వినూత్న ఆలోచనలు.. ఆకట్టుకునే ప్రాజెక్టులు
సప్తగిరికాలనీ(కరీంనగర్): చిన్నారులే కానీ ఆలోచనల్లో అదరగొట్టారు.. వినూత్న ప్రాజెక్టులు రూపొందించి ఔరా అనిపించారు. వైజ్ఞానిక ప్రదర్శనల్లో తమ ప్రత్యేకత కనబర్చారు. కామారెడ్డిలో జరిగిన 53వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మనాక్ ప్రదర్శన ఇందుకు వేదికై ంది. ఈనెల 7న ప్రారంభమైన రాష్ట్రస్థాయి పోటీలు శుక్రవారం ముగిశాయి. కరీంనగర్ జిల్లానుంచి సైన్స్‌ఫేర్‌కు 14, ఇన్‌స్పైర్ మనాక్‌లో 13 ప్రాజెక్టులు ప్రదర్శించగా.. మూడు జాతీయ, రెండు సౌత్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యాయని జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి తెలిపారు. వీరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బహుమతులు అందించారు.
జాతీయస్థాయి ఇన్‌స్పైర్ మనాక్‌కు శ్రీనిత్య..
పెద్దపల్లిరూరల్: రాగినేడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఇల్లందుల శ్రీనిత్య ఇన్‌స్పైర్‌మనాక్ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. తక్కువ ఖర్చుతో వరి కలుపు తీసే యంత్రం అనే వినూత్న ప్రాజెక్టుతో ఘనత సాధించిన శ్రీనిత్యను విద్యాశాఖ అధికారులు శుక్రవారం అభినందించారు. వరి సాగులో రైతుకు శ్రమను తగ్గించి తక్కువ ఖర్చుతో కలుపు సమస్యకు పరిష్కారం అందించేలా రూపొందించిన పరికరం అందరి ప్రశంసలు అందుకుంది. శ్రీనిత్యను హెచ్‌ఎం చాట్ల ఆగయ్యతోపాటు జగదీశ్వర్‌రెడ్డి, సర్పంచ్ సోమ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.
హైడ్రాలిక్ ఫుల్‌పంప్ తయారీతో..
చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ముష్కం జాహ్నవి జాతీయస్థాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర, ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు ఝూన్సీ తెలిపారు. జాహ్నవి హైడ్రాలిక్ ఫుల్‌పంప్ తయారు చేసింది. ఎమ్మెల్సీ అంజిరెడ్డి నుంచి జ్ఞాపిక అందుకుంది.
సౌత్ ఇండియా సైన్స్‌ఫేర్‌కు అభయ్‌రాజ్
రాయికల్: రాయికల్ మండలం కుమ్మరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్‌రాజ్ సౌత్ ఇండియా సైన్స్‌ఫేర్‌కు ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ తెలిపారు. అభయ్‌రాజ్ రూపొందించిన సూపర్‌సైన్స్ కిట్ బోధనోపకరణల విభాగంలో ఆయన ప్రాజెక్టు అబ్బురపరిచంది. ఆయనను ఎమ్మెల్సీ అంజిరెడ్డి, డీఈవో రాము, ఎంఈవో రాఘవులు, సర్పంచ్ సంతోష్, ఉపసర్పంచ్ శేఖర్ అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు మంథని విద్యార్థులు
మంథని: స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థి విక్రాంత్ ఇంగ్లిష్ ఒలింపియాడ్, ఎడ్యుక్వెస్ట్ టెడ్ టాక్ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. అప్పన్నపేట జిల్లా పరిషత్ పాఠశాలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో విక్రాంత్ మొదటి బహుమతి అందుకున్నాడు. ఈ నెల 20న రాష్ట్రస్థాయి పోటీలకు హాజరు కానున్నాడు. గైడ్ టీచర్లుగా శేషాద్రి, రవీందర్, ఉమామహేశ్ పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు సుమలత, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
వినూత్న ఆలోచనలు.. ఆకట్టుకునే ప్రాజెక్టులు
వినూత్న ఆలోచనలు.. ఆకట్టుకునే ప్రాజెక్టులు
వినూత్న ఆలోచనలు.. ఆకట్టుకునే ప్రాజెక్టులు
వినూత్న ఆలోచనలు.. ఆకట్టుకునే ప్రాజెక్టులు


