అనారోగ్య సమస్యలతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన పర్స ధనుష్ (17) అనారోగ్య సమస్యలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ధనుష్ ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఇతడు పుట్టుకతోనే షుగర్, ఫిట్స్ వ్యాధులతో బాధపడుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కలవారు గమనించిన ముస్తాబాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒంటరి తనం భరించలేక ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
మేడిపల్లి: మానసిక ఒత్తి డి తట్టుకోలేక ఉరేసుకు ని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొండాపూర్‌లో చో టుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. గొల్లపల్లి జలందర్ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా, కొద్ది నెలలకే విడాకులయ్యాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న జలందర్ ఇలీవలే గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చాడు. 18 నెలలుగా ఒంటరిగా ఉంటున్న జలందర్ మానసికంగా బాధపడుతున్నాడు. జీవితం మీద విరక్తితో మంగళవారం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి గొల్లపల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రాయికల్: మండలంలోని ఇటిక్యాల పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్లను మంగళవారం తహసీల్దార్ నాగార్జున మైనింగ్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.
వివాహేతర సంబంధం అనుమానంతో దాడి
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్‌లోని సుగ్లాంపల్లి వద్ద మేకల శ్రీనివాస్‌పై మంగళవారం దాడి జరిగింది. కరీంనగర్ జిల్లా మందలపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు పెద్దపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమె భర్త, కొడుకు, కొడుకు స్నేహితులు ఈ దాడి చేశారు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. సదరు వివాహిత, ఆమె భర్త మధ్య గొడవలు జరుగుతుండగా.. భర్తపై ఫిర్యాదు చేసేందుకు పరిచయం ఉన్న శ్రీనివాస్‌తో కలిసి వివాహిత ద్విచక్రవాహనంపై తొలుత పెద్దపల్లికి వెళ్లింది. అక్కడి నుంచి కరీంనగర్ వెళ్తుండగా.. ఆమె కొడుకు సోన్నాయిటెంకం అభిషేక్, భర్త చంద్రమోహన్, కొడుకు స్నేహితులు ఎల్లంకి సాగర్, తాటిపల్లి వినయ్ కలిసి సుగ్లాంపల్లి వద్ద కాపుకాసి శ్రీనివాస్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు.
స్కానింగ్ సెంటర్ల తనిఖీ
కోల్‌సిటీ(రామగుండం): జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్ ఆదేశాలతో గోదావరిఖనిలోని స్కానింగ్ కేంద్రాలను, ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోగ్రాం అధికారి వాణిశ్రీ మంగళవారం తనిఖీ చేశారు. డాక్టర్ వాణిశ్రీ మాట్లాడుతూ, లింగనిర్ధారణ చట్ట విరుద్ధమన్నారు. పుట్టబోయే పిల్లలు ఆడ అయినా, మగ అయినా సమానమే అనే భావన ప్రజల్లో పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అనారోగ్య సమస్యలతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
అనారోగ్య సమస్యలతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
అనారోగ్య సమస్యలతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య


