సమ్మర్‌ క్యాంపుల సందడి | - | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ క్యాంపుల సందడి

Apr 28 2025 12:07 AM | Updated on Apr 28 2025 12:07 AM

సమ్మర్‌ క్యాంపుల సందడి

సమ్మర్‌ క్యాంపుల సందడి

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ

నెల రోజులపాటు శిక్షణ శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా..

అర్బన్‌ ఏరియాలో పే అండ్‌ ప్లే..

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: పాఠశాలలకు వేసవి సెలవులిచ్చారు. సమ్మర్‌లో చిన్నారులు ఎండలో అటూఇటూ తిరగకుండా ఉండేందుకు కొన్ని సంస్థలు, కళాసంస్థలు, సమ్మర్‌ క్యాంపులను నిర్వహించి వారికి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవిలో క్రీడాశిక్షణ శిబిరాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో జిల్లాకు 10 కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను మే 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నారు. కేటాయించిన కేంద్రాల్లో అక్కడి పీడీ, పీఈటీ, సీనీయర్‌ క్రీడాకారుడు ఇలా ఒకరు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ క్రీడలో శిబిరం జరుగుతుంది.. ఏ గ్రామంలో నిర్వహిస్తున్నారు.. కోచ్‌ ఎవరు తదితర విషయాలపై సాక్షి ప్రత్యేక కథనం.

గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా..

గ్రామీణ ప్రాంతాల్లో మెరికల్లాంటి ఎందరో క్రీడాకారులున్నారని, వారికి నాణ్యమైన శిక్షణ అందించి వెలుగులోకి తీసుకొచ్చి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనే వేసవి శిబిరాలను క్రీడాశాఖ నిర్వహించడం మొదలుపెట్టింది. గ్రామీణ క్రీడలుగా పేరొందిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌తోపాటు ఈసారి మరికొన్ని క్రీడలను చేర్చి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. నెల రోజుల శిక్షణ కాలానికి గౌరవ వేతనం కింద రూ.5వేలు క్రీడాశాఖ కోచ్‌లకు ఇవ్వనున్నారు. 14 సంవత్సరాల్లోపు బాలబాలికలు తర్పీదు పొందే అవకాశముంది.

అర్బన్‌ ఏరియాలో..

జిల్లాల్లోని అర్బన్‌ ఏరియాలో పే అండ్‌ ప్లే కింద శిబిరాలను ఆయా జిల్లాల క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు క్రీడాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న కోచ్‌ల నుంచి క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్బన్‌ ఏరియాలో శిక్షణ తీసుకోవాలనుకునే చిన్నారులు క్రీడాశాఖ ఇచ్చిన వెబ్‌సైట్‌లో https://satgasc-te langana.gov.in దరఖాస్తులు చేసుకోవాలి. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో అర్బన్‌ ఏరియాలో సమ్మర్‌ క్యాంపులను నిర్వహించేందుకు వేదికలు ఖరారు చేయగా.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, జగిత్యాల జిల్లాలో వేదికలు ఖరారు చేసే పనిలో పడ్డారు క్రీడాశాఖ అధికారులు.

కరీంనగర్‌ జిల్లా..

క్రీడ వేదిక(గ్రామం) కోచ్‌ నంబర్‌

వాలీబాల్‌ రామడుగు ఎస్‌.ఆశాలు 9908528205

వాలీబాల్‌ వెదిర కరుణాకర్‌రెడ్డి 9502760690

వాలీబాల్‌ చింతకుంట ఎ.శ్రీనివాస్‌ 9700517852

వాలీబాల్‌ గంగాధర ఎల్‌.నరేశ్‌ 9441700892

వాలీబాల్‌ మల్లారెడ్డిపల్లె కె.నర్సయ్య 9989139012

కబడ్డీ రాంపూర్‌ కె.రాజ్‌కుమార్‌ 9666563882

హ్యాండ్‌బాల్‌ రామడుగు ఎ.సాయికృష్ణ 7660892907

నెట్‌బాల్‌ నగునూర్‌ ఎం.అంజన్‌సాయి 6281774073

హాకీ ఆర్నకొండ ఎం.చంద్రశేఖర్‌ 9490530300

జూడో నెదునూర్‌ ఎ.శ్రీనివాస్‌ 9000190331

పెద్దపల్లి జిల్లా..

