భూసారం తెలుసుకోవడం తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

భూసారం తెలుసుకోవడం తప్పనిసరి

May 28 2025 11:59 AM | Updated on May 28 2025 11:59 AM

భూసార

భూసారం తెలుసుకోవడం తప్పనిసరి

● భూసార పరీక్షతో సుస్థిర వ్యవసాయం సాధ్యం ● రామగిరిఖిల్లాలో ఉచితంగా భూసార పరీక్షలు

రామగిరి(మంథని): నైరుతి రుతుపవనాల ప్రవేశం తర్వాత రైతులు వ్యవసాయానికి సిద్ధమవుతున్నారు. అంతకంటే ముందే నేలలో మట్టి పరీక్షలు చేయించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. భూసార పరీక్షలకు ఇదేసరైన సమయమంటున్నారు. పొలాల్లోని మట్టి నమునాలను సేకరించి పరీక్షలు చేయించుకుంటే భూసారం తెలియడంతో పాటు ఆ నేలల్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎంతమేర ఎరువులను వినియోగించాలనే విషయాలు రైతులు తెలుసుకోవచ్చు. రైతులు పంట పండించేందుకు మూడు పెట్టుబడులు అవసరం. అవి భూమి, విత్తనం, నీరు. వీటన్నింటికన్నా నేల ముఖ్యమైన పెట్టుబడి. అందుకే భూమిగుణగణాలు తెలిస్తే ఎలాంటి పంటలు పండుతాయో అవగాహన వస్తుంది. అందుకోసం మట్టి పరీక్షలు చేయించాలి. తద్వారా పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలో తెలియడంతో ఖర్చు తగ్గించుకోవచ్చు. చాలామంది రైతులు మట్టిపరీక్షలు జరిపించకుండా ఎరువులు అధిక మోతాదులో వేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరగడంతోపాటు పంటల్లో పురుగుల ఉధృతి కూడా ఎక్కువవుతుంది. పొలాల్లో ఎరువుల మోతాదు తెలుసుకునేందుకు కచ్చితంగా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపించాలి. దీనికోసం సాగుభూమి నుంచి మట్టిని ఇలా సేకరించాలి.

మట్టి నమూనా సేకరించ కూడని ప్రదేశాలు

● పొలం వరాలు, చెట్టు నీడ, బోరుబావులు, నీరు పొసేచోటు, బండరాళ్లు ఉన్న చోటు, మందులు కలుపుకునే చోటు.

మట్టి నమూనా సేకరించే విధానం

● భూసార పరీక్ష ఫలితాలు సేకరించే మట్టి నమూనాలపై ఆధారపడి ఉంటాయి. కనుక మట్టి నమూనాలను ఒక ఎకరం విస్తీర్ణంలో ఒకచోటు నుంచే కాకుండా 10 నుంచి 15 ప్రదేశాల్లో తీయాలి.

● ఎంపిక చేసిన పొలంలో జిగ్‌జాగ్‌(ఎగుడు దిగుడు) పద్ధతిలో 10 నుంచి 15 చోట్ల గుర్తులు పెట్టాలి.

● గుర్తులు పెట్టిన చోట చెత్తాచెదారం తొలిగించి శుభ్రపరచాలి. శుభ్రపర్చిన చోట గుంతలు తీయాలి.

● ఆ గుంతల్లో ఒక అంగుళం(2.5 సెం.మీ.) మట్టిని సేకరించాలి.

● పొలంలో 10 నుంచి 15 చోట్ల సేకరించిన మట్టిని ఒకకుప్పగా పోసి బాగా కలపాలి.

ఈ విధంగా బాగా కలిపిన మట్టిని గుండ్రంగా చేసి నాలుగు భాగాలుగా విభజించాలి. పైరెండు భాగాలను(ఏ, సీ)లుగా, కింది రెండు భాగాలను(బీ,డీ) భాగాలుగా గుర్తించాలి. వీటిలో రెండు ఎదురెదురుగా ఉన్న భాగాలను (బీ,డీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(ఏ, సీ) తొలిగించాలి. ఇప్పుడు మిగిలిన (బీ,డీ) భాగాలను బాగా కలిపి మళ్లీ గుండ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా గుండ్రంగా చేసుకున్న మట్టిని మళ్లీ ముందుగా విభజించినట్లుగా నాలుగు భాగాలుగా చేసి ఎదురెరుగా ఉన్న భాగాలను(ఏ,సీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(బీ,డీ)లను తొలిగించాలి. ఈ విధంగా 10–15 చోట్ల నుంచి సేకరించిన మట్టిని అర్ధకిలో మట్టి నమూనా వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత ఈ నమూనాను నీడలో ఆరబెట్టి పరిశుభ్రమైన, గుడ్డసంచిలో నింపి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఇవ్వాలి.

ఉచితంగా భూసార పరీక్షలు

రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం. కార్డులు కూడా ఉచితంగా ఇస్తాం. భూసారాన్ని బట్టి ఏ పంటకు ఎలాంటి ఎరువులు వాడాలో కూడా రైతులకు సూచిస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

– డాక్టర్‌ పిల్లి కిరణ్‌, మృత్తిక శాస్త్రవేత్త, కేవీకే, రామగిరి ఖిల్లా

భూసారం తెలుసుకోవడం తప్పనిసరి 1
1/4

భూసారం తెలుసుకోవడం తప్పనిసరి

భూసారం తెలుసుకోవడం తప్పనిసరి 2
2/4

భూసారం తెలుసుకోవడం తప్పనిసరి

భూసారం తెలుసుకోవడం తప్పనిసరి 3
3/4

భూసారం తెలుసుకోవడం తప్పనిసరి

భూసారం తెలుసుకోవడం తప్పనిసరి 4
4/4

భూసారం తెలుసుకోవడం తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement