యువ వికాసం అర్జీలు వేగంగా పరిశీలించండి
కరీంనగర్ అర్బన్: రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల ప్రత్యేక అధి కారులు, ఎంపీడీవోలు, బ్యాంకర్లతో సమావే శం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లాలో 57,763 దరఖాస్తులు వచ్చాయని తెలి పారు. దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ప్రత్యేక అధికారులు దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కోటాలో నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు ఇదివరకే పంపించామని తెలిపారు. బ్యాంకుల నుండి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డీఆర్‌వో వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు.
దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. కళాభారతిలో జరుగుతున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీ లన ప్రక్రియను సోమవారం పరిశీలించారు. నగర వ్యాప్తంగా దాదాపు 15 వేల మంది దరఖాస్తు చేసుకొన్నారని, దరఖాస్తులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారీగా పరిశీలన చేస్తున్నట్లు వివరించారు.
15 రోజుల్లో రైల్వేస్టేషన్ ప్రారంభం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ రమేశ్‌రెడ్డి శనివా రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరికొత్త హంగులతో కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుని ప్రారంభోత్సవాని కి సిద్ధమవుతోందని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద రూ.26.64కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం చేపట్టిన స్టేషన్ రెనోవేషన్ పనులు చివరి దశకు చేరాయని తెలిపారు. రెండు వారాల్లో పనులు పూర్తిచేసి, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సం జరిపిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, స్టేషన్ మేనేజర్ ఉన్నారు.
బాధిత మహిళలకు సత్వరమే సఖి సేవలు
కరీంనగర్: మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ పరిధిలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ సఖి కేంద్రాన్ని ఆశ్రయించిన బాధిత మహిళలకు సత్వరమే సేవలు అందించాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపా రు. సప్తగిరికాలనీలోని సఖి కేంద్రంలో సోమ వారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం, శక్తి సదన్, సఖి కోఆర్డినేటర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీడబ్ల్యూవో సరస్వతి మాట్లాడుతూ.. బాధిత మహిళలు సఖి కేంద్రాన్ని ఆశ్రయించినప్పుడు ఉచిత న్యాయ, వైద్య, ఆశ్రయ, పోలీసుసేవలను సత్వరమే అందించాలన్నారు. అంగన్‌వాడీ, వైద్య సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సఖి అడ్మిన్ లక్ష్మి, డిహెచ్‌ఈడబ్ల్యూ కో– ఆర్డినేటర్ శ్రీలత పాల్గొన్నారు.
యువ వికాసం అర్జీలు వేగంగా పరిశీలించండి
యువ వికాసం అర్జీలు వేగంగా పరిశీలించండి
యువ వికాసం అర్జీలు వేగంగా పరిశీలించండి


