సీనియర్ జర్నలిస్టు ఫజుల్ రహమాన్ మృతి
● సంతాపం తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ టౌన్: సీనియ ర్ జర్నలిస్టు మొహమ్మద్ ఫజుల్ రెహమాన్ శుక్రవారం అనారోగ్యంతో మ రణించారు. మూడున్నర దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యూజే, టీయూడబ్ల్యూ జే సంఘాలకు సేవలందించారు. శనివారం ఆయన స్వగ్రామమైన హుస్నాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీనియర్ జర్నలిస్టు ఫజుల్ రెహమాన్ మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనతో పనిచేసిన సహచర పాత్రికేయుడు కవి అన్నవరం దేవేందర్, జర్నలిస్టు, కవి పొన్నం రవిచంద్ర , మహాత్మ జ్యోతి బాపూలే విద్యాలయాల సంస్థ కార్యదర్శి జీవీ శ్యాం ప్రసాద్ లాల్ కవులు, రచయితలు, ఇండియన్ జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్, గాండ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్, కొండా లక్ష్మణ్, గులా బీల మల్లారెడ్డి, ఒంటెల కృష్ణ, ఎలగందల రవీందర్, నెల్లుట్ల వాసుదేవరావు నలిమెల భాస్కర్, గాజోజి నాగభూషణం, ఆవునూరు సమ్మయ్య, కూకట్ల తిరుపతి, బూర్ల వెంకటేశ్వర్లు, సీవీకుమార్ నివాళి అర్పించారు.
రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ ఉద్యోగి..
కరీంనగర్‌రూరల్: రామగుండం– హైదరాబాద్ రాజీవ్ రహదారిపై దుర్శేడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ మున్సిపల్ ఉద్యోగి శశికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. న్యాయం చేయాలంటూ కు టుంబసభ్యులు చేపట్టిన ఆందోళనతో దాదా పు రెండున్నరగంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. కరీంనగర్‌రూరల్ పోలీసులు, స్థానికు ల వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన బొడ్డు శశికుమార్(28) ము న్సిపల్ కార్పొరేషన్‌లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై స్నేహితుడిని దుర్శేడ్‌లో దింపేసి, తిరిగి కరీంనగర్ బయల్దేరాడు. దుర్శేడ్ స్టేజీ సమీపంలో వెనుక నుంచి వస్తున్న ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు అతివేగంగా ముందు వెళ్తున్న శశికుమార్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన శశికుమార్ తలపై నుంచి బస్సు వెనుకటైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సుడ్రైవర్ పరారు కాగా.. సమాచారం అందుకున్న సీఐ నిరంజన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. తగిన చర్యలు తీసుకుంటా మని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శశికుమార్‌ది ప్రేమ వివాహం కాగా కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు.
సీనియర్ జర్నలిస్టు ఫజుల్ రహమాన్ మృతి


