అమ్మపాలు.. జీవధార!
తల్లి ఒడిలో హాయిగా పడుకొని పాలు తాగాల్సి న నవజాత శిశువులు అమ్మ అమృతధార కోసం పోరాడాల్సిన పరిస్థితి. పౌష్టికాహార లేమి.. అనారోగ్య సమస్యతో తల్లికి పాలు పడక అప్పుడే పుట్టిన చిన్నారులకు అమృతధారలు అందడం లేదు. ఫలితంగా నవజాత శిశుమరణాలు పెరుగుతున్నాయి. పాలు పడని తల్లుల పిల్లల ప్రాణాలు నిలిపేందుకు పలువురు తల్లులు తమ పాలను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇలా ముందుకొచ్చిన మాతృమూర్తుల అమృతధారలను నిల్వ చేసే మిల్క్‌బ్యాంక్ కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిల్క్‌బ్యాంకులు ఎక్కడా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని నవజాత శిశువులు పాల కోసం తల్లడిల్లుతున్నారు. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ మిల్క్‌బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తే చాలా మంది తల్లులు తమ పాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – కరీంనగర్/ సిరిసిల్లటౌన్/
జగిత్యాల/కోల్‌సిటీ/మంథని
పాలు ఎంతో ఉపయోగపడ్డాయి
నాకు పాలు పడకపోవడంతో బిడ్డ ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడ్డా. కానీ మరో తల్లి నుంచి సేకరించిన పాలను నా బిడ్డకు పట్టించారు. ఆ పాలు నా బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడాయి. – లావణ్య, పోతారం, హుస్నాబాద్
అమ్మపాలు.. జీవధార!


