
అంజన్న హుండీ ఆదాయం రూ.1.07 కోట్లు
మల్యాల: కొండగట్టు ఆంజన్న ఆలయంలోని 12 హుండీలకు భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ రాజమౌళి ఆధ్వర్యంలో సోమవారం లెక్కించారు. 39 రోజులకు రూ.1,07,67,134 సమకూరాయి. 134 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మిశ్రమ వెండి, బంగారాన్ని తిరిగి బ్యాగుల్లో పెట్టి, సీల్ వేసి హుండీల్లోనే వేశారు. జువెల్లర్స్ సమక్షంలో తూకం వేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఆలయ పరిశీలకులు సునీల్‌కుమార్, చంద్రశేఖర్, హరిహరనాథ్, అశోక్, రాములు పాల్గొన్నారు.
కొండగట్టులో భక్తుల రద్దీ
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మధ్యాహ్నం ఎండలను సైతం లెక్కచేయకుండా స్వామి వారిని దర్శించుకున్నారు. మొక్కలు చెల్లించుకున్నారు.