బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు
మేడిపల్లి: కొండాపూర్ గ్రామ శివారు పాక్స్ గోడౌన్ మలుపు వద్ద ఆదివారం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. మన్నేగూడెం గ్రామానికి చెందిన సుందరగిరి శంఖర్‌గౌడ్ తలకు గాయం కాగా.. రాజలింగంపేట వాసి కొండ అశోక్ ధర్మతేజ కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇరువురిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. మేడిపల్లి నుంచి దేశాయిపేట రోడ్డు ఇంతకుముందు సింగిల్ రోడ్డుగా ఉండేది. రెండు సంవత్సరాల క్రితం డబుల్ రోడ్డు కావడంతో.. ఆ రోడ్డు గుండా రవాణా పెరిగింది. వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.


