
అత్తపై కోడలు దాడి
జగిత్యాలక్రైం: అత్తపై కోడలు కత్తితో దాడిచేయగా, కేకలు వేయడంతో స్థానికులు కాపాడి సఖి కేంద్ర నిర్వాహకులకు అప్పగించారు. స్థానికుల వివరాలు.. జిల్లా కేంద్రంలోని జంబిగద్దె ప్రాంతానికి చెందిన పెండ్యాల భాగ్య సంతానం లేకపోవడంతో వినయ్ అనే వ్యక్తిని పెంచుకుంది. అతడికి అఖిల అనే యువతితో వివాహం జరిపించింది. కాగా, కొన్నేళ్లుగా అత్తను అఖిల శారీరకంగా, మానసికంగా వేధిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న బోరు వేయాలని అఖిల అత్తకు సూచించగా, ఆమె మరిచిపోయింది. దీంతో ఆగ్రహించిన కోడలు ఇంట్లోని కత్తితో అత్తపై దాడిచేయగా వీపు, ముఖంపై స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు జిల్లా సంక్షేమశాఖాధికారి నరేశ్‌కు సమాచారం అందించగా, వెంటనే సఖి నిర్వాహకులు లావణ్య, సామాజిక కార్యకర్త శారద చేరదీసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్సై గీత వృద్ధురాలి కోడలు, కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం సఖి కేంద్ర నిర్వాహకులు వృద్ధురాలిని ఆమె ఇంటికి తరలించారు.