శిశువుల ఆకలి తీరేదెలా
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా, శిశు సంక్షేమ కేంద్రంలో నెలకు 300లకు పైగానే ప్రసవాలు జరుగుతున్నాయి. మిల్క్‌బ్యాంక్ లేకపోవడంతో పాలు పడని తల్లుల పిల్లలకు ఫార్ములా మిల్క్ అందిస్తున్నారు. దీని ద్వారా సహజసిద్ధమైన పోషకాలు పొందలేకపోతున్నారు. జిల్లాలో మాతా, శిశు కేంద్రంలోనే అత్యధికంగా ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ మిల్క్‌బ్యాంక్ ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
శిశుమరణాలు ఆగేదెలా?
జిల్లాలో శిశుమరణాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. 2025 ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ వరకు దాదాపు 10 మంది వరకు చిన్నపిల్లలు మృతిచెందారు. వీరంతా వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్యులు వివరించారు.
తల్లిపాలతో ప్రయోజనం
తల్లిపాలు అమృతంతో సమానం. ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి. ప్రతీ రోజు బిడ్డకు కనీసం 10–14 సార్లు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.


