సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: రాజీవ్‌యువవికాసం పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్‌చాహత్ బాజ్‌పేయ్ సూచించారు. నగరంలో రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు చేసుకొన్న వారికి వారం రోజుల నుంచి కళాభారతిలో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ, వికలాంగుల కేటగిరీల వారిగా సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరవ్యాప్తంగా 16 వేల మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వెరిఫికేషన్‌కు 10వేల మంది మాత్రమే హాజరయ్యారన్నారు. ప్రభుత్వ నిబందనల మేరకు ఆన్‌లైన్‌లో చేసుకొన్న దరఖాస్తు ప్రతితో పాటు, అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ జత చేసి, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నగరపాలకసంస్థ నిర్వహిస్తున్న వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నారు.
డంప్‌యార్డు నుంచి కాపాడండి
కరీంనగర్ కార్పొరేషన్: డంప్‌యార్డ్ బారి నుంచి తమ ప్రాణాలు కాపాడాలంటూ బాధిత ప్రజలు రోడ్డెక్కారు. ఆటోనగర్‌లోని డంప్‌యార్డ్‌ను వెంటనే తరలించాలని నగరంలోని ఎన్‌టీఆర్ సర్కిల్ వద్ద గురువారం అలకాపురికాలనీ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్, హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఆటో నగర్‌లో ఉన్న డంప్‌యార్డ్ తమ పాలిటి శాపంలా మారిందని ఆందోళనకారులు ఆవేదనచెందారు. విషవాయువులు వెలువడి పిల్లలు, వృద్ధులు, గర్భిణులు శ్వాసకోశ, చర్మవ్యాధులకు గురవుతున్నారన్నారు. కలెక్టర్, మున్సిపల్ అధికారులు తమ బాధలను పరిగణలోకి తీసుకొని వెంటనే డంప్‌యార్డ్‌ను తరలించాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలి


