కబడ్డీ.. కబడ్డీ.. హోరాహోరీ
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ లీగ్ దశ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండోరోజు శుక్రవారం రాత్రి వరకు లీగ్‌దశలో సగానికి పైగా మ్యాచ్‌లు ముగిశాయి. ఉదయం, రాత్రి జరిగిన పలు మ్యాచ్‌లను రాష్ట్ర, జిల్లా కబడ్డీ సంఘం బాధ్యులతో పాటు పలు జిల్లాల క్రీడాశాఖ అధికారులు, క్రీడా సంఘాల బాధ్యులు ప్రారంభించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సీహెచ్.అమిత్ కుమార్, బుర్ర మల్లేశ్ గౌడ్, రాష్ట్ర కబడ్డీ సంఘ ఉపాధ్యకుడు సీహెచ్.సంపత్‌రావు, మల్లేశ్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కరుణాకర్, బాబు శ్రీనివాస్, కృష్ణ, అంతడ్పుల శ్రీనివాస్, యూనిస్‌పాషా పాల్గొన్నారు.
దూసుకెళ్తున్న కరీంనగర్ జట్లు
రాష్ట్రస్థాయి సీనియర్స్ పోటీల్లో భాగంగా కరీంనగర్ పురుషుల, మహిళల జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసుకుని దూసుకెళ్తున్నాయి. పురుషుల జిల్లా జట్టు కామారెడ్డిపై 68–20, సిద్దిపేటపై 50–33 భారీ స్కోర్‌తో విజయాలు నమోదు చేసింది. మహిళల జట్టు నిర్మల్‌పై 36–10, వికారాబాద్‌పై 59–18 భారీ స్కోర్‌తో విజయాలు సాధించింది.
ఉత్కంఠగా సాగుతున్న రాష్ట్రస్థాయి పోటీలు కరీంనగర్ జట్లకు రెండేసి విజయాలు
కబడ్డీ.. కబడ్డీ.. హోరాహోరీ


