ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్‌ను జీపీటీ హుస్నాబాద్ కళాశాల జట్టు కై వసం చేసుకోగా బాలికల విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రభుత్వ మోడల్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు కై వసం చేసుకున్నాయి. అథ్లెటిక్స్ బాలికల విభాగంలోలో కె.కీర్తన (కరీంనగర్), బాలుర విభాగంలో బి.అభిషేక్(కోరుట్ల) చాంపియన్‌గా నిలిచారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ డి.శోభారాణి ట్రోపీలు అందజేశారు.
బాలికల విజేత కరీంనగర్, బాలుర చాంపియన్ హుస్నాబాద్


