ఇటుకబట్టీల్లో విచారణ
పెద్దపల్లిరూరల్: గౌరెడ్డిపేట గ్రామశివారులోని ఓ ఇటుకబట్టీలో రెవెన్యూ, పోలీస్, కార్మికశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. కనీస సౌకర్యాలు లేవని జాతీయ మానవహక్కుల సంఘానికి కొంతకాలం ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం విచారణ చేసినట్లు తెలిసింది. ఇటుకబట్టీ నిర్వహణ తీరు పరిశీలించిన కార్మికశాఖ అధికారి హేమలత, రూరల్ ఎస్సై మల్లేశ్, రెవెన్యూ డెప్యూటీ తహసీల్దార్ విజేందర్.. నిర్వహణకు సంబంధించిన రికార్డులు తనిఖీచేసి నివేదిక రూపొందించారు. బుధవారం కలెక్టర్‌కు నివేదించనున్నట్లు కార్మికశాఖ అధికారి హేమలత తెలిపారు.


