
భారీ విగ్రహం ఆవిష్కరణ
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని శ్రీ భక్త మార్కండేయస్వామి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 33 అడుగుల ఎత్తయిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆదివారం కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆవిష్కరించారు. తొలుత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాజీ మేయర్ వై.సునీల్‌రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కమిటీ సభ్యులు స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్, అనుమల్ల సత్యనారాయణ, బీజేపీ నాయకులు కంచ శేఖర్, హరీశ్ పాల్గొన్నారు.
స్పష్టమైన వైఖరి ప్రకటించాలి
కరీంనగర్: తెలంగాణ ఆవతరణ దినోత్సవం వరకు తెలంగాణ ఉద్యమకారుల అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని ఓ హోటల్‌లో ఆదివారం ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఆర్ మాట్లాడు తూ.. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుపరచాలన్నారు. ప్రతీ ఉద్యమకారుడికి 250 చదరపు గజాల భూమి, రూ.25వేల పెన్షన్, వైద్య సదుపాయాలు, వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ చైర్మన్ చీమ శ్రీనివాస్, ఫుడ్ కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

భారీ విగ్రహం ఆవిష్కరణ