రెవెన్యూలోనే భూ సమస్యకు పరిష్కారం
● ‘భూ భారతి’తో రైతులకు మేలు ● కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం లేదు ● సీసీఎల్‌ఏ వరకు అప్పీల్‌కు అవకాశం ● త్వరలో అసైన్‌మెంట్ కమిటీల ఏర్పాటు
సాక్షి ఫోన్‌ఇన్‌లో ఆర్డీవో కుందారపు మహేశ్వర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ అర్బన్:
‘భూ భారతి’ రైతులకు వరం. భూ సమస్యలకు పరిష్కార వేదిక’ అని కరీంనగర్ ఆర్డీవో కుందారపు మహేశ్వర్ తెలిపారు. ధరణి స్థానంలో వచ్చిన భూభారతితో కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం లేదన్నారు. రెవెన్యూ అధికారుల స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ‘భూ భారతి’ సందేహాల నివృత్తి కోసం శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్‌లో రైతులు అడిగిన పలు ప్రశ్నలకు ఆర్డీవో సమాధానాలు ఇచ్చారు. జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి అమలవుతుందని, వచ్చేనెల ఒకటి నుంచి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలంలో అమలు చేస్తామన్నారు.
రెవెన్యూలోనే భూ సమస్యకు పరిష్కారం


