అంతరాల్లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
కరీంనగర్‌టౌన్: భారతదేశ సంపదను దోచుకునే పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల ఆగడాలకు ఎప్పటికప్పుడు కళ్లెం వేసింది కమ్యూనిస్టులేనని సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి 100 ఏళ్ల సందర్భంగా శుక్రవారం కరీంనగర్‌లోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.


