ఆదాయం పెంపుపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

ఆదాయం పెంపుపై దృష్టి సారించండి

Sep 19 2026 6:20 AM | Updated on Sep 19 2026 6:20 AM

ఆదాయం పెంపుపై దృష్టి సారించండి

కరీంనగర్‌కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ ఆదాయ పెంపుపై దృష్టి సారించాలని కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరపాలకసంస్థకు చెందిన సముదాయాల్లోని దుకాణాల నుంచి క్రమం తప్పకుండా నెలవారి అద్దె వసూలు చేయాలన్నారు. యజమానుల నుంచి బకాయిలు కట్టించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, బకాయిలు పడ్డ యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసులకు కూడా స్పందించని బకాయిదారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, డిప్యూటీ కమిషనర్‌లు ఖాదర్‌మొహియొద్దిన్‌, వేణుమాధవ్‌, ఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement