీయ కక్షతోనే ఈ కేసు వేయించారని, ఎన్జీటీ ధర్మాసనం కూడా ఇదే విషయాన్ని తీర్పులో ప్రస్తావించడాన్ని మాజీ మంత్రి వర్గీయులు గుర్తుచేస్తున్నారు. అదే విధంగా ఎంఆర్ఎఫ్పై దాఖలైన వ్యాజ్యాన్ని పనికిమాలిన పిటిషన్‌గా ధర్మాసనం పేర్కొనడాన్ని బీఆర్ఎస్ నాయకులు స్వాగతిస్తున్నారు. కోర్టు తీర్పుకు విరుద్ధంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు మీద చేస్తున్న దుష్ప్రచారంపై ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్టు’ కేసు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ చర్చ ఎప్పుడూ లేనిది మాజీ మంత్రి ఆడియో టేపులు బయట పెడతానంటుండటంతో ఈ విషయం జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. వెనక ఉండి కేసులు వేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అన్న అంశంపై ఎవరి సిద్ధాంతాలను వారు ప్రతిపాదిస్తున్నారు. ఫలానా నాయకుడే ఇది చేయించి ఉంటాడంటే.. కాదు కాదు మరో నాయకుడు చేయించి ఉంటాడని ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు. ఎవరి వాదనలు బలపరిచేలా వారు ఉదాహరణలు ఇచ్చుకుంటున్నారు. వాస్తవానికి ఈ విషయంలో గంగుల వద్ద ఉన్న ఆడియోటేపులు బయటికి వస్తే.. ఆ నాయకుడు ఎవరన్న విషయం బయటికి రానుంది. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని పోచమ్మవాడలో గంగధరి ప్రసన్నలక్ష్మీ (28) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పోచమ్మవాడకు చెందిన ఉప్పునీటి గంగాధర్ కుమార్తె ప్రసన్నలక్ష్మీని వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన గంగధరి తిరుపతికి ఇచ్చి 2023లో వివాహం చేశారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. తిరుపతి వెళ్లేందుకని ఇటీవలే జగిత్యాలలోని పుట్టింటికి వచ్చింది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికొత్తపల్లి: కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామానికి చెందిన మొగిలిపాలెం గంగరాజు(42)బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న నాగులమల్యాలకు చెందిన గంగారాజు ప్రతి రోజు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుంటాడు. బుధవారం సర్వారెడ్డిపల్లిలో పనిముగించుకొని తన వాహనంపై నాగులమల్యాలకు వస్తుండగా కొత్తపల్లి శివారులోని వెలిచాల ఎక్స్‌రోడ్ దగ్గర లారీ ఢీకొట్టింది. గంగారాజుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అజాగ్రత్తగా లారీ నడిపి తన తండ్రి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గంగరాజు కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్మకాండకు వెళ్లి యువకుడు గల్లంతుజగిత్యాలక్రైం: కర్మకాండకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో యువకుడు గల్లంతైన సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన నీలి మల్లికార్జున్ నానమ్మ ఇటీవల మృతిచెందింది. బుధవారం కర్మకాండ నిర్వహించారు. శ్మశాన వాటిక పక్కనే ఉన్న చింతకుంట చెరువులో స్నానం చేస్తుండగా మల్లికార్జున్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. మల్లికార్జున్ మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
జిల్లాకు 12 మంది హెడ్‌కానిస్టేబుళ్లు
జగిత్యాలక్రైం: మల్టీజోన్–1లో పనిచేస్తున్న 28 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ మల్టీజోన్–1 ఇన్చార్జి, మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఒక కానిస్టేబుల్‌కు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి రాగా.. 12 మంది ఇతర జిల్లాల్లో పదోన్నతి పొందిన వారిని జిల్లాకు కేటాయించారు. జగిత్యాలకు చెందిన వెంకటేశంకు హెడ్‌గా పదోన్నతి వచ్చింది. అలాగే ఆదిలాబాద్ నుంచి జిల్లాకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పి.శివాజీ, డి.వెంకటి, ఎ.వెంకటరమణ, నిజామాబాద్ నుంచి ఎస్.వేణుగోపాల్, ఎం.శంకర్రావు, ఆర్.నారాయణ, ఎండి.మహ్మద్ అలీ, ఎ.గంగాధర్, ఎ.మనోజ్, కృష్ణకుమార్, ఎస్.హరికృష్ణ రానున్నారు. -
కట్నం వేధింపులకు యువతి బలి
జగిత్యాలక్రైం/బుగ్గారం: కొడిమ్యాల మండలకేంద్రంలో వివాహిత దుబ్బాక జమున (23) కట్నం వేధింపులకు బలైంది. స్థానికుల కథనం ప్రకారం.. బుగ్గారం మండలకేంద్రానికి చెందిన జమునను ఏడాది క్రితం కొడిమ్యాలకు చెందిన దుబ్బాక రాహుల్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో కట్నకానుకలతోపాటు సామగ్రి, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. కొద్దికాలంగా రాహుల్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక జమున క్రిమిసంహారక మందు తాగింది. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జమనను కట్నం కోసం వేధించి భర్తతోపాటు అత్తమామలు హత్య చేశారంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ ఘటన స్థలానికి చేరుకుని నిందితులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతురాలి తల్లి కొమ్ము పోశవ్వ ఫిర్యాదు మేరకు జమున భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. జమున మృతదేహానికి బుగ్గారంలో దహన సంస్కారాలు నిర్వహించగా.. తల్లి పోశవ్వ తలకొరివి పెట్టింది. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ రూరల్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ బుధవారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది జూలైలో గుంటూరుపల్లిలో దొంగలు తాళంవేసి ఉన్న ఇంట్లో చొరబడి రూ.2.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ రోడ్డులోని రాజేంద్రప్రసాద్ ఇంటి తాళాలు పగుటగొట్టి మద్యం సీసాలు, బైక్ అపహరించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన ప్రదీప్, హత్రుసింగ్, జితేన్లు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందని ఏసీపీ వివరించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌ను గత నెలలో రిమాండ్‌కు పంపించామని, మరో నిందితుడైన హత్రుసింగ్ను కొత్తపల్లి ఎస్సై ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లో దార్ జిల్లా నరవాలిలో అదుపులో తీసుకొని బుధవారం కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఈకేసులో మరో నిందితుడు జితేన్ పరారీలో ఉన్నాడని త్వరలోనే ఆయనూ పట్టుకుంటామని ఏసీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది శ్రీనాథ్, అబ్దుల్ ఖదీర్, షరీఫ్, సాంబరెడ్డి, దేవేందర్‌ను అభినందించారు. -
26 క్రీడాంశాలు.. 889 సీట్లు
● కోచ్‌గా మారేందుకు కేరాఫ్ ఎన్ఎస్ ఎన్ఐఎస్ ● 26లోపు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ కరీంనగర్‌స్పోర్ట్స్: దేశంలో క్రీడారంగానికి పెద్దన్న ఎన్ఐఎస్. క్రీడాకారులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించి ఒలింపిక్స్‌తో పాటు ప్రపంచ క్రీడావేదికల్లో భారత పతాకం రెపరెపలాడేలా తీర్చిదిద్దుతుంది. క్రీడాకారులకు ఎన్ఐఎస్ నుంచి పిలుపువచ్చిందంటే అదృష్టమే. దేశవ్యాప్తంగా కోచ్‌లను తయారు చేసేందుకు ఏటా కొన్ని క్రీడాంశాల్లో నిష్ణాతులైన క్రీడాకారులకు, అర్హులైన వారికి డిప్లొమా కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. పీఈటీలుగా మారాలనుకునే వారు పీఈసెట్ రాసి ట్రైనింగ్ చేసి డీఎస్సీ ద్వారా డ్రిల్ మాస్టర్లుగా మారుతారు. దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాల్లో కోచ్‌లుగా నియామకం కావడానికి ఈ డిప్లొమా కోర్సులు దోహదపడుతుంటాయి. 2025–26 ఏడాదికి నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నోటిఫికేషన్ విడుదలైంది. 63వ డిప్లొమా బ్యాచ్‌కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 26 క్రీడాంశాల్లో.. దేశవ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో డిప్లొమా కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి. పంజాబ్‌లోని పాటియాలలో ఎన్ఎస్ ఎన్ఐఎస్ సెంటర్, బెంగళూర్‌లోని సాయ్ ఎన్ఎస్ఎస్సీ సెంటర్, కోల్‌కత్తాలోని సాయ్ ఎన్ఎస్ఈసీ సెంటర్, తిరువంతపురంలోని సాయ్ ఎల్ఎన్సీపీఈ సెంటర్లలో కోర్సుల కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 26 క్రీడాంశాల్లో శిక్షణనివ్వనున్నారు. మొత్తం 785 సీట్లతో పాటు 104 అదనపు సీట్లు (ఒలింపిక్స్, ప్రపంచస్థాలో ఆడిన వారికి) కలిపి మొత్తం 889సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల వివరాలు అర్చరీ(30), అథ్లెటిక్స్(75), బ్యాడ్మింటన్(20), బాస్కెట్‌బాల్(30), బాక్సింగ్(50), కనోయింగ్–కయాకింగ్(15), సైక్లింగ్(30), ఫెన్సింగ్(30), ఫుట్‌బాల్(50), జిమ్నాస్టిక్స్(20), హ్యాండ్‌బాల్(20), హాకీ(50), జూడో(30), కబడ్డీ(30), ఖోఖో(20), రోయింగ్ (10), షూటింగ్ (20), స్విమ్మింగ్(20), టేబుల్‌టెన్నిస్(40), తైక్వాండో(20), టెన్నీస్ (20), వాలీబాల్(30), వెయిట్ లిఫ్టింగ్ (30). రెజ్లింగ్(50), ఉషూ(25), యోగాసన(20) సీట్లు ఉన్నాయి. అర్హత వివరాలు... అభ్యర్థి వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు ఒలింపిక్స్, ప్రపంచస్థాయి, జాతీయ స్పోర్ట్స్ ఆచీవ్‌మెంట్ సర్టిఫికెట్లు ఆన్లైన్ అప్లికేషన్లో నమోదు చేయాలి. రాత, ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలతోపాటు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. సామర్థ్య పరీక్షలు పురుష, మహిళా అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తారు. 30 మీటర్ల ఫ్లయింగ్ స్ప్రింట్, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, షటిల్రన్, బెండ్ అండ్ రీచ్ టెస్ట్, 1600మీటర్ల పరుగు పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 26 సవరణ తేదీ ఏప్రిల్ 27,28 పరీక్ష తేదీ జూన్ 6 -
జగిత్యాలకు రెడ్ అలర్ట్
బయటకు వెళ్లలేని పరిస్థితి ఉదయం 8 గంటలకే ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం ఆరుగంటల తర్వాత కూడా వేడిగాలులు వీస్తున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నాం. ఎండలకు కూలీలు కూడా వ్యవసాయ పనులకు రావడం లేదు. – ఏలేటి స్వామిరెడ్డి, శ్రీరాములపల్లె, గొల్లపల్లి(మం)మరో నాలుగు రోజులు వాతావరణ మార్పులతో రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. వాతావా రణ విభాగం వారు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం భూమిలో తేమ శాతం ఎక్కువగా లేకపోవడంతో ఉష్ణోగ్రతలకే ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. – శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస జగిత్యాలఅగ్రికల్చర్: కొద్దిరోజులుగా సూర్యుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఇక మే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని పొలాస వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వడగాలులు వీస్తుండటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.8 డిగ్రీల సెల్సియస్‌లో కదలాడుతున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో మరో రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యవసరమైతనే బయటకు వెళ్లాలి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం గంటకు 30 నుంచి40 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం వేడితో కూడిన వడగాలులు వస్తుండటంతో ప్రజలు అతులాకుతలం అవుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత మొదలైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటోంది. వడదెబ్బతో విలవిల ఉష్ణోగ్రతలు పెరిగినకొద్దీ శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. దీంతో నీరసం వస్తుంది. నీటి శాతం తక్కువ అయినప్పుడు వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఉంది. దీనికితోడు దురద, చెమటకాయ, పొక్కులు, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కళ్లు మంటలు మండి ఎరుపుచారలు వస్తాయి. గ్రామాల్లో లోతైన బావుల నీరు తాగినప్పుడు విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎండకు వెళ్లినప్పుడు కళ్లజోళ్లతోపాటు చర్మం పూర్తిగా కప్పేలా బట్టలు ధరించడం మంచిదంటున్నారు వైద్యులు. శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు మజ్జిగ, పెరుగు, నిమ్మరసాలు తీసుకోవాలంటున్నారు. వాతావరణ మార్పులే కారణం వాతావరణంలో అప్పటికప్పుడు వస్తున్న మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కార్బన్ డైఆక్సెడ్, మిథేన్, నైట్రస్ ఆకై ్సడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా భూమి ఉపరితల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుండటంతో పర్యావరణంలోనూ, వాతావరణంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా.. జిల్లాలో ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. రాయికల్, ధర్మపురి మండలం నేరేళ్ల, కోరుట్ల మండలం అయిలాపూర్, గొల్లపల్లి మండలాల్లో 44.1 డిగ్రీలు, ఎండపల్లి మండలం మారెడుపల్లి, సారంగాపూర్, రాయికల్ మండలం అల్లీపూర్లో 44 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజులు కూడా ఎండలు పెరిగే అవకాశం ఉండడంతో జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మరో నాలుగు రోజులూ ఎండలే రోజురోజుకూ మండుతున్న సూర్యుడు బుధవారం 45 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత -
సబ్సిడీ రుణాలకు ఇంటర్వ్యూలు
రాజన్న హుండీ ఆదాయం రూ.2.01 కోట్లువేములవాడ: రాజన్నకు భక్తుల ద్వారా 29 రోజుల్లో రూ.2.01కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయంలోని ఓపెన్‌స్లాబ్‌లో బుధవారం హుండీలను లెక్కించారు. రూ.2,01,53,852 నగదు, 184 గ్రాముల బంగారం, 12.300 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి తెలిపారు. కోల్‌సిటీ(రామగుండం): రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఈనెల 21వ తేదీ వరకు మొత్తం 11,446 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 8,195 మంది బల్దియా కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించారు. యూనిట్ల వారీగా అర్హులను గుర్తించడం కోసం ఈనెల 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ తెలిపారు. తొలిరోజు ఎన్టీపీసీ, రామగుండం ఏరియాలకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ పరిధిలోని దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ రెండు బ్యాంకులకు 1,050 మంది దరఖాస్తు చేసుకోగా, ఇదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇద్దరే అధికారులు ఇంటర్వ్యూలను నిర్వహించడంతో ప్రక్రియ ఆలస్యంగా జరిగింది. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేశించారు. అభ్యర్థులు ఒరిజినల్ ఆధార్, పాన్‌కార్డు, రేషన్ కార్డు/ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. భారీగా తరలివచ్చిన దరఖాస్తుదారులు