గ్రామీణ ప్రాంతాల్లో..

ఫుట్‌బాల్‌ అంతర్గాం టి.శోభ 9866573416

ఫుట్‌బాల్‌ దొంగతుర్తి ఎన్‌.శ్రీనివాస్‌ 9398295492

వాలీబాల్‌ నందిమేడారం ఎం.కొమురయ్య 9848130522

వాలీబాల్‌ జూలపల్లి కె.రాకేశ్‌ 8978755521

వాలీబాల్‌ గర్రెపల్లి బి.నవీన్‌ 9703399149

బాక్సింగ్‌ కనగర్తి జె.శ్రీవిష్ణు 8555929662

అథ్లెటిక్స్‌ వెన్నంపల్లి ఎ.దుర్గాప్రసాద్‌ 9177964751

ఖోఖో నిట్టూర్‌ పి.భాస్కర్‌ 9177992471

తైకై ్వండో తెలుకుంట ఎన్‌.సతీశ్‌కుమార్‌ 9989143163

హ్యాండ్‌బాల్‌ అప్పన్నపేట వి.సురేందర్‌ 8008816932

అర్బన్‌ ఏరియాలో..

ఖోఖో 8ఇంక్లయిన్‌కాలనీ పి.ఓదెలుయాదవ్‌ 9849484631

ఖోఖో పెద్దపల్లి ఎండీ షఫీయొద్దీన్‌ 9949757572

ఫుట్‌బాల్‌ 8ఇంక్లయిన్‌కాలనీ కె.సత్యనారాయణ 9849340610

లాన్‌టెన్నీస్‌ మంథని ఎస్‌.జగదీశ్వర్‌

వాలీబాల్‌ సుల్తానాబాద్‌ ఎం.శ్రావణ్‌ 7702360978

రాజన్న సిరిసిల్ల జిల్లా..

కబడ్డీ కోనరావుపేట బి.వేణు 9492504013

అథ్లెటిక్స్‌ తంగళ్లపల్లి కె.శ్రీనివాస్‌ 9392880231

కరాటే పెద్దలింగాపూర్‌ బి.బాలరాజు

హ్యాండ్‌బాల్‌ కొత్తపల్లి బి.భాను 9885598502

వాలీబాల్‌ రుద్రంగి ఎ.దేవయ్య 9866824012

వాలీబాల్‌ బోయిన్‌పల్లి పి.ప్రభాకర్‌ 8008494801

వాలీబాల్‌ కొదురుపాక ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి 7997182244

వాలీబాల్‌ ఎల్లారెడ్డిపేట బి.బాపురెడ్డి 9492390821

వాలీబాల్‌ ముస్తాబాద్‌ బి.అనిల్‌గౌడ్‌ 9989227229

వాలీబాల్‌ ఇల్లంతకుంట డి.శివరాం 9985796519

జగిత్యాల జిల్లా..

వాలీబాల్‌ భూపతిపూర్‌ సీహెచ్‌ తిరుపతిరెడ్డి 9440922296

వాలీబాల్‌ వెల్గటూర్‌ కె.సతీశ్‌ 9059501017

వాలీబాల్‌ లక్ష్మీపూర్‌ కె కోటేశ్వర్‌రావు 9963159111

వాలీబాల్‌ గొల్లపల్లి టి.పవన్‌ 8186870870

వాలీబాల్‌ ఎండపల్లి బి.కొమురయ్య 9182406818

వాలీబాల్‌ ఊరిట్‌పల్లి ఎం.ప్రవీణ్‌ 9701710968

అథ్లెటిక్స్‌ తిప్పన్నపేట ఎల్‌.శ్రీకాంత్‌ 9550963101

అథ్లెటిక్స్‌ ఎండపల్లి బి.శివమణి 8367588646

హ్యాండ్‌బాల్‌ గుల్లకోట జి.సాయికుమార్‌ 7893472246

సాఫ్ట్‌బాల్‌ మల్లన్నపేట కె.శ్రీకాంత్‌ 7702294312

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement