
స్వచ్ఛతలో భాగస్వామ్యం కావాలి
● యూట్యూబ్ స్టార్ గంగవ్వ
కరీంనగర్ కార్పొరేషన్: నగర పరిశుభ్రతలో ప్రజ లు భాగస్వామ్యం కావాలని యూట్యూబ్ స్టార్ గంగవ్వ పిలుపునిచ్చారు. పారిశుధ్యంపై నగరపాలకసంస్థ చేపట్టిన అవగాహన కార్యక్రమంలో యూట్యూబ్‌స్టార్లు గంగవ్వ, రాజు భాగస్వాములయ్యా రు. శనివారం కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్‌తో కలిసి లక్ష్మినగర్, రాంనగర్, హౌసింగ్‌బోర్డుకాలనీ, ముకరాంపురలో పర్యటించారు. ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరుచేసే పద్ధతిని కమిషనర్ వారికి వివరించారు. సోర్స్ లెవెల్ సెగ్రిగేషన్, స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ, డీఆర్‌సీ సెంటర్, ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్లలో చెత్తను వేరుచేయడంపై అవగాహన కల్పించారు. గంగవ్వ మాట్లాడుతూ ప్రతీ ఇంట్లో చెత్తను ఆకుపచ్చ, నీలంరంగు, ఎరుపురంగు డబ్బాల ద్వారా వేరు చేసి కార్మికులకు ఇవ్వాలన్నారు. తడిచెత్తతో కంపోస్టు ఎరువును తయారు చేయాలని, అట్టముక్కలు, డబ్బాలు, ఇతర పొడి వస్తువులు డీఆర్‌సీ సెంటర్‌కు అందించాలన్నారు.