ఓపెన్‌ ‘సిట్టింగ్‌’ | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ ‘సిట్టింగ్‌’

May 5 2025 8:46 AM | Updated on May 5 2025 8:46 AM

ఓపెన్

ఓపెన్‌ ‘సిట్టింగ్‌’

● వైన్స్‌ సమీపాల్లో మందుబాబుల హల్‌చల్‌ ● ఫుట్‌పాత్‌లు, ఖాళీ ప్రదేశాల్లో మద్యపానం ● కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటినా అమ్మకాలు ● ఇబ్బంది పడుతున్న మహిళలు, పాదచారులు

నగరంలోని హౌజింగ్‌బోర్డు చౌరస్తా వైన్స్‌ వద్ద ఫుట్‌పాత్‌పై కూర్చుని మందుబాబులు ఇలా బహిరంగంగా మద్యం తాగుతున్నారు. కమాన్‌ నుంచి హౌజింగ్‌బోర్డు కాలనీ, మారుతినగర్‌కు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. రాత్రి ఏడు దాటిందంటే ఇక్కడ మందుబాబులతో కిక్కిరిసిపోతుంది. కొందరైతే యథేచ్ఛగా రోడ్డుపైనే కూర్చుని మద్యం సేవిస్తుంటే.. అటుగా వెళ్లే మహిళలు,

చిన్నారులు ఇబ్బంది పడడం కనిపించింది.

కరీంనగర్‌క్రైం:

సాయంకాలం అయిందంటే చాలు నగరంలోని పలు వైన్స్‌ల వద్ద ఫుట్‌పాత్‌లు, ఖాళీ ప్రదేశాలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. రద్దీ ప్రాంతాల్లో రోడ్లపైనే సిట్టింగ్‌ వేయడంతో మహిళలు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ వైన్స్‌కు పర్మిట్‌రూం ఉన్నప్పటికీ.. కొందరు ఓపెన్‌ డ్రింకింగ్‌ చేయడం సమస్యగా మారుతోంది. వైన్స్‌ల ఎదుట నిలిపే వాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక అర్ధరాత్రి తరువాత కూడా బార్లు తెరిచి ఉంటుండగా.. నగరశివారు ప్రాంతాల్లో తెల్లవార్లూ బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

ఫుట్‌పాత్‌లపైనే సిట్టింగ్‌..

నగరంలోని హౌజింగ్‌బోర్డు చౌరస్తాలోని మద్యంషాపులో పర్మిట్‌రూం ఉన్నప్పటికీ పలువురు ఫుట్‌పాత్‌లపై మద్యం సేవిస్తున్నారు అంబేద్కర్‌స్టేడి యం పక్కన, ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై అడ్డాలు వేస్తున్నారు. రాంనగర్‌, సుభాష్‌నగర్‌, కోతిరాంపూర్‌, విద్యానగర్‌, నాఖాచౌరస్తా, రేకుర్తి, చింతకుంట, మంకమ్మతోటతో పాటు పలు ప్రాంతాల్లోని బహిరంగ మద్యపానం జోరుగా సాగుతున్నా.. ఎకై ్సజ్‌, పోలీసు అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లమధ్యే వైన్స్‌లు కొనసాగుతుండగా.. ఓపెన్‌ సిట్టింగ్‌తో ఆయా కాలనీలవాసులు ఇబ్బంది పడుతున్నారు. గాంధీరోడ్డులో వస్త్రదుకాణాల మధ్యలో ఓ వైన్స్‌ను ఏర్పాటు చేయగా.. మందుబాబుల కారణంగా చుట్టుపక్కల షాపులవారు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అక్కడి వైన్స్‌తో రాత్రి సమయంలో గిరాకీ రావడంతో లేదని పలువురు వ్యాపారులు తెలిపారు.

తెల్లవార్లూ అమ్మకాలు

వైన్స్‌లు, బార్లు మూసివేసిన తర్వాత కూడా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బస్టాండ్‌ సమీపంలో ఉన్న రెండు బార్లలో తెల్లవార్లూ వెనకవైపు నుంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నా.. ఎకై ్సజ్‌, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు.అంబేద్కర్‌ స్టేడియం, కోతిరాంపూర్‌, మంచిర్యాల చౌరస్తాల్లోని మద్యం దుకాణాల్లోనూ బ్లాక్‌లో దందా సాగిస్తున్నారు. అలుగునూరు, రేకుర్తి, శాంతినగర్‌లాంటి విలీన గ్రామాల్లో తెల్లవార్లూ అనుమతి లేకుండా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. ఎకై ్సజ్‌, పోలీసు అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

నగరానికి సమీపంలో ఉన్న విలీన గ్రామంలో తెల్లవార్లూ బెల్టు దుకాణాలు తెరుచుకునే ఉంటున్నాయి. అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. హైవే పక్కనే ఉండడంతో నగరంతో పాటు సమీప గ్రామాల మందుబాబులు వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు. కార్లు, బైక్‌లపై వచ్చి నచ్చిన బ్రాండ్‌ తీసుకెళ్తున్నారు. అన్నీ తెలిసినా.. సంబంధిత అధికారులు సైలెంట్‌గా ఉంటున్నారు.

నగరంలోని బస్టాండ్‌, మంకమ్మతోట, కోతిరాంపూర్‌, తదితర ప్రాంతాల్లోని బార్లలో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పేరుకు సమయానికి మూసేసినా.. దొంగచాటుగా విక్రయాలు సాగిస్తున్నారు. బస్టాండ్‌, అంబేడ్కర్‌ స్టేడియం సమీపంలోని మద్యం దుకాణాల వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత కూడా రద్దీ కనిపిస్తోంది. యథేచ్ఛగా విక్రయాలు కొనసాగిస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం.

ఓపెన్‌ ‘సిట్టింగ్‌’1
1/2

ఓపెన్‌ ‘సిట్టింగ్‌’

ఓపెన్‌ ‘సిట్టింగ్‌’2
2/2

ఓపెన్‌ ‘సిట్టింగ్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement