అతి తక్కువ ధరలకే టెస్ట్‌లు
కరీంనగర్‌లో ఏ ప్రయివేటు ఆసుపత్రికి, డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లినా రక్త, మూత్ర పరీక్షలు చేసుకోవాలంటే అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. చిన్న రోగానికి కూడా డాక్టర్లు పెద్ద పరీక్షలు రాస్తున్నారు. లయన్స్‌క్లబ్ ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు, బంధువులు అందరం ఇక్కడే పరీక్షలు చేసుకుంటున్నాము. బయటి ధరలకన్నా కేవలం 20శాతం ధరకే ఇక్కడ పరీక్షలు చేస్తున్నారు. – రాజు, కరీంనగర్ పేదల కోసం ప్రారంభించాం
జిల్లాకేంద్రంలో కొన్నేళ్లుగా ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో అత్యధిక రేట్లు పెట్టి రోగనిర్ధారణ చేయించుకోలేక చాలా మంది ఆసుపత్రులకు వెళ్లడమే మానేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్‌క్లబ్ తక్కువ ధరలకే సేవలు అందించాలనే ఉద్దేశంలో రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ల్యాబ్, సీటీస్కాన్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– రాజిరెడ్డి, లయన్స్‌క్లబ్ చైర్మన్
వైద్యులు సహకరించాలి
జిల్లాలో ప్రైవేటు వైద్యం చేయించుకోలేని దీనస్థితిలో ఉన్న నిరుపేదలు ఉన్నారు. వారు ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చినప్పుడు రోగనిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు పంపకుండా లయన్స్‌క్లబ్ ల్యాబ్‌కు పంపిస్తే ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రైౖవేటు ల్యాబ్ కన్నా.. కేవలం 20శాతం ధరలకే లయన్స్ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నాం. వైద్యులు సహకరించాలి.
– ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, రెడ్‌క్రాస్ సెక్రటరీ
అతి తక్కువ ధరలకే టెస్ట్‌లు
అతి తక్కువ ధరలకే టెస్ట్‌లు


