
మనిషికి చిటికెడంతా ప్రేమ అవసరం
కరీంనగర్‌కల్చరల్: కూడు, గూడు, బట్టలాగే ప్రేమ కూడా మనిషికి కనీస అవసరమేనని, కవిత్వ పఠనంతో మనిషికి చిటికెడంతా ప్రేమైనా అందాలని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్ అన్నారు. ఆదివారం తెలంగాణ రచయితల వేదిక, ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్టు నిర్వహణలో సాహిత్య పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాధేయ మాట్లాడుతూ, కవిత్వాన్ని ప్రేమించే తాను సృజనకారులను ప్రోత్సహించడానికి 37 ఏళ్లుగా పురస్కారాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన వైష్ణవశ్రీకి సత్యదేవి సాహిత్య పురస్కారం, వరంగల్ కవి నందకిషోర్‌కు ఉమ్మడిశెట్టి సతీశ్‌కుమార్ యువ పురస్కారం, తిరుపతికి చెందిన సుధామురళికి రాజయ్య కవితా పురస్కారాన్ని నలిమెల చేతులమీదుగా ప్రదానం చేశారు. అలాగే కరీంనగర్‌కు చెందిన యుగంధర్ కవితా సంపుటి ‘ఇదేమి యుద్ధం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కవులు అన్నవరం దేవేందర్, సీవీ కుమార్, కందుకూరు అంజయ్య, గాజోజు నాగభూషణం, నడిమెట్ల రామయ్య, విలాసాగరం రవీందర్, తోట నిర్మలరాణి, పెనుగొండ సరసిజ, రామానుజం సుజాత, నీలగిరి అనిత, నసీరుద్దీన్, నెరువట్ల చైతన్య, కూకట్ల తిరుపతి, మోర అనిల్, పీఎస్ రవీంద్ర, బీవీఎం స్వామి, గుండు రమణయ్య, గాజుల రవీందర్, ప్రేమసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్