వెదురు సాగును ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

వెదురు సాగును ప్రోత్సహించాలి

Sep 19 2026 6:20 AM | Updated on Sep 19 2026 6:20 AM

వెదురు సాగును ప్రోత్సహించాలి

కరీంనగర్‌: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించగల వెదురుసాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రపంచ వెదురు దినోత్సవాన్ని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, వెదురు సాగుతో పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు స్థిరమైన ఆదాయ మార్గాలు లభిస్తాయని పేర్కొన్నారు. తరతరాలుగా వెదురు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మేదరి కులస్తుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. మేదరి కుల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చింతల మల్లేశం, కార్యనిర్వాహక అధ్యక్షుడు అలిపిరెడ్డి చంద్రమౌళి, బొల్లం రామస్వామి, ఎనుగందుల రమేశ్‌, బొమ్మిడి వేణుగోపాల్‌, బొల్లం నారాయణ, మొలుగూరి రవీందర్‌, అలిపిరెడ్డి రామస్వామి, మొగులూరి రాజ్‌ కుమార్‌, చింతల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement