
చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం
కథలాపూర్(వేములవాడ): మండలంలోని ఊట్‌పెల్లి గ్రామశివారులో శనివారం రాత్రి పిచ్చిమొక్కలకు నిప్పంటుకొని మంటలు చెలరేగడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పిచ్చిమొక్కలకు అంటుకున్న మంటలు వ్యాపించి గ్రామశివారులోని రైస్‌మిల్, పెట్రోల్ బంక్ సమీపం వరకు చేరుకున్నాయి. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. ఎస్సై నవీన్‌కుమార్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ప్రజలను అప్రమత్తం చేశారు. మెట్‌పల్లి నుంచి ఫైరింజన్ వచ్చి మంటలార్పేసింది. అగ్నిప్రమాదంలో రైస్‌మిల్, పెట్రోల్ బంక్‌కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.