ఇయ్యాల కొత్త సర్పంచులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఇయ్యాల కొత్త సర్పంచులకు సన్మానం

Dec 27 2025 7:54 AM | Updated on Dec 27 2025 7:54 AM

ఇయ్యా

ఇయ్యాల కొత్త సర్పంచులకు సన్మానం

● హాజరు కానున్న ముగ్గురు మంత్రులు ● కిసాన్‌ జాగరణ్‌ అధ్యక్షుడు సుగుణాకర్‌రావు

● హాజరు కానున్న ముగ్గురు మంత్రులు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశానికి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ హాజరవుతారని వివరించారు.

పంటలకు లాభసాటి ధర చెల్లించాలి

కరీంనగర్‌: రైతులు పండించిన పంటలకు లాభసాటి ధర రాని కారణంగా చాలామంది వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తులు, జీవనోపాధి వైపు పరుగెడుతున్నారని కిసాన్‌ జాగరణ్‌ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్‌రావు అన్నారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో 3 రోజులపాటు నిర్వహించిన కిసాన్‌ గ్రామీణ మేళా శుక్రవారం ముగిసింది. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లు తిలకించారు. మెషినరీ, మందులు, విత్తనాలపై అవగాహన పెంచుకున్నారు. ప్రముఖ రైతు నాయకుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అధిక క్రిమిసంహారక ఎరువుల వాడకంతో భూసారం తగ్గిపోతుందన్నారు. ప్రముఖ రైతు నాయకుడు నరసింహనాయుడు మాట్లాడుతూ.. రైతులు సంఘటితమై ఉద్యమించనిదే ప్రభుత్వాలు దిగి రావని అన్నారు. కేవీకే శాస్త్రవేత్త వేణుగోపాల్‌, ప్రముఖ వైద్యులు బీఎన్‌ రావు, రైతు నాయకులు మల్లారెడ్డి, నేలమడుగు శంకరయ్య, ఏపీవోల అధ్యక్షులు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన పలువురు రైతులు, రైతు నాయకులు పాల్గొన్నారు.

31న మా‘నీరు’ విడుదల

తిమ్మాపూర్‌: యాసంగి పంటల కోసం కరీంనగర్‌ దిగువ మానేరు జలాశయం నుంచి ఈనెల 31న నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ ఎస్‌ఈ పి.రమేశ్‌ తెలిపారు. ఉదయం 11 గంటలకు కాకతీయకాలువ ద్వారా సాగునీరు విడుదల చేస్తామని వివరించారు. నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జోన్‌–1 (కి.మీ. 146.00 నుంచి 284.00)కు 7 రోజులు, జోన్‌–2 (కి.మీ. 284.09 నుంచి 340.00)కు 8 రోజులు వారాబందీ పద్ధతిలో నీరు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వీర్‌ బాల్‌ దివస్‌ చరిత్ర స్ఫూర్తిదాయకం

కరీంనగర్‌టౌన్‌: పదవ సిక్కుల గురువు గురు గోవింద్‌ సింగ్‌జి యువ కుమారుల అసాధారణ ధైర్యం, త్యాగాన్ని స్మరించుకుంటూ వారి వీరత్వానికి నివాళిగా ఏటా డిసెంబర్‌ 26న వీర్‌ బాల్‌ దివస్‌ను నిర్వహిస్తామని, ఈ దివస్‌ చరిత్ర, ప్రాముఖ్యం భావితరాలకు స్ఫూర్తిదాయకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వీర్‌ బాల్‌ దివస్‌ నిర్వహించారు. దివస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ సర్దార్‌ బల్వీర్‌సింగ్‌, బీజేపీ శ్రేణులు కరీంనగర్‌లోని టవర్‌ సర్కిల్‌ నుంచి సిక్కువాడిలోని గురుద్వార వరకు నగర కీర్తన యాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి యాత్రను ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్‌ గురుద్వార అధ్యక్షుడు సర్దార్‌ హర్మిందర్‌సింగ్‌, కార్యదర్శి సర్దార్‌ యస్పాల్‌సింగ్‌, కమిటీ సభ్యులు రవీందర్‌ పాల్‌సింగ్‌, మంజిత్‌సింగ్‌, జస్పాల్‌సింగ్‌, రణధీర్‌సింగ్‌, సురేందర్‌ పాల్‌సింగ్‌, స్వరణ్‌సింగ్‌, భూపేందర్‌సింగ్‌, బీజేపీ నాయకులు కన్న సాయిని మల్లేశం, కోలగని శ్రీనివాస్‌, దురిశెట్టి అనూప్‌, సతీశ్‌, కటకం లోకేశ్‌, బొంతల కళ్యాణ్‌ చంద్ర, నాంపల్లి శ్రీనివాస్‌ తదితరులున్నారు.

ఇయ్యాల కొత్త   సర్పంచులకు సన్మానం1
1/2

ఇయ్యాల కొత్త సర్పంచులకు సన్మానం

ఇయ్యాల కొత్త   సర్పంచులకు సన్మానం2
2/2

ఇయ్యాల కొత్త సర్పంచులకు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement