ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం
● నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు
● జిల్లాలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు
● తనిఖీ అధికారులను బెదిరిస్తున్న యాజమాన్యాలు
జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఇటీవల లింగనిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ తర్వాత అబార్షన్ చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు డీఎంహెచ్‌వో ఆకస్మికంగా ఆస్పత్రి తనిఖీ చేశారు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది పేషెంట్‌ను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు.
ధర్మారంలోని ఓ ఆస్పత్రి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే ఫిర్యాదుతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవల తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు తేలడంతో యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. స్కానింగ్ యంత్రాన్ని సీజ్ చేశారు.
గోదావరిఖనిలోని శ్రీమమత ఆస్పత్రిలో డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి సోమవారం తనిఖీలు చేశారు. అనుమతి లేనిస్కానింగ్ యంత్రాన్ని గుర్తించి సీజ్ చేశారు. అయితే, తనిఖీ కోసం ఉదయం ఆస్పత్రికి చేరుకున్న డీఎంహెచ్‌వోకు వివిధ విభాగాలను చూపించాల్సిన నిర్వాహకులు.. అటూఇటూ తిప్పుతూ కాలయాపన చేశారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.


