గుట్టల్లో సర్వే
గట్టుసింగారం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం గట్టుసింగారం (సబ్బితం) గుట్టల్లో మంగళవారం పురావస్తు శాఖ అధికారులు ఎపిగ్రాఫికల్ సర్వే నిర్వహించారు. గట్టుసింగారం పరిసరాల్లోని సీతమ్మలొద్ది ప్రాంతంలో ఓ శిలపై చెక్కిన శాసనాలను ఎపిగ్రఫి డైరెక్టర్ మునిరత్నంరెడ్డి, పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. క్రీ.శ. 1వ శతాబ్దం నుంచి క్రీ.పూ. ఆరో శతాబ్దం వరకు ఉన్న ఈ శాసనాలు దక్కన్ ప్రాంతం ప్రారంభ చరిత్ర, సాంస్కృతిక పరిమాణం తదితర అంశాల గురించి తెలియజేస్తాయని వారు అన్నారు. ఇందుకు సంబంధించి 11 శాసనాలకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ శాసనాల్లో కొన్ని శాతవాహన కాలం నాటివిగా తెలుస్తున్నాయని వివరించారు. శాతవాహన రాజవంశానికి చెందిన కుమార ఆకుసిరి శాసనాలు తొలిసారిగా గుర్తించినట్లు తెలిపారు. రాక్‌ఆర్ట్ పెయింటింగ్ స్పెషలిస్ట్ బీఎం రెడ్డి, ఫారెస్టు రేంజర్ నాయక్, ఫొటో జర్నలిస్ట్ రవీందర్‌రెడ్డి ఉన్నారు.
● ఆధారాలు సేకరించిన పురావస్తు శాఖ
గుట్టల్లో సర్వే


