ఎయిర్ గన్.. తల్వార్‌లు చూపి..
కోరుట్ల: వీడియో కాల్ చేసి.. ఎయిర్ గన్ చూపి ఓ వ్యక్తిని బెదిరించి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు కోరుట్ల సీఐ సురేశ్‌బాబు తెలిపారు. వివరాలు.. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో పనిచేసే ఉద్యోగస్తులను కొంత మంది కోరుట్ల మొబైల్ అసోసియేషన్ పేరిట బెదిరిస్తూ ఇక్కడ బిజినెస్ నడపాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని లేకుంటే వ్యాపారం నడవనివ్వమని బెదిరించారు. వారం క్రితం ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ఉద్యోగి దండబొయిన అరుణ్‌కు వీడియో కాల్ చేసి ఎయిర్‌గన్ తుపాకీ, బొమ్మ రివాల్వర్‌తో పాటు తల్వార్ చూపుతూ చంపుతామని బెదిరించారు. ఈ ఘటనపై ఎస్పీ అశోక్‌కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ నెల 6న కేసు నమోదు చేసి బొమ్మ తుపాకులు, ఎయిర్‌గన్, తల్వార్‌లు చూపుతూ వీడియో కాల్ చేసి బెదిరింపులకు దిగి రూ.30వేలు వసూలు చేసిన మార శివకుమార్, బోగ శ్రీనివాస్, అడ్డగట్ల సురేశ్‌పై కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్‌కు పంపామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై చిరంజీవి ఉన్నారు.
బెదిరించిన ముగ్గురిపై కేసు


