
7 నుంచి వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు
కరీంనగర్‌స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వేసవిలో నిర్వహించే ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలను ఈనెల 7 నుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్.మురళీధర్‌రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని కేడీసీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిక్షణ శిబిరాల వివరాలను వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌లో 2, గోదావరిఖనిలో 1, జగిత్యాలలో 1, వేములవాడలో 1 శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 13 సంవత్సరాల వయస్సు నుంచి 23 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారులకు ఈ శిబిరంలో నిపుణులైన కోచ్‌ల సమక్షంలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు, ఈనెల 6 లోగా ఆసక్తి, అర్హులైనవారు తమ పేర్లను కరీంనగర్‌లోని కేడీసీఏ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. జూన్ 6 వరకు కొనసాగుతాయని అన్నారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులతో ఈనెల 12 నుంచి ఉమ్మడి జిల్లా టోర్నమెంట్ నిర్వహించి రాణించిన క్రీడాకారులను జూన్‌లో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు సైతం ప్రతి కేంద్రంలో 100 నుంచి 120 మంది క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని అన్నారు.