మొన్న బాధ్యతలు.. నిన్న బదిలీ
● మహిళాస్టేషన్ సీఐ సీసీఆర్‌బీకి అటాచ్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ రఫీక్ ఖాన్‌ను సీసీఆర్‌బీకి అటాచ్ చేశా రు. మూడు రోజుల కిత్రం జగిత్యాల వీఆర్ నుంచి కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు బది లీ అయ్యారు. బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే డీసీఆర్‌బీ విభాగానికి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా తిమ్మాపూర్ సర్కిల్‌లో పనిచేస్తున్న ఓ అధికారిపై పెద్దఎత్తున ఆరోణలు రావడంతో సీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్‌టౌన్: స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఈనెల 12న తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వివేకానంద జయంతి ఉత్సవాల పోస్టర్‌ను క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. సమితి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డ్ గ్రహీత సత్తినేని శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, వొడ్నాల రాజు, జక్కని సాయిరాం, పటేల్ సుధీర్‌రెడ్డి, గంగాధర చందు, బొంకూరి మోహన్, అన్వేశ్, మహేందర్, సుస్మిత, కిరణ్మయి పాల్గొన్నారు.
కరెంటు వైర్లతో జాగ్రత్త
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ తీగలకు దూరంగా ఖాళీ ప్రదేశాల్లో పతంగులు ఎగరేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ రమేశ్‌బాబు తెలిపారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పతంగులు ఎగరేస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. చైనా మాంజా ప్రమాదకరమన్నారు. విద్యుత్ వైర్లు, పరికరా లపై పతంగులు, మాంజాలు తెగిపడితే విద్యు త్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు, సమీప కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
చిగురుమామిడి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్‌యోజన అందాలంటే పట్టాదార్ పాసుపుస్తకం కల్గిన ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి కోరారు. శనివారం చిగురుమామిడి, కొండాపూర్, చిన్నముల్కనూర్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఏడీఏ శ్రీధర్, ఏవో మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
జయప్రదం చేయాలి
కరీంనగర్‌టౌన్: ఖమ్మం జిల్లాలో ఈనెల 18న నిర్వహించే సీపీఐ శత జయంతి ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆ పార్టీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో మాట్లాడారు. ఈనెల 19 నుంచి 21 వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్లో జరుగుతాయన్నారు. జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్‌కుమార్, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, నాగేల్లి లక్ష్మారెడ్డి, బత్తుల బాబు, న్యాలపట్ల రాజు, గూడెం లక్ష్మి, బండ రాజిరెడ్డి పాల్గొన్నారు.